Saturday, April 11, 2020

ప్రస్తుత పరిస్థితికి అద్దం పట్టే కథ

అది ఒక అందమైన  జింకల వనం. అందులో జింక జాతులు ఆనందంగా, నిర్భయంగా జీవిస్తున్నాయి. 

ఒకసారి ఆ వనం నుంచి ఒక జింక దారి తప్పి, వేరే అడవిలోకి వెళ్ళింది. అక్కడ దానికి ఎన్నెన్నో కొత్త కొత్త జంతువులు కనిపించాయి. తోడేళ్ళనూ, పులులనూ, సింహాలనూ, నక్కలనూ తొలిసారి అక్కడే చూసింది. 

అక్కడ ఒక కొమ్ముల జింక ఎదురై- ‘‘ఓ జింక సోదరా! ఈ అడవిలో నిన్నెప్పుడూ చూడలేదే!’’ అంది. 

‘‘అవును. మాది జింకల వనం!’’
‘‘ఈ అడవి మీ జింకల వనం లాంటిది కాదు. ఇక్కడ మనల్ని చంపి తినే క్రూరమృగాలు ఉన్నాయి. వాటి నుంచి ఎలా తప్పించు కోవాలో మీకసలు తెలియదు. కాబట్టి ఇక్కడి నుంచి త్వరగా  వెళ్ళిపో!’’ అంటూ ఆ జింక గెంతుతూ వెళ్ళిపోయింది. 

‘‘పిరికి జింక! నేనూ జింకనే. అదెలా తప్పించు కోగలదో నేనూ అలాగే తప్పించు కోగలను’’ అనుకుంటూ జింకలవనం జింక ముందుకు వెళ్ళింది. 

అక్కడ చెట్టు కింద నిద్రపోతున్న సింహం కనిపించింది. జింక మెల్లగా దాని దగ్గరకు వెళ్ళి, తన ముంగాలి గిట్టతో సింహం తోకను తొక్కింది. 

సింహానికి మెలకువ వచ్చింది. బద్దకంగా లేస్తూ జింకను చూసింది. గర్జించింది. ఆ గర్జన విని, జింకకు గుండె ఆగినంత పని అయింది.. వెను తిరిగి వచ్చిన దారినే పరుగులు పెట్టింది. 
అడవి దాటి జింకలవనం వైపు పరుగులు తీస్తూనే ఉంది. జింకలవనం సమీపానికి రాగానే సింహానికి చిక్కింది. సింహం దాన్ని చంపి, చీల్చి ఆరగించింది.

తరువాత సింహం లేచి మెల్లగా జింకలవనం లోకి వెళ్ళింది. దానికి అది కొత్త ప్రదేశం. అక్కడ దానికి గుంపులు గుంపులుగా జింకలు కనిపించాయి. సింహం ఆనందానికి అంతు లేదు. దొరికిన జింకను దొరికినట్టు చంపి తినేస్తోంది.

కొత్తగా ముంచుకొచ్చిన ఈ మృత్యువును చూసి జింకలన్నీ భయపడిపోయాయి. చెల్లా చెదురయ్యాయి. పొదల్లో దాక్కున్నాయి. బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నాయి. పొరపాటున ఏ జింకయినా బయటకొస్తే చాలు... సింహం దాన్ని పడగొట్టేస్తోంది. 

అయితే ఆ జింకల్లో తెలివైన కుర్ర జింక ఒకటుంది. దాని పేరు జ్ఞాననేత్ర. జింకల పెద్దలు జ్ఞాననేత్ర దగ్గరకు వచ్చి- ‘‘దీనికి పరిష్కారం ఏమిటి?’’ అని అడిగాయి.

‘‘జింక పెద్దలారా! నేనూ అదే ఆలోచిస్తున్నాను. ఈ క్రూరజంతువును ‘సింహం’ అంటారు. దీని పంజా నుంచి తప్పుకొనే చాకచక్యం మనకు లేదు. ఎటు ఆలోచించినా, ఎంత యోచించినా ఒకే ఒక్క దారి కనిపిస్తోంది. ఈ సింహం ఆహారం లేకుండా 14 రోజులు మాత్రమే బతకగలదు. కానీ మనం 21 రోజులు బతకగలం. కాబట్టి మన జింకలన్నీ తమ పొదల్లోకి దూరి 14 రోజులు బయటకు రాకుండా ఉంచే చాలు. దీని పీడ మనకు విరగడ అవుతుంది. మనలో ఎవరైనా నిర్లక్ష్యంతో బయటకు వచ్చి దానికి చిక్కారా... దాని జీవిత కాలాన్ని మరో 14 రోజులు పెంచినట్టే! ఈ రోజు అమావాస్య. ఇప్పుడే పొదల్లోకి చేరిపోదాం. పున్నమి నాటికి బయటకు వద్దాం. తమ పొద నుంచీ ఏ జింకా బయటకు రాకుండా చూసే బాధ్యత ఆ జింకల పెద్దలదే!’’ అంది. 

జింకలన్నీ జ్ఞాననేత్ర మాటలు విన్నాయి. ఆకలితో అలమటించాయి. 

పున్నమి వచ్చింది. జింకలన్నీ ఒక్కొక్కటీ భయం భయంగా బయటకు వచ్చాయి. వనం మధ్య చెట్టుకింద చచ్చి పడి ఉన్న సింహాన్ని చూశాయి. 

ఆనందంతో అరిచాయి. గెంతాయి.  జింకల కేరింతలతో వనమంతా పులకరించింది.

Friday, April 10, 2020

Zodiac Signs- Astrology- Body parts


When we would analyze a Horoscope chart in terms of body issues and health concerns we would pay attention both to signs and planets as well as the houses. For example, we have been having headaches quite often. The head is associated with Aries and the first house. We would need to pay attention to any planet in the first house. Mars rules the sign of Aries and it could bring pain, pressure or burst of energy and even accidents to the head. Other planets in Aries would be important as well.
However, Mars could be in square (disruption of the flow) with Mercury (lots of thinking and confusion in terms of decisions), Saturn (tiredness and low energy) or any other planet in our Horoscope chart. Transits would also be important and might give us more insight, too. In that term the first house is connected to the head, the second house is connected to the throat… But, when we are talking about issues with the body and overall health the sixth house needs to be taken into careful consideration, as well.

So there is really no simplification, but there is always a very deep and meaningful answer when we turn to our Horoscope chart. Sun sign of a person will often bring an issue that will be present throughout the life and we can see this quite often.

However, as we can connect parts of the body with the planets and every planet is related to one chakra, if there is an issue we are facing with, meditations and visualizations focused on a specific chakra could help, too. 

This is something that we can learn to do by ourself and will do us a lot of good. If we are having headaches, we would need to focus on the first chakra (Mars) and unblock the energy which is not flowing to the head, therefore headaches might appear.

#Aries the head, the pineal gland, the eyes, Mars muscles and when the planet is afflicted by transit on this sign and you are getting surgery, we might expect, Heaven forbid, a hemorrhage. The same with the Moon which rules moods: when it is negatively afflicted by transit look at the sign it is transiting in because the associated body part might have a hemorrhage during surgery.

#Taurus: the throat, the neck, the voice, AND Venus rules the skin of the person.

#Gemini: the nervous system. The lungs and movement. Gemini's might find it difficult to stand still they constantly need movement. Mercury: problems with language and speaking, extreme nervousness, problems with the mind.

#Cancer: the breasts and the stomach, extreme moodiness, mood swings, over sensitive to the mental atmosphere. 

#Leo: the heart, the entire cardiovascular system, the back. The Sun: inflammation. Confusion if Mercury is close by because it causes an obliteration of the mind. 

#Virgo: the intestines, the guts.

#Libra: the kidneys but Venus rules the skin so Libra's are obsessed with the use of cosmetic creams.

#Scorpio: the genitals, so if Mars is afflicted in Scorpio, expect a genital inflammation.

#Sagittarius: the legs, the hips, Jupiter rules the veins and circulation, beware of Jupiter because it also rules weight gains, it makes people fat.

#Capricorn: the teeth, the bones, the knees, and Saturn rules blockages like constipation or mental and emotional blockages if afflicted by Mercury or the Moon.

#Aquarius: the ankles, the ligaments.

#Pisces: the feet. 

We can see there is a plethora of information we can derive from a Horoscopic chart and its transits to clarify the medical conditions of a person.

Thursday, April 9, 2020

కాల ధర్మాన్ని పోషించడమే నా ధర్మం

ఆత్మ నిష్ఠ - ఆత్మ విచారణ

1. స్వధర్మం
2.  అవసరం లేదు
3. ఇక చాలు
4. ఏదీ శాశ్వతం కాదు
5. దేహానికే మరణము
6.  సంసిద్ధత
7. అవగాహనత /మేలుకో
 కాంక్ష, మోహం లోనుంచి బయిటపడాలి అనంటే,
మూడు నియమాలను పెట్టుకోవాలి కదా!
ఏమిటి? అవి.
(1). ‘ధర్మం తప్పి ప్రవర్తించను’-అనేది వుండాలా? వద్దా?
అదేమిటి?
స్వధర్మం, పరధర్మం.
So, ధర్మం తప్పి ప్రవర్తించడం అంటే?
స్వధర్మాన్ని తప్పి ప్రవర్తించను. ఆత్మధర్మాన్ని తప్పి ప్రవర్తించను.
ఆత్మధర్మాన్ని తప్పి ప్రవర్తించినదంతా అధర్మమే. పర ధర్మమే. అర్థమైందా?
ఇంకొకటి ఏమిటి?

(2). ఇకచాలు.
ఇక చాలా? ఉన్నది చాలా?
శి: ఉన్నది చాలు.
గు: ‘ఉన్నది చాలు’ అంటే... ఇంకా అందులో శేషం మిగిలి వుందిగా...
శి: ‘ఇక చాలు’ - అనగలగాలి.
గు: ‘ఉన్నది చాలు’ - అన్నవాడికి...
అప్పుడేమయ్యింది? శేషం మిగలడం లేదా?
ఆత్మ ధర్మంలో, ‘ఉన్నదిచాలు’అనడానికి అక్కడ ఏముంది?
అంతటా వున్నదే కానీ అది,పరిమితంగా లేదుగా. కాబట్టి ప్రపంచానికి సంబంధించినటువంటి పరధర్మ విషయం వచ్చింది.
అక్కడేమి చెప్పాడు ఇక?
‘ఇక చాలు’ - అన్నాడు.
‘ఉన్నది చాలు’ - అనడం లేదు ఇప్పడు.
‘ఇక చాలు’ - అన్నాడు.
‘ఇక చాలు’ - అని ఎప్పుడైతే అన్నాడో ఏమైంది? ముగిసిపోలేదా ఇక...?
Full stop పడిపోయింది.
‘ఉన్నది చాలు’ - అంటే ప్రపంచం మిగిలింది ఇంకా.

విషయం కూడా మిగిలింది ఇంకా.
ఆసక్తి కూడా మిగిలింది ఇంకా అక్కడ.
ఇక చాలయ్యా! ఈ ఆట చాలా కాలం ఆడాను, ఇంకెంత కాలం ఆడతాను?
నేను ఎప్పటి నుంచో ఆడుతూనే వున్నాను. ఎన్నో లక్షల జన్మల్లో ఆడుతూనే వున్నాను.
ఈ జననమరణాలనే ఆట ఆడుతూనే వున్నాను.
ఇకచాలు. ఈ జన్మతో ఇక చాలు. అర్థమైందా?!
‘ధర్మం తప్పను’, ‘ఇక చాలు’.

(3). మూడవ నియమం.... ‘అవసరం లేదు’. ఇది చాలా బలమైనటువంటి నియమం.
జననమరణాలు కలగడానికి కారణం ఏమిటి?

అవసరమేగా! ‘అవసరం వుంది’అనే భావన వుందనుకోండి, మళ్ళా రాక తప్పదు.
కాబట్టి ‘అవసరం లేదు’ అనే నియమాన్ని పాటిస్తే ఏమైంది?
ఇక నేను దానికి లొంగటం లేదు కదా! ఇక, అర్థమైందా?

తీవ్ర వైరాగ్య సంపన్నుడు - జగమొండి.
రాజుకంటే బలవంతుడు.
వాడిని ఏదీ వంచలేదన్నమాట ఇక.
ఎందుకనీ?
వాడి దగ్గర ఈ మూడు నియమాలు వుంటాయి.

1. ధర్మం(స్వధర్మం)తప్పడు.
2. ‘ఇకచాలు’అంటాడు ఏదైనా సరే.
3. ‘అవసరం లేదు’అంటాడు... నువ్వు ఏదైనా చెప్పు,

‘పిపీలికాది బ్రహ్మపర్యంతము’ -అంటున్నామా? లేదా?వివేకచూడామణిలో... అంటున్నామా?ఏమి ఇవ్వబడుతాయి?
అంటే, పిపీలకము నుంచీ బ్రహ్మపదవి వరకూ...

కాబట్టి పిపిలికాది బ్రహ్మపర్యంతమూ నీకు గనుక ఇవ్వబడినప్పటికీ... నువ్వు ఏమన్నావు?

‘అవసరం లేదు’. నాకెందుకు?
పిపీలికాది బ్రహ్మపర్యంతము నీకు ఎక్కడో ఒకచోట అవసరం వుంది అనే భావన వుందనుకోండి, మళ్ళా పుట్టాల్సిందే. మళ్ళా శరీరం ధరించవలసిందే.

కాబట్టి, తీవ్రవైరాగ్య సంపన్నుడు,తీవ్రమోక్షేచ్ఛ కలిగినటువంటి వాడు,ఆత్మనిష్ఠుడైనటువంటి వాడు... ఈ మూడు నియమాలను కలిగి వుంటాడు.
ఏమిటి?
“స్వధర్మే నిధనం శ్రేయః” - కేవలం స్వధర్మాన్నే పాటిస్తాడు.
మిగిలిన ఏ పాత్రోచిత ధర్మాలను నేను పాటించను. నాకు అవసరం లేదు.
ఎందుకని?

ఇకచాలయ్యా! చాలాకాలం ఆడాను... పాత్రోచిత ధర్మాలు. ఆట ఎంతోకాలం ఆడాను, ఎన్నో లక్షల జన్మల్లో ఆడాను. నాకంటవు ఇక. నేను ఎదిగాను. పాత్రచేత నేను ప్రభావితం కావడం లేదు. నాకు పాత్రోచిత ధర్మాలు లేవు.

కృష్ణ పరమాత్మ ఏం చేశాడు?తను అందరికీ బంధువేగా? యుద్ధంలో ఏం చేశాడు?
వరుసబెట్టి వేసేశాడు.
మరి ఇప్పుడు బంధువేగా? ఎలా వేశాడు?

నాకు పాత్రోచిత ధర్మాలేమిటి? నేను పరమాత్మను.
కాల ధర్మాన్ని పోషించడమే నా ధర్మం. నా ‘స్వధర్మం’ అది.

“కాలోస్మి లోకక్షయ కృత్ ప్రవృద్ధో
లోకాన్ సమాహర్తుమి హ ప్రవృత్తః
ఋతేపిత్వా నభవిష్యంతి సర్వే(అంటున్నాడా?లేదా?)
ఏవస్థితాః ప్రత్యనీకేషుయోధా” (గీత 11-32)

ఏమని చెబుతున్నాడు?
కాలంలో సమస్తలోకాలు పుడుతున్నాయి. పోషించబడుతున్నాయి. లయించ బడుతున్నాయి. పరమాత్మ కాలాతీతుడు. నేను బావా, నేను మరదలు, నేను మరిది, నేను అన్నయ్యా, నేను తమ్ముడు, నేను భర్త,నేను భార్యా... అవేవీ నాకు లేవు.

అర్జునుడు: బావా! ద్వారక మునిగిపోతుంది.
శ్రీకృష్ణుడు: సమయం అయిపోయింది.

ఒక్కటే మాట చెప్పాడు, సమయం అయిపోయింది అన్నాడు.
అర్జునుడు అన్నాడు: ‘ద్వారక మునిగిపోతుంది’.
‘Time అయిపోయిందయ్యా’! అర్థమైందా?
అంతేగాని పరమాత్మ ఎక్కడా వలవలా ఎడవలా.

ఏ సంఘటనలోనూ కన్నీళ్ళు పెట్టలేదు. కారణం?
‘ఇకచాలు’. ఆట చాలాసార్లు ఆడాను.
ఇప్పుడు పరమాత్మగా ఆడుతా.
కాలాతీతంగా ఆడుతా.
దేశకాలములకు అతీతంగా ఆడుతా.
ఆత్మనిష్ఠుడనై ఆడుతా.
బ్రహ్మనిష్ఠుడనై ఆడుతా.
పరబ్రహ్మ నిర్ణయంతో ఆడుతా…!! అప్పుడేమయ్యింది?
“పిల్లలాటల పోలికాయెను”.
ఆటలో ఆసక్తి వుంది.
పెద్దవాళ్ళు పిల్లల ఆటను ఎలా చూస్తున్నారు?
అలా చూస్తా! సృష్టి స్థితి లయాలను.
అప్పుడేమయ్యావు?

హరిదాసు అంటె పరమాత్మతో సమానం


శ్రీ మహవిష్ణువుకు ప్రతినిధులు హరిదాసులు  హరిదాసుల అక్షయ పాత్రలో బియ్యం పోస్తే మన తెలిసి తెలియక చేసిన ఎన్నో పాపలు తోలగిపోతాయి 

హరిదాసు అనగా పరమాత్మతో సమానం మనుషులు ఇచ్చే ధానధార్మలు అందుకోని వారికి ఆయురారోగ్యాలు భోగభాగ్యలు కలగలని దివించెవారు హరిదాసులు 

నెలరోజులు పాటు హరినామన్ని గానం చేసినందుకు చివరి రోజున స్వయంపాకానికి అందరు ఇచ్చే ధన,ధాన్య , వస్తు దానాలను స్వికరిస్తారు 

సూర్యభగవానుడు ప్రసాదించిన అక్షయ పాత్ర వారి శిరస్సుపై ధరించి పంచలోహ పాత్రగా బావిస్తారు 

ధనుర్మాసం నెలరోజులు సూర్యోదయానికి ముందే శ్రీకృష్ణ గోదాదేవిని స్మరించి, తిరుప్పావై పఠించి, అక్షయ పాత్రను ధరించి హరిదాసులు గ్రామ సంచారం ప్రారంభిస్తారు. 

ఇంటికి తిరిగి వెళ్లే వరకు హరినామ సంకీర్తన తప్ప మరేమి మాట్లాడరు. అక్షయపాత్రను దించరు. ఇంటికి వెళ్ళాక ఇల్లాలు ఆ హరిదాసు పాదాలు కడిగి, అక్షయపాత్రను దించుతుంది.  
శ్రీకృష్ణునికి మరోరూపం హరిదాసులని అంటారు పెద్దలు. గొబ్బెమ్మలను ఇంటి ముందు చక్కగా అలంకరించి, హరినామ స్మరణ చేసే వారిని అనుగ్రహించడానికి హరిదాసు రూపం వైకుంఠపురం నుండి శ్రీమహావిష్ణువు వస్తాడన్నది ఒక నమ్మకం. 

హరిదాసు పేద, ధనిక భేదం లేకుండా అందరి ఇంటికి వెళ్తాడు. ఎవరి ఇంటి ముందు ఆగడు. 

శ్రీమద్రమారమణ గోవిందో హరీ అంటూ.. ఇంటి ముందు ముగ్గు చుట్టూ ఒకసారి తిరుగుతాడు. గుమ్మంలో ఎవరూ లేకపోతే మరో ఇంటికి వెళ్తాడు. హరిదాసు ఉట్టి చేతులతో వెళ్ళిపోతే ఐ ఇంటికి అరిష్టమంటారు పెద్దలు. 
అందుకే గ్రామాలో హరిదాసుడు వస్తున్నాడంటే ఇంటి యజమానులు గుమ్మలలో ధాన్యంతో సిద్ధంగా ఉంటారు. అక్షయపాత్రలో బియ్యం పోయడాన్ని శ్రీమహా విష్ణువుకు కానుకగా బహుకరించినట్లుగా భక్తులు భావిస్తారు.

హరిదాసు తల మీద గుండ్రటి రాగి పాత్రను భూమికి సంకేతంగా శ్రీమహావిష్ణువు పెట్టాడనే కథ కూడా ప్రచారంలో ఉంది.

హరిదాసు వస్తే ఎన్ని పనులు ఉన్న ఇంటి ముందుకు వచ్చి అక్షయ పాత్రలో బియ్యం పోయండి. 

అహోబిల క్షేత్రము- నరసింహ స్వామి

హిరణ్య కశిపుడు తపస్సుకి వెళ్ళినప్పుడు నారదుని ఆశ్రమములో లీలవతికి కుమారుడు కలిగాడు. ప్రహ్లాదుడు అని పేరు పెట్టారు. ఇతరులు సంతోషిస్తే సంతోషించే వాడు ప్రహ్లాదుడు. తనకి ఉన్నది ఒకరికి పెట్టి వారు సంతోషిస్తే ప్రహ్లాదుడు సంతోషిస్తాడు. 

ఒకడు ఏడిస్తే చూచిసంతోషించి తానే అనుభవించి సంతోషిస్తాడు హిరణ్యకశిపుడు. లోకములో ఒక ధర్మము ఉన్నది. మంచి కొడుకు పుట్టాలి అంటే పుణ్యము చేసిన వాడి కడుపున పుడతాడా? పాపము చేసిన వాడి కడుపున పుడతాడా? 

అటువంటి వాడి కడుపున పుట్టడానికి ప్రహ్లాదుడు చేసిన పాపము ఏమిటి? ? అటువంటి కొడుకు పుట్టడానికి హిరణ్యకశిపుడు చేసుకున్న పుణ్యము ఏమిటి? అన్న ప్రశ్న వస్తుంది కదా? భాగవతములోనే దీనికి జవాబు చెప్పారు. పుట్టుకతో నారదుని ఆశ్రయము లభించి అంత గొప్ప భక్తి తత్పరుడు కావడానికి కారణము ఎక్కడ ఉన్నది అంటే ప్రహ్లాదుని గత జన్మలలో సత్సంగము ఉన్నది. 

ఏది ఉన్న లేకపోయినా సత్పురుషులతో కలసి ఉండి వారితో తిరిగి వారిని సేవించాడు. మనము ఎంత ధర్మము ఆచరించాము అన్నది పక్కన పెడితే సత్పురుషులతో కలసి ఉంటే చాలు ఈశ్వర అనుగ్రహము కలుగుతుంది. ఆయనతో మనము ఉన్నామన్నది ముఖ్యము కాదు. ఆయన మనను గుర్తుపట్టి పేరు పెట్టి పిలిచి పక్కన కూర్చోపెట్టుకోగలడా? ఏ కారణమునకైనా అలా ఉంచుకోగలిగితే వాడు ఉత్తర జన్మలలో మహాభక్తుడైపోతాడు. సత్సంగమే ప్రహ్లాదుడు అంతటి భక్తుడిగా పుట్టడానికి కారణము.

అహోబిల క్షేత్రములో నవనారసింహమై తొమ్మిదిమంది నరసింహులుగా ఉన్నాడు. 

1. జ్వాలానరసింహుడు -- ఆయనే ఉగ్ర నరసింహ స్వరూపము. మొదటగా వచ్చిన తేజో స్వరూపము. హిరణ్యకశిపుని పొట్ట చీలుస్తున్న స్వరూపములో ఉంటాడు. 

2. అహోబిలనరసింహస్వరూపము -- హిరణ్యకశిపుని సంహరించిన తరవాత కూర్చున్న స్వరూపము.

3. మాలోల నరసింహుడు -- లక్ష్మీదేవి చెంచు లక్ష్మిగా వస్తే ఆమెని స్వీకరించి ఎడమ తొడ మీద కూర్చో పెట్టుకున్న స్వరూపము. 

4. కరంజ నరసింహుడు అని నాలగవ నరసింహుడు. ఆయన చెట్టుకింద ధ్యాన ముద్రలో ఉంటాడు.

5. పావన నరసింహుడు -- ఆయన దగ్గరకు వెళ్ళి ఒక్కసారి నమస్కారము చేస్తే ఎన్ని పాపములనైనా తీసేస్తాడు. మంగళములను ఇస్తాడు. అందుకని ఆయనని పావన నరసింహుడు అనిపిలుస్తారు.

6. యోగ నరసింహుడు అంటారు. అయ్యప్పస్వామి ఎలా కూర్చుంటారో అలా యోగపట్టముకట్టుకుని యోగముద్రలో కూర్చుంటాడు. ఇప్పటికి అక్కడకి దేవతలు కూడా వచ్చి ధ్యానము చేస్తారు అని చెపుతారు. 

7. చత్రవట నరసింహస్వరుపము అంటారు. పెద్ద రావి చెట్టుకింద వీరాసనము వేసుకుని కూర్చుంటాడు. అక్కడకి హూ హ, హా హా అని ఇద్దరు గంధర్వులు శాపవిమోచనము కొరకు నరసింహస్వామి వద్దకి వచ్చి పాటలు పాడి నృత్యము చేసారు. ఆయన తొడమీద చెయ్యి వేసుకుని తాళము వేస్తూ కూర్చున్నారు. ఆ కూర్చున్న స్వరూపమును చత్రవట నరసింహస్వరూపము అంటారు అక్కడకు వెళ్ళి కొంతమంది పెద్దలు సంగీతము పాడుతుంటారు. 

8. భార్గవ నరసింహుడు పరశురాముడు నరసింహ దర్శనము చెయ్యాలని కోరుకుంటే అనుగ్రహించి దర్శనము ఇచ్చిన స్వరూపము

9. వరాహ నరసింహస్వరూపము భూమిని తన దంష్ట్రమీద పెట్టుకుని పైకి ఎత్తినటువంటి స్వరూపము ఆదివరాహస్వామి పక్కన వెలసిన నరసింహస్వరూపము మొదటగా వచ్చిన యజ్ఞ వరాహస్వరూపము, నరసింహ స్వరూపము రెండు ఉంటాయి వరాహ నరసింహము. తొమ్మిది నరసింహస్వరూపములు అహోబలక్షేత్రములో ఉంటాయి. 

కర్మసన్యాస యోగము


ఒకసారీ అర్జునుడు శ్రీ కృష్ణుని ఇలా అడిగాడు... 

కర్మలను వదిలివేయ మని ఒకసారీ, కర్మానుష్టానము చేయమని ఒక సారి చెప్తున్నావు. వీటిలో ఏది అనుసరించాలో చెప్పు..?

అప్పుడు శ్రీ కృష్ణుడు ఇలా చెప్పారు...

కర్మత్యాగం, నిష్కామకర్మ రెండూ శ్రేష్టమే ఐనా నిష్కామకర్మ ఉత్తమం. రాగద్వేషాది ద్వంద్వా భావాలు లేని వాడే నిజమైన సన్యాసి మరియు అలాంటి వారు మాత్రమే కర్మబంధాల నుండి తరిస్తారు.

జ్ఞానయోగం, కర్మయోగాలలో ఏది అవలంబించినా సరే ఒకటే ఫలితం ఉంటుంది. రెండూ ఒకటే అనే భావం కలిగి ఉండాలి. యోగియై సన్యసించిన వాడే బ్రహ్మజ్ఞానాన్ని పొందగలడు. నిష్కాముడు, శుద్దమనస్కుడు, ఇంద్రియనిగ్రహి అన్ని ప్రాణులను తనవలనే చూస్కునే వాడిని ఎలాంటి కర్మలు బంధించలేవు.

కర్మయోగి చూసినా, వినినా, తాకినా, వాసన చూసినా, నిద్రించినా, శ్వాసించినా, మాట్లాడుతున్నా ఆయా ఇంద్రియాలే వాటి విషయాల పని చేస్తున్నయను కుంటాడు కాని తానేమీ చేయడం లేదనే అనుభవం కలిగిఉంటాడు. ఫలితం పైన ఆశ లేక, ఈశ్వరార్పణంగా చేయుకర్మల వలన తామరాకుపై నీటి బొట్టు వలె పాపాలంటవు.

యోగులు అహంకారం లేక చిత్తశుద్ది కొరకు మాత్రమే కర్మలు చేస్తారు. ఫలాపేక్ష కలవారు కర్మలచే సంసారంలో బంధించ బడతారు. ఆత్మనిష్ఠుడు కర్మసంకల్పం చేయక, ఇతరులచే చేయింపక నవద్వారాలు గల ఈ శరీరంలో సుఖంగా ఉంటాడు.

కర్మ, కర్మ చేయడం, దాని ఫలితం ఆత్మ ప్రేరణ కాదు. ఆ ప్రేరణను మాయ చేస్తోంది. ఆత్మకు పాప పుణ్యాలతో సంబంధం లేదు. కాని అజ్ఞానం వలన ఆ భ్రాంతి కలుగుతోంది. ఆత్మజ్ఞానం ప్రాప్తి కలిగిన వారికి అజ్ఞానం నశించి పరమాత్మ దర్శనం కలుగుతుంది. బ్రహ్మజ్ఞాన ఆసక్తిపరులు తమ బుద్దినీ, మనుసునీ పరమాత్మ యందు నిలిపి మోక్షాన్ని పొందుతారు. విద్యావినయాలుగల బ్రహ్మజ్ఞాని బ్రాహ్మణుని యందు, చండాలుని యందు, ఆవు, కుక్క, ఏనుగు అన్నిటి యందు ఒకే దృష్టి కలిగి ఉంటాడు. అతడు ఈ జన్మలోనే పరబ్రహ్మను చేరుతాడు.

సుఖాలకు పొంగక, దుఃఖాలకు క్రుంగని స్థిరబుద్దికలవాడే నిజమైన బ్రాహ్మణుడు మరియు బ్రహ్మజ్ఞాని. అతడు బ్రహ్మాన్ని ఆత్మలోనే దర్శించి నిత్యమైన బ్రహ్మానందాన్ని పొందుతాడు. తాత్కాలికాలైన, దుఃఖకారకాలైన ఇంద్రియ సుఖాలను బ్రహ్మజ్ఞాని కోరడు. ఎవరైతే ఈ జన్మలోనే కామ క్రోధాలను జయిస్తారో వారు ఆత్మజ్ఞానం పొందుతారు.

ఎవరైతే స్వతంత్రుడై ఆత్మ యందే సుఖిస్తూ, ఆడుకుంటూ, ప్రకాశిస్తుంటారో, పాప పుణ్యాలను నశింప చేసుకొని జితేంద్రియుడై నిస్సందేహంగా ఉంటారో ఎల్లప్పుడూ అన్ని జీవుల సుఖం కోరువానికి మాత్రమే బ్రహ్మత్వం, బ్రహ్మానందం లభిస్తుంది. దృష్టిని భ్రూమధ్యంపై కేంద్రీకరించి ప్రాణ, అపాన మొదలగు వాయువులను సమం చేసి మనసు, బుద్ది, ఇంద్రియాలను స్వాధీనం చేస్కొని కోరిక, కోపం, భయం మొదలగు వాటిని విడిచిన జ్ఞాని ముక్తుడవుతాడు. తపస్సులకు, యాగాలకు నేనే భోక్తను.నేనే సర్వలోకాలకు అధిపతిని, దైవాన్ని, సర్వభూతహితుడను. నన్ను తెలుసుకున్న యోగి క్షేమాన్ని పొందుతాడు.

Wednesday, April 8, 2020

ప్రపంచ ప్రసిద్ద కృష్ణ మందిరం ఉడిపి బాల కృష్ణుడు

ఉడిపి దర్శనం.. సర్వపాప హరం

జగద్గురు, గీతాచార్యుడు భగవాన్‌ శ్రీకృష్ణుడు బాల కృష్ణుని రూపంలో వెలసిన క్షేత్రమే ఉడిపి. కర్ణాటక రాష్ట్రంలో ఒక జిల్లా. ప్రసిద్ధ కృష్ణమందిరం ఇక్కడ ఉంది. పూర్వం ఈ ప్రాంతాన్ని శివళ్లి అని పిలిచేవారు. ద్వైతమత స్థాపకులు శ్రీమధ్వాచార్యులు అవతరించిన స్థలం భాగ్యతక్షేత్రం. దానికి సమీపంలో ఉడిపి ఉంది. శ్రీమధ్వాచార్యులు శిష్యులతో కలిసి శ్రీకృష్ణుని విగ్రహ ప్ర‌తిష్ఠ‌ జరిపించారు. దీనికి సంబంధించిన గాథ ఒకటి ప్రచారంలో ఉంది.

శ్రీమధ్వాచార్యులు త‌న‌కున్న  దివ్యమహిమలతో తీవ్రమైన గాలివానకు సముద్రంలో మునిగిపోతున్న ఓడను రక్షించినప్పుడు ఓడలోని నావికుడు వీరికి గోపిచందనం మూటను కానుకగా సమర్పించాడు. అందులో చందనంతో పాటూ చిన్ని కృష్ణుని విగ్రహం ఉంది. ఈ విగ్రహాన్ని మధ్వాచార్యులు 800 సంవత్సరాల క్రితం ఉడిపి క్షేత్రంలో ప్రతిష్ఠించారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా ఉడిపిలో భక్తులకు గర్భాలయ దర్శనం లేదు. తొమ్మిది రంధ్రాలు ఉన్న కిటికీద్వారా స్వామివారిని దర్శించుకోవడం ఇక్కడి ప్రత్యేకత. తూర్పుముఖంగా ఉన్న కృష్ణుడు పశ్చిమాభిముఖుడై ఉండడం వెనుక ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. అంత్యకులానికి చెందిన కనకదాసు కృష్ణదర్శనం కోసం ప్రాధేయపడగా పూజారులు నిరాకరించారు. కనకదాసు భక్తిని మెచ్చిన కృష్ణుడు పడమరాభిముఖంగా దర్శనమిచ్చినట్లు స్థలపురాణం. కనకదాసుకు కనిపించిన కిటికిలో నుంచే నేటికీ భక్తులు స్వామివారిని దర్శించుకొంటారు. దీనిని కనకుడి కిటికీ అంటారు. కనకదాసు ప్రార్థించిన చోట దివ్యమండప నిర్మాణం చేశారు. దీనికే కనకదాసు మండపమని పేరు. శ్రీమధ్వాచార్యులు ఉడిపి దివ్యక్షేత్రంలో ఎనిమిది మఠాలను ఏర్పాటు చేశారు. వాటిలో శ్రీకృష్ణమఠం ఒకటి.

ఆలయానికి కుడివైపున శ్రీమధ్వతీర్థం ఉంది. తీర్థం మధ్యభాగంలో అందమైన మండపం ఉంది. అందులో శ్రీమధ్వాచార్యుల ప్రతిమ ఉంది. ఉత్సవాల సమయంలో ఇక్కడే స్వామివారికి తెప్పోత్సవం నిర్వహిస్తారు. తీర్థానికి ఒకవైపున భగీరథుని మందిరం, మరోవైపు చెన్నకేశవస్వామి మందిరం ఉన్నాయి. ప్రధాన ఆలయమంతా శ్రీకృష్ణుని లీలా విశేషాలు తెలిపే అందమైన తైలవర్ణచిత్రాలతో నిండి ఉంటుంది. గర్భాలయం ముందుభాగంలో వెండితో చేసిన ధ్వజస్తంభం ఉంది. దీనికి సమీపంలోనే తీర్థమండపం ఉంది. మండపంలోనే స్వామివారికి ఇష్టమైన అటుకులపొడిని ఉంచుతారు. పూజలు నిర్వహించే సమయంలో తీర్థమండపంలో జ్యోతులు వెలిగిస్తారు. ఆ సమయంలో మండపం శోభాయమానంగా ఉంటుంది.

గర్భాలయంలో కవ్వము, పిల్లనగ్రోవి చేతుల్లో ధరించిన శ్రీకృష్ణుని విగ్రహం దర్శనమిస్తుంది. గర్భాలయం బయట శ్రీమధ్వాచార్యుల విగ్రహం ఉంది. మరోపక్క శ్రీమధ్వాచార్య పీఠం ఉంది. ఆంజనేయస్వామి భవ్యమందిరంలో స్వామివారు వీరాంజనేయస్వామి అవతారంలో కన్పిస్తారు. ఇదే ప్రాంగణంలో సుబ్రమణ్యేశ్వరస్వామి కొలువుదీరాడు. నవగ్రహాలయం, గోశాల, గీతామందిరాలు ఉన్నాయి.

ఉడిపి వంటకాలు, హోటళ్లు విశేష ఆదరణ పొందాయి. శాకాహార వంటల్లో ఉడిపి శైలి వంటలు ప్రసిద్ధి చెందాయి. కర్ణాటక రాష్ట్రంతో పాటు దేశమంతటా ఉడిపి హోటళ్లు ఉన్నాయి. దక్షిణ భారతీయ శాకాహార వంటలు ఉడిపి ప్రత్యేకత
అష్ట మఠాలు

ఉడుపి శ్రీకృష్ణ మఠానికి అనుసంధానంగా అష్ట మఠాలు కృష్ణ మఠాలు ఉన్నాయి. ఈ ఎనిమిది మఠాలు ఉడుపి రథవీధిలో, శ్రీకృష్ణ దేవాలయానికి చుట్టూ ఉంటాయి.

పుత్తగె
పేజావర
పలిమారు
అదమారు
సోదె
శీరూరు
కాణియూరు
కృష్ణాపుర

దగ్గరలో ఉన్న మరికొన్ని ముఖ్య ప్రదేశాలు

కోల్లూరు ముకాంబికా దేవాలయం
మరవంతె బీచ్
మల్పే రేవు
కాపు దీపస్తంభం (కాపు లైటు హౌసు)
కార్కళ లోని గోమటేశ్వరుడు
వేణూరు లోని గోమటేశ్వరుడు
అత్తూరులో సెయింట్ లారెన్స్ ఇగర్జి
సెయింట్ మేరీస్ ద్వీపం
మూడబిదరెలో సావిరకంబద బసది
మణిపాల్
బైందూరు కోసళ్ళి జలపాతము

ఉడిపి జిల్లా రెండు జాతీయరహదార్లు ఉన్నాయి. జాతీయరహదారి17 (ప్రస్తుతం జాతీయరహదారి 66 అని మాత్చబడింది) మరియు రెండవది జాతీయరహదారి 13. జాతీయరహదారి 17 జిల్లా ఉత్తర దక్షిణ దిశగా పయనిస్తూ ఉడిపిని మంగుళూరు, కార్వార్, మురుదేష్వర, కొచ్చి, మద్గావ్, గోవా రత్నగిరి మరియు ముంబయితో అనుసంధానిస్తుంది. జాతీయరహదారి 13 జిల్లాను షిమొగా, బీజపూర్, సోలాపూర్, చిత్రదుర్గ మరియు హోస్పేటలతో అనుసంధానిస్తుంది.

కొంకణి రైల్వే జిల్లాను పొరుగు జిల్లాలు మరియు రాష్ట్రాలతో అనుసంధానిస్తుంది. జిల్లాలో ఉడిపి, బైందూర్, కుందపురె వద్ద ప్రధాన రైలు స్టేషన్లు ఉన్నాయి.

అన్ని వర్గాల వారికి వసతి భోజన సదుపాయాలు ఉన్నాయి

కర్ణాటక రాష్ట్రం బెంగుళూరుకు సుమారు 500 కిలోమీటర్లు దూరంలో ఉడిపి జిల్లాలో ఈ క్షేత్రముంది. ఈ క్షేత్రాన్ని చేరుకోవడానికి దేశంలోని అన్ని ప్రధాన కేంద్రాలనుంచి బస్సులు అందుబాటులో ఉన్నాయి. అలాగే హైద్రాబాద్ నుంచి మంగళూరుకు నేరుగా వచ్చి అక్కడనుంచి 80 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఉడిపికి చేరుకోవచ్చు. ఈ క్షేత్ర దర్శనం పూర్వజన్మల పుణ్యఫలం.

🔱శివలింగం అంటే ఏమిటి.?🔱

ఆకాశమేలింగం. భూమి దాని పీఠం. అది సమస్త దేవతలకు నిలయం. ఇందే అంతా లయం చెందుతుంది. అందుేక దీనిని లింగం అని అన్నారు. ‘లిం’ అంటే మన కంటికి కనిపించకుండా లీనమై ఉన్నదానిని, ‘గం’ అంటే ఒక గుర్తు రూపంలో తెలియజేస్తుంటుంది. అందుేక అది లింగమైంది. 

ఈ సృష్టి సమస్తం శివమయం. ఈ సమస్తం ఆయనచే సృష్టించబడింది. సృష్టికి పూర్వం ఈ సమస్త విశ్వమంతా నీటితో నిండి నిభిడృకృతమై అంతులేని మహాసముద్రం వలె ఉండేది. ఆ మహాజలం నుంచి ఓ మహా తేజస్సు ఉత్పన్నమైంది. ఆ తేజఃపుంజమే క్రమంగా ఒక రూపాన్ని సంతరించుకుంది. ఆ తేజోమయరూపమే పరబ్రహ్మం. ఆయనే లింగరూపాన్ని ధరించిన శివుడు.

సామాన్యంగా లింగశబ్దానికి చిహ్నంలేక లక్షనం అనే అర్థాలున్నాయి. ప్రకృతి, వికృతులు రెండూ లింగమనే సౌంఖ్యదర్శనం చెప్పింది. విగ్రహాన్ని మూర్తి అని అంటారు. మూర్తి ధ్యానాన్నిబట్టి ఆకారాలు ఉంటాయి. కానీ, లింగములో ఆకారంగానీ, రూపంగానీ, చెప్పవీలుబడదు. అదొక చిహ్నం మాత్రమే. లయనా ల్లింగముచ్యతే అని అన్నారు. అంటే, లయం ప్రళయం కావడం వల్ల లింగమని చెప్పబడుతోంది. ప్రళయాగ్నిలో సర్వమూ భస్మమై శివలింగంలో చేరుతుంది. లింగార్చనతో సర్వదేవతల పూజ జరుగునని లింగపురాణం చెబుతుంది.
స్వామి సర్వవ్యాపి కనుక ఆయనకు ఆకారం ఉండదు. 

తాను ఇతరులకు దర్శనమివ్వాలనుకున్నప్పుడు అంబతో కలిసి (సాంబ) దర్శనమిస్తుంటాడు. ఆ స్వామి రూపంలేని స్థితి నుంచి సాంబ మూర్తిగా దర్శనమివ్వడానికి మధ్యలో మరొక రూపం ఉంది. దానినే అరూపమని అంటారు.అదే శివలింగం.

శివలింగాలు ఐదు రకాలుగా మనకు గోచరిస్తుంటాయి. తనంతట తానుగా అవతరించినది స్వయంభూలింగం. ధ్యానపూర్వకమైనది బిందు లింగం. మంత్రపూర్వకమైనది ప్రతిష్ఠాలింగం. నాలుగవది చర లింగం. ఐదవది శివుని విగ్రహమైన గురులింగం. ఈ పవిత్ర భారతావనిలో కొన్నివేల శివలింగాలను దర్శించుకోవచ్చు. మరికొన్ని గ్రంథాలు శివలింగం యొక్క రంగు, ఆకారం, కొలతలననుసరిం చి శివలింగాలను నాలుగు విధాలుగా పేర్కొన్నాయ. అవి: ఆఢ్యం, సురేఢ్యం, అనాఢ్యం, సర్వసమం. 

1001 ముఖాలతో కనబడే శివలింగం ఆఢ్యం. 108 ముఖాలతో కనబడే శివలింగం సురే ఢ్యం. ప్రస్తుతం ఉన్నవి, లేనివి అన్ని శివలింగరూపాలను అనాఢ్యం అంటున్నారు. ఒకటి నుంచి ఐదు ముఖాలుగల శివలిం గాలు సర్వసమం.

ముఖలింగాలను మనం అరుదుగానే చూస్తుంటాం.

ముఖలింగాలను మనం అరుదుగానే చూస్తుంటాం. ఏకముఖలింగం, ద్విముఖలింగం, త్రిముఖలింగం, చతుర్ముఖలింగం, పంచ ముఖలింగం, షణ్ముఖలింగం అంటూ ముఖలింగాలను చూడ వచ్చు. అయితే ఆరుముఖాలు గల షణ్ముఖలింగాన్ని పూజించే పద్ధతి ప్రస్తుతం లేదు. ఈ ముఖలింగాలను పూజించడం వల్ల ఇహంలో అష్టైశ్వర్యాలు, పరంలో శివసాయుజ్యం లభిస్తుందని పురాణవచనం.

ఏకముఖ లింగం

ఈ లింగంలో శివుని యొక్క తత్పురుష రూపాన్ని దర్శించుకుం టాం. తూర్పుముఖంగా ఉండే ఏకముఖలింగం ఎరుపురంగులో పరమ శాంతంగా గోచరిస్తుంటుంది. సాధారణంగా ఈ లింగాలు శివ ఆలయాలలో నెైరుతిదిక్కులో ఉంటాయి. పదోన్నతి, అష్టైశ్వర్యాలను కోరుకునే భక్తులు, ఈ తత్పురుష లింగపూజలను గర్భాలయంలో ప్రతిష్ఠించుకుని పూజించే పద్ధతి లేదు. 

అలాగే ఈ ఏకముఖ లింగాలకు ఏక ముఖ రుద్రాక్షలతో 11-121 సంఖ్యలో మాలలను తయారుచేసి, లింగమూర్తికి అలంకరించి బిల్వదళాలతో పూజిస్తే మానసికశాంతి.

ద్విముఖలింగం

శివలింగానికి తూర్పు- పడమరల లో ముఖా లు కలిగి ఉండటం ద్విముఖలింగ లక్షణం. తూర్పుముఖం తుత్పురుష, పడమటి ముఖం సద్యోజాతం. వీరశెైవులు ఈ లింగాన్ని పూజిస్తుంటారు. ద్విముఖలింగ సన్నిధికి తూర్పు పడమర దిక్కులలో ద్వారాలను ఏరర్రచాలన్నది నియమం. ఈ లింగాన్ని ద్విముఖ రుద్రాక్షలతో పూజించాలి. ఈ లింగాలను ఆలయాలలో చూడలేము.

త్రిముఖ లింగం

ఈ శివలింగం తూర్పు, ఉత్తర, దక్షిణముఖాలను కలిగి ఉంటుంది. తూర్పున ఉన్న తత్పురుష ముఖం చిరునగవుతో, దక్షిణవెైపుగానున్న అఘోరముఖం కోపంతో, ఉత్తరం వెైపునున్న వామదేవముఖం మందహాసంతో గోచరిస్తుంటాయి. ఈ త్రిముఖలింగం సృష్టి, స్థితి, లయకారకులెైన త్రిమూర్తులను సూచిస్తోందని కొందరి భావన, మంత్రార్చనతో, త్రిముఖ రుద్రాక్షమాలను స్వామికి సమర్చించుకుని, మూడు దళాల బిల్వ పత్రాలతో అర్చిస్తే సకల సంపదలు సమకూరుతాయి.

చతుర్ముఖ లింగం

నాలుగు ముఖాల ఈ లింగానికి తూర్పున తత్పురుషం, పడమట సద్యోజాతం, ఉత్తరాన వామదేవం, దక్షిణాన అఘోర ముఖాలున్నాయి. ఈ నాలుగుముఖాలను నాలుగు వేదమంత్రాలతో పూజిస్తుంటారు. ఈ లింగాన్ని చతుర్ముఖ రుద్రాక్షలతో అలంకరించి బిల్వపత్ర పూజ చేస్తే, అలా పూజించిన వారి మేధస్సు పెరుగుతుందనేది ఐతిహ్యం.

పంచముఖలింగం

ఈ పంచముఖ లింగాలు చాలా అరుదుగా కనిపిస్తుం టాయి. నాలుగు దిక్కులలో నాలుగు ముఖాలతో, తూర్పువెై పున ఐదవముఖంతో స్వామి దర్శనమిస్తుంటాడు. ప్రస్తుతం నిర్మిస్తున్న శివాలయాలలో చాలా మంది పంచముఖ శివ లింగాలను ప్రతిష్ఠించుకుంటున్నారు. పంచముఖ రుద్రాక్ష మాలను స్వామికి అలంకరించి, పంచగవ్యంతో అభిషేకిం చి, బిల్వ పత్రాలతో అర్చించి, ఐదు విధాలెైన ఉపచారాలను చేసి, పంచ నెైవేద్యాలను నివేధించాలి. ఈ ఐదు ముఖాల నుంచి ఆగమాలు వెలువడినందువల్ల దీనిని ‘శివాగమ లింగం’ అని కూడా పిలుస్తారు.

పంచముఖ లింగాలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. నాలుగు దిక్కుల లో నాలుగు ముఖాలతో, తూర్పువెై పున ఐదవ ము ఖంతో స్వామి దర్శనమిస్తుంటాడు. ప్రస్తు తం నిర్మిస్తున్న శివాలయాలలో చాలా మంది పంచముఖ శివ లింగాలను ప్రతిష్ఠించుకుంటు న్నారు. పంచముఖ రుద్రాక్ష మాలను స్వామికి అలంకరించి, పంచగవ్యంతో అభిషేకిం చి, బిల్వ పత్రాలతో అర్చించి, ఐదు విధాలెైన ఉపచారాల ను చేసి, పంచ నెైవేద్యాలను నివేధించాలి.

షణ్ముఖ లింగం

ఈ లింగంలో నాలుగు ముఖాలు నాలుగు దిక్కులను చూస్తుండగా, ఐదవ ముఖం ఆకాశాన్నీ, ఆరవముఖం పాతా ళాన్ని చూస్తుంటాయి. ఈ ఆరు ముఖాల నుంచి వెలువడిన తేజఃపుంజాలతో శివుడు సుబ్రహ్మణ్య స్వామిని సృజించా డని పురాణకథనం. అలాగే పాలసముద్రాన్ని మధించినప్పు డు వెలువడిన హాలాహలాన్ని శివపరమాత్మ అథోముఖంతో స్వీకరించాడట అయితే ప్రస్తుతం ఎక్కడా మనం షణ్ముఖలిం గాన్ని దర్శించుకోలేము.ఇక, ఎవరెవరు ఏయే లింగాన్ని పూజిస్తే ఫలితం ఉంటుం దున్న విషయాన్ని కూడా మన పురాణాలు పేర్కొన్నాయి. బ్రహ్మవేత్తలు రసలింగాన్ని, క్షత్రియులు బాణలింగాన్ని, వ్యాపారస్తులు స్వర్ణలింగాన్ని, ఇతరులు శిలా లింగాన్ని పూజించాలి. వితంతువులు స్ఫటికలింగాన్ని లేక రసలిం గాన్ని అర్చిస్తే మంచిది. ఈ స్ఫటికలింగాన్ని అందరూ పూజించవచ్చు. ఏ లింగాన్ని పూజించడం వల్ల ఫలితమన్న విషయాన్ని లింగపురాణం వివరించింది.

1. గంధలింగం: రెండు భాగాలు కస్తూరి, నాలుగు భాగాలు గంధం, మూడు భాగాలు కుంకుమను కలిపి ఈ లింగాన్ని తయారు చేస్తారు. దీనిని పూజిస్తే శివసాయుజ్యం లభిస్తుంది.

2. పుష్పలింగం: నానావిధ సుగంధ పుష్పాలతో దీనిని నిర్మిస్తారు. దీనిని పూజిస్తే రాజ్యాధిపత్యం కలుగుతుంది.

3. గోమయలింగం: కపిలగోవు పేడతో ఈ లింగాన్ని తయారుచేస్తారు. దీనిని పూజిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. భూమిపెై పడి మట్టి కలసిన పేడ పనికిరాదు.

4. రజోమయలింగం: పుప్పాడితో నిర్మించిన ఈ లింగాన్ని పూజించడం వల్ల విద్యాధరత్వం సిద్ధిస్తుంది. శివసాయుజ్యాన్ని పొందగలం.

5. ధాన్యలింగం: యవుల, గోధుమలు, వరిబియ్యపు పిండితో ఈ లింగాన్ని నిర్మిస్తారు. దీనిని పూజించడం వల్ల సంపదల వృద్ధి, సంతానం కలుగుతుంది.

6. తిలపిష్టోత్థలింగం: నూగుపిండితో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే ఇష్టసిద్ధి కలుగుతుంది.

7. లవణజలింగం: హరిదళం, త్రికటుకం, ఉప్పు కలిపి చేసిన ఈ లింగాన్ని పూజిస్తే వశీకరణ శక్తి.

8. తుషోత్థలింగం: మారణక్రియకు పూజిస్తారు.

9. భస్మమయలింగం: భస్మంతో తయారు చేస్తారు. సర్వ సిద్ధులను కలుగుజేస్తుంది.

10. శర్కరామయలింగం: సుఖప్రదం.

11. సద్యోత్థలింగం: ప్రీతిని కలిగిస్తుంది.

12. వంశాకురమయలింగం: వంశవృద్ధిని కలిగిస్తుంది. దీనిని వెదురు మొలకలతో తయారు చేస్తారు.

13. కేశాస్థిలింగం: వెంట్రుకలు, ఎముకలతో తయారు చేస్తారు. ఇది శత్రునాశనం చేస్తుంది.

14. పిష్టమయలింగం: ఇది పిండితో తయారు చేయబడుతుంది. ఇది విద్యలను ప్రసాదిస్తుంది.

15. దధిదుగ్థలింగం: కీర్తిప్రతిష్టలను కలిగిస్తుంది.

16. ఫలోత్థలింగం: ఫలప్రదమైనది.

17. ధాత్రిఫలజాతలింగం: ముక్తిప్రదం.

18. నవనీతలింగం: వెన్నతో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే కీర్తి సౌభాగ్యాలు కలుగుతాయి.

19. దుర్వాకాండజలింగం: గరికతో తయారు చేసిన ఈ లింగం అపమృత్యుభయాన్ని తొలగిస్తుంది.

20. కర్పూరజ లింగం: ముక్తిప్రదమైనది.

21. ముక్తాలింగం: ముత్యంతో తయారుచేయబడిన లింగం ఇష్టసిద్ధిని కలిగిస్తుంది.

22. సువర్ణనిర్మిత లింగం: బంగారంతో చేసిన ఈ లింగం ముక్తిని కలిగిస్తుంది.

23. రజత లింగం: సంపదలను కలిగిస్తుంది.

24. ఇత్తడి-కంచులింగం: ముక్తిని ప్రసాదిస్తుంది.

25. ఇనుము-సీసపులింగం: శత్రునాశనం చేస్తుంది.

26. అష్టథాతులింగం: చర్మరోగాలను నివారిస్తుంది. సర్వసిద్ధిప్రదం.

27. వెైఢూర్యలింగం: శత్రునాశనం. దృష్టిదోషహరం.

28. స్ఫటికలింగం: సర్వసిద్ధికరం, అనుకున్న కార్యాలను సఫలీకృతం చేస్తుంది.

29. సితాఖండలింగం: పటికబెల్లంతో తయారు చేసింది. ఆరోగ్యసిద్ధి కలుగుతుంది.

ఇక శివలింగాలు లక్షణ శాస్త్ర గ్రంథాన్ని అనుసరించి రెండు విధాలుగా ఉన్నాయి.

1. శుద్ధలింగమూర్తులు, 2. లింగోద్భవమూర్తులు
శుద్ధలింగాలు స్థావర లింగాలు, జంగమలింగాలని రెండు విధాలుగా ఉన్నాయి.

మానుషమూర్తులు 

1. అనుగ్రహమూర్తులు, 2. సంహార మూర్తులు,
 3. నృత్యమూర్తులు, 4. ఉమాసహిత మూర్తులు, 
5. ఇతర మూర్తులని ఐదు రకాలుగా ఉన్నాయి.

స్థావరలింగాలు 

1. స్వాయంభువలింగాలు,2.పూర్వపురాణలింగాలు,
 3. దెైవతలింగాలు,4. గాణపత్యలింగాలు, 
5. అసురలింగాలు, 6. సురలింగాలు,
 7. ఆర్షలింగాలు, 8. మానుషలింగాలు,
9.బాణలింగాలని తొమ్మిది విధాలుగా ఉన్నాయి.

కామికాగమంలో శివలింగాలు నాలుగు రకాలుగా చెప్పబడ్డాయి. 

1. స్వయంభులింగాలు, 2. దెైవత, గాణపత్య లింగాలు, 3.అసుర, సుర, ఆర్షలింగాలు,
 4.మానుషలింగాలు.

శివలింగంలో శివశక్తుల సమ్మేళనం జరగడం వలన ప్రచంఢమైన ఊర్జస్సు ఉద్భవిస్తుంది. దాని ప్రతికూల ఫలితాలు మనపెై పడకుండా ఉండేందకు శివలింగంపెై జలధారను పోస్తుండాలి. ఆ దార నుంచి సూక్ష్మమైన లింగకారం ఉద్భవిస్తుంది. ఇదే నిర్గుణబ్రహ్మ. ఇలా జీవుడు మంత్రపూర్వక ధారాభిషేకం ద్వారా నిర్గుణ బ్రహ్మను తెలుసుకుంటాడు. 

శివలింగం స్వయంభూగా వెలసిన  లింగానికి నీటితో అభిషేకం చేసిన చాలు ప్రతిష్ట చేసిన లింగం అడుగున ప్రతిష్టించి శక్తి యంత్రం ఉంచుతారు వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకించడం వల్ల అందులోనుండి శక్తి ఊర్జస్సు ప్రచోదనం అవుతుంది దానికి చుట్టుపక్కల ఆ శక్తి  ప్రకంపనలు వ్యాపిస్తుంది.

ఎందరో సంతాన లేమి ఉన్నవారికి తరచూ రుద్రాభిషేకం చేయడం శివలింగానికి అభిషేకించిన ద్రవ్యం తాగడం వల్ల సంతాన లోపాలు తొలగి సంతానం కలిగింది.. సనాతన ధర్మం లో ప్రతిదీ శాస్త్ర పరిజ్ఞానం తోనే ఉంటుంది.. అయితే అభిషేక  క్షిరాన్ని తాగితే మంచిది, 

పాశాన లింగ తీర్థం మటుకు సేవించ కూడదు.

🙏నమః శివాయ🙏

తారకేశ్వర శివాలయం - రహస్యం

హిమాలయాలలో ఘర్వాల్ జిల్లాలో ల్యాండ్స్ డౌన్ గ్రామానికి 12 మైళ్ళ దూరం లో 6500 అడుగుల ఎత్తులో దట్టమైన అరణ్య ప్రాంతం మధ్య తారకేశ్వర అనే చోట సుమారు 650 ఏళ్ళ నాటి చిన్న శివాలయం ఉంది .ఈ ప్రాంత ప్రజలు తమకు పండిన పంటను ఈ శివుడికి నైవేద్యం పెట్ట కుండా తినరు . 
ఒక వేళ పొరబాటున అలాచేయకపోతే వాళ్ళ ఇల్లు కదులుతుంది ,ఊళ్ళో వాళ్ళు వాళ్ళను చూసి నవ్వుకుంటారు ..తన 14 వ ఏట ఈ ప్రదేశాన్ని గురించి విని స్వయంగా సంగతులు తెలుసుకోవాలనుకొన్నాడు స్వామి రామా .నడిచి అక్కడికి చేరుకున్నాడు అప్పటికే రాత్రి 7 అయింది .చీకట్లు అలముకున్నాయి .ఒక కొండ గుట్ట అంచున ఉన్నాడు .చేతిలో బాటరీ లైట్ కూడా లేదు .

కాళ్లకు కర్ర చెప్పులు -పాంకోళ్ళు మాత్రమే ఉన్నాయి మంచు మీద అవి జారిపోతూ నడక చాలా ఇబ్బంది అయింది .. నిలువైన కొండ అంచు నుంచి జారిపోయాడు .ఇంతలో పొడవుగా  తెల్లని వస్త్రాలతో పొడవైన తెల్లని గడ్డం తో ఉన్న ఒక ముసలాయనఆపన్న హస్తాలు   అందించి పైకి లాగి  బయటకు చేర్చికాలిబాట పట్టించి  రామా తో ”ఇది దివ్య ధామం .రక్షిత ప్రదేశం .
నేను నిన్ను నీ గమ్యానికి చేరుస్తానని ”చెప్పి పది నిమిషాలలో  బయట  దీపం వెలుగుతున్న ఒక చిన్న కుటీరం దగ్గరకు తీసుకు వెళ్ళాడు  ఇద్దరూకలిసి గుడిసె చుట్టూ ఉన్న రాతి గోడ దగ్గరకు వచ్చారు .స్వామి రామా ఒక్క సారి వెనక్కి తిరిగి చూస్తే తనను తీసుకొచ్చిన ముసలాయన కనపడ లేదు ..ఆయనకోసం వెతుకుతూ పిలిచాడు .

ఇంతలో గుడిసె లో ఉన్న ఒక సాధువు ఈ కేకలు విని బయటి కొచ్చి ,తానుంటున్న గుడిసెలో తనతోపాటు ఉండమని ఆహ్వానించాడు .వెచ్చదనం కోసం లోపల  మంట  మండుతోంది  .

రామా గుడిసెలో చేరి జరిగిన విషయం సాధువుకు తెలియ జేశాడు .సాధువు కన్నీరు కారుస్తూ ”నువ్వు చాలా అదృష్టవంతుడివి నాయనా !గొప్ప మహానుభావుని దర్శించగలిగావు .నేనెందుకు ఇక్కడ ఉంటున్నానో తెలుసా ?ఏడేళ్ల క్రితం నేను కూడా నువ్వు జారిపోయిన ప్రదేశం లోనే రాత్రి 11 గంటలకు అంచునుండి జారిపోయాను .

నీకు కనిపించిన మహానుభావుడే  నన్నూ  ఆపన్నహస్తాలు అందించి రక్షించి ఈ గుడిసెకు చేర్చాడు .మళ్ళీ ఆయన దర్శనం నాకు కాలేదు .ఆయనను నేను ”సిద్ధ బాబా ”అని పిలుస్తాను .నిన్ను రక్షించిన చేతులే నన్నూ అప్పుడు రక్షించాయి ”అన్నాడు గద్గద స్వరం తో .


మర్నాడు స్వామిరామా ఆ చుట్టు ప్రక్క ప్రదేశాలన్నీ గాలించి చూశాడు .తాను  జారిన ప్రదేశం దగ్గర వెతికాడు .తాను  జారిన పాదపు గుర్తులు మాత్రమే కనిపించి గుర్తించాడు.ముసలాయన పద చిహ్నాలు లేవు.

ఇది చాలా ప్రమాదకరమైన అంచు అని గ్రహించాడు అందుకే ఆ అదృశ్య మహాత్ముడు ఆపన్న హస్తాలు అందించి కాపాడుతున్నాడు అని అర్ధం చేసుకొన్నాడు స్వామిరామా . తాను  బ్రతికి బయట పడటానికి ఆ సిద్ధబాబాయే కారణమని గ్రహించాడు ..దగ్గరే ఉన్న ఊళ్లోకి వెళ్లి అక్కడున్న వారిని కలిసి తన అనుభవం చెప్పాడు .

అక్కడి వారందరికీ తమకుటుంబాలలో పిల్లా పెద్ద అందరినీ  ప్రమాదాలనుంచి కాపాడే వాడు ఆ సిద్ధ బాబాయే  అనే నమ్మకం లో ఉన్నారని తెలుసుకొన్నాడు  .


ఇక్కడ సాధువుతో తానున్న గుడిసె ప్రసిద్ధ శివాలయానికి 100 గజాల దూరం లో మాత్రమే ఉంది . శివాలయాన్ని దట్టమైన ఫర్ వృక్షాలమధ్య కొంత ప్రదేశం ఖాళీ చేసి కట్టారు .అందుకే ఇక్కడ అద్భుత ఆధ్యాత్మిక తరంగ ప్రసారం జరుగుతుందని ఊహించాడు .

గ్రామస్తులను అడిగితె సిద్ధబాబా సుమారు 650 సంవత్సరాలక్రితం ఇక్కడ ఉండేవాడని నిరంతర మౌనంలో ఉన్నా  ఇక్కడి ప్రజలను సన్మార్గం లో నడిపించేవాడని తెలిసింది .ఆయన సిద్ధిపొందాక ఆ ప్రదేశం లో ఆరు అడుగుల చతురం లో గుడికట్టారని ,లోపల శివ లింగాన్ని ప్రతిష్టించారని ,అప్పటినుంచి ప్రతి మూడు నెలలకోసారి ప్రజలు వచ్చి కృతజ్ఞత పూర్వకంగా దర్శించిసిద్ధబాబా ను స్మరించి వెడతారని ,ఆసిద్ధ బాబాయే  తన ప్రాణ రక్షకుడని రామా గ్రహించాడు .ఈ ఆలయం దగ్గరే ఒక గదిలో స్వామిరామా చాలా నెలలు ఉండి యోగ,ధ్యానాలు చేశాడు .   

స్వామి రామా అక్కడ నుండి వెళ్లి పోయాక కొన్నేళ్ళకు అక్కడి బ్రాహ్మణులు ఆలయం శిధిలమై పోతోందికనుక శివాలయాన్ని ఇంకొంచెం పెద్దదిగా కడదామని ప్రయత్నం చేశారు ..కూలీలు వచ్చి గుడి ని పడ  గొట్టటానికి పలుగు పారలతో ప్రయత్నించారు …అడుగు లోతు  నుంచి చిన్న చిన్న పాములు అనేక రంగుల్లో కనిపించాయి .తవ్విన మట్టి తీసి పాముల్ని ఏరేసి మళ్ళీ లోపలి తవ్వారు .లోతుకు వెళ్లిన కొద్దీ పాముల సంఖ్య పెరిగి0దేకాని తగ్గలేదట.

దగ్గర గ్రామంలోని ఒక ముసలామె రోజూ సాయంకాలం వచ్చి ఆలయం లో దీపం వెలిగించి,మళ్ళీ మర్నాడు ఉదయం వచ్చి ఆర్పేస్తుందిట ఆమె ఇలా ఎన్నో ఏళ్లుగా భక్తితో చేస్తోందట .ఆమె రోజూ త్రవ్వేవారితో గుడిని కూల్చవద్దు ,దాన్ని మార్చే ప్రయత్నం చేయద్దు అని గోల చేసేది .కొత్త గుడి కట్టటానికి ఏర్పాటు చేయబడిన ఇంజనీర్ ఆమె మాటలను పట్టించుకొనే వాడు కాదు ..ఆరు రోజులు త్రవ్వాక పాములు అనంతం గా ఉన్నాయని  గ్రహించి త్రవ్వకం ఆపేశారు.

పోనీ శివలింగాన్ని త్రవ్వి పీకి పారేద్దామని ప్రయత్నం చేశారట .8 అడుగులు తవ్వారు .”అంబ” పలక లేదు యెంత లోతుకు తవ్వినా దాని మూలం ఎక్కడుందో తెలియ లేదట . కనుక పీకలేక తోక ఝాడించేశారు  .ఒక రోజు రాత్ర ఇంజనీర్ కు కలలో ఒక పొడవైన తెల్లగడ్డం ముసలి యోగి కనిపించి ”ఈ శివ లింగం అత్యంత మహిమాన్వితమైనది .దీన్ని కదిలించే ప్రయత్నం చేయద్దు .

ఆలయాన్ని పెంచి కట్టే ప్రయత్నమూ చేయద్దు ”అని చెప్పాడట .అంతే ఆ ప్రయత్నాలన్నీ ఆపేసి ఉన్న చిన్న గుడినే ఏ మాత్రమూ మార్చకుండా  రిపేర్ చేసి  లెంపలు వాయించుకొన్నారట .అందమైన ప్రకృతి  మధ్య విలసిల్లిన వెలసిల్లిన ఆరు శతాబ్దాల మహిత,మహిమాన్విత శివాలయం అది దానికే తారకేశ్వరాలయమనీ పేరుంది
ఇక్కడే శివుడు తారకాసురుని సంహరించాడని ఐతిహ్యం .

దీన్ని శివ సిద్ధ క్షేత్రమనీ పేరుకూడా ఉంది .తరువాతకాలం లో తాండ శివ విగ్రహ ప్రతిష్ట చేసి వసతులేర్పాటు చేసి ధర్మశాల కట్టించారు. 

Seeds Of Consciousness- The Basic Truth

When you analyze the situation you will discover that it is but consciousness seeking the unmanifested source of manifestation, and not finding it, because this consciousness, ever-moving, ever-active, is actually just seeking itself, in its serene, inactive, potential state. 

It is the seeker that is being sought. When this is deeply, intuitively perceived then the seeker will disappear and the Source will remain.

What you appear to be, what you are conditioned to think you are but are not, is temporal. But what you are is intemporality. 

What you think you are is some thing in time, a river of time flowing from infancy to old age, from birth to death, like any other manifested phenomenon, but what you subjectively are is timeless, here and now... where 'here' means the absence of space and 'now' means the absence of time. 

The past is only a memory and the future is only a hope; both past and future are conceptual, rooted in duality. 

But, the now, the present is intemporal, spontaneous and ever new, free of conceptualization, and that is what you are ..  

You must understand yourself always.