Saturday, July 25, 2020

విష్ణుదత్తుడు చేసిన దత్త స్తుతి

దత్తాత్రేయుని పిత్రు స్థానమున కుర్చోబెట్టి  శాస్త్రోక్తముగా శ్రాద్ధము పెట్టిన తరువాత, స్వామి తృప్తి చెందారు. 
నీకు నాశనము లేని ఫలము కలిగినదని స్వామి చెప్పగా, సాష్టాంగనమస్కారములు చేసి విష్ణుదత్తుడు ఈ విధముగా స్తుతించారు🙏...

1.🔸దత్తాత్రేయం హరిం కృష్ణం! ఉన్మాదం ప్రణతోస్మ్యహమ్!
ఆనందదాయకం దేవం! మునిబాలం దిగంబరమ్॥🙏
భావము :: దత్త దేవుడు, అత్రిపుత్రుడు, విష్ణువు, కృష్ణుడు, అనందము చే ఉన్మత్తుడు, ఆనందమును ఇచ్చె వాడు, ప్రణవస్వరూపుడు,మునిబాలుడు, దిగంబరుడు అయిన దత్తాత్రేయునికి నమస్కారించు చున్నాను.

2.🔸పిశాచరూపిణం విష్ణుం! వందేహం జ్ఞానసాగరం!
యోగినం భోగినం నగ్నం!అనషూయాత్మజం కవిమ్ ॥🙏

భావము:: పిశాచరూపుడు, సర్వవ్యాపకుడు,జ్ఞానసముద్రుడు, యోగి, భోగి, దిగంబరుడు, అనసూయా పుత్రుడు, సర్వజ్ఞుడు అయిన స్వామికి నమస్కారము.

3.🔸భోగ మోక్షప్రదం వందే! సర్వదేవ స్వరూపిణం!
ఉరుక్రమం విశాలాక్షం! పరమానంద విగ్రహం ॥🙏
భావము:: భోగమోక్షములను ఇచ్చువాడు, సర్వ దేవస్వరూపుడు, గొప్ప పరాక్రమము కలవాడు, విశాలమైన కన్నులు కలవాడు, పరమానందమే శరీరముగా కలవాడవు అగు నీకు నమస్కారము.

4.🔸వరదందేవదేవేశం వందే! కార్తవీర్యవరప్రదం !
నానారూపధరం హృద్యం! భక్త చింతామణిం గురుమ్ ॥🙏
భావము :: దేవదేవులకు ప్రభువైన వాడవు, వరములిచ్చువాడవు, కార్తవీర్యునికి అనేక వరములు ఇచ్చినవాడవు, నానారూపములు ధరించెడి వాడవు, హృదయమునకు ఇష్టుడైనవాడవు, భక్తులకు చింతామణి లాంటి వాడవు, గురువైన నీకు నమస్కారము.

5.🔸విశ్వవంద్యపదాంబోజం! యోగి హృత్పద్మవాసినమ్!
ప్రణతార్తిహరం గూఢం! కుత్సితాచార చేష్టితమ్॥🙏
భావము:: విశ్వములోని జనులందరిచే నమస్కరింపదగిన పాదపద్మాలు కలవాడవు, యోగుల హృదయములందు నివశించెడివాడవు,నమస్కారించు వారి బాధలను పోగొట్టేవాడవు, రహస్యంగా వుండెడి వాడవు, విచిత్రమైన ఆచారము, చేష్టలు కలవాడవు అయిన దత్తాత్రేయునికి నమస్కారములు.

6.🔸 మితాచారం మితాహారం! భక్ష్యా భక్ష్య వివర్జితమ్!
ప్రమాణం ప్రాణనిలయం! సర్వాధారం నతోస్మ్యహం ॥🙏
భావము:: మితమైన ఆచారము, ఆహారం కలిగినవాడు, తినతగిన ,తినకూడని ఆహారము అనే దంద్వమును విడిచిన వాడవు ( ఆహారం మీద ఇష్టం, అయిష్టం లేని వాడు), అన్నిటికీ ప్రమాణం అయిన వాడు, అందరిలో ప్రాణముల రూపంలో నివశించుచూ, సర్వమునకు ఆధారమైనవాడవగు ఓ దత్త ప్రభో! నీకు నమస్కారము.

7.🔸సిద్ధసాథక సంసేవ్యం! కపిలం కృష్ణ పింగళం!
విప్రవర్యం వేదవిదం! వేదవేద్యం వియత్సమమ్॥🙏
భావము:: సిద్ధులు, సాథ్యులు, భక్తులు అందరిచే సేవించబడేవాడు , చిత్రమైన వర్ణములు కలిగినవాడవు, నల్లని, పచ్చని రూపములు కలిగిన వాడు, విప్రులలో శ్రేష్ఠమైనవాడవు, వేదములు తెలిసినవాడవు, వేదములచే తెలియతగిన వాడవు, ఆకాశముతో సమానమైన వాడవు అగు నీకు నమస్కారము.

8.🔸పరాశక్తి పదాశ్లిష్టం! రాజరాజ్యప్రదం శివమ్!
శుభదం సుందరగ్రీవం! సుశీలం శాన్త విగ్రహమ్॥🙏
భావము:: పరాశక్తితో కూడిన వాడు,రాజరాజ్యములను ఇచ్చువాడు, మంగళ స్వరూపుడు,,శుభములు ఇచ్చువాడు,సుందరమైన కంఠం కలవాడు, మంచి స్వభావం కలిగిన వాడు, శాంతస్వరూపుడు అయిన దత్తాత్రేయునికి నమస్కారించు చున్నాను.

9.🔸 యోగినం రామయాస్పృష్టం! రామా రామం రమాప్రియం!
ప్రణతోస్మి మహాదేవం! శరణ్యం భక్తవత్సలం ॥🙏
భావము:: యోగిఅయిన వాడు, లక్ష్మిదేవి తో కూడిన వాడు, లక్ష్మీ ప్రియుడు, మహాదేవుడు, రక్షకుడు, భక్తులయందు వాత్సల్యము కలిగిన వాడవైన నీకు నమస్కారము.

10.🔸వీరం వరేణ్య
మృషభం! వృషాచారం వృషప్రియమ్!
అలిప్తమనఘం మేధ్యం! అనాదిమగుణం పరమ్ ॥🙏
భావము:: వీరుడు, ప్రార్ధనీయుడు,శ్రేష్ఠమైనవాడు, శ్రేష్ఠమైన ఆచారము కలవాడు, వృషప్రియుడు, దేనితో సంబంధము లేనివాడు, పాపములేనివాడు, ఆది లేనివాడు, నిర్గుణుడు అయిన స్వామికి నమస్కారము.

11.🔸అనేకమేక మీశానం! అనంతమనికేతనమ్ !
అధ్యక్ష మసురారాతిం ! శమం శాంతం సనాతనమ్॥🙏
భావము:: అనేక రూపములలో వున్న ఏక స్వరూపుడు, ఈశానుడు, నాశనము లేనివాడు, అందరికీ ప్రభువు, రాక్షసులకు శత్రువు, అనంతుడు, శమస్వరూపుడు, శాంతుడు, సనాతనుడు అయిన స్వామికి నమస్కారము.

12.🔸గుహ్యం గభీరం గహనం! గుణజ్ఞం గహ్వరప్రియమ్!
శ్రీదం శ్రీశం శ్రీనివాసం! శ్రీవత్సాంకం పరాయణమ్॥🙏
భావము:: రహస్యమైనవాడు, లోతైన భావములు కలవాడు, దొరకనివాడు,గుహయందు ఇష్టము కలవాడు, లక్ష్మి ని ఇచ్చువాడు, లక్ష్మి నివాసుడు, శ్రీవత్సమను పుట్టుమచ్చ కలిగినవాడు, పరబ్రహ్మమే గతిగా కలిగిన స్వామికి నమస్కారము.

13.🔸జపంతం జపతాం వంద్యం! జయంతం విజయప్రదమ్!
జీవనం జగతః సేతుం! జానానమ్ జాతవేదసమ్॥🙏
భావము:: జపించువారిలో జపించువాడును,జపస్వరూపుడు, నమస్కారింపతగిన వాడు,జయ స్వరూపుడు, విజయాలను ఇచ్చువాడు, జగత్తుకు జీవనం అయిన వాడు, అన్నిటి ఎరుక కలవాడు, జగత్తు కు సేతువైనవాడు, అగ్ని అయిన వాడు అయిన స్వామికి నమస్కారము.

14.🔸యజ్ఞమిజ్యం యజ్ఞభుజం! యజ్ఞేసం యాజకం యజుః!
యష్టారం ఫలదం వందే! సాష్టాంగం పరయా ముదా॥🙏
భావము:: యజ్ఞస్వరూపుడు,యజ్ఞమున ప్రార్థింపతగినవాడు, యజ్ఞమున హవిస్సులను తినువాడు, యజ్ఞములకు ప్రభువైన వాడు, యజుర్వేద స్వరూపుడైనవాడు, సోమయాజి అయిన వాడు, యజ్ఞ ఫలములను ప్రసాదించు వాడు, అయిన దత్తాత్రేయునికి పరమ సంతోషంతో సాష్టాంగ పడి నమస్కారించున్నాను🙏🙏🙏

         *_🍁శుభమస్తు🍁_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏

No comments:

Post a Comment