🌷 ధనం గురించి ,అది లభించే మార్గాల గురించి , ఎంతసేపు ఆలోచించినా కోటీశ్వరుల భజన చేసినా ఒక్క రూపాయి కూడా లభించదు.
🌷జ్ఞానం గురించి మాట్లాడుతూ, చర్చిస్తూ, ఆలోచిస్తూ, జ్ఞానుల సాంగత్యం లో ఉంటేనే , జ్ఞానుల ని ఆరాధిస్తే వారి నుండి జ్ఞానం మన లోకి ప్రవహిస్తుంది.
🌷జ్ఞానం ఒక అగ్ని, మనలోని సమస్త మాలిన్యాలని దహిస్తుంది. అహంకారం కరిగి పోతుంది.
🌷జ్ఞానం ఒక ఐశ్వర్యం. క్రమంగా పెరుగుతూ జన్మ జన్మ కి వెంట వస్తుంది.
🌷జ్ఞానం ఒక ప్రేమ స్వరూపం. జ్ఞానం ఉన్నవారే
తమని ప్రేమించే వారి హృదయాన్ని. గుర్తించగలరు. స్వయంగా అందించగలరు.
🌷జ్ఞానం ఒక సౌందర్యం. జ్ఞానం పొందిన వారి
మాటల్లో. ,ప్రవర్తన లో , వ్యక్తిత్వం లో, విశ్వాసాల్లో, కోరికల్లో, వారి ప్రతి అణువు లో జ్ఞానమే కనిపిస్తుంది..
ఈ కారణం గానే శ్రీ కృష్ణుడు భగవద్గీత లో
". *నహి జ్ఞానేన సదృశం "* అన్నాడు.
.🙏🙏🙏💐💐💐
No comments:
Post a Comment