Saturday, June 27, 2020

Seeds Of Consciousness - 52

🌴. YOU PEOPLE DON’T KNOW HOW MUCH YOU MISS BY NOT KNOWING YOU TRUE SELF  🌴

Q: While in theory I am ready to pay any price, in actual life again and again I am being prompted to behave in ways which come in between me and reality. Desire carries me away.

M: Increase and widen your desires till nothing but reality can fulfil them. It is not desire that is wrong, but its narrowness and smallness. Desire is devotion. By all means be devoted to the real, the infinite, the eternal heart of being. 

Transform desire into love. All you want is to be happy. All your desires, whatever they may be, are expressions of your longing for happiness. Basically, you wish yourself well.

Q: If I am free, why am I in a body?

M: you are not in the body, the body is in you! The mind is in you. They happen to you. They are there because you find them interesting. Your very nature has the infinite capacity to enjoy. 

It is full of zest and affection. It sheds its radiance on all that comes within its focus of awareness and nothing is excluded. It does not know evil nor ugliness, it hopes, it trusts, it loves. 

You people do not know how much you miss by not knowing your own true Self. You are neither the body nor the mind, neither the fuel nor the fire. They appear and disappear according to their own laws.

That which you are, your true Self, you love it, and whatever you do, you do for your own happiness. To find it, to know it, to cherish it is your basic urge.

Since time immemorial you loved yourself, but never wisely. Use your body and mind wisely in the service of the self, that is all. 

Be true to your own self, love your self absolutely. Do not pretend that you love others as yourself. Unless you have realised them as one with yourself, you cannot love them. 

Don't pretend to be what you are not, don't refuse to be what you are. Your love of others is the result of self-knowledge, not its cause.

Without self-realization, no virtue is genuine. When you know beyond all doubting that the same life flows through all that is and you are that life, you will love all naturally and spontaneously. 

When you realize the depth and fullness of your love of yourself, you know that every living being and the entire universe are included in your affection. But when you look at anything as separate from you, you cannot love it for you are afraid of it. 

Alienation causes fear and fear deepens alienation. It is a vicious circle. Only Self-realization can break it. Go for it resolutely.

- Nisargadatta Maharaj

రాజ ధర్మం-భక్తి ధర్మం

ధర్మం నాలుగు పాదాలుగా నడిచిన త్రేతాయుగంలోని రామాయణకాలంలో రాజధర్మానికి, భక్తిధర్మానికి మధ్య జరిగిన సంఘర్షణ, వాటివల్ల పొడసూపిన భావవైరుధ్యాన్ని వారు ఆనుభవించిన తీరు చాలా ఆశ్చర్యం కలిగించేలా ఉండి, సగటు మనిషికి ఎన్నో జీవితపాఠాలు నేర్చుకునే అవకాశం కలిగిస్తుంది. పరిస్థితులు ధర్మసంకటాన్ని సృష్టించినా, తాము నమ్మిన సిద్ధాంతాల కోసం తమ జీవితాలను సమర్పించి పునీతం చేసుకున్న రెండు వైవిధ్యమైన వ్యక్తిత్వాల మధ్య ఉన్న అపురూపమైన అనుబంధాన్ని వాల్మీకి మలిచిన తీరు మనం రామలక్ష్మణుల వృత్తాంతాలను అవలోకిస్తే అవగతమవుతుంది.

మర్యాదా పురుషోత్తముడిగా మన్ననలందిన శ్రీరాముడి ధర్మజిజ్ఞాస రామాయణమంతా మనకు అగుపడుతుంది. అందుకే ‘రామో విగ్రహవాన్‌ ధర్మః’ అని శత్రువైన మారీచుడి ద్వారా వర్ణితమైన ఉత్తమోత్తముడు శ్రీరాముడు. అడుగడుగు నా ఎన్ని పరీక్షలు ఎదురైనా కేవలం తండ్రికిచ్చిన మాట కోసం స్వంతవారి ని, ప్రజలను ఐశ్వర్యాన్ని రాజ్యాధికారాన్ని తృణప్రాయంగా వదిలి అడవిబాట బట్టిన త్యాగశీలి. కైకేయి వరం వల్ల దశరథుడు తాను తలపెట్టిన పట్టాభిషేకానికి బదులు ఉన్నఫలాన రాజ్యాన్ని భరతుడికి వదిలేసి వెళ్ళమని అన్నప్పుడు, ఒక్కమాట కూడా ఎదురుచెప్పకుండా, తల్లి కౌసల్య వద్దని వారిస్తున్నా, అన్యాయం జరుగుతుందని లక్ష్మణుడు వారిస్తున్నా, ఎన్నో కష్టాలు అనుభవించి,  ఆ ప్రస్థానంలో, ఏకపత్నీ వ్రతాన్ని, సుగ్రీవుడి విషయంలో స్నేహధర్మాన్ని, విభీషణుడి విషయంలో రాజధర్మాన్ని, భరతుడు తన పాదుకలు స్వీకరించడానికి వచ్చినపుడు రాజ్యపాలనా రహస్యాలను వివరించి తన భాతృధర్మాన్ని నిర్వర్తించిన సౌహార్ద్ర శీలి ఆ పురుషోత్తముడు.

అటువంటి రాముడి అత్యంత ప్రియమైన సోదరుడు, అరివీర భయంకరుడు, పేరుకి సవతి తమ్ముడైనా, రాముడి కోసం ప్రాణత్యాగం కూడా చేయడానికి వెనుకాడని భక్తిధర్మం లక్ష్మణుడిది. ఇద్దరి మనస్తత్వంలో ఎంతో వైరుధ్యం ఉంది. తాను స్వతహాగా రాముడికి ధీటైన వాడైనా, అన్నమాట దాటని సేవకుడు. లక్ష్మణుడు, రాముడికి ఏ కష్టం వచ్చినా తట్టుకోలేడు. ఎంతటి సాహసానికైనా వెనుకాడడు. తన దృష్టిలో రాముడికి కష్టం కలిగించిన వారెవరూ తన మిత్రులు కారు. రాముణ్ణి బాధపెట్టే అవకాశం ఉన్న ఏ సంఘటనా ఆయనకు రుచించదు. లక్ష్మణుడు నమ్మిన ఏకైక ధర్మం రామభక్తి. మిగతా అన్నీ అధర్మాలే. ఎంతటి ఆవేశాన్నయినా ఒక్క రాముడి కంటిచూపుతోనే తగ్గించుకొని, రామసేవలో నిద్రాహారాలు మాని, తన సర్వసుఖాలు వదులుకొని ఒక సేవకుడిగా మారి, తన భక్తిని చాటుకున్న ధర్మశీలి లక్ష్మణుడు.

రాముడిని నిత్యం అనుసరిస్తూ గడిపిన లక్ష్మణుడి దృష్టిలో, రాముడిని వనవాసానికి వెళ్ళమన్న తండ్రి దశరథుడు, కైకేయి ఇద్దరూ పెద్ద మోసగాళ్ళు. వారి నిర్ణయంపై ఆగ్రహంతో, వారిని, అయోధ్యనంతటినీ నాశనం చేయడానికి కూడా ఉద్యుక్తుడైన సాహసవంతుడు, నిరంతరం తన ఆవేశాన్ని సీతారాముల సేవలో అణిచివేసుకొని, కేవలం అన్న వెంటే ఉండాలన్న భక్తితో, తన సతీ వియోగంలో పధ్నాలుగేండ్లు వనవాసంలో గడిపిన ధర్మమూర్తి. లక్ష్మణుడికి రాముడి మాటంటే ఎంత గురి అంటే, రాముడి ధర్మవాక్కులు ఎక్కడైనా నచ్చినా, నచ్చకపోయినా ఒక్కమాట కూడా అనక భాతృప్రేమను చాటిన ఉత్తముడు సౌమిత్రుడు. లక్ష్మణుడి తల్లి సుమిత్ర ఎంతో ఉత్తమురాలు. తన సవతి కొడుకుతో పాటు భార్యను, రాజ్యాన్ని వదిలి వనవాసానికి సిద్ధమైన పుత్రుడిని వారించకుండా, పైగా ‘రాముని క్షేమం పూర్తిగా నీ బాధ్యతయే’ అన్నదిగానీ, ‘నువు జాగ్రత్త’ అనలేదు. అంతటి ఉత్తమోత్తమమైన తల్లికి పుత్రుడు. కాబట్టే, లక్ష్మణుడు (సౌమిత్రుడు) అంతటి సౌశీల్యుడయ్యాడు. చివరకు యుద్ధంలో ఇంద్రజిత్తు ఏ అస్ర్తానికీ లొంగకపోతే రాముడిని, రాముడు పాటించిన ధర్మాన్ని మనసులో తలుచుకొని బాణం వేసి వధించి, రాముడి రాజధర్మాన్నీ, తన భక్తిధర్మాన్ని ఒకేసారి నిరూపించిన సౌజన్యశీలి లక్ష్మణుడు.

మనస్తత్వంలో ఇంతటి వైరుధ్యం ఉన్నా, తాను నమ్మిన రాజధర్మం కోసం రాముడు, తాను నమ్మిన భక్తి కోసం అన్నను తప్ప అన్నీ త్యాగం చేసిన తమ్ముడు లక్ష్మణుడు. అటువంటి రామలక్ష్మణ అనుబంధం అజరామరం. మనందరికీ ఆదర్శప్రాయం, ఆచరణీయం. ఇప్పుడు అరుదైనా, మన ఉమ్మడి కుటుంబాల్లో ఇటువంటి అనుబంధాలను ఇంకా మనం చూడవచ్చు. దీనికి ఇంకా ఆస్కారం ఉంది కూడా. ధర్మో రక్షతి రక్షితః

Friday, June 26, 2020

ఋణానుబంధం

పువ్వు తొడిమనుండి విడిపోతుంది, పండు చెట్టునుండి రాలిపోతుంది, కానీ ఎన్ని కష్టాలు ఎదురైనా తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లలను విడిచిపెట్టరు.. అని మహాభారతం చెబుతోంది.

పిల్లలపై తల్లిదండ్రులకున్న అనుబంధం ఎలాంటిదో కృష్ణుని ఎడబాటును భరించలేని యశోదానందుల హృదయావేదనను ఒక్కసారి తెలుసుకుంటే అర్థమవుతుంది.

శ్రీకృష్ణుడు మధురకు వెళ్ళినప్పుడు ఆ ఎడబాటును సహించలేక తల్లి యశోద దుఃఖసాగరంలో మునిగిపోయింది. దుఃఖంతో కుమిలిపోతున్న యశోదను చూసి నందుడు కూడా ’కన్నయ్య లేకుండా మేము బ్రతకలేం’ అని కన్నీరు మున్నీరు కాసాగాడు. అలాగే శ్రీకృష్ణుడు కూడా తల్లిదండ్రులను వదిలి మధురకు వచ్చినప్పుడు అవ్యక్తావేదనతో యశోదమ్మను తలచుకుంటూ ఉద్ధవునితో, "ఉద్ధవా! నాకన్నయ్య భోజనం చేస్తే గానీ నేను పచ్చి మంచినీళ్ళైనా ముట్టను’ అని మొండి పట్టుదలతో కూర్చొనే నాతల్లి యశోదమ్మను నేను మరువలేకున్నాను" అని చెబుతూ కృష్ణుడు విలపించసాగాడు.

కంసుని చెరాల నుంచి దేవకీ వసుదేవులను విడిపించిన తరువాత బలరామకృష్ణులు వారికి పాదాభివందనాలు చేసి, వారి పట్ల కృతజ్ఞతాభావాన్ని ఇలా వ్యక్తపరిచారు..

"మాకు నిన్నాళ్ళు లేదయ్యె మరియు వినుడు
నిఖిల పురుషార్థ హేతువై నెగడుచున్న
మేనికెవ్వార లాఢ్యులు మీరు కారె
యా ఋణము దీర్ప నూరేండ్లకైన జనదు" (దశమస్కంధం, పోతన భాగవతం).

’అమ్మా.. నాన్నా..  మేము ఇన్నాళ్ళూ మీ ప్రేమ, ఆప్యాయతలను పొందే అదృష్టానికి నోచుకోలేదు. ధర్మార్థ కామ మోక్షాలనే పురుషార్థాలు సాధించడానికి అవసరమైన ఈ దేహాన్ని ప్రసాదించిన వారు మీరు. అలాంటి దుర్లభమైన మానవ దేహాన్ని ఇచ్చిన మీ ఋణం తీర్చడానికి మాకు నూరేళ్ళైనా సాధ్యం కాదు.’ అని. 

బలరామకృష్ణులు పలికిన మాటల వల్ల తల్లితండ్రుల స్థానం ఎంతటి మహోన్నతమైనదో మనం అర్థం చేసుకోవచ్చు. నిరంతరం తల్లిదండ్రులు మన చెంత ఉండడం వల్ల వారి విలువ ఏమిటో మనం గుర్తించ లేకపోతున్నాం. అందువల్ల వారిపట్ల నిర్లక్ష్య వైఖరినీ, నిర్దాక్షిణ్యాన్నీ చూపుతున్నాం. తల్లిదండ్రులే ఇలలో ప్రత్యక్ష దైవాలనీ, వారి ఋణం ఎన్ని జన్మలైనా తీర్చలేనిదనీ నిరూపించిన వినాయకుడు, శ్రీకృష్ణుడి జీవితాలు మనకు ఆదర్శం కావాలి...

ఆ తల్లికి మనోవేదన

ఆ తల్లికి కూడా భరించలేని మనోవేదన ఎందుకు ఆమె దేవత కదా ఆమెకు కూడా వేదన ఉంటుందా అంటే ఉంటుంది ఆ తల్లిలో లేని గుణాలు మనలో కూడా ఉండదు అయితే అందులో మంచికి జరిగే స్పందన చెడుకు కలిగే స్పందన మన గుణాన్ని బట్టి ఉంటుంది.. ఆమెకు ఎందుకు వేదన చూద్దాము..

బిడ్డను కని చెత్తకుప్పలో వేస్తే ఆ బిడ్డ ఆకలికి ఏడుస్తునప్పుడు ప్రకృతి మాతకు మనో వేదన..

కన్న తల్లితండ్రులను అనాధాలుగా వదిలి వేస్తునప్పుడు ఆమెకు వేదన..

క్షణకాలం సుఖం కోసం వరసలు మర్చిపోయి పాప బీతి లేకుండా పసిబిడ్డలను బలిచేస్తే ఆమెకు వేదన

నోరు లేని జీవాలను హింసించి ఆనందిస్తే ఆమెకు వేదన

నమ్మక ద్రోహం చేసే వారు, దోపిడీలు దొంగతనాలు ఆస్థి కోసం అయిన వాళ్లనే చంపుకోవడం చూసి ఆమెకు వేదన

భార్యాభర్తల సంబందంకి విలువ లేకుండా ప్రవర్తిస్తూ మోసం చేసుకుంటూ విలువలు లేకుండా ప్రవర్తిస్తే ఆమెకు వేదన..

కష్ట పడ్డ వాడికి తగిలి మూల్యం ఇవ్వకుండా శ్రమ దోపిడీ చేస్తే ఆమెకు వేదన...

అపద్దపు వాక్ధానం తో నాయకులు చేసే మోసాలకు ఆమెకు వేదన..

అన్నిటికన్నా ముఖ్యంగా అడ్డదారుల్లో డబ్బు సంపాదన కోసం వ్యక్తిత్వం కోల్పోయి చేసే పాపపు పనులకు ఆమెకు వేదన...
అతల్లి కూడా కన్నీరు పెట్టె సంఘటన ఉంది అది దేవుడి పేరుతో చేసే దోపిడీలు, మోసాలు, పాపపు పనులు దేవుడి పేరుతో బిడ్డలను బలి ఇవ్వడం ఆడవాళ్ళని మోసం చేయడం సమాజంలో సాధువు గా దోపిడీలు చేస్తూ వికృతంగా ప్రవర్తించే వారికి చూసి ఆ తల్లి కన్నీరు కారుస్తుంది అందరూ ఆ తల్లి బిడ్డలే అందులో కొందరు ఆమె పేరుతో మోసం చేస్తే తల్లిని అనాధగా వదిలేస్తే ఎలా ఆమె హృదయం రోధిస్తుందో అలా తాము చడిపోతూ సమాజాన్ని చెడగొడుతున్న వారిని చూసి రోదిస్తుంది..

లంచాలు తినే వారిని, వైద్యం పేరుతో రక్తం తాగే వాళ్ళని చూసి రోధిస్తుంది..

ఆకలితో ప్రాణాలు కోల్పోయే వారిని చూసి , అహకరంతో కన్నుమిన్ను కానక ప్రవర్తించే వారిని చూసి వేదన పడుతుంది..

దేవుడు ఇచ్చిన స్వచ్ఛమైన గాలి నీరు వాతావరణం కలిషితం చేస్తే రోదిస్తుంది..

ఎందుకు వేదన పడుతుందో తెలుసా ఈ పాప భారాన్ని మోయలేక ప్రకృతి చేసే విలయతాండవము దానికి బలి అయిన వారిని చూసి రోదిస్తుంది..చేసిన కర్మకు అనుభవిస్తున్న శిక్షని చూసి ఆవేదన పడుతుంది.. 

ఎందుకంటే అందరూ ఆమె నుండి వచ్చిన బిడ్డలే..పాపం చేసి కర్మను అనుభవించక తప్పదు అది తప్పితేనే ఆమెను చేరుకోగలరు..

మేము బాధలో ఉన్నాము మా కష్టాలు దేవుడు తీర్చలేదు అంటారు, మా పిల్లలు స్థిరపడాలి పెళ్లి కావాలి అంటూ ఏవేవో కొరికలతో అవి జరగక పోతే తల్లితండ్రుగా బాధ పడతారు .మరి ఆ తల్లి బిడ్డలు కష్టాలు పడుతుంటే, తప్పుడు పనులు చేస్తుంటే, జీవితం అడ్డదారిలో నాశనం చేసుకుంటూ ఉంటే ఆమె రోదించదా ఆమెకు బాధ ఉండదా..మనము ఆమెను కష్టపెట్టడం లేదా...

మనము బాధ పడుతూ ఆ తల్లిని బాధ పెడుతున్నాము... అని గమనించాలి.. అనుక్షణం మనల్ని రక్షిస్తూనే ఉంది అని తెలుసుకోవాలి. మనవైపు నుండి మనము ధర్మ బద్దంగా ఉంటే ఆమె వైపు నుండి వచ్చే అనుగ్రహం దక్కుతుంది పాత్ర శుద్దిగా లేకుండా అందులో పానకం పోసిన రుచి ఉండదు ఆమె పానకం పాయసము ఇస్తుంది మనము పాత్ర అనే మన మనసుని ఆలోచనని శుద్ధంగా ఉంచి స్వీకరిద్దాము...మన వైపు  నుండి మనము ధర్మగా ఉందాము.. క్రమశిక్షణతో ఉందాము కొంతైనా ఆ తల్లికి ఆనందాన్ని ఇద్దాము..

ప్రకృతి అంటే అమ్మవారు ఆ ప్రకృతి ని కాలుష్యం చేయకుండా ఉంటాము అని ప్రమాణం చేసుకుందాము ప్రకృతి రూపంలో ఉన్న తల్లిని దర్శిద్దాము..

జ్ఞాన సౌందర్యం

 🌷 ధనం గురించి ,అది లభించే మార్గాల గురించి , ఎంతసేపు ఆలోచించినా కోటీశ్వరుల భజన చేసినా  ఒక్క రూపాయి కూడా లభించదు.
      
 🌷జ్ఞానం గురించి మాట్లాడుతూ,  చర్చిస్తూ, ఆలోచిస్తూ, జ్ఞానుల సాంగత్యం లో ఉంటేనే , జ్ఞానుల ని ఆరాధిస్తే  వారి  నుండి జ్ఞానం మన లోకి  ప్రవహిస్తుంది.
      
 🌷జ్ఞానం ఒక అగ్ని,  మనలోని సమస్త మాలిన్యాలని దహిస్తుంది. అహంకారం కరిగి పోతుంది.

 🌷జ్ఞానం ఒక ఐశ్వర్యం.  క్రమంగా పెరుగుతూ  జన్మ జన్మ కి వెంట వస్తుంది.
  
🌷జ్ఞానం  ఒక ప్రేమ స్వరూపం.  జ్ఞానం ఉన్నవారే
తమని ప్రేమించే వారి  హృదయాన్ని. గుర్తించగలరు. స్వయంగా అందించగలరు.

  🌷జ్ఞానం  ఒక సౌందర్యం.    జ్ఞానం పొందిన వారి
మాటల్లో. ,ప్రవర్తన లో ,  వ్యక్తిత్వం లో,  విశ్వాసాల్లో, కోరికల్లో,   వారి  ప్రతి అణువు లో  జ్ఞానమే కనిపిస్తుంది..

       ఈ కారణం గానే  శ్రీ కృష్ణుడు భగవద్గీత లో 
". *నహి జ్ఞానేన. సదృశం "*  అన్నాడు. 

Thursday, June 25, 2020

భగవంతుడు భక్త సులభుడు

సీతమ్మ గురంచి విన్నప్పుడు, తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి జీవితంలో జరిగిన ఒక ఘటన గుర్తుకు వస్తుంది.

*భగవంతుడు భక్త సులభుడు*...

శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి జీవితంలో జరిగిన ఓ అద్భుత సంఘటన .

వారు పూజ చేసే టప్పుడు ఆవాహయామి అనగానే ఆ దేవత వచ్చి ఎదురుగా బుద్ధిగా కూర్చునేదిట . అది వారి అనుభవం.

ఒకసారి ఒకామె వచ్చి తనకు సీతా మంత్రం అనుగ్రహించమని కోరిందట .
ఆశ్చర్యంతో , ఆనందంతో వారు చాలా కాలం సీతా మంత్రోపాసన చేసి , తరువాత ఆవిడని రమ్మని 
మంత్రోపదేశం చెసారట . 
ఆవిడ వెళ్ళిపోతూ ఈ మంత్రం చేస్తే చాలా కస్టాలు వస్తాయని వింటున్నాను . నిజమేనా అని అడిగిందట . 
వారు అలాటప్పుడు ఆ మంత్రం కావాలని ఎందుకు అడిగావు ? సందేహాలుండకూడదు. అంటే, ఆమె అదేమీ లేదంటూ వెళ్ళిపోయిందట .
కొంత కాలానికి ఆవిడ తిరిగి వచ్చి తనకి ఆ మంత్రం వద్దనీ , ఇక చేయలేననీ, చాలా కష్టాల బారిన పడుతున్నాననీ వాపోయిందిట . 
ఆమె ప్రారబ్దానికి బాధపడుతూ , ఆమె ప్రారభ్దానికి జాలి పడి , సందేహాస్పదమైన మనసుతో, పరిపూర్ణ విశ్వాసం లేకుండా చేస్తే ఇలాగే ఉంటుందేమో అనుకుంటూ 
దయతో శ్రీ శాస్త్రి గారు దానికి కావలసిన జపాలు ముందు ఆయన చేసుకుని ఆవు కుడి చెవిలో మంత్రం చెప్పి వదిలెయ్యి . 
ఇకనించీ మళ్ళీ దాని గురించి ఆలోచించవద్దు అని చెప్పేరట . 
ఆవిడ అలాగే చేసి వెళ్ళిపోయిందట .

ఆ రాత్రి కలలో సీతమ్మ వారు గురువుగారికి కనిపించి , అర్హత లేని వారికి నా మంత్రం ఎందుకు ఇచ్చావు ? 
ఇకనించీ నువ్వు పిలిస్తే రాను అన్నారుట . 
గభాలున లేచి వారు కన్నీరు మున్నీరు గా విలాపించారుట .

కాలం గడుస్తోంది . కొన్నాళ్ళకి వారింట్లో శ్రీరామనవమిని రామపట్టాభిషేకం ప్రతిసారిలాగే నిర్వహిస్తున్నారు . తండోపతండాలుగా శిష్యులు వచ్చి ఉన్నారుట . 
గురువుగారు శ్రీరామచంద్రుని ఆవాహన చేసి , తరువాత సీతమ్మను ఆవాహన చేయబోయి ఆగిపోయారట . 
తల్లి రానని చెప్పిందిగా . ఏ మొహంతో పిలవగలను ? అని పాత జ్ఞాపకాలతో అశ్రుధారలు ప్రవహిస్తూంటే అలాగే చాలా సేపు ఏడుస్తూ ఉండిపోయారట .

చివరకి అతి కష్టం మీద సీతాం ఆవాహయామి అని అనగలిగేరట . 
వెంటనే వచ్చి తల్లి అక్కడ కూర్చున్నదట . 
ఆయన సంతోషానికి హద్దులు లేవు . 
గద్గద స్వరం తో 'రానన్నావు కదా తల్లీ . ఈ దాసుని మీద అంత దయా?' అని ఆనంద బాష్పాలు రాలుస్తున్నారట .

ఏం చెయ్యనురా ! శ్రీ రాములవారిని పిలిచావు ముందు . వారొచ్చి మాట్లాడకుండా కూర్చున్నారు నీ యెదుట . 
నేను రాకేం చెయ్యను ? అన్నదట .

బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు చెప్పినది. 

ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటుంది... అందరికీ మంత్రోపదేశం పొందాలని కుతూహలం. కానీ అది పొందిన తర్వాత జపం చేసే ఓపిక గానీ, ఆ నియమాలు పాటించాలన్న తపన గానీ చాలామందికి ఉండదు. అప్పుడు ఆ మంత్రదేవతకు ఆగ్రహం వస్తుంది. మీకు ఉపదేశం ఇచ్చిన పాపానికి ఆ గురువు కష్టాలపాలవుతారు. కనుక ఉపదేశం పొందాలనుకునే ముందు అన్నిటికి సిద్ధపడే తీసుకోవాలి.

Tuesday, June 23, 2020

శ్రీ కృష్ణ పరమాత్మకు 8 సంఖ్యకు ఉన్న సంబంధం ఏమిటో తెలుసా....?

శ్రీ కృష్ణ పరమాత్మకు 8 సంఖ్యకు ఉన్న సంబంధం ఏమిటో తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవాల్సింది. శ్రీ కృష్ణుడు పుట్టిన తిథి  అష్టమి. దశావతారాల్లో ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణుడు. 

దేవకీ వసుదేవులకు అష్టమ గర్భం. ఆయనకు భార్యలు ఎనిమిదిమంది. కృష్ణుని జన్మనక్షత్రమైన రోహిణి నక్షత్ర క్రమంలో నాలుగవది. అంటే అష్టమ సంఖ్యలో సగం. పదహారు వేలమంది గోపికలు. పదహారు సంఖ్యను, ఎనిమిది సంఖ్యతో భాగించవచ్చును.
 
ఇక జ్యోతిష్యశాస్త్రం ప్రకారం అష్టమం ఆయఃస్థానం. లగ్నం నుండి ఆరవస్థానం మేనమామ. అష్టమత్‌ అష్టమం కూడా ఆయువును చూస్తుంది. అంటే అది మేనమామకు తృతీయం అన్నమాట. 'అష్టమి అష్టకష్టాలు' అన్న నానుడి ఉంది. కానీ జయ తిథికి దుర్గాదేవి అధిష్ఠాన దేవత. విజయసూచిక ఎనిమిది సంఖ్య శని గ్రహాన్ని సూచిస్తుంది. శని ఆయుఃకారకుడు. ఎనిమిది సంఖ్యను రాయటం మొదలుపెడితే ఆ సంఖ్యను ఆపకుండా రాయవలసి వస్తుంది.
 
రోహిణి నక్షత్రం చంద్రుడికి ఉచ్ఛస్థానం. సహజ చతుర్ధాధిపతి చంద్రుడికి ప్రాధాన్యం రోహిణి నక్షత్రం. అంటే మనఃకారకుడు. చంద్రుడు మాతృ, ఆహార, వాహన, గృహభోగాన్ని సూచిస్తాడు. ఆత్మకారకుడు రవి. అగ్నిని మానవుడికి తానే ఇస్తానని సూచించాడు. సహజ ఆరవ స్థానం శత్రు, రోగ, రుణాలను సూచిస్తుంది. దానికి అధిపతి బుధుడు (అంటే నారాయణుడన్నమాట). అందుకే 'వైద్యో నారాయణో హరిః' అనమని పెద్దలు చెప్తున్నారు. అందుచేత శ్రీకృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుడిని స్మరించుకుంటే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.

బ్రహ్మ జ్ఞానానికి మూలము

త్రిపురాలు..మనిషిని మింగేస్తున్నా మూడు వికారాలు-నేను,నాది,నాదికానిది.
'నేను' అంటే -నా శరీరం,నా మనసు.

'నాది' అంటే-నా ఆస్తి, నా జ్ఞానం, నా కుటుంబం, నా అధికారం.
'నాది కాదు'అంటే-నాకు అందనిది,అందుబాటులో లేనిది,నేను అందుకోవాలని ఆరాట పడుతున్నది...ఏదయినా కావచ్చు..

'నాది' అనుకోవడములో బాధ ఉంది.'నాది కాదే'!అనుకోవడములోను బాధ ఉంది.మొత్తంగా 'నా...'అనే ఆలోచనే వద్దు అంటుంది "నీ తత్వము"..ఈ మూడు దుఃఖ కారకాలే..ఆ త్రివిధ వికారాలకి ప్రతీకలైన ముగ్గురు రాక్షసులు మూడు ఎగిరే నగరాలని సృష్టించుకొని ముల్లోకాలని అల్లకల్లోలం చేస్తుంటారు.

ఆ మూడు నగరాలని ఒకే బాణంతో నేలకూల్చాలి. లేదనంటే లేదు.అది వారి ధైర్యము,వారికున్న వరము.ఒకే సరళరేఖలో ఎగురుతున్నప్పుడే దుష్టశిక్షణ సాధ్యమవుతుంది... త్రిపురాల్ని నాశనం చేయడమంటే...నేను,నాదీ, నాదికాదు అన్న భావనల్ని తొలగించుకోవడమంటే... ఎంత కష్టం! 

మనలోని సమస్త శక్తుల్ని కూడగట్టుకోవాలి.నువ్వు చేసింది అదే కదా....
"భూమిని రథము చేసుకున్నావు,(భూమి వాస్తవిక దృక్పథానికి ప్రతీక)సూర్యచంద్రుల్ని చక్రాలుగా అమర్చకున్నావు(ఆ రెండు జీవితములో ఎత్తుపల్లాల్ని ప్రతిబింబిస్తాయి).బ్రహ్మ సారథ్యం  వహించాడు(బ్రహ్మ జ్ఞానానికి మూలము)..మేరుపర్వతము వింటి చాపమైంది(కొండ ఆత్మబలానికి రూపము),శేషుడు వింటినారి అయ్యాడు,సర్పం శరము అయ్యింది.(సర్పాన్ని సంధించడమంటే కోరికల్ని జయించడము) పరిపూర్ణ ఆత్మవిశ్వాససముతో వెన్నంటి తరమగా..త్రిపురాలు ఒకే సరళరేఖ మీదకి వచ్చాయి.నీ బాణం దెబ్బకి కాలి బూడిద అయిపోయాయి.. నాలోను తిష్టవేసుకున్న త్రిపురాసుల్ని సంహారం చేసేటంతటి శక్తిని ప్రసాదించు ప్రభు....

సాలగ్రామములు-పుట్టు పూర్వోత్తరాలు

సాలగ్రామము విష్ణుప్రతీకమైన ఒక శిలా విశేషము. సర్వకాల సర్వ్యావస్థలయందు విష్ణువు సాక్షాతూ సాన్నిధ్యం కలిగి ఉండేది సాలగ్రామంలో మాత్రమే. అందుచేతే గృహదేవతార్చనలలోగానీ, దేవాలయాలలోగానీ సాలగ్రామము (మూర్తి) లేకుండా పూజలు కొనసాగవు. ద్వైతులు, విశిష్టాద్వైతులు, అద్వైతులు తమతమ దేవతార్చనలలో సాలగ్రామములను పూజకు ఉపయోగిస్తారు.
భారతదేశంలో సాలగ్రామ పూజ బహు పురాతనమైనది. క్రీస్తు కంటే ప్రాచీనుడైన అపస్తంబుడు సాలగ్రామ పూజను పేర్కొన్నాడు. త్రిమతాచార్యులు తమతమ భాష్యాలలో సాలగ్రామాలు విష్ణురూపాలని వివరించారు. దేవాలయాలలో పంచాయతన మూర్తులకు శిలా ప్రతిమలు ఉంటే గృహస్థులకు మణి, స్వర్ణ నిర్మితమైన మూర్తులు, సాలగ్రామములు ఉంటాయి. సాధారణంగా ప్రతిమలకు నిత్య పూజా సమయంలో ఆవాహనాది షోడశోపచారాలు చేయాలి. సాలగ్రామాలలో దేవత నిత్యం సన్నిహితమై ఉండడం వల్ల వాటికి పూజా సమయంలో అవాహనాది ఉపచారాలు అవసరం లేదు.
హిందువులందరికీ తులసి, శంఖం, సాలగ్రామం పూజనీయమైనవి. తులసి హిందువుల ఇహపర సాధనానికి భూలోకంలో అవతరించిన వనదేవత. ఈ తులసి అపూర్వమైన మూలిక కూడా. శంఖం అత్యంత పవిత్రమైనది. శంఖారావం వ్యాపించినంత దూరం సూక్ష్మక్రిములు నశిస్తాయి అంటారు. నీరు శంఖంలో పూరిస్తే తీర్థం అవుతుంది. వట్టివేళ్ళు, ఏలకులు, లవంగాలు, పచ్చ కర్పూరం మొదలైన సుగంధ ద్రవ్యాలు చేర్చిన నీటిని శంఖంలో పోసుకుంటూ సాలగ్రామాలకు పురుషుసూక్తం పఠిస్తూ అభిషేకం చేసిన తీర్థం సర్వశక్తివంతం. ఇటువంటి తీర్ధాన్ని భక్తితో సేవిస్తే ప్రాయశ్చిత్తం, పాపక్షయం కలుగుతుంది. తీర్ధాన్ని మూడుసార్లు తీసుకుంటారు. మొదటిది కాయసిద్ధి కొరకు, రెండవది ధర్మసాధనకు,మూడవది మోక్షం పొందడానికి. అసలీ తీర్ధం అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయం కలుగుతాయి.
సాలగ్రామాలు ఉన్న ఇల్లు గొప్ప పుణ్యక్షేత్రంతో సమానం. సాలగ్రామ దర్శనం వల్ల, స్పర్శవల్ల, అర్చనవల్ల అంతులేని పుణ్యం లభిస్తుంది. సాలగ్రామాలు శిలాజాలు. శాస్త్రజ్ఞులు ఈ శిలలను ఒక విధమైన ప్రాణి నిర్మిస్తుందని అంటారు. ఆలి అనే ఒక విధమైన మత్స్యం శీతాకాలంలో తన శరీరం నుంచి వెలువడే ఒక విధమైన రసాయనిక పదార్ధంతో శిలామయమైన కవచాన్ని నిర్మించుకుని దానిలో నివశిస్తుందని అది మరణించినప్పుడు లేక వదిలి వెళ్ళినప్పుడు అవి సాలగ్రామాలుగా మనకు లభిస్తాయని అంటారు. సాలగ్రామాల మీద వివిధ దేవతా చిహ్నాలు ఉంటాయి. ముఖ్యంగా చక్రం, పద్మం ప్రధాన చిహ్నాలు. విష్ణు భక్తులైన మాధ్వులకు, వైష్ణవులకు ఇవి పూజకు ఎంతో విలువైనవి. వైష్ణవ పురాణాలు, ఇతవ వైష్ణవ గ్రంధాలు వీటిని గురించి సవిస్తరంగా వివరిస్తాయి.

నేపాల్ దేశంలో ఖట్మండుకు సుమారు 197 మైళ్ళు దూరంలో ముక్తినాధ్, గండకీ నదీ తీరంపై ఉన్న మహాషేత్రంలో ఇవి లభిస్తాయి. ఇవి సాధారణంగా స్థలజాలు, జలజాలు అని రెండు రకాలు. గండకీ నదీ తీరాన్ని ఆనుకుని ఉన్న సాలగ్రామ గిరిపైన స్థలజాలు, గండకీ నదీ గర్భంలో జలజాలు లభిస్తాయి.

 సాలగ్రామాలలో బంగారం ఉంటుంది. అందుకే వాటిని హిరణ్యగర్భ అని కూడా అంటారు. సాలగ్రామాలు అమోనైట్ శిలామాలు. ఇండియాలో ఈ సాలగ్రామాలు సముద్రంలో నివసించే టెథైస్ అనే ప్రాణి వల్ల ఏర్పడతాయి. ఇటువంటి శిలాజాలు అనేక రకాలు ఉన్నాయి. 250 మిలియన్ సంవత్సరాలలో ఇండియా ఉత్తర దిక్కుగా 9,000 కి.మీ. జరిగిపోయింది. హిమాలయాలు ఏర్పడ్డాయి. వీటి నుండి అనేక నదులు ప్రవహించాయి. ఇండో మైదానంలోకి ప్రవహించిన అటువంటి నదులలో ఒకటి గండకి. సాలగ్రామములు మన శాస్త్రం అనుసరించి కొన్ని సౌమ్యమైనవి. కొన్ని ఉగ్రమైనవి. శాస్త్ర సమ్మతంగా చక్రశుద్ధి, వక్త్రశుద్ధి, శిలాఉద్ధి, వర్ణశుద్ధి గల వాటినే పూజించాలి. రకరకాల రంగులు గలిగిన కారునలుపు, భగ్నమైన, మొక్కవోయిన సాలగ్రామాలను పూజించకూడదు. నారసింహ పాతాళ నారసింహ, గండభేరుండ, మహాజ్వాల మొదలైనవాటిని సన్యాసులు, బ్రహ్మచారులు పూజించాలి. విష్ణు, సీతారామ, గోపాల వంటి శాంతమూర్తులనే గృహస్థులు పూజించుకూవాలంటారు. పరిమాణాన్నిబట్టి కూడా పూజార్హతను నిర్ణయించుకుంటారు.. సాధారణంగా ఇవి ప్రతి గృహంలోనూ వంశపారంపర్యంగా సంక్రమిస్తుంటాయి. సాలగ్రామ శిలామహత్మ్యం గురించి వేరే చెప్పనక్కరలేదు. తిరుపతిలో శ్రీ వేంకటేశ్వరునికీ, మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామి వారికీ అంతటి మహిమ ఉండడానికి కారణం అక్కడ ఉండే సాలగ్రామాలు అంటారు. 

సాలగ్రామాన్ని పూజిస్తే ఎంత పుణ్యం లభిస్తుందో దాని దానం వలన కూడా అంతటి ఫలం లభిస్తుంది.
2 )పూర్వం విదేహరాజ్యంలో ప్రియంవద అనే స్ర్తీమూర్తి ఉండేది. అత్యంత రూపవతి, గుణవతి అయిన ఆమె, శ్రీమన్నారాయణుని ప్రసన్నం చేసుకుని, ఆయన తన కుమారునిగా జన్మించాలని కోరుకుంటుంది. ఆమె కోరి కను మన్నించిన స్వామివారు, మరుజన్మలో ఆమె గండ కీ నది రూపాన్ని ధరించేటట్లుగా చేసి, తాము సాల గ్రామ రూపంలో ఆ నది నుంచి ఉద్భవిస్తున్నారని కథ.సాలగ్రామ శిలయందు, చరాచరాత్మకమగు మూడు లోకాలు అణిగి ఉన్నాయి. ఆ కారణంగా సాలగ్రామాన్ని భక్తిశ్రద్ధలతో, పరిపూర్ణ విశ్వాసంతో, శాస్త్ర ప్రకారం అభిషేకిస్తే, కోటి యజ్ఞాలు చేసినంత పుణ్యఫలానికి సమానమవుతుంది. మరియు కోటి గోవులను దానం చేసినంత ఫలితాన్ని పొందుతారు. సాలగ్రామ పూజచే, శివకేశవులని పూజించిన ఫలితం కలుగుతుందిట.

సాలగ్రామం వున్న ప్రదేశాలలో స్నానం చేసినా, దానం చేసినా, కాశీ క్షేత్రంలో పవిత్ర గంగానదీ స్నానంకంటే, ఆ పుణ్యక్షేత్రంలో చేసిన దానం కంటే, నూరె రెట్లు అధి క ఫలము కలుగుతుంది. సాలగ్రామమును అభిషేకిం చిన పుణ్య బలాలను ప్రోక్షించుకొనినచో, సర్వపాపాల ను నశింపజేస్తుంది. సర్వరోగాలు తొలగిపోతాయి. సక ల సంపదలు కలుగుతాయి, సర్వశుభాలను కలిగించి, మోక్ష సామ్రాజ్యమును సిద్ధింపజేస్తుంది. సాలగ్రామ మును అభిషేకించిన జలాలను ప్రోక్షించుకొనిన యెడల, పవిత్ర గంగానదీ స్నానమాచరించిన యెడల సర్వ తీర్థాలలో స్నానమాచరించిన పుణ్యఫలం కలిగి, సర్వదేవతలను ఆరాధించిన ఫలితం కలుగుతుంది.

ఒక్కసారి భక్తిశ్రద్ధలతో సాలగ్రామాన్ని శాస్త్ర ప్రకారం పూజించి, అభిషేకించితే కోటి లింగాలను దర్శించి, పూజించి, అభిషేకించిన ఫలితం కలుగుతుంది. సాల గ్రామ తీర్థం సేవించినచో, వెయ్యిసార్లు పంచామృత మును సేవించిన ఫలితముకంటే, ప్రాయశ్చిత్తముల యందు ఆచరించు దానాలు ఫలితం కంటే అధిక ఫలి తం ఉంటుంది. కనీసం, సాలగ్రామాన్ని అర్చించు టకు మంత్రాదులు తెలియకున్నప్పటికీ, శక్తిననుసరించి పూర్తి భక్తివిశ్వాసాలతో పూజిస్తే, కొన్ని ఫలితాలైనా కలు గుతాయి. సాలగ్రామ శిల యందు ఉంచిన అన్ని పదార్థములు పవిత్రములవుతాయి. సాలగ్రామమును ముందుంచు కుని పితృదేవతలకు తర్పణాలను ఇచ్చన ఎడల, ఆ పితృదేవతలు స్వర్గంలో శాశ్వత సుఖాలను పొందు తారు. అన్ని విధాలైన పుణ్యాలకు పరిమితులున్నాయి గాని, ఈ సాలగ్రామశిల పూజచే కలుగు పుణ్యానికి పరిమితులు లేవు. అతల, వితల, రసాతల, పాతాళాది పధ్నాలుగు లోకాలలో ఈ సాలగ్రామ శిలకు సరిపడునట్టి వేరొక శిల లేదన్నదే శాస్తవ్రచనం.
కార్తీక మాసంలో సాలగ్రామ శిలపై ‘స్వస్తిక’ మండల మును రచించినచో అనంతమైన పుణ్యఫలము కలుగు తుంది. సంవత్సరకాలం గృహంలో ‘నిత్యాగ్ని హోమం’ చేసిన ఫలితానికి సమానమైన ఫలితాన్ని పొందుతారు. సాలగ్రామంపై శుద్ధమైన మట్టితో గాని, రంగులతో గాని, ఏ కొద్దిపాటి కేశవనామాలను వ్రాసినా, కోటి కల్పాల వరకూ స్వర్గంలో నివసించే భాగ్యం కలుగు తుందిట. పూజాపీఠంలో సాలగ్రామమును ఉంచితే, సమస్తమైన పూజలు సక్రమంగా సాగి పరిపూర్ణ ఫలితాలను పొందుతారు. సాలగ్రామాలు ఎంత చిన్నవిగా ఉంటే అంత మంచిది. సాలగ్రామాలు పగిలి నప్పటికీ, పెచ్చు పూడినప్పటికీ కూడా పూజార్హత కలిగి ఉంటాయి. కొన్ని సాలగ్రామాలు ఇంట్లో పెట్టుకుని పూజించుటకు అర్హత కలిగి ఉండవు. విపరీత పరి మాణామాలు కలుగుతాయి, కాబట్టి ఇంట్లో పెట్టుకుని పూజించాలనుకుంటే, సాలగ్రామములను గురించి క్షుణ్ణంగా తెలిసిన పండితుల అమూల్యమైన అభిప్రా యాలను తెలుసుకుని ఆచరించటం శ్రేయస్కరం.
సాలగ్రామంపై గల చక్రాలను బట్టి వాటికి వివిధము లైన పేర్లు ఉన్నాయి.

1 చక్రం ఉంటే - సుదర్శనం అని,

2 చక్రములు ఉంటే - లక్ష్మీనారాయణ అని,

3 చక్రములు ఉంటే - అచ్యుతుడు అని,

4 చక్రములు ఉంటే - జనార్ధనడు అని,

5 చక్రములు ఉంటే - వాసుదేవుడు అని,

6 చక్రములు ఉంటే - ప్రద్యుమ్నుడు అని,

7 చక్రములు ఉంటే - సంకర్షణుడు అని,

8 చక్రములు ఉంటే - పురుషోత్తముడు అని,

9 చక్రములు ఉంటే - నవ వ్యూహము అని,

10 చక్రములు ఉంటే - దశావతారము అని,

11 చక్రములు ఉంటే - అనిరుద్ధుడు అని,

12 చక్రములు ఉంటే - ద్వాదశాత్ముడు అని,

12 చక్కముల కన్నా ఎకువ ఉంటే ‘అనంతమూర్తి’ అని అంటారు. సాలగ్రామాలు తెల్లనివైతే సర్వపాపాలను హరిస్తాయి. పసుపుపచ్చనివి అయితే సంతానభాగ్యాన్ని కలిగిస్తాయి. నీలవర్ణంగలవి అయితే సర్వసంపదలను ఇస్తాయి. ఎరుపురంగు గలవి అయితే రోగాలను కలిగిస్తాయి, వక్రముగా వున్న సాలగ్రామాలు దారి ద్య్రాన్ని కలిగిస్తాయి.నలుపు రంగు కలిగి, దానికి గల చక్రం మధ్య భాగంలో కొద్దిగా ఉబ్బినట్లుగా వుండి, రేఖపొడవుగా ఉంటే, దానిని ‘ఆదినారాయణ సాలగ్రామం’ అని అంటారు.

తెలుపురంగు కలిగి రంధ్రంవైపున రెండు చక్రాలు ఒక దానితో ఒకటి కలిసిపోయినట్లు ఉంటే, దానిని ‘వాసు దేవ సాలగ్రామం’ అని అంటారు. ఇది సర్వ శ్రేష్టమై నది. ఇది ఆధ్యాత్మికతను పెంపొందిస్తుంది.

పసుపు పచ్చ రంగు కలిగి గుండ్రంగా వుండి, రంధ్రం వైపున మూడు రేఖలు ఉండి, ‘పద్మ చిహ్నం’ పైముఖం గా ఉంటే దానిని ‘అనిరుద్ధ సాలగ్రామము’ అని అం టారు. ఇది చాలా మంచిది. కపిలవర్ణం కలిగి, చక్రం పెద్దదిగా ఉంటే, దానిని ‘నర సింహ సాలగ్రామం’ అని అంటారు. దీనిని బ్రహ్మచర్య దీక్షతోనే పూజించాలి. బంగారు వర్ణంతో పొడవుగా వుండి మూడు బిందువులతో వున్నదానిని ‘మత్య్సమూర్తి సాలగ్రామం’ అని అంటారు. ఇది భక్తిని పెంచి ముక్తిని కలిగిస్తుంది. సంపదలను ఇస్తుంది. నలుపు రంగుతో, మెరుస్తూ వుండి ఎడమవైపున గద, చక్రాలు, కుడి వైపున రేఖ వున్నదానిని ‘సుదర్శనమూర్తి సాలగ్రామం’ అని అంటారు. శత్రుబాధలు నుండి రి స్తుంది. వివిధ వర్ణములతో వుండి, అనేక చక్రాలు, అనేక రేఖలు వున్నదానిని ‘అనంతమూర్తి సాలగ్రామ ము’ అని అంటారు.

ఈ సాలగ్రామం సకలాభీష్టాలను తీర్చుతుంది. 3 ముఖాలు, 6 చక్రాలు కలిగి నేరేడు పం డు ఆకారంలో ఉన్న దానిని ‘షట్చక్రసీతారామ సాల గ్రామం’

అని అంటారు. ఇలాంటి సాలగ్రామం దొర కటం దుర్లభం. ఈ సాలగ్రామాన్ని పూజించనవారికి అష్టైశ్వర్యములు కలుగుతాయి. ఇంకా కొన్ని అపురూప మైన సాలగ్రామాలు కూడా ఉన్నాయి. ఇంట్లో పూజిం చు సాలగ్రామానికి నిత్యనైవేద్యం తప్పనిసరిగా పెట్టాలి.

 కుటుంబ సభ్యులు మినహా అన్యులు సాలగ్రామాన్ని దర్శించరాదు.సర్వపాపపరిహారమైనది, సర్వవిధాలైన కష్టాల నుండి రక్షించేది, సర్వ పుణ్యణఫలాలను ఇచ్చేది, సర్వదేవతా పూజాఫలితాలను ఇచ్చేది, సర్వశ్రేయస్కరమైనది, సర్వో త్కృష్టమైనది, సర్వాంతర్యామి యొక్క ప్రతీక అయిన ‘సాలగ్రామాన్ని’ పూజించుకునే భాగ్యం ఈ కలియుగం లో మానవులమైన మనకు కలగటం, నిజంగా అపూర్వ మైన అదృష్టం. అటువంటి అవకాశాన్ని వినియోగించు కుని, జీవితాన్ని ధన్యం ఒనర్చుకుని, శాశ్వతానందాన్ని పొంది ముక్తిని పొందటం భక్తిపరుడైన మానవునికి ముఖ్యకర్తవ్యం అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అవకాశం దొరికితే, ఆ పుణ్యఫలాన్ని దక్కించుకు నేందుకు ప్రయత్నించాలి.
మరోకథ ప్రకారం, ఒకానొకసారి సృష్టిలోని జీవులన్నీ విపరీతమైన పాపపు చేష్టలను చేస్తుండేవి. ఆ దృశ్యా లను చూసిన బ్రహ్మదేవుడు, ఇంతడికీ కారణం తన సృష్టే కదా! తాను చేసిన సృష్టిలో 
ోపం ఉండబట్టే కదా, జనం ఇలా పాపకృత్యాలలో మునిగిపోతున్నారని బాధపడు తుండగా, ఆయన కళ్ళెంబడి రెండు కన్నీటి చుక్కలు రాలిపడ్డాయట. ఆ కన్నీటి చుక్కలే గండకీనది గా మారాయని కథనం. ఇలా సాలగ్రామాన్ని గురించిన అనేక కథలు మన పురాణాలలో కనబడుతున్నాయి.
సాలగ్రామాలను ఆవుపాలతో గాని, పంచామృముతోగాని శుద్ధి చేయాలి. 

‘రుద్రాక్షధారణ’ నియమాలనే, సాలగ్రామ పూజలోనూ పాటించాలి. ప్రత్యేక సమయాలలో, సంక్రమణకాలాలలో, గ్రహణ సమయాలలో 
ఆయా సాలగ్రామాలననుసరించి ఆయా 
దైవజపాలను 1008 సార్లు చేసినా, 
చేయించుకున్నా, ఆ సాలగ్రామము యొక్క శక్తి ద్విగుణీకృతమవుతుంది.
సాలగ్రామశిలను షోడశోపచార 
పూజావిధానం ద్వారా అర్చించిన భక్తులకు యావత్‌ కల్పాంతముల వరకు 
వైకుంఠంలో నివసించే భాగ్యం కలుగుతుంది. 
కనీసం సాలగ్రామంకు భక్తిశ్రద్ధలతో 
నమస్కరించి, యథావిధిని పూజిస్తే, మరుజన్మ లేకుండా ముక్తి పొందుతారని ప్రతీతి.

 సాలగ్రామ మును స్మరించినా, దర్శించినా, నమస్కరించినా, సర్వపాపాలు పరిహరింపబడతాయి.

వినయం వివేక లక్షణమ్

శ్రీమద్రామాయణం లోని కథ
పరమాత్ముడైన శ్రీ రామ చంద్రుడు అమిత పరాక్రమశాలి మహావీరుడు ధనుర్విద్యానిపుణుడు. శ్రీ రాముడు బ్రహ్మర్షి అగు వసిష్ఠ మహర్షి వద్ద సకల శాస్త్రములు ధనుర్విద్య అభ్యసించినాడు. గాయత్రీ మంత్రద్రష్ట అగు విశ్వామిత్ర బ్రహ్మర్షి వద్ద బల అతిబలాది విద్యలు మఱియు ఎన్నెన్నో అతి రహస్యములైన అస్త్రములను నేర్చినాడు. ఈ అస్త్రములు కేవలము విశ్వామిత్రులవారికే తెలియును. ఇదియే కాక పరమపూజనీయుడగు అగస్త్య మహర్షి శ్రీ రామ చంద్రునకు దివ్య ధనువు అక్షయ తూణీరము రత్నఖచిత ఖడ్గమును ప్రసాదించెను.

ఒక్క బాణముతో శ్రీ రామ చంద్ర మూర్తి మహాబలశాలియైన తాటకను నేలకూల్చెను
ఒకేమాఱు రెండు బాణములు వదిలి సుబాహు సంహారము చేసి మారీచుని సప్తసముద్రాలకు అవతల పారవేశను
మహాభారవంతమైన శివచాపమును అవలీలగా ఎత్తి ఎక్కుపెట్టిన అది విరిగెను
శ్రీ రాముడొక్కడే ప్రహరార్ధకాలములో (90 min.) ఖర త్రిశిర దూషణాదులను వారి సేనలను సంహరించెను
ఇంత ప్రతాపవంతుడైనప్పటికీ శ్రీ రాముడు ఎప్పుడూ తనకుతానుగా బలప్రదర్శనము చేయలేదు. ఆ దయార్ద్ర హృదయుడు సర్వదా వినయవంతుడై వర్తించెను. దీనికి తార్కాణము సముద్రుని గర్వభంగ ఘట్టము.

శ్రీ రాముని సైన్యము సముద్ర లాంఘనము చేయుసమయము వచ్చెను. సర్వజ్ఞుడైన రాముడు ఉపాయము ఎఱిగియు సహజ వినయవంతుడగుటచే పరమభాగవతోత్తముడైన విభీషణుని సలహా అడిగెను. విభీషణుడు ఇట్లు పల్కెను “ఓ రఘునాయకా! మీ బాణమొక్కటే కోటి సముద్రములనైనను శుష్కింప చేయగలదు. ఐనను సముద్రునే ఉపాయమడుగ ఉత్తమమని నా యోచన”.

రావణుడు తనను వివాహమాడమని హెచ్చరించి సీతమ్మవారికి నెల రోజుల గడువు ఇచ్చెను. భరతుడు పదునాలుగేండ్లపై ఒక్క నిమిషము కూడా శ్రీ రామునికి దూరంగా ఉండజాలక శ్రీ రాముడు ఆలస్యమైన పక్షంలో శరీరత్యాగం చేసెదనని ప్రతిజ్ఞబూనెను. ఈ రెండు కారణముల వలన శ్రీ రాముని వద్ద అప్పటికి పట్టుమని ౩౦ రోజులుకూడాలేవు. ఐనను రఘురాముడు తన బలప్రదర్శనము చేయక వినయముతో సాగరుని ప్రార్థింప నిశ్చయించెను.

శ్రీ రాముడు ఉదధిని సమీపించి సముద్రునకు శిరసా ప్రణమిల్లెను. పిదప తీరమున దర్భలు పరచి ఆ దర్భాసనం పైన కూర్చుని తదేక దృష్టితో సముద్రుని ప్రార్థించెను. ఇట్లు ౩ దివసములు సముద్రునికై ప్రార్థించినను ఆ సముద్రుడు రాడాయె. చివరకు శ్రీ రాముడు “ఈతనికి సామముగా చెప్పిన వినడాయె. ఇటువంటి వారికి దండోపాయయే సరియైనది” అని సముద్రునిపై అస్త్రం సంధించెను. శ్రీ హరి కోపమును భరింపగలవారెవ్వరు? వెంటనే సముద్రుడు ప్రత్యక్షమయ్యెను. అంత దయాళువైన శ్రీ రాముడు సముద్రుని క్షమించి తాను ఎక్కుపెట్టిన అమోఘ బాణము దేనిమీద ప్రయోగింపవలెనని అడిగెను. సముద్రుడు ఉత్తరాన దుష్టులైన కాలకేయ రాక్షసులు ఉన్నారని సూచించెను. అంతట శ్రీ రాముడు ఆ అస్త్రముతో ఆ రాక్షసుల సంహారముచేసి ఆ కాలకేయులుండే పర్వతం ఔషధాలకు నిలయమై ప్రజాహితం చేకూర్చునని ఆశీర్వదించెను.