Tuesday, June 23, 2020

శ్రీ కృష్ణ పరమాత్మకు 8 సంఖ్యకు ఉన్న సంబంధం ఏమిటో తెలుసా....?

శ్రీ కృష్ణ పరమాత్మకు 8 సంఖ్యకు ఉన్న సంబంధం ఏమిటో తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవాల్సింది. శ్రీ కృష్ణుడు పుట్టిన తిథి  అష్టమి. దశావతారాల్లో ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణుడు. 

దేవకీ వసుదేవులకు అష్టమ గర్భం. ఆయనకు భార్యలు ఎనిమిదిమంది. కృష్ణుని జన్మనక్షత్రమైన రోహిణి నక్షత్ర క్రమంలో నాలుగవది. అంటే అష్టమ సంఖ్యలో సగం. పదహారు వేలమంది గోపికలు. పదహారు సంఖ్యను, ఎనిమిది సంఖ్యతో భాగించవచ్చును.
 
ఇక జ్యోతిష్యశాస్త్రం ప్రకారం అష్టమం ఆయఃస్థానం. లగ్నం నుండి ఆరవస్థానం మేనమామ. అష్టమత్‌ అష్టమం కూడా ఆయువును చూస్తుంది. అంటే అది మేనమామకు తృతీయం అన్నమాట. 'అష్టమి అష్టకష్టాలు' అన్న నానుడి ఉంది. కానీ జయ తిథికి దుర్గాదేవి అధిష్ఠాన దేవత. విజయసూచిక ఎనిమిది సంఖ్య శని గ్రహాన్ని సూచిస్తుంది. శని ఆయుఃకారకుడు. ఎనిమిది సంఖ్యను రాయటం మొదలుపెడితే ఆ సంఖ్యను ఆపకుండా రాయవలసి వస్తుంది.
 
రోహిణి నక్షత్రం చంద్రుడికి ఉచ్ఛస్థానం. సహజ చతుర్ధాధిపతి చంద్రుడికి ప్రాధాన్యం రోహిణి నక్షత్రం. అంటే మనఃకారకుడు. చంద్రుడు మాతృ, ఆహార, వాహన, గృహభోగాన్ని సూచిస్తాడు. ఆత్మకారకుడు రవి. అగ్నిని మానవుడికి తానే ఇస్తానని సూచించాడు. సహజ ఆరవ స్థానం శత్రు, రోగ, రుణాలను సూచిస్తుంది. దానికి అధిపతి బుధుడు (అంటే నారాయణుడన్నమాట). అందుకే 'వైద్యో నారాయణో హరిః' అనమని పెద్దలు చెప్తున్నారు. అందుచేత శ్రీకృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుడిని స్మరించుకుంటే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.

బ్రహ్మ జ్ఞానానికి మూలము

త్రిపురాలు..మనిషిని మింగేస్తున్నా మూడు వికారాలు-నేను,నాది,నాదికానిది.
'నేను' అంటే -నా శరీరం,నా మనసు.

'నాది' అంటే-నా ఆస్తి, నా జ్ఞానం, నా కుటుంబం, నా అధికారం.
'నాది కాదు'అంటే-నాకు అందనిది,అందుబాటులో లేనిది,నేను అందుకోవాలని ఆరాట పడుతున్నది...ఏదయినా కావచ్చు..

'నాది' అనుకోవడములో బాధ ఉంది.'నాది కాదే'!అనుకోవడములోను బాధ ఉంది.మొత్తంగా 'నా...'అనే ఆలోచనే వద్దు అంటుంది "నీ తత్వము"..ఈ మూడు దుఃఖ కారకాలే..ఆ త్రివిధ వికారాలకి ప్రతీకలైన ముగ్గురు రాక్షసులు మూడు ఎగిరే నగరాలని సృష్టించుకొని ముల్లోకాలని అల్లకల్లోలం చేస్తుంటారు.

ఆ మూడు నగరాలని ఒకే బాణంతో నేలకూల్చాలి. లేదనంటే లేదు.అది వారి ధైర్యము,వారికున్న వరము.ఒకే సరళరేఖలో ఎగురుతున్నప్పుడే దుష్టశిక్షణ సాధ్యమవుతుంది... త్రిపురాల్ని నాశనం చేయడమంటే...నేను,నాదీ, నాదికాదు అన్న భావనల్ని తొలగించుకోవడమంటే... ఎంత కష్టం! 

మనలోని సమస్త శక్తుల్ని కూడగట్టుకోవాలి.నువ్వు చేసింది అదే కదా....
"భూమిని రథము చేసుకున్నావు,(భూమి వాస్తవిక దృక్పథానికి ప్రతీక)సూర్యచంద్రుల్ని చక్రాలుగా అమర్చకున్నావు(ఆ రెండు జీవితములో ఎత్తుపల్లాల్ని ప్రతిబింబిస్తాయి).బ్రహ్మ సారథ్యం  వహించాడు(బ్రహ్మ జ్ఞానానికి మూలము)..మేరుపర్వతము వింటి చాపమైంది(కొండ ఆత్మబలానికి రూపము),శేషుడు వింటినారి అయ్యాడు,సర్పం శరము అయ్యింది.(సర్పాన్ని సంధించడమంటే కోరికల్ని జయించడము) పరిపూర్ణ ఆత్మవిశ్వాససముతో వెన్నంటి తరమగా..త్రిపురాలు ఒకే సరళరేఖ మీదకి వచ్చాయి.నీ బాణం దెబ్బకి కాలి బూడిద అయిపోయాయి.. నాలోను తిష్టవేసుకున్న త్రిపురాసుల్ని సంహారం చేసేటంతటి శక్తిని ప్రసాదించు ప్రభు....

సాలగ్రామములు-పుట్టు పూర్వోత్తరాలు

సాలగ్రామము విష్ణుప్రతీకమైన ఒక శిలా విశేషము. సర్వకాల సర్వ్యావస్థలయందు విష్ణువు సాక్షాతూ సాన్నిధ్యం కలిగి ఉండేది సాలగ్రామంలో మాత్రమే. అందుచేతే గృహదేవతార్చనలలోగానీ, దేవాలయాలలోగానీ సాలగ్రామము (మూర్తి) లేకుండా పూజలు కొనసాగవు. ద్వైతులు, విశిష్టాద్వైతులు, అద్వైతులు తమతమ దేవతార్చనలలో సాలగ్రామములను పూజకు ఉపయోగిస్తారు.
భారతదేశంలో సాలగ్రామ పూజ బహు పురాతనమైనది. క్రీస్తు కంటే ప్రాచీనుడైన అపస్తంబుడు సాలగ్రామ పూజను పేర్కొన్నాడు. త్రిమతాచార్యులు తమతమ భాష్యాలలో సాలగ్రామాలు విష్ణురూపాలని వివరించారు. దేవాలయాలలో పంచాయతన మూర్తులకు శిలా ప్రతిమలు ఉంటే గృహస్థులకు మణి, స్వర్ణ నిర్మితమైన మూర్తులు, సాలగ్రామములు ఉంటాయి. సాధారణంగా ప్రతిమలకు నిత్య పూజా సమయంలో ఆవాహనాది షోడశోపచారాలు చేయాలి. సాలగ్రామాలలో దేవత నిత్యం సన్నిహితమై ఉండడం వల్ల వాటికి పూజా సమయంలో అవాహనాది ఉపచారాలు అవసరం లేదు.
హిందువులందరికీ తులసి, శంఖం, సాలగ్రామం పూజనీయమైనవి. తులసి హిందువుల ఇహపర సాధనానికి భూలోకంలో అవతరించిన వనదేవత. ఈ తులసి అపూర్వమైన మూలిక కూడా. శంఖం అత్యంత పవిత్రమైనది. శంఖారావం వ్యాపించినంత దూరం సూక్ష్మక్రిములు నశిస్తాయి అంటారు. నీరు శంఖంలో పూరిస్తే తీర్థం అవుతుంది. వట్టివేళ్ళు, ఏలకులు, లవంగాలు, పచ్చ కర్పూరం మొదలైన సుగంధ ద్రవ్యాలు చేర్చిన నీటిని శంఖంలో పోసుకుంటూ సాలగ్రామాలకు పురుషుసూక్తం పఠిస్తూ అభిషేకం చేసిన తీర్థం సర్వశక్తివంతం. ఇటువంటి తీర్ధాన్ని భక్తితో సేవిస్తే ప్రాయశ్చిత్తం, పాపక్షయం కలుగుతుంది. తీర్ధాన్ని మూడుసార్లు తీసుకుంటారు. మొదటిది కాయసిద్ధి కొరకు, రెండవది ధర్మసాధనకు,మూడవది మోక్షం పొందడానికి. అసలీ తీర్ధం అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయం కలుగుతాయి.
సాలగ్రామాలు ఉన్న ఇల్లు గొప్ప పుణ్యక్షేత్రంతో సమానం. సాలగ్రామ దర్శనం వల్ల, స్పర్శవల్ల, అర్చనవల్ల అంతులేని పుణ్యం లభిస్తుంది. సాలగ్రామాలు శిలాజాలు. శాస్త్రజ్ఞులు ఈ శిలలను ఒక విధమైన ప్రాణి నిర్మిస్తుందని అంటారు. ఆలి అనే ఒక విధమైన మత్స్యం శీతాకాలంలో తన శరీరం నుంచి వెలువడే ఒక విధమైన రసాయనిక పదార్ధంతో శిలామయమైన కవచాన్ని నిర్మించుకుని దానిలో నివశిస్తుందని అది మరణించినప్పుడు లేక వదిలి వెళ్ళినప్పుడు అవి సాలగ్రామాలుగా మనకు లభిస్తాయని అంటారు. సాలగ్రామాల మీద వివిధ దేవతా చిహ్నాలు ఉంటాయి. ముఖ్యంగా చక్రం, పద్మం ప్రధాన చిహ్నాలు. విష్ణు భక్తులైన మాధ్వులకు, వైష్ణవులకు ఇవి పూజకు ఎంతో విలువైనవి. వైష్ణవ పురాణాలు, ఇతవ వైష్ణవ గ్రంధాలు వీటిని గురించి సవిస్తరంగా వివరిస్తాయి.

నేపాల్ దేశంలో ఖట్మండుకు సుమారు 197 మైళ్ళు దూరంలో ముక్తినాధ్, గండకీ నదీ తీరంపై ఉన్న మహాషేత్రంలో ఇవి లభిస్తాయి. ఇవి సాధారణంగా స్థలజాలు, జలజాలు అని రెండు రకాలు. గండకీ నదీ తీరాన్ని ఆనుకుని ఉన్న సాలగ్రామ గిరిపైన స్థలజాలు, గండకీ నదీ గర్భంలో జలజాలు లభిస్తాయి.

 సాలగ్రామాలలో బంగారం ఉంటుంది. అందుకే వాటిని హిరణ్యగర్భ అని కూడా అంటారు. సాలగ్రామాలు అమోనైట్ శిలామాలు. ఇండియాలో ఈ సాలగ్రామాలు సముద్రంలో నివసించే టెథైస్ అనే ప్రాణి వల్ల ఏర్పడతాయి. ఇటువంటి శిలాజాలు అనేక రకాలు ఉన్నాయి. 250 మిలియన్ సంవత్సరాలలో ఇండియా ఉత్తర దిక్కుగా 9,000 కి.మీ. జరిగిపోయింది. హిమాలయాలు ఏర్పడ్డాయి. వీటి నుండి అనేక నదులు ప్రవహించాయి. ఇండో మైదానంలోకి ప్రవహించిన అటువంటి నదులలో ఒకటి గండకి. సాలగ్రామములు మన శాస్త్రం అనుసరించి కొన్ని సౌమ్యమైనవి. కొన్ని ఉగ్రమైనవి. శాస్త్ర సమ్మతంగా చక్రశుద్ధి, వక్త్రశుద్ధి, శిలాఉద్ధి, వర్ణశుద్ధి గల వాటినే పూజించాలి. రకరకాల రంగులు గలిగిన కారునలుపు, భగ్నమైన, మొక్కవోయిన సాలగ్రామాలను పూజించకూడదు. నారసింహ పాతాళ నారసింహ, గండభేరుండ, మహాజ్వాల మొదలైనవాటిని సన్యాసులు, బ్రహ్మచారులు పూజించాలి. విష్ణు, సీతారామ, గోపాల వంటి శాంతమూర్తులనే గృహస్థులు పూజించుకూవాలంటారు. పరిమాణాన్నిబట్టి కూడా పూజార్హతను నిర్ణయించుకుంటారు.. సాధారణంగా ఇవి ప్రతి గృహంలోనూ వంశపారంపర్యంగా సంక్రమిస్తుంటాయి. సాలగ్రామ శిలామహత్మ్యం గురించి వేరే చెప్పనక్కరలేదు. తిరుపతిలో శ్రీ వేంకటేశ్వరునికీ, మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామి వారికీ అంతటి మహిమ ఉండడానికి కారణం అక్కడ ఉండే సాలగ్రామాలు అంటారు. 

సాలగ్రామాన్ని పూజిస్తే ఎంత పుణ్యం లభిస్తుందో దాని దానం వలన కూడా అంతటి ఫలం లభిస్తుంది.
2 )పూర్వం విదేహరాజ్యంలో ప్రియంవద అనే స్ర్తీమూర్తి ఉండేది. అత్యంత రూపవతి, గుణవతి అయిన ఆమె, శ్రీమన్నారాయణుని ప్రసన్నం చేసుకుని, ఆయన తన కుమారునిగా జన్మించాలని కోరుకుంటుంది. ఆమె కోరి కను మన్నించిన స్వామివారు, మరుజన్మలో ఆమె గండ కీ నది రూపాన్ని ధరించేటట్లుగా చేసి, తాము సాల గ్రామ రూపంలో ఆ నది నుంచి ఉద్భవిస్తున్నారని కథ.సాలగ్రామ శిలయందు, చరాచరాత్మకమగు మూడు లోకాలు అణిగి ఉన్నాయి. ఆ కారణంగా సాలగ్రామాన్ని భక్తిశ్రద్ధలతో, పరిపూర్ణ విశ్వాసంతో, శాస్త్ర ప్రకారం అభిషేకిస్తే, కోటి యజ్ఞాలు చేసినంత పుణ్యఫలానికి సమానమవుతుంది. మరియు కోటి గోవులను దానం చేసినంత ఫలితాన్ని పొందుతారు. సాలగ్రామ పూజచే, శివకేశవులని పూజించిన ఫలితం కలుగుతుందిట.

సాలగ్రామం వున్న ప్రదేశాలలో స్నానం చేసినా, దానం చేసినా, కాశీ క్షేత్రంలో పవిత్ర గంగానదీ స్నానంకంటే, ఆ పుణ్యక్షేత్రంలో చేసిన దానం కంటే, నూరె రెట్లు అధి క ఫలము కలుగుతుంది. సాలగ్రామమును అభిషేకిం చిన పుణ్య బలాలను ప్రోక్షించుకొనినచో, సర్వపాపాల ను నశింపజేస్తుంది. సర్వరోగాలు తొలగిపోతాయి. సక ల సంపదలు కలుగుతాయి, సర్వశుభాలను కలిగించి, మోక్ష సామ్రాజ్యమును సిద్ధింపజేస్తుంది. సాలగ్రామ మును అభిషేకించిన జలాలను ప్రోక్షించుకొనిన యెడల, పవిత్ర గంగానదీ స్నానమాచరించిన యెడల సర్వ తీర్థాలలో స్నానమాచరించిన పుణ్యఫలం కలిగి, సర్వదేవతలను ఆరాధించిన ఫలితం కలుగుతుంది.

ఒక్కసారి భక్తిశ్రద్ధలతో సాలగ్రామాన్ని శాస్త్ర ప్రకారం పూజించి, అభిషేకించితే కోటి లింగాలను దర్శించి, పూజించి, అభిషేకించిన ఫలితం కలుగుతుంది. సాల గ్రామ తీర్థం సేవించినచో, వెయ్యిసార్లు పంచామృత మును సేవించిన ఫలితముకంటే, ప్రాయశ్చిత్తముల యందు ఆచరించు దానాలు ఫలితం కంటే అధిక ఫలి తం ఉంటుంది. కనీసం, సాలగ్రామాన్ని అర్చించు టకు మంత్రాదులు తెలియకున్నప్పటికీ, శక్తిననుసరించి పూర్తి భక్తివిశ్వాసాలతో పూజిస్తే, కొన్ని ఫలితాలైనా కలు గుతాయి. సాలగ్రామ శిల యందు ఉంచిన అన్ని పదార్థములు పవిత్రములవుతాయి. సాలగ్రామమును ముందుంచు కుని పితృదేవతలకు తర్పణాలను ఇచ్చన ఎడల, ఆ పితృదేవతలు స్వర్గంలో శాశ్వత సుఖాలను పొందు తారు. అన్ని విధాలైన పుణ్యాలకు పరిమితులున్నాయి గాని, ఈ సాలగ్రామశిల పూజచే కలుగు పుణ్యానికి పరిమితులు లేవు. అతల, వితల, రసాతల, పాతాళాది పధ్నాలుగు లోకాలలో ఈ సాలగ్రామ శిలకు సరిపడునట్టి వేరొక శిల లేదన్నదే శాస్తవ్రచనం.
కార్తీక మాసంలో సాలగ్రామ శిలపై ‘స్వస్తిక’ మండల మును రచించినచో అనంతమైన పుణ్యఫలము కలుగు తుంది. సంవత్సరకాలం గృహంలో ‘నిత్యాగ్ని హోమం’ చేసిన ఫలితానికి సమానమైన ఫలితాన్ని పొందుతారు. సాలగ్రామంపై శుద్ధమైన మట్టితో గాని, రంగులతో గాని, ఏ కొద్దిపాటి కేశవనామాలను వ్రాసినా, కోటి కల్పాల వరకూ స్వర్గంలో నివసించే భాగ్యం కలుగు తుందిట. పూజాపీఠంలో సాలగ్రామమును ఉంచితే, సమస్తమైన పూజలు సక్రమంగా సాగి పరిపూర్ణ ఫలితాలను పొందుతారు. సాలగ్రామాలు ఎంత చిన్నవిగా ఉంటే అంత మంచిది. సాలగ్రామాలు పగిలి నప్పటికీ, పెచ్చు పూడినప్పటికీ కూడా పూజార్హత కలిగి ఉంటాయి. కొన్ని సాలగ్రామాలు ఇంట్లో పెట్టుకుని పూజించుటకు అర్హత కలిగి ఉండవు. విపరీత పరి మాణామాలు కలుగుతాయి, కాబట్టి ఇంట్లో పెట్టుకుని పూజించాలనుకుంటే, సాలగ్రామములను గురించి క్షుణ్ణంగా తెలిసిన పండితుల అమూల్యమైన అభిప్రా యాలను తెలుసుకుని ఆచరించటం శ్రేయస్కరం.
సాలగ్రామంపై గల చక్రాలను బట్టి వాటికి వివిధము లైన పేర్లు ఉన్నాయి.

1 చక్రం ఉంటే - సుదర్శనం అని,

2 చక్రములు ఉంటే - లక్ష్మీనారాయణ అని,

3 చక్రములు ఉంటే - అచ్యుతుడు అని,

4 చక్రములు ఉంటే - జనార్ధనడు అని,

5 చక్రములు ఉంటే - వాసుదేవుడు అని,

6 చక్రములు ఉంటే - ప్రద్యుమ్నుడు అని,

7 చక్రములు ఉంటే - సంకర్షణుడు అని,

8 చక్రములు ఉంటే - పురుషోత్తముడు అని,

9 చక్రములు ఉంటే - నవ వ్యూహము అని,

10 చక్రములు ఉంటే - దశావతారము అని,

11 చక్రములు ఉంటే - అనిరుద్ధుడు అని,

12 చక్రములు ఉంటే - ద్వాదశాత్ముడు అని,

12 చక్కముల కన్నా ఎకువ ఉంటే ‘అనంతమూర్తి’ అని అంటారు. సాలగ్రామాలు తెల్లనివైతే సర్వపాపాలను హరిస్తాయి. పసుపుపచ్చనివి అయితే సంతానభాగ్యాన్ని కలిగిస్తాయి. నీలవర్ణంగలవి అయితే సర్వసంపదలను ఇస్తాయి. ఎరుపురంగు గలవి అయితే రోగాలను కలిగిస్తాయి, వక్రముగా వున్న సాలగ్రామాలు దారి ద్య్రాన్ని కలిగిస్తాయి.నలుపు రంగు కలిగి, దానికి గల చక్రం మధ్య భాగంలో కొద్దిగా ఉబ్బినట్లుగా వుండి, రేఖపొడవుగా ఉంటే, దానిని ‘ఆదినారాయణ సాలగ్రామం’ అని అంటారు.

తెలుపురంగు కలిగి రంధ్రంవైపున రెండు చక్రాలు ఒక దానితో ఒకటి కలిసిపోయినట్లు ఉంటే, దానిని ‘వాసు దేవ సాలగ్రామం’ అని అంటారు. ఇది సర్వ శ్రేష్టమై నది. ఇది ఆధ్యాత్మికతను పెంపొందిస్తుంది.

పసుపు పచ్చ రంగు కలిగి గుండ్రంగా వుండి, రంధ్రం వైపున మూడు రేఖలు ఉండి, ‘పద్మ చిహ్నం’ పైముఖం గా ఉంటే దానిని ‘అనిరుద్ధ సాలగ్రామము’ అని అం టారు. ఇది చాలా మంచిది. కపిలవర్ణం కలిగి, చక్రం పెద్దదిగా ఉంటే, దానిని ‘నర సింహ సాలగ్రామం’ అని అంటారు. దీనిని బ్రహ్మచర్య దీక్షతోనే పూజించాలి. బంగారు వర్ణంతో పొడవుగా వుండి మూడు బిందువులతో వున్నదానిని ‘మత్య్సమూర్తి సాలగ్రామం’ అని అంటారు. ఇది భక్తిని పెంచి ముక్తిని కలిగిస్తుంది. సంపదలను ఇస్తుంది. నలుపు రంగుతో, మెరుస్తూ వుండి ఎడమవైపున గద, చక్రాలు, కుడి వైపున రేఖ వున్నదానిని ‘సుదర్శనమూర్తి సాలగ్రామం’ అని అంటారు. శత్రుబాధలు నుండి రి స్తుంది. వివిధ వర్ణములతో వుండి, అనేక చక్రాలు, అనేక రేఖలు వున్నదానిని ‘అనంతమూర్తి సాలగ్రామ ము’ అని అంటారు.

ఈ సాలగ్రామం సకలాభీష్టాలను తీర్చుతుంది. 3 ముఖాలు, 6 చక్రాలు కలిగి నేరేడు పం డు ఆకారంలో ఉన్న దానిని ‘షట్చక్రసీతారామ సాల గ్రామం’

అని అంటారు. ఇలాంటి సాలగ్రామం దొర కటం దుర్లభం. ఈ సాలగ్రామాన్ని పూజించనవారికి అష్టైశ్వర్యములు కలుగుతాయి. ఇంకా కొన్ని అపురూప మైన సాలగ్రామాలు కూడా ఉన్నాయి. ఇంట్లో పూజిం చు సాలగ్రామానికి నిత్యనైవేద్యం తప్పనిసరిగా పెట్టాలి.

 కుటుంబ సభ్యులు మినహా అన్యులు సాలగ్రామాన్ని దర్శించరాదు.సర్వపాపపరిహారమైనది, సర్వవిధాలైన కష్టాల నుండి రక్షించేది, సర్వ పుణ్యణఫలాలను ఇచ్చేది, సర్వదేవతా పూజాఫలితాలను ఇచ్చేది, సర్వశ్రేయస్కరమైనది, సర్వో త్కృష్టమైనది, సర్వాంతర్యామి యొక్క ప్రతీక అయిన ‘సాలగ్రామాన్ని’ పూజించుకునే భాగ్యం ఈ కలియుగం లో మానవులమైన మనకు కలగటం, నిజంగా అపూర్వ మైన అదృష్టం. అటువంటి అవకాశాన్ని వినియోగించు కుని, జీవితాన్ని ధన్యం ఒనర్చుకుని, శాశ్వతానందాన్ని పొంది ముక్తిని పొందటం భక్తిపరుడైన మానవునికి ముఖ్యకర్తవ్యం అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అవకాశం దొరికితే, ఆ పుణ్యఫలాన్ని దక్కించుకు నేందుకు ప్రయత్నించాలి.
మరోకథ ప్రకారం, ఒకానొకసారి సృష్టిలోని జీవులన్నీ విపరీతమైన పాపపు చేష్టలను చేస్తుండేవి. ఆ దృశ్యా లను చూసిన బ్రహ్మదేవుడు, ఇంతడికీ కారణం తన సృష్టే కదా! తాను చేసిన సృష్టిలో 
ోపం ఉండబట్టే కదా, జనం ఇలా పాపకృత్యాలలో మునిగిపోతున్నారని బాధపడు తుండగా, ఆయన కళ్ళెంబడి రెండు కన్నీటి చుక్కలు రాలిపడ్డాయట. ఆ కన్నీటి చుక్కలే గండకీనది గా మారాయని కథనం. ఇలా సాలగ్రామాన్ని గురించిన అనేక కథలు మన పురాణాలలో కనబడుతున్నాయి.
సాలగ్రామాలను ఆవుపాలతో గాని, పంచామృముతోగాని శుద్ధి చేయాలి. 

‘రుద్రాక్షధారణ’ నియమాలనే, సాలగ్రామ పూజలోనూ పాటించాలి. ప్రత్యేక సమయాలలో, సంక్రమణకాలాలలో, గ్రహణ సమయాలలో 
ఆయా సాలగ్రామాలననుసరించి ఆయా 
దైవజపాలను 1008 సార్లు చేసినా, 
చేయించుకున్నా, ఆ సాలగ్రామము యొక్క శక్తి ద్విగుణీకృతమవుతుంది.
సాలగ్రామశిలను షోడశోపచార 
పూజావిధానం ద్వారా అర్చించిన భక్తులకు యావత్‌ కల్పాంతముల వరకు 
వైకుంఠంలో నివసించే భాగ్యం కలుగుతుంది. 
కనీసం సాలగ్రామంకు భక్తిశ్రద్ధలతో 
నమస్కరించి, యథావిధిని పూజిస్తే, మరుజన్మ లేకుండా ముక్తి పొందుతారని ప్రతీతి.

 సాలగ్రామ మును స్మరించినా, దర్శించినా, నమస్కరించినా, సర్వపాపాలు పరిహరింపబడతాయి.

వినయం వివేక లక్షణమ్

శ్రీమద్రామాయణం లోని కథ
పరమాత్ముడైన శ్రీ రామ చంద్రుడు అమిత పరాక్రమశాలి మహావీరుడు ధనుర్విద్యానిపుణుడు. శ్రీ రాముడు బ్రహ్మర్షి అగు వసిష్ఠ మహర్షి వద్ద సకల శాస్త్రములు ధనుర్విద్య అభ్యసించినాడు. గాయత్రీ మంత్రద్రష్ట అగు విశ్వామిత్ర బ్రహ్మర్షి వద్ద బల అతిబలాది విద్యలు మఱియు ఎన్నెన్నో అతి రహస్యములైన అస్త్రములను నేర్చినాడు. ఈ అస్త్రములు కేవలము విశ్వామిత్రులవారికే తెలియును. ఇదియే కాక పరమపూజనీయుడగు అగస్త్య మహర్షి శ్రీ రామ చంద్రునకు దివ్య ధనువు అక్షయ తూణీరము రత్నఖచిత ఖడ్గమును ప్రసాదించెను.

ఒక్క బాణముతో శ్రీ రామ చంద్ర మూర్తి మహాబలశాలియైన తాటకను నేలకూల్చెను
ఒకేమాఱు రెండు బాణములు వదిలి సుబాహు సంహారము చేసి మారీచుని సప్తసముద్రాలకు అవతల పారవేశను
మహాభారవంతమైన శివచాపమును అవలీలగా ఎత్తి ఎక్కుపెట్టిన అది విరిగెను
శ్రీ రాముడొక్కడే ప్రహరార్ధకాలములో (90 min.) ఖర త్రిశిర దూషణాదులను వారి సేనలను సంహరించెను
ఇంత ప్రతాపవంతుడైనప్పటికీ శ్రీ రాముడు ఎప్పుడూ తనకుతానుగా బలప్రదర్శనము చేయలేదు. ఆ దయార్ద్ర హృదయుడు సర్వదా వినయవంతుడై వర్తించెను. దీనికి తార్కాణము సముద్రుని గర్వభంగ ఘట్టము.

శ్రీ రాముని సైన్యము సముద్ర లాంఘనము చేయుసమయము వచ్చెను. సర్వజ్ఞుడైన రాముడు ఉపాయము ఎఱిగియు సహజ వినయవంతుడగుటచే పరమభాగవతోత్తముడైన విభీషణుని సలహా అడిగెను. విభీషణుడు ఇట్లు పల్కెను “ఓ రఘునాయకా! మీ బాణమొక్కటే కోటి సముద్రములనైనను శుష్కింప చేయగలదు. ఐనను సముద్రునే ఉపాయమడుగ ఉత్తమమని నా యోచన”.

రావణుడు తనను వివాహమాడమని హెచ్చరించి సీతమ్మవారికి నెల రోజుల గడువు ఇచ్చెను. భరతుడు పదునాలుగేండ్లపై ఒక్క నిమిషము కూడా శ్రీ రామునికి దూరంగా ఉండజాలక శ్రీ రాముడు ఆలస్యమైన పక్షంలో శరీరత్యాగం చేసెదనని ప్రతిజ్ఞబూనెను. ఈ రెండు కారణముల వలన శ్రీ రాముని వద్ద అప్పటికి పట్టుమని ౩౦ రోజులుకూడాలేవు. ఐనను రఘురాముడు తన బలప్రదర్శనము చేయక వినయముతో సాగరుని ప్రార్థింప నిశ్చయించెను.

శ్రీ రాముడు ఉదధిని సమీపించి సముద్రునకు శిరసా ప్రణమిల్లెను. పిదప తీరమున దర్భలు పరచి ఆ దర్భాసనం పైన కూర్చుని తదేక దృష్టితో సముద్రుని ప్రార్థించెను. ఇట్లు ౩ దివసములు సముద్రునికై ప్రార్థించినను ఆ సముద్రుడు రాడాయె. చివరకు శ్రీ రాముడు “ఈతనికి సామముగా చెప్పిన వినడాయె. ఇటువంటి వారికి దండోపాయయే సరియైనది” అని సముద్రునిపై అస్త్రం సంధించెను. శ్రీ హరి కోపమును భరింపగలవారెవ్వరు? వెంటనే సముద్రుడు ప్రత్యక్షమయ్యెను. అంత దయాళువైన శ్రీ రాముడు సముద్రుని క్షమించి తాను ఎక్కుపెట్టిన అమోఘ బాణము దేనిమీద ప్రయోగింపవలెనని అడిగెను. సముద్రుడు ఉత్తరాన దుష్టులైన కాలకేయ రాక్షసులు ఉన్నారని సూచించెను. అంతట శ్రీ రాముడు ఆ అస్త్రముతో ఆ రాక్షసుల సంహారముచేసి ఆ కాలకేయులుండే పర్వతం ఔషధాలకు నిలయమై ప్రజాహితం చేకూర్చునని ఆశీర్వదించెను.

నామస్మరణం

నవవిధ భక్తిమార్గాల్లో స్మరణం చాలా ముఖ్యమైనది. పరమాత్మతో ఆత్మానుసంధానానికి, భక్తికి నామస్మరణమే కీలకమైనది. దైవ నామస్మరణ వల్ల భక్తుడి హృదయంలో భక్తిభావన వెల్లివిరుస్తుంది. మనసు ప్రశాంతంగా ఉండాలన్నా, నిర్మలత్వం సంతరించుకోవాలన్నా భగవంతుణ్ని స్మరించాలని పురాణాలు చెబుతున్నాయి.

ఈ భారతావనిలో ఎందరెందరో భక్తులు భగవంతుణ్ని స్మరిస్తూ తమ కర్తవ్యాన్ని నిష్ఠతో చేసి జన్మను సార్థకం చేసుకున్నారు.

రామనామం జపిస్తూ హనుమంతుడు సముద్రాన్ని ఆకాశమార్గంలో దాటి లంకానగరం చేరాడు. హరినామ సంకీర్తన చేసిన ప్రహ్లాదుణ్ని ఎన్ని బాధలు పెట్టినా ఏ విధమైన హానీ జరగలేదు. కృష్ణనామస్మరణం చేసిన మీరాబాయికి విషం        అమృతతుల్యమైంది.

ఎంత చెడ్డవాడైనా, అనన్యమనస్కుడైనా తనను ఆరాధించి సేవిస్తే వాణ్ని సజ్జనుడిగానే పరిగణించాలని బోధించాడు శ్రీకృష్ణపరమాత్మ.

ఉత్తమకులంలో పుట్టి, చెడిపోయిన అజామీళుడు ప్రాణావసాన సమయంలో ‘నారాయణ’ పేరును స్మరించినంతనే మోక్షప్రాప్తి కలిగిందంటుంది భాగవతం.

దైవనామ స్మరణ మనిషిలోని మాలిన్యాన్ని క్షాళన చేసి ధర్మమార్గం వైపు నడిపిస్తుంది. సర్వశక్తిమంతుడు, సర్వాధీశుడు అయిన భగవంతుడి నామస్మరణ వల్ల ‘నేను’ అనే అహంకార గోడ అడ్డు తొలగిపోతుంది. మనసు భగవంతుడి పాదపద్మాలపై నిలుస్తుంది.

కర్తవ్యాన్ని నిష్ఠతో ఆచరిస్తూ ప్రాతఃకాలం, సాయంకాలాల్లో ఒక్కసారి భగవత్‌ స్మరణ చెయ్యడం కూడా గొప్పతనమేనని వివరించే కథ ఉంది.

ఒకరోజు నారదుడు వైకుంఠంలో శ్రీమహావిష్ణువు సన్నిధిలో ఉన్నాడు. తనకంటే గొప్ప భక్తుడెవరూ లేరనే అహంకారం నారదుడికి కలిగింది. తానెప్పుడూ నారాయణ నామస్మరణ చేస్తాడు కనుక తానే ఉత్తమ భక్తుడు అనుకున్నాడు. ఆ భావాన్ని మహావిష్ణువు ముందు వ్యక్తీకరించాడు. నీకంటే గొప్పభక్తుడు ఫలానా గ్రామంలో ఉన్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళు అని నారదుడిని పంపాడు విష్ణుమూర్తి. నారదుడు ఆ గ్రామం వెళ్ళి ఆ భక్తుణ్ని చూశాడు. అక్కడ ఒక రైతు తెల్లవారుజామున లేవగానే ‘నారాయణ’ అనుకుని తన పనుల్లో నిమగ్నమయ్యాడు. తిరిగి రాత్రి ‘నారాయణ’ అనుకుని పడుకున్నాడు. రోజుకు రెండుసార్లు మాత్రమే నారాయణ స్మరణ చేస్తున్న ఇతడు గొప్ప భక్తుడా అనుకుని, నారదుడు తాను చూసినది చూసినట్లుగా మహావిష్ణువుకు చెప్పాడు.


అప్పుడు మహావిష్ణువు నారదుణ్ని పరీక్షించదలచి ‘నీకు ఒక నూనెగిన్నె ఇస్తాను. అది పట్టుకుని ఒక్కబొట్టు కిందపడకుండా వైకుంఠం అంతా తిరిగిరావాలి’ అన్నాడు. నారదుడు ఆ గిన్నె తీసుకుని వైకుంఠం అంతా తిరిగి మహావిష్ణువు దగ్గరికి తిరిగివచ్చాడు. ‘నారదా! నువ్వు ఎన్నిసార్లు భగవన్నామం స్మరించావు?’ అని అడిగాడు విష్ణువు. దానికి జవాబిస్తూ నారదుడు ‘గిన్నెలో నుంచి నూనె బొట్టు కిందపడకుండా చూస్తున్నాను. మీ నామాన్ని ఒక్కసారి కూడా స్మరించలేదు’ అన్నాడు. అప్పుడు  నిజమైన భక్తుడెవరో గ్రహించాడు నారదుడు.

భగవంతుడి నామస్మరణ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనే సందేహాలు చాలామందిలో కలుగుతుంటాయి. భగవంతుణ్ని స్మరించడానికి ఎలాంటి నియమాలు లేవు. సర్వకాల, సర్వావస్థల్లోనూ స్మరించుకోవచ్చు. మన పనులు నిత్యం చేస్తూనే శుద్ధ భక్తితో భగవంతుణ్ని స్మరించాలి.

అసలు స్మరణ ఎందుకు చేయాలంటే భగవదనుగ్రహం కోసమే. వార్థక్యంలో మాత్రమే భగవంతుణ్ని స్మరించుకుందాం అనుకోకూడదు. దైవచింతనకు వయసుతో నిమిత్తం లేదు.

Miracle Lakshmi Narasimha stotram

ఈ  స్తోత్రం  రోజూ భక్తితో పటించండి.........
శ్రీ నృసింహ స్వామి వారి ద్వాదశ నామ స్తోత్రం మహా మహిమాన్వితం శక్తివంతం,ఈస్తోత్రాన్ని భక్తిగా పఠిస్తే స్వామివారు మనకు రక్షా కవచంలా ఉండి కాపాడతారు.అతి భయంకర వ్యాధులు రుగ్మతులు నశిస్తాయి,భయంతొలగుతుంది,

 *శ్రీ నృసింహ ద్వాదశ నామ స్తోత్రం.......* 

ప్రథమంతు మహాజ్వాలో ద్వితీయం తు ఉగ్రకేసరీ ।

తృతీయం తు వజ్రదంష్ట్రశ్చ చతుర్థం తు విశారదః ॥

పంచమం నారసింహశ్చ షష్ఠః కశ్యపమర్దనః ।

సప్తమో యాతుహంతా చ అష్టమో దేవవల్లభః ॥

నవమం ప్రహ్లాద వరదో దశమోऽనంత హస్తకః ।

ఏకాదశో మహారుద్రో ద్వాదశో దారుణస్తదా ॥

ద్వాదశైతాని నామాని నృసింహస్య మహాత్మనః ।

మంత్రరాజ ఇతి జ్ఞాతం సర్వపాప వినాశనమ్ ॥

క్షయాపస్మార కుష్ఠాది తాపజ్వర నివారణం ।

రాజద్వారే మహాఘోరే సంగ్రామే చ జలాంతరే ॥

గిరిగహ్వర అరణ్యే వ్యాఘ్ర చోరామయాదిషు ।

రణేచ మరణేచైవ శమదం పరమం శుభమ్ ॥

శతమావర్తయేద్యస్తు ముచ్యతే వ్యాధి బంధనాత్ ।

ఆవర్తయత్ సహస్రం తు లభతే వాంఛితం ఫలమ్ ॥

 ||  *ఓం శ్రీ లక్ష్మి నృసింహాయ నమః. ||*

Importance of Ganesha

వినాయకుడినే.....గణపతి, గణేశుడు, బొజ్జ_గణపయ్య అని పిలుస్తారు. ఆది దేవుడిగా, మొదట పూజలు అందుకునే దేవుడిగా వినాయకుడికి హిందూ సంప్రదాయంలో చాలా ప్రాధాన్యత ఉంది. భక్తులు కోరుకునే సంపద, శ్రేయస్సు అందించే గొప్ప దేవుడు వినాయకుడు. 
హిందూ పురాణాల ప్రకారం.. ఏ పూజ అయినా, ఎలాంటి కార్యమైనా.. ముందుగా వినాయకుడిని పూజించడం ఆనవాయితీ. చాలామంది ఇంట్లో లేదా ఆఫీస్ లో వినాయకుడి విగ్రహం పెట్టుకుంటూ ఉంటారు.

అయితే చాలామందికి ఎలాంటి విగ్రహం లేదా ఎలాంటి ఫోటో లేదా ఏ రంగు విగ్రహం, ఎక్కడ పెట్టుకోవాలి అనే విషయం తెలియదు. సరైన పద్ధతిలో, సరైన వాస్తు ప్రకారం వినాయకుడి విగ్రహం లేదా ఫోటోని పెట్టుకోవడం వల్ల.. పాజిటివ్ ఎనర్జీ మరింత పెరుగుతుంది. ఆ దేవుడి అనుగ్రహం మరింత మిన్నగా ఉంటుంది. సరైన ప్లేస్ లో వినాయకుడి విగ్రహం పెట్టుకుంటే.. సంతోషం, సక్సెస్, సంపద జీవితంలో పొందుతారు. మరి ఎలాంటి విగ్రహం, ఎక్కడ పెట్టుకోవాలో చూద్దామా..

👉#వాస్తు_దోషం..

👉ఇంట్లో వాస్తు దోషంతో బాధపడేవాళ్లు.. వినాయకుడు, స్వస్తిక్ కలిసి ఉండే విగ్రహాన్ని లేదా ఫోటోని ఇంట్లో పెట్టుకోవాలి. అప్పుడు ఎలాంటి వాస్తు దోషమైనా తొలగిపోతుంది.

👉#ఆఫీస్ లో..

ఆఫీస్ లో నిలబడి ఉండే వినాయకుడి విగ్రహాన్ని పెట్టుకోవాలి. ఇలాంటి విగ్రహం వర్క్ ప్లేస్ లో పెట్టుకోవడం వల్ల వర్క్ విషయంలో ఎనర్జీ, ఉత్సాహం పెరుగుతాయి.

👉#కూర్చున్న_వినాయకుడు..

కూర్చుని, తొండం ఆయన ఎడమ చేతివైపు తిరిగి ఉన్న వినాయకుడి విగ్రహం పెట్టుకుంటే.. సక్సస్ తో పాటు, అదృష్టం మీ సొంతమవుతుంది.

👉#సంతోషం..

సంతోషం, ప్రశాంతత, ఐశ్వర్యం పొందాలనుకునేవాళ్లు తెలుపు వర్ణంలోని వినాయకుడి విగ్రహాన్ని లేదా ఫోటోని ఇంట్లో పెట్టుకోవాలి.

👉#పూజ_గదిలో..

మీ పూజ గదిలో కేవలం ఒక వినాయకుడి విగ్రహాన్ని మాత్రమే పెట్టుకోవాలి. రెండు లేదా అంత కంటే ఎక్కువ వినాయకుడి విగ్రహాలను పెట్టుకుంటే.. ఆయన భార్యలైన రిధి, సిద్ధిలకు ఆగ్రహం వస్తుంది.

👉#అభివృద్ధి #పొందాలనుకునేవాళ్లు..

తమలో వృద్ధిని కోరుకునే వాళ్లు, సంపద పెరగాలని కోరుకునేవాళ్లు.. ఎరుపు, ఆరంజ్ కలిసిన (రెడిష్ ఆరంజ్) కలర్ వినాయకుడి విగ్రహాన్ని పూజించాలి.

బ్రహ్మరాత

ఒక మంచి ప్రతిభావంతుడైన ముని వుండేవారు. సకల శాస్త్రాలు, విద్యలు తెలిసినవారు. ఆ ముని భార్య సాక్షాత్తూ అన్నపూర్ణయే. ఆమె శిష్యులను తన కన్నబిడ్డల్లా చూసుకునేది. ఆకలితో ఎవరు వచ్చినా లేదనకుండా వారి ఆకలిని తీర్చేది. అలా, ఒక నాడు ఆ ముని దంపతుల వద్దకు వసంతుడు అనే ఒక అనాథ వచ్చి శిష్యుడిగా చేరాడు. అతడు బాగా చురుకైనవాడు, తెలివైనవాడు కావడంతో, అతనికి గురువుగారు నేర్పించే విద్యలన్నీ ఇట్టే అబ్బేవి.
వసంతుడు కొన్నాళ్ళకే తన గురువుకు తెలిసిన విద్యలన్నీ పూర్తిగా నేర్చేసుకున్నాడు. ఇక అతనికి నేర్పడానికి తనవద్ద ఉన్న జ్ఞానం సరిపోకపోవడంతో, తనకు గురువులైన వారి వద్దకు పంపించి మరీ విద్యాభ్యాసం చేయించాడు. ఆ గురువర్యుడు. అయితే కొన్నాళ్ళకే అతనికి నేర్పడానికి తమవద్ద ఉన్న విద్యలన్నీ పూర్తయ్యాయని ఆ పెద్ద గురువులైన వాళ్ళు కూడా చెప్పారు.

ఇదిలా వుండగా నిండు చూలాలైన గురుపత్ని ప్రసవించే సమయం రావడంతో, వసంతుడు ఆశ్రమంలో అన్ని పనులు తానే చూసుకుంటూ, తల్లితో సమానురాలైన గురుపత్నిని కాలు క్రింద పెట్టకుండా చూసుకుంటున్నాడు. ఆమెకు పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. ఆశ్రమంలోపల ప్రసవం జరుగుతుండగా వసంతుడు గుమ్మం బయటకు వచ్చి కూర్చున్నాడు.

కాసేపట్లో లోపలి నుండి చంటి బిడ్డల ఏడుపులు వినిపించ్చాయి. గురుపత్ని కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఒక మగపిల్లవాడు, ఒక ఆడపిల్ల. ఇంతలో దివి నుండి భువికి దిగివచ్చిన ఒక దివ్యపురుషుడు వడివడిగా ఆశ్రమంలోకి వెడుతూ, గుమ్మం ముందు కూర్చున్న వసంతుడికి కనిపించాడు. మామూలు మనుషులకైతే అతను కనిపించి వుండేవాడు కాదు. కాని వసంతుడు దేవరహస్యాలు కూడా నేర్చుకున్నాడు కాబట్టి ఆ వచ్చిన అతనెవరో ఇట్టే కనిపెట్టేశాడు వసంతుడు.

అతడు ''బ్రహ్మ''. అప్పుడే పుట్టిన పిల్లలకు నొసటి రాత రాయడానికి వచ్చాడని అర్థం చేసుకున్న వసంతుడు ఓపిగ్గా బయట కాచుకుని కూర్చున్నాడు వసంతుడు. బ్రహ్మ బయటకు రాగానే ఆయనకు ప్రణామం చేసి ''స్వామి'' మా గురువుగారి పిల్లల నుదుట ఏమి రాశారో దయచేసి సెలవివ్వగలరు అని వినమ్రపూరితంగా అడిగాడు.

బ్రహ్మ తనను చూడగలిగిన ఈ పిల్లవాడు సామాన్యుడు కాడు అని తెలుసుకొని, వసంతుడు అడిగిన విధానానికి ముచ్చటపడి, ఇతరులకు తెలియజెయ్యరాని రహస్యాన్ని అతనికి చెప్పడానికి నిర్ణయించుకున్నాడు. అప్పుడు ఇలా చెప్పాడు.. నాయనా.. ఈ అబ్బాయి నిరక్షర కుక్షి అవుతాడు. ఇతని జీవితకాలమంతా ఇతని వద్ద ఒక మూట బియ్యము, ఒక ఆవు, ఒక పూరిపాక తప్ప మరిక ఏమీ ఉండవు. ఇతడు రోజంతా కష్టపడినా తన రెక్కల కష్టంతో కనా కష్టంగా పెళ్లాన్ని, పిల్లల్ని పోషిస్తాడు అంతే అన్నాడు.

ఇక ఆ అమ్మాయి మాత్రం వేశ్య అవుతుంది. డబ్బుల కోసం రోజుకో పురుషుడితో సంభోగించే వారకాంత అవుతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు బ్రహ్మ. అది వినిన వసంతుడు నిశ్చేష్టుడయ్యాడు. సాక్షాత్తూ దైవసమానులైన తన గురుదంపతులకి పుట్టిన పిల్లలకు ఇలాంటి రాత రాసాడేమిటా విధాత అని విచారంగా ఆలోచనలో మునిగిపోయాడు.

వెంటనే తన గురువు గారిని బ్రహ్మ రాత మార్చగలమా అని అడిగాడు వసంతుడు. దానికి, ఆయన అది సాధ్యం కాదు నాయనా. అది ఎవ్వరికీ సాధ్యం కాదు అని చెప్పాడు. పిల్లలు పెద్దవాళ్ళయ్యే కొద్దీ వాళ్ళ రాత నిజమవడం వసంతుడికి కనిపించసాగింది. ఆ ఇద్దరికీ చదువులు వంటపట్టడం లేదు.

ఎందరికో విద్యాబుద్ధులు నేర్పిన గురువుగారి పిల్లలు ఇలా అయ్యారేమిటా.. అనే దిగులుతో, వసంతుడికి దేనిమీద ఏకాగ్రత కుదరడంలేదు. దానికి తోడు ఆ పిల్లలిద్దరు వసంతుడి వెంటపడి అన్నయ్య, అన్నయ్య అని తిరుగుతూ వుంటే, అతడికి దుఃఖం మరింత ఎక్కువ కాసాగింది. ఒక రోజు గురువుగారితో చెప్పి, ఆయన అనుమతి పొంది దేశం చుట్టి రావడానికి బయలుదేరి వెళ్ళాడు. ఎన్నో చోట్లకు వెళ్ళి ఎందరో పండితులను కలిసాడు. 
వారందరిని వసంతుడు ప్రశ్నించాడు. బ్రహ్మ రాసిన రాతను మార్చగలమా... దానికి వసంతుడికి అందరు చెప్పిన సమాధానం బ్రహ్మరాత మార్చడం అసాధ్యం. అది ఎవరితరమూ కాదు అని.

అలా అక్కడా ఇక్కడా తిరుగుతూ, తన అన్వేషణను కొనసాగిస్తూ ఇరవై సంవత్సరాలకు పైగా గడిపాడు. అప్పటికి గురువుగారి పిల్లలకు పాతికేళ్ళు వచ్చాయి. వసంతుడికి వాళ్ళు ఎలా ఉన్నారో చూడాలనిపించసాగింది. ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. అప్పుడు అక్కడి పరిస్థితి గురువుగారి కుమారుడి పేరు శంకరుడు అని, ఆ ఊరిలోనే కూలిపని చేస్తున్నాడని, గురువుగారి కుమార్తె పేరు వసంతసేన అని దగ్గరలోని ఒక పట్టణంలో వ్యభిచార వృత్తిలో ఉందని తెలుసుకున్నాడు. తనకు పుట్టిన పిల్లల దుస్థితి చూసి దిగులుతో మంచం పట్టి, గురు దంపతులు మరణించారని కూడా వసంతుడు తెలుసుకున్నాడు.

వసంతుడు బాగా ఆలోచించాడు. ముందు శంకరుడిని వెతుక్కుంటూ వెళ్ళాడు. వసంతుడిని చూడగానే అన్నయ్యా.. అంటూ బావురుమన్నాడు శంకరుడు. చిన్న పూరిపాక, చిరిగిపోయిన దుస్తుల్లో భార్య, ఒక కొడుకు, ఇంట్లో ఎటు చూసినా విలయతాండవం చేస్తున్న కటిక దారిద్య్రం ఇదీ శంకరుడి దుస్థితి. తమ్ముడూ.. నువ్వు బాధపడకు. ఇప్పటి నుండి నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు వసంతుడు. దానికి శంకరుడు, ''సరే అన్నయ్యా.. ఇక నుండి నువ్వు ఎలా చెపితే అలానే చేస్తాను'' అన్నాడు శంకరుడు.

ముందు ఆ ఆవుని తోలుకుని పట్టణానికి వెళదాం పద అన్నాడు వసంతుడు. ఏమి మాట్లాడకుండా ఆవును తోలుకుని వసంతుడిని అనుసరించాడు శంకరుడు. ఇద్దరూ నేరుగా పట్టణంలోని సంత దగ్గరకు వెళ్ళారు. అక్కడ ఒక దళారి దగ్గరకు వెళ్ళి ఈ ఆవుని ఎంతకు కొంటావు అని అడిగాడు వసంతుడు. తరువాత అతను చెప్పిన ధరకు అమ్మేసాడు వసంతుడు. శంకరుడికి ఏమీ అర్థం కాకపోయినా, వసంతుడికి ఎదురు చెప్పలేదు.

ఆవును అమ్మగా వచ్చిన డబ్బుతో వంటకు అవసరం అయిన సరుకులను, శంకరుడి భార్యకు, పిల్లలకు కొత్త బట్టలు కొన్నారు. తిరిగి గ్రామానికి బయలుదేరారు. ఇంటికి రాగానే ఆ సరుకులతో వంట చేయించాడు వసంతుడు. శంకరుడి భార్య, పిల్లలు ఆవురావురుమని తిని ఆకలి తీర్చుకున్నారు. 
తర్వాత వసంతుడు శంకరుడితో తమ్ముడూ అన్నదానం చేద్దాం. ఆకలితో ఎవరు వచ్చినా లేదనకుండా వడ్డించు అని చెప్పాడు. శంకరుడు మారు మాట్లాడకుండా అలాగే చేశాడు. కాని శంకరుడు ఆ రోజు రాత్రి వసంతుడితో, అన్నయ్యా.. ఇంతవరకు ఆ ఆవు వుంది కదా అన్న ధైర్యం నాకు ఉండేది, ఇప్పుడు ఉన్న ఆ ఒక్క ఆధారం కూడా పోయింది. దాన్ని అమ్మగా వచ్చిన ధనం కూడా అన్నదానానికి ఖర్చయిపోయింది. తెల్లవారితే ఎలా గడపాలో అని భయంగా వుంది అని అన్నాడు.

దానికి వసంతుడు తమ్ముడూ.. నువ్వు ఏమీ ఆలోచించకుండా సుఖంగా నిద్రపో, ప్రొద్దునకంతా సర్దుకుంటాయి అని ధైర్యం చెప్పాడు. 
ప్రొద్దున్నే లేచి తలుపు తెరచి బయటికి వచ్చి చూసిన శంకరుడి ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది. శంకరుడి ఇంటిముందు ఒక ఆవు నిలబడి వుంది. శంకరుడి ఆస్తి ఎప్పుడూ ఒక్క ఆవే అని తను రాసిన రాత పొల్లుపోకుండా ఉండడానికి రాత్రికి రాత్రి బ్రహ్మయే స్వయంగా ఒక ఆవుని తీసుకొని వచ్చి అక్కడ కట్టేసాడు. ఆ రోజు కూడా ఆవును తీసుకెళ్ళి సంతలో అమ్మి, వచ్చిన ఆ డబ్బుతో అన్నదానం చేయించాడు వసంతుడు. తమ్ముడూ, ఇక ఇలాగే ప్రతిరోజూ క్రమం తప్పకుండా చేస్తూ ఉండు అని చెప్పి వసంతుడు అక్కడి నుండి వసంతసేనను వెతుక్కుంటూ బయలుదేరాడు. అన్ని దానాల్లోకెల్లా గొప్పదైన అన్నదానాన్ని క్రమం తప్పకుండా చేస్తున్నందున శంకరుడు తన జీవితంలో అనంతమైన పుణ్యాన్ని మూట కట్టుకున్నాడు.

వసంతుడు వాళ్ళని, వీళ్ళని అడుగుతూ వెళ్ళి వసంతసేనను కలుసుకున్నాడు. వసంతసేన ఒక అవ్వతో కలసి ఒక ఇంట్లో ఉంటోంది. ఆమె వసంతుడిని చూడగానే భోరుమని ఏడ్చేసింది. అన్నయ్యా.. నేను మహాపాపిని. ఈ పాపపంకిలంలో కూరుకుపోయాను. మీలాంటి ఉన్నతుడిని చూడటానికి కూడా నాకు అర్హత లేదు అని బావురు మంది. ఊరుకో చెల్లీ.. ఊరుకోమ్మా.. ఈ పాపపు పంకిలం నుండి నువ్వు బయటపడే మార్గం చెబుతాను. ఇక ఇవాల్టి నుండి నేను చెప్పినట్లు చెయ్యి అని ఆమెను ఓదార్చాడు వసంతుడు. దానికి సరే అని ఒప్పుకుంది వసంతసేన.

ఆ రాత్రికి విటులు ఎవ్వరు వచ్చినా లక్ష వరహాలు చెల్లిస్తేనే లోపలికి ప్రవేశం అని చెప్పమని అక్కడ వసంతసేనతో ఉన్న అవ్వకు చెప్పాడు వసంతుడు. ఆమె ఆశ్చర్యపడుతూ అయ్యా.. ఇది జరిగే వ్యవహారం కాదు అని ఏదో చెప్పబోయింది. వసంతుడు ఆమెను మధ్యలోనే వారించి నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్లుగా. ఆ రాత్రి ఇద్దరు, ముగ్గురు విటులు వచ్చి లక్ష వరహాలు అనగానే వెనుదిరిగి వెళ్ళిపోయారు. అది వాళ్ళు ఊహించలేని మొత్తం. కాని అర్ధరాత్రి సమీపిస్తూ ఉంది అనగా ఒక మహాపురుషుడు మాత్రం లక్ష వరహాలతో వచ్చి ఆ రాత్రి వసంతసేనతో గడిపి వెళ్ళాడు.

ఆ మరుసటిరోజు రాత్రి కూడా అలాగే జరిగింది. తన రాత తప్పకూడదని, లక్ష వరహాలు ఇచ్చి వసంతసేనతో సంభోగించింది సాక్షాత్తూ ఆ బ్రహ్మే నని వసంతుడికి తెలుసు. అలా బ్రహ్మ సంభోగం వలన అప్పటివరకు ఆమె మూటగట్టుకున్న పాపాలన్నీ పటాపంచలయ్యాయి. ఆమె జన్మ చరితార్థమైంది. అలా వసంతుడు వాళ్ళిద్దరి చేత పుణ్యకర్మలు చేయించి, గురుదంపతుల రుణం తీర్చుకున్నాడు. 

ఈ ప్రపంచంలో ప్రతి జీవి నుదుట తలరాత రాసేది బ్రహ్మే అయినా దానిని చక్కగా తీర్చిదిద్దుకునే శక్తిని, అవకాశాన్ని మాత్రం ప్రతి జీవికి ఇచ్చాడు అని గ్రహించాడు, దానిని నిరూపించాడు. అలా బ్రహ్మ రాతను సైతం బ్రహ్మాండమైన రాతగా మార్చి చూపాడు వసంతుడు...

|| ఓం నమః శివాయ ||

Thursday, June 18, 2020

మహాయోగి శ్రీ త్రైలింగ స్వామి

*అమృతస్య పుత్రాః*

పుట్టింది తెలుగు దేశంలో అయినా, ఆయన గడిపిన కాలమంతా కాశీలోనే. ఆయన చూపించిన మహిమలు అపారం. వారు పొందిన సిద్దులనేకం. వారి దివ్య విభూతి అనంతం. ఆయనే త్రైలింగ స్వామి. అసలు పేరు శివరామయ్య. విశాఖపట్నం జిల్లా విజయనగరం దగ్గరలో హాలియా గ్రామంలో జన్మించారు. తండ్రి నరసింహారావు, తల్లి విద్యావతి, సంపన్న బ్రాహ్మణ కుటుంబం. 

ఆయన జననం 19-12-1607. తల్లి పూజ చేసుకొంటుంటే శివలింగం నుంచి వింత కాంతి ఈ బాలుడిమీద పడటం ఆమెచూసి యోగ్యుడవుతాడు అనుకొన్నారు. చిన్నప్పటి నుంచి ఐహిక వాంఛల మీద కోరిక లేదు. నలభై ఏళ్ళకు తండ్రి, యాభై రెండో ఏట తల్లి చనిపోయారు.స్మశానాన్నే ఇల్లుగా చేసుకొని ఆస్తిని అంతా సవతి తమ్ముడు శ్రీధరుడికి ఇచ్చేసి, అక్కడే ఇంకో ఇరవై ఏళ్ళు గడిపాడు.

స్వగ్రామం వదిలి పాటియాలా సంస్థానంలో బస్తర్ చేరాడు. అక్కడ భాగీరధి స్వామితో పుష్కర తీర్ధానికి వెళ్ళాడు. ఆయన దీక్షను ఇచ్చి గణపతి స్వామి అనే దీక్షా నామం ఇచ్చాడు. అప్పటికి అయ్యగారి వయస్సు డబ్భై ఎనిమిది. గురు సమక్షంలో పదేళ్ళ సాధన చేసి, అద్భుత శక్తుల్ని సంపాదించుకొన్నాడు. గురువు మరణించిన తర్వాత తీర్థ యాత్రలు చేస్తూ రామేశ్వరం చేరాడు. 

అక్కడ స్వంత ఊరివారు కనిపించి ఇంటికి రమ్మని కోరినా వెళ్ళలేదు. రామేశ్వరంలో ఒక బ్రాహ్మణ బాలుడు చనిపోతే శవాన్ని తీసుకొని వెళ్తూ తలిదండ్రులు విలపిస్తుంటే, గుండె కరిగి కమండలం లోని నీరు వాడిమీద చల్లాడు. వెంటనే బాలుడు బ్రతికి అందర్నీ ఆశ్చర్యపరచాడు. ఆయన మహత్తు అందరికి తెలిసి సాక్షాత్తు శ్రీరామ లింగేశ్వరుడే గణపతి స్వామి అనుకొన్నారందరూ. అక్కడి నుండి నేపాల్ చేరాడు. అక్కడ అడవిలో తపస్సు చేస్తుంటే ఒక పులి వచ్చి ఆయనకు ఎదురుగుండా కదలకుండా కూచునిపోయింది. 

రాజుగారి బంధువు ఈ దృశ్యాన్ని చూసి చకితుడైనాడు. పులిని చంపటానికి ప్రయత్నిస్తే వారించాడు. ఆయన రాజుకు ఈ విషయం చెప్పాడు. నేపాల్ రాజు వచ్చి సాష్టాంగ పడి అనేక కానుకలిస్తే, తీసుకోకుండా జంతు హింస చేయవద్దని హితవు చెప్పాడు స్వామి. అక్కడి నుంచి టిబెట్, తరువాత మానస సరోవరం సందర్శించి, దారిలో ఎన్నో అద్భుతాలను చూపి, హిమాలయాలలో చాలాకాలం తపస్సు చేసే నర్మదా నదీ తీరంలో, మార్కండేయ ఆశ్రమంలో ‘ఖలీ బాబా” అనే అహోరాత్రాలు తపస్సు చేసే యోగిని దర్శించాడు. ఒకరోజు తెల్లవారు జామున నర్మదా నదిలో పాలు ప్రవహిస్తున్నట్లు, ఈ స్వామి దాన్ని తాగుతున్నట్లు ఖలీ బాబా చూశారు. గణపతిలోని మహిమేమిటో గ్రహించారు. 
విషయం తెలిస్తే ఆయన ఇక అక్కడ ఉండరు. 

1733లో ప్రయాగ చేరారు. తపో నిష్టలో ఉండగా ఒకసారి కుంభ వృష్టి కురుస్తోంటే శిష్యుడు రామ తరణ భట్టాచార్య ఆశ్రమంలోకి పోదామని చెప్పినా కదలలేదు. దూరంలో ఒక పడవ మునిగిపోతోందని దాన్ని రక్షించాలని సంజ్న చేశారు. అతడు అక్కడికి వెళ్ళే లోపున పడవ మునుగుతుంటే దిగంబర స్వామి అక్కడ పడవ మీద చేరి దాన్ని రక్షించాడు. శిష్యుడు ఆశ్చర్యం ప్రకటించగా ప్రతి వాడిలోను మహాశక్తులు అజ్ఞాతంగా ఉంటాయని వాటిని గుర్తించే వారు తక్కువ అని తెలిపారు. 

1737లో కాశీ చేరారు దిగంబర గణపతి స్వామి. అప్పటికి ఆయనకు 130 ఏళ్ళు. కాశీలో 150 యేళ్ళు గడిపారు. ఆయనది 300 పౌన్ల బరువైన భారీ విగ్రహం. గడ్డాలు, మీసాలు పెరిగి దీర్ఘ శరీరంతో దిశ మొలతో, మెడలో పెద్ద రుద్రాక్ష మాలతో, పెద్దబాన పొట్టతో కాశీ నగర వీధుల్లో సంచరించేవాడు. గంటలసేపు గంగా జలంపై పద్మాసనంలో తేలి ఉండేవాడు. అలాగే గంటల కొద్దీ కాలం నదీ గర్భంలో మునిగి ఉండేవాడు. అంటే కుంభక విద్యలో అద్భుతమైన నేర్పు ఉండేదన్న మాట... కుష్టు రోగులకు సేవ చేసి వారిని ఆదరించాడు బాబా. 

వేద వ్యాస ఆశ్రమం చేరి, అక్కడ సీతానాథా బందోపాధ్యాయుని క్షయ వ్యాధి పోగొట్టి, హనుమాన్ ఘాట్ చేరాడు.ఒక మహారాష్ట్ర స్త్రీ రోజు విశ్వేశ్వరుడి అభిషేకం చేసి వస్తు ఈ దిగంబర స్వామిని రోజు చూస్తూ ఏవగించుకొనేది. ఆమె భర్తకు రాచ పుండు. ఆమెకు అందరు దిగంబర స్వామిని అర్ధించమని కోరారు. కానీ తాను తూల నాడిన ఆయన దగ్గరకు వెళ్ళటానికి సందేహించింది. చివరికి వెళ్లి కాళ్ళమీద పడింది. ఆయన ఇచ్చిన విభూతితో జబ్బు మాయమైంది.

కాశీ మహానగరంలో ఎందరో తెలుగువారు ఉపాధ్యాయులుగా, అధ్యాపకులుగా ఉన్నారు. వారు ఈ దిగంబర స్వామి తెలుగు వాడని గుర్తించారు. ఆయనకు "త్రైలింగ స్వామి” అనే పేరు పెట్టారు. తెలుగు దేశం అంటే త్రిలింగ దేశమే కదా. అప్పటి నుంచి ఆ పేరే స్థిరపడిపోయింది. 1800లో తన మకాంను దశాశ్వ మేధ ఘాట్ నుండి బిందు మాధవంకు మార్చారు. ఎప్పుడూ మౌనమే, ధ్యానమే, తపస్సు, యోగ సమాధే. కనుకే ఆయన్ను “మౌన బాబా” అన్నారు. 

కాశీరాజు వీరిని తన పడవలోకి ఆహ్వానిస్తే వెళ్ళారు. రాజు బ్రిటిష్ వారు బహుమతిగా ఇచ్చిన కత్తిని స్వామి చూడాలని ముచ్చటపడితే ఇచ్చారు. అది పొరపాటున గంగలో జారిపడిపోయింది. రాజుకు కోపం వచ్చి తిట్టాడు. స్వామి తన చెయ్యి గంగా నదిలో పెట్టి ఒకే రకంగా ఉండే రెండు కత్తులను తీసి అందులో రాజుదేదో గుర్తించి తీసుకోమన్నాడు. రాజు గుర్తించ లేకపోతే తానే గుర్తించి చెప్పి ఇచ్చాడు. రెండోదాన్ని గంగలోకి విసిరేశారు స్వామి..

దిగంబరంగా తిరగటం కొంతమందికి
నచ్చక కేసు పెట్టరు. కోర్టులో కేసు నడిచింది. ఆయన్ను బంధించి తీసుకొని రమ్మని మేజిస్ట్రేట్ ఆర్డర్ వుశాడు. అలాగే గబ్బిట దుర్గాప్రసాద్ తెచ్చారు. ఈయన మహిమలను అధికారులు ఆయనకు వివరించారు. ఆయన తాను తినే మాంసం స్వామి తింటే శిక్షించను అన్నాడు అన్నాడు. స్వామి సైగలతో తాను తినే దాన్ని మేజిస్ట్రేట్ తింటారా అని ప్రశ్నించాడు. వెంటనే తన చేతిలో మల విసర్జన చేసుకొని నోట్లో వేసుకొని తినేశారు. మతి పోయింది మేజిస్ట్రేట్ కు. అయితే సుగంధ పరిమళం కోర్టు అంతా వ్యాపించింది. స్వామి మహిమ తెలిసి దిగంబరంగా తిరిగే హక్కు ఇచ్చాడు. 

ఒకసారి ఒక ఆకతాయి ఆయన బజారులో వెళ్తుంటే మర్మాంగాన్ని గుంజాడు. అది కొన్ని గజాలు సాగింది. వాడు భయపడి పారిపోయాడు. దుండగులు కొందరు సున్నపు తేట ఇచ్చి పాలు అని చెప్పారు. శుభ్రంగా తాగేశాడు స్వామి. వెంటనే మూత్ర రూపంలో దాన్ని అంతట్ని విసర్జించాడు. 

శ్రీరామ కృష్ణ పరమహంస 1868లో కాశీ వచ్చినప్పుడు తన మేనల్లుడు హృదయనాథ్తో కలిసి మౌనస్వామిని దర్శించారు. ఆయనకు బాబా నశ్యం వేసుకొనే కాయ కానుకగా ఇచ్చారు. స్వామిని “నడయాడే విశ్వనాథుడు” అని చెప్పారట పరమహంస.ఇంకోసారి అర్ధమణుగు పాయసం వండించి తీసుకొని వెళ్లి స్వామికి అందించి తినిపించారట. పరమహంస స్వామిని "ఈశ్వరుడు ఏకమా అనేకమా” అని ప్రశ్నిస్తే - సమాధి స్తితిలో ఏకం అనీ, వ్యావహారిక దృష్టిలో అనేకం అని సైగలతో చెప్పారు స్వామి. పరమహంస, స్వామిని తన ఆశ్రమానికి ఆహ్వానించి సత్కరించారు. ఇద్దరూ మహా పురుషులే. పరమహంసలే ఒకరి విషయం రెండో వారికి తెలుసు. ఎన్నో అద్భుతాలు చేసిన రామకృష్ణులు స్వామిని అంతగా గౌరవించారంటే బాబా ఎంత మహిమాన్వితుడో తెలుస్తోంది. 

ఒకసారి రాజఘాట్ నుండి విద్యానంద స్వామి అనే యతి వీరిని దర్శించటానికి కేదార్ ఘాట్లో ఉన్న మన స్వామి దగ్గరకు వచ్చారు. ఇద్దరు గాఢంగా ఆలింగనం చేసుకొన్నారు. కాసేపట్లో అందరు చూస్తుండగానే ఇద్దరు మాయమైనారు. అరగంట తర్వాత స్వామి తిరిగి వచ్చారు. తాను ఆయన్ను రాజ ఘాట్లో దింపి వచ్చాను అని స్వామి అందరి సందేహాల్ని తీర్చారు.

పంచగంగా ఘట్టంలో చిన్న భూగృహం నిర్మింప జేసుకొని 32 ఏళ్ళు సేవ చేసి, ఆయన విగ్రహాన్ని చేయించాలని రెండునెలల గడువు కావాలని కోరితే, మరణాన్ని వాయిదా వేసుకొని, భక్తుడైన మంగళదాస్ కోర్కె తీర్చి భూగృహం చేరి ఉదయం ఎనిమిది నుండి మధ్యాహ్నం మూడు వరకు యోగ సమాధిలో ఉండి, తానే బయటకు వచ్చి భక్తుల హారతులు అందుకొని యోగాసనంలో కూర్చుండి, బ్రహ్మ రంధ్రాన్ని ఛేదించుకొని 26-12-1887న సర్వజిత్ సంవత్సర పుష్య శుద్ధ ఏకాదశి సోమవారం త్రైలింగ స్వామి తమ ఇహ జీవితాన్ని చాలించు కొన్నారు. 

ఆయన శరీరాన్ని చెక్కపెట్టెలో పెట్టి ఆయన కోరిన విధంగానే తాళం వేసి అసి నది నుండి వరుణ నది దాక ఊరేగించి గంగా నదీ ప్రవాహంలో వదిలారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కాశీ విశ్వేశ్వరునికి ఎలా నిత్యం అభిషేకం, పూజా జరుగుతాయో స్వామి విగ్రహానికి కూడా కేదార్ ఘాట్లోన మఠంలో జరగటం విశేషం. పతంజలి యోగంలో విభూతి పాదంలో చెప్పిన అణిమాది అష్ట సిద్ధులు, కుంభక యోగంలో త్రైలింగ స్వామి సిద్ధింప జేసుకున్నారు. ఆయన సంస్కృతంలో రాసిన “మహా వాక్య రత్నావళి”కి వ్యాఖ్యను బెంగాలిలో రాశారు. కాని మన తెలుగు వారి దృష్టి ఇంకా దానిపై పడకపోవటం విచారకరం అంటారు బాధతో బి. రామరాజు గారు. (ఆంధ్ర యోగులు రచయిత). 

280 సంవత్సరాలు జీవించి, స్వచ్చంద మరణాన్ని పొంది, యోగ సిద్దులలో త్రివిక్రములై ఆశ్రిత జన కల్పవృక్షమై మౌన ముద్రాలన్కారులై తెలుగువారై ఉండి ఉత్తర దేశంలో, అందులోను కాశీ మహా క్షేత్రంలో బ్రహ్మ రధం పట్టించుకొన్న త్రిలింగ యోగి నామ ఉచ్చారణ చాలు మనం తరించటానికి.

Monday, June 15, 2020

Sucide is not the Educational stress

Don't teach them how to live an easy life teach them a difficult one so that they will always b prepared.
To all parents......

There was a very brilliant boy, he always scored 100% in Science.

Got Selected for IIT Madras and scored excellent in IIT.

Went to the University of California for MBA.
Got a high paying job in America and settled there.

Married a Beautiful Tamil Girl.

Bought a 5 room big house and luxury cars.
He had everything that make him successful but a few years ago he committed suicide after shooting his wife and children.

WHAT WENT WRONG?

California Institute of Clinical Psychology Studied his case and found “what went wrong?”

The researcher met the boy's friends and family and found that he lost his job due to America’s economic crisis and he had to sit without a job for a long time. 

After even reducing his previous salary amount, he didn't get any job. 

Then his house installment broke and he and his family lost the home. 

They survived a few months with less money and then he and his wife together decided to commit suicide. 

He first shot his wife and children and then shot himself.

The case concluded that the man was Programmed for success but he was not trained for handling failures.

Now let's come to the actual question.

What are the habits of highly successful people?

First of all, I want to tell you that if you have achieved everything, there is a chance to lose everything, nobody knows when the next economic crisis will hit the world. 

The best success habit is getting trained for handling failures.

I want to request every parent, please do not only program your child to be successful but *"teach them how to handle failures** and also teach them proper lessons about life. 

Learning high-level science and maths will help them to clear competitive exams but a knowledge about life will help them to face every problem.

Teach them about how money works instead of teaching them to work for money. 

Help them in finding their passion because these degrees will not help them in the next economic crisis and we don’t know when the next crisis will hit the world.

"Success is a lousy teacher. Failure teaches you more."