ఆ తల్లికి కూడా భరించలేని మనోవేదన ఎందుకు ఆమె దేవత కదా ఆమెకు కూడా వేదన ఉంటుందా అంటే ఉంటుంది ఆ తల్లిలో లేని గుణాలు మనలో కూడా ఉండదు అయితే అందులో మంచికి జరిగే స్పందన చెడుకు కలిగే స్పందన మన గుణాన్ని బట్టి ఉంటుంది.. ఆమెకు ఎందుకు వేదన చూద్దాము..
బిడ్డను కని చెత్తకుప్పలో వేస్తే ఆ బిడ్డ ఆకలికి ఏడుస్తునప్పుడు ప్రకృతి మాతకు మనో వేదన..
కన్న తల్లితండ్రులను అనాధాలుగా వదిలి వేస్తునప్పుడు ఆమెకు వేదన..
క్షణకాలం సుఖం కోసం వరసలు మర్చిపోయి పాప బీతి లేకుండా పసిబిడ్డలను బలిచేస్తే ఆమెకు వేదన
నోరు లేని జీవాలను హింసించి ఆనందిస్తే ఆమెకు వేదన
నమ్మక ద్రోహం చేసే వారు, దోపిడీలు దొంగతనాలు ఆస్థి కోసం అయిన వాళ్లనే చంపుకోవడం చూసి ఆమెకు వేదన
భార్యాభర్తల సంబందంకి విలువ లేకుండా ప్రవర్తిస్తూ మోసం చేసుకుంటూ విలువలు లేకుండా ప్రవర్తిస్తే ఆమెకు వేదన..
కష్ట పడ్డ వాడికి తగిలి మూల్యం ఇవ్వకుండా శ్రమ దోపిడీ చేస్తే ఆమెకు వేదన...
అపద్దపు వాక్ధానం తో నాయకులు చేసే మోసాలకు ఆమెకు వేదన..
అన్నిటికన్నా ముఖ్యంగా అడ్డదారుల్లో డబ్బు సంపాదన కోసం వ్యక్తిత్వం కోల్పోయి చేసే పాపపు పనులకు ఆమెకు వేదన...
అతల్లి కూడా కన్నీరు పెట్టె సంఘటన ఉంది అది దేవుడి పేరుతో చేసే దోపిడీలు, మోసాలు, పాపపు పనులు దేవుడి పేరుతో బిడ్డలను బలి ఇవ్వడం ఆడవాళ్ళని మోసం చేయడం సమాజంలో సాధువు గా దోపిడీలు చేస్తూ వికృతంగా ప్రవర్తించే వారికి చూసి ఆ తల్లి కన్నీరు కారుస్తుంది అందరూ ఆ తల్లి బిడ్డలే అందులో కొందరు ఆమె పేరుతో మోసం చేస్తే తల్లిని అనాధగా వదిలేస్తే ఎలా ఆమె హృదయం రోధిస్తుందో అలా తాము చడిపోతూ సమాజాన్ని చెడగొడుతున్న వారిని చూసి రోదిస్తుంది..
లంచాలు తినే వారిని, వైద్యం పేరుతో రక్తం తాగే వాళ్ళని చూసి రోధిస్తుంది..
ఆకలితో ప్రాణాలు కోల్పోయే వారిని చూసి , అహకరంతో కన్నుమిన్ను కానక ప్రవర్తించే వారిని చూసి వేదన పడుతుంది..
దేవుడు ఇచ్చిన స్వచ్ఛమైన గాలి నీరు వాతావరణం కలిషితం చేస్తే రోదిస్తుంది..
ఎందుకు వేదన పడుతుందో తెలుసా ఈ పాప భారాన్ని మోయలేక ప్రకృతి చేసే విలయతాండవము దానికి బలి అయిన వారిని చూసి రోదిస్తుంది..చేసిన కర్మకు అనుభవిస్తున్న శిక్షని చూసి ఆవేదన పడుతుంది..
ఎందుకంటే అందరూ ఆమె నుండి వచ్చిన బిడ్డలే..పాపం చేసి కర్మను అనుభవించక తప్పదు అది తప్పితేనే ఆమెను చేరుకోగలరు..
మేము బాధలో ఉన్నాము మా కష్టాలు దేవుడు తీర్చలేదు అంటారు, మా పిల్లలు స్థిరపడాలి పెళ్లి కావాలి అంటూ ఏవేవో కొరికలతో అవి జరగక పోతే తల్లితండ్రుగా బాధ పడతారు .మరి ఆ తల్లి బిడ్డలు కష్టాలు పడుతుంటే, తప్పుడు పనులు చేస్తుంటే, జీవితం అడ్డదారిలో నాశనం చేసుకుంటూ ఉంటే ఆమె రోదించదా ఆమెకు బాధ ఉండదా..మనము ఆమెను కష్టపెట్టడం లేదా...
మనము బాధ పడుతూ ఆ తల్లిని బాధ పెడుతున్నాము... అని గమనించాలి.. అనుక్షణం మనల్ని రక్షిస్తూనే ఉంది అని తెలుసుకోవాలి. మనవైపు నుండి మనము ధర్మ బద్దంగా ఉంటే ఆమె వైపు నుండి వచ్చే అనుగ్రహం దక్కుతుంది పాత్ర శుద్దిగా లేకుండా అందులో పానకం పోసిన రుచి ఉండదు ఆమె పానకం పాయసము ఇస్తుంది మనము పాత్ర అనే మన మనసుని ఆలోచనని శుద్ధంగా ఉంచి స్వీకరిద్దాము...మన వైపు నుండి మనము ధర్మగా ఉందాము.. క్రమశిక్షణతో ఉందాము కొంతైనా ఆ తల్లికి ఆనందాన్ని ఇద్దాము..
ప్రకృతి అంటే అమ్మవారు ఆ ప్రకృతి ని కాలుష్యం చేయకుండా ఉంటాము అని ప్రమాణం చేసుకుందాము ప్రకృతి రూపంలో ఉన్న తల్లిని దర్శిద్దాము..
No comments:
Post a Comment