Monday, April 27, 2020

The Cosmic Rebels

Since ancient times the sages have advised their students to know themselves and to ask, “Who am I?” Self-observation is possible for us because we are self-conscious beings. 
We know that we exist and we can reflect on our life. The self-consciousness differentiates us from the animal. Animals are in a dreamlike state. 

Some animal species that live in closer contact with humans can also develop mind. In minerals, plants and the majority of the animals, however, the mind, called Manas in Sanskrit, has not yet awakened. 

Through the awakening of Manas, man has grown from being guided by instinct to an individual. He slowly develops from an individual to a personality and from there to soul consciousness.

The unfoldment of the core of his being happens through the presence of high beings who have given to man the fire of mind. 

Since eons they are sending their light rays so that the blossom of human awareness unfolds. This blossom is also called the egoic lotus, the lotus of our soul.

There are different legends and allegorical narrations which explain the awakening of the mind. 

The story of the Fallen Angels contains in its esoteric meaning the key to the secrets of human consciousness in the same way as the eastern allegories of the Kumaras or Agnishvattas, the Solar Angels. 

It depends on our subtle understanding how far the teachings disclose themselves to us. 

Thus, the Greek legend of Prometheus, who brought man the fire from the gods, resembles the story of the awakening of self-consciousness through the Kumaras which we want to study here.

There are four Kumaras who were born out of the Creator at the beginning of creation. 

A fifth Kumara, Narada, later joined them as the teacher of the beings. The Kumaras are called the Sons of Mind, of the creative mind principle. They had been perfect beings already in the previous creation. 

The Kumaras came at the beginning of this creation, not to learn something more, but to help, especially the human beings. 

They are pure beings who are symbolically represented as five-year-old boys or as eternal youths of 16 years. 

The Puranas describe that Brahma, the Creator, asked them to co-create with him. 

But they refused, for they knew that they had another task. Brahma got angry and cursed them to descend to earth. Because of their disobedience they are also called the cosmic rebels.

Their disobedience had a purpose which Brahma did not know. They said, “The forms into which we are to move are not yet suited for us.” 

They refused to let their fire flow downwards and to stimulate beings for procreation. 

Therefore, they are also called Agnishvattas, those who have put off the procreative fire. Their flames are always directed upwards, to the origin. 

Thus, they are also described as innocent youths because impressions do not stick to their virginal pure mind. 

Though they were perfect beings of the most sublime worlds, they didn’t refuse to descend into the dense matter because this is precisely what they wanted.

గార్గి పండితురాలు

వేదవిద్యలో విదుషీమణి "గార్గి"
గార్గి పండితురాలు, బ్రహ్మజ్ఞాని. యాజ్ఞవల్క్యుడు అనే మహర్షితో వాద ప్రతివాదాలు చేసిన మహామనీషి ఆనాడూ, ఈనాడూ ఉపనయనం చేసుకోవటం పురుషులకే పరిమితం. అటువంటిది పురుషులతో పాటు సమంగా గార్గి కూడా ఉపనయనం చేసుకుంది. జందెం వేసుకుంది శాస్త్ర చర్చ చేసింది. మిధిలా నగర రాజైన జనకుని సభలో ఆస్థాన పండితురాలిగా ఎంతో పేరు తెచ్చుకుంది. సృష్టికి మూలమైన పరబ్రహ్మ గురించి మాట్లాడింది. యాజ్ఞవల్క్యుని ముప్పుతిప్పలు పెట్టింది. 

పురుషులకు స్త్రీలు ఎందులోనూ తీసిపోరని ఋజువు చేసింది. ఆది శంకరాచార్యులనూ ఇలాగే ఓ వనిత ఓడించింది. గార్గి కథ బృహదారణ్యక ఉపనిషత్తులో ఉంది. పూర్వం వాచక్ను అనే ఓ మహర్షి ఉండేవాడు. ఆయన కుమార్తె గార్గి అందానికీ, ఆత్మ స్థైర్యానికీ, పాండిత్యానికీ పెట్టింది పేరుగా ఉండేది. గార్గిని వాచక్ను మహర్షి గొప్ప పండితురాలిగా తీర్చిదిద్దాలనుకున్నాడు. తన ఆశ్రమానికి వచ్చే ఎందరెందరో పండితులతో ఆమెకు కావలసిన విద్యనంతటినీ నేర్చుకొనేలా చేశాడు. వేదాంత విద్యలో ఆమెను గొప్పగా తీర్చిదిద్దాడు. గార్గి విద్యా ప్రాభవం మెల్లమెల్లగా అందరికీ తెలిసింది. ఎక్కడన్నా గొప్ప గొప్ప వేదాంత సభలు జరిగినప్పుడుకూడా ఆమె వెళుతూ ఉండేది.
ఓ రోజున జనక మహారాజు ఓ గొప్ప సభ చేశాడు. ఆ సభకు ఎందరెందరో ప్రముఖులు వచ్చి వేదాంత చర్చలు జరిపారు. అదే సభకు గార్గి కూడా వెళ్ళింది. ఆ సభలో జనక మహారాజుకు ఓ ఆలోచన వచ్చింది. అంతమంది వేదాంత వేత్తల్లో బ్రహ్మవేత్త ఎవరో తెలుసుకోవాలనుకున్నారు. అలా బ్రహ్మవేత్త అయిన వ్యక్తికి బంగారు ఆభరణాలతో అలంకరించిన చక్కటి వేయి గోవులను బహూకరిస్తానని కూడా ప్రకటించాడు జనకుడు. ఆ ప్రకటన విని యాజ్ఞవల్క్య మహర్షి తానే బ్రహ్మవేత్తనని, ఆ గోవులను తనకే ఇమ్మని అన్నాడు. ఆ సభలో ఉన్న అశ్వలుడులాంటి రుషులు యాజ్ఞవల్క్యుడిని నీవు ఎలా బ్రహ్మవేత్తవో వివరించి చెప్పు అని అన్నారు. కానీ యాజ్ఞవల్క్యుడి ముందు ఎక్కువ సేపు నిలబడలేక పోయారు. అంతలో గార్గి లేచి ధైర్యంగా ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ ప్రశ్నలడిగిన తీరు ఆమె వేదాంత పటిమకు గీటురాళ్ళయ్యాయి. దాంతో ఆ రోజు నుంచి గార్గి గొప్పతనం మరింతగా అందరికీ తెలిసింది.
గార్గి తన కడుపున పుట్టి అంత గొప్పదైనందుకు వాచక్ను మహర్షికి ఎంతో ఆనందం కలిగింది. అయితే ఆమె యవ్వన దశను దాటిపోతున్నా వివాహానికి మాత్రం సుముఖంగా లేకపోవటంతో ఎంతో బాధపడ్డాడు. తన కుమార్తె గొప్ప విద్యావతి అని పేరు తెచ్చుకోవాలనుకున్నాడు కానీ, పెళ్ళి లేకుండా బ్రహ్మచారిణిగా ఉండిపోవాలని అనుకోలేదు.
అలాంటి రోజుల్లో ఓ రోజున నారద మహర్షి ఆమె దగ్గర కొచ్చి స్త్రీ వివాహమాడాల్సిన అవసరాన్ని గురించి వివరించి చెప్పాడు. వివాహమైతే తప్ప ఆమె కావాలనుకుంటున్న ముక్తి సాధించటానికి అర్హత లభించదన్నాడు. అప్పుడు ఆలోచనలో పడింది గార్గి. తగిన వరుడి కోసం అన్వేషిస్తుంటే శృంగవంతుడు అనే ఒక ముని కనిపించాడు. అతడిని తనకు తగిన వరుడిగా భావించిన గార్గి వివాహానికైతే సమ్మతించింది కానీ, ఒక్క రోజుకు మించి తమ గృహస్థ జీవితం ఉండబోదని, రెండో రోజున సన్యాస దీక్షను తీసుకుని వెళ్లిపోతానని అంది. ఆమె అలా అనటం చూసిన కొందరు పెళ్ళి అయ్యాక ఈ ఆలోచన మానుకుంటుందిలే అనుకొన్నారు. పెళ్ళి అయింది. ఒక రోజు గడిచింది. ముందుగా అనుకొన్న మాట ప్రకారం తాను విడిపోబోతున్నానని గ్రహించి ఆమెకు నచ్చజెప్పటానికి ప్రయత్నం చేశాడు శృంగవంతుడు. కానీ ఆమె మనస్సు మార్చుకోలేదు. ఇహలోక సుఖాల కోసం పాకులాడక, ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోక తాను పొందాలనుకున్న ముక్తిమార్గం వైపు నడిచింది. వేదాంతసారం తెలిసిన మహోన్నత మనిషిగా చరిత్రలో నిలిచిపోయింది.

Sunday, April 26, 2020

Gautama Buddha

గౌతమ బుద్ధుడు పుట్టినప్పుడు ఆయన తండ్రి ఆస్థాన పురోహితులతో ఆయన జాతకం చూడమని అడిగితే...
వాళ్లు చెప్పడానికి మొదట భయపడ్డారు.
తర్వాత ఇలా చెప్పారు.

గౌతమ బుద్ధుడు అయితే లోకానికి అంతటికీ రాజవుతాడు లేకపోతే బిచ్చగాడు అవుతాడు అని...
కానీ ఒక సలహా ఇచ్చారు...
అతను బిచ్చగాడు కాకుండా ఉండాలి అంటే...
అతనిని బయటకు రాకుండా...
ఎలాంటి కష్టాలూ అతని కంట పడకుండా చూసుకోవాలని...
అతని తలరాతను మార్చడానికి ప్రయత్నించారు.
అలాంటి భవిష్యత్ గురించి తెలిసే గొప్ప మేధావులు కూడా తలరాతను మార్చడానికి ప్రయత్నిస్తుంటారు ఒక్కొక్కసారి...
కానీ వాళ్లకు కూడా తెలుసు అది ప్రయత్నం మాత్రమే అని...
మనిషి ఆశావాది...
తలరాతని కూడా మార్చడానికి ప్రయత్నిస్తుంటాడు...
కానీ విధి రాతే తధ్యమని చివరికి ఒప్పుకుంటాడు...
ఎన్ని విధాల రాజభవనంలో పెట్టి గౌతముని బయటకు కనబడకుండా పెంచినా కూడా...
ఎలాంటి కష్టం తెలియకుండా పెంచినా...
ఆయన తండ్రి పోయిన తర్వాత బయటకు రాక తప్పలేదు...
సమయం వచ్చినప్పుడు ఎలాంటి వారైనా బయటకు రావాల్సిందే...
అదే విధి లీల...
ఏదైనా గుప్పెట్లో ఉన్నంతవరకే...
గుప్పెట తెరిస్తే ఏదీ ఉండదు...
అదే సత్యం...
ఎప్పుడైతే ఆ సత్యాన్ని చూశాడో...
వెంటనే అన్నీ వదిలేసుకున్నాడు...
ఎవరైనా కూడా అంతే సత్యాన్ని తెలుసుకోవాలి...
ప్రతీ విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి...
ఎప్పుడైతే అలా ప్రయత్నిస్తామో మనకు తెలియకుండానే సత్యాన్ని తెలుసుకుంటాం...
అందులో ప్రధాన మార్గం ధ్యానం...
ఎప్పుడైతే ధ్యానం చేయడం మొదలు పెట్టామో...
మనం ప్రశాంతతను పొందుతాం...
అప్పుడు మన అసలైన కర్తవ్యం ఏంటన్నది తెలుస్తుంది...
కనీసం కొద్ది సేపైయనా రోజూ ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలి...
సర్వేజనా సుఖినోభవంతుః...

శ్రీ మహాభారతం

 శ్రీ మహాభారతంలో కథలు - తారకాసురుడి కొడుకులు
తారకాసురుడి కొడుకులు విద్యున్మాలి, తారకాక్షుడు, కమలాక్షుడు, అనే వాళ్ళు బ్రహ్మదేవుణ్ణి గురించి తపస్సు చేశారు. ఆయన ప్రత్యక్షమయ్యకా, తమకు ఎన్నడూ చావు లేకుండా వరమిమ్మని కోరారు. అది అసాధ్యమన్నాడాయన. మరేదైనా వరం కోరుకొమ్మన్నాడు.
"అయితే సకల సౌకర్యాలూ కలిగి కామగమనం గల మూడు పట్టణాలు మా ముగ్గిరికీ ఇవ్వు. అవి దేవదానవాదులెవరూ భేదించరానివిగా ఉండాలి. అలా అయితే మేము సుఖంగా వుంటాం" అన్నారు వాళ్ళు.
"సరే ! అలాగే ఇస్తాను. కాని ఆ మూడు పట్టణాలూ ఒక్కచోటికి రాకూడదు. తీరా వచ్చాకా బలవంతుడెవడైనా అది చూసి బాణం వేస్తే మాత్రం అవి నాశనమవుతాయి. అలా రాకుండా జాగ్రత్తపడండి" అన్నాడు బ్రహ్మ దేవుడు.
"అలాగే" అని ఆ వరం పొందారు వాళ్ళు.

తరువాత మయుణ్ణి పిలిచి పురాలు నిర్మించవలసిందన్నారు. అతడు తన తపస్సంతా ధారపోసి, నాలుగుదిక్కులూ నూరేసి యోజనాలుండేట్టుగా ముగ్గురికీ మూడు పట్టణాలు నిర్మించాడు. ఒకటి బంగారుది, రెండవది వెండిది, మూడోది ఇనుముతో చేసినది. తారకాక్షుడికి బంగారు పట్టణం ఇచ్చాడు. అది స్వర్గంలో సంచరిస్తుంది. కమలాక్షుడికి వెండి పట్టణం ఇచ్చాడు. అది అంతరిక్షంలో తిరుగుతుంది. ఇనుపనగరును విద్యున్మాలికిచ్చాడు. అది భూమిమీద తిరుగాడుతుంది. అలా ఆ రాక్షసులు ముగ్గురూ సకల భోగాలు అనుభవిస్తూ అంతటితో తృప్తి పడక ముల్లోకాలనూ స్వాధీనపర్చుకున్నారు. మయుడు తన మాయాజాలంతో వాళ్ళకు కావలసినవన్నీ సమకూరుస్తుండేవాడు. ఇలా చాలా ఏళ్ళు గడిచిపోయాయి. తారకాక్షుడికి 'హరి' అనే కొడుకు పుట్టాడు. అతడు కూడా బ్రహ్మదేవుణ్ణి గురించి తపస్సు చేసి , ' త్రిపురాల్లో వున్న రక్కసులు ఒకవేళ ఆయుధాల వల్ల చనిపోతే వాళ్ళను నీళ్ళలో పడేసిన వెంటనే ఒక్కడు పదిమందై అమిత బలంతో లేచి రావాలి. అలాంటి బావులు ఆ మూడు పట్టణాల్లోనూ వుండేటట్టు వరమివ్వు. వాటిలో నీళ్ళు నిరంతరం వుండలి ' అని వరమడిగాడు. బ్రహ్మ సరేనని వరమిచ్చాడు.

అంతటితో వాళ్ళ ఆగడాలు పెచ్చుమీరాయి. ముల్లోకాలనూ వేధించడం మొదలు పెట్టారు. దేవేంద్రుడు తట్టుకోలేక బ్రహ్మ దగ్గరకు వెళ్ళాడు. బ్రహ్మ పరమేశ్వర సన్నిదికి చేరాడు. అంతా విని పరమేశ్వరుడు " ఆ రాక్షసులు చాలా బలవంతులు. నా ఒక్కడి చేత చెడరు. అందుచేత నా తేజోబలాల్లో సగం తీసుకుని మీరందరూ కలిసి వాళ్ళను సంహరించండి" అన్నాడు.
"మహాత్మా! అది మా వల్ల కానిపని. నీ తేజస్సును మేము భరించలేం, అందుచేత మా అందరి తేజోబలాల్లో సగం సగం నీకే ఇస్తాం. నువ్వే ఆ శత్రువుల్ని సంహరించు' అని దేవతలు ప్రార్థించారు.

"సరే! అలాగే కానివ్వండి. నేను వాళ్ళను సంహరిస్తాను. కాని ఒక్క విషయం గుర్తుంచుకోండి. లోకాలన్నిటికీ పశుత్వం సహజం - నాకు పశుపతిత్వం కలగాలి. అలా అయితే పశువుల్ని చంపినా పాపం వుండదు. దివ్య రథం తయారుచేయండి. దానికి తగిన సారధినీ, విల్లమ్ములనూ తీసుకురండి" అన్నాడు శివుడు. తమకందరికీ పశుత్వం కలగడాన్ని గురించి దేవతలు విచారిస్తుంటే వాళ్ళ మనస్సు గ్రహించి "భయపడకండి! పాశుపతవ్రతం చేస్తే పశుత్వం పోతుంది" అని అభయమిచ్చాడు శివుడు. అప్పుడు దేవతలంతా తృప్తి పడి పరమేశ్వరుణ్ణి 'పశుపతి' అని స్తుతించారు. తమ తమ తేజోబలాలు సగం ధారపోసి ఆయనకు అభిషేకం చాశారు. విశ్వకర్మ దివ్య రథం తయారు చేశాడు.
"నా రథానికి సారథి ఎవరు?" అని అడిగాడు భవుడు.
"మీ ఇష్టం" అన్నారు దేవతలు.
"అలా కాదు. నాకంటే గొప్పవాణ్ణి సారథిగా మీరే నిర్ణయించండి" అని ముక్కంటి అనగానే దేవతలూ, మునులూ బ్రహ్మ దేవుడి వైపు తిరిగి సాష్టాంగ నమస్కారం చేశారు.
"శక్తి , చాతుర్యం కలిగిన సారథి రథికుణ్ణి తప్పకుండా గెలిపిస్తాడు. ఇంతగొప్ప రథానికి నీవంటి వాడు తప్ప మరొకడు సారథ్యం చెయ్యలేడు. ఇందుకు నువ్వు అంగీకరించాలి" అన్నాడు శివుడు బ్రహ్మదేవుడితో.

చేతిలో వున్న కమండలం పక్కన పెట్టి, జడ ముడి బిగించి, ఓంకారాన్ని ములుకోలగా చేసుకుని రథమెక్కాడు బ్రహ్మ. శివుడు రుద్రుడై నారి సారించి, పాశుపతాస్త్రంతో సహా నారాయణాస్రాన్ని సంధించి ఆ మూడు పట్టణాల్నీ మనస్సులో నిలిపాడు. మరుక్షణం ఆ మూడూ ఒక్కచోటుకు చేరాయి. ఈశ్వరుడు బాణం విడవడం, ఆ మూడు పట్టణాలూ బూడిదై పశ్చిమ సముద్రంలో కలవడం కన్ను మూసి తెరిచేలోగా జరిగిపోయాయి. అప్పుడు సకల లోకాలూ సంతోషంతో మహాదేవుణ్ణి స్తుతించాయి.

మహాభారత యుద్ధంలో తనంతటి వాడు కర్ణుడికి సారథిగా వుండటమేమిటని శల్యుడు భీష్మించిన సందర్భంలో యీ కథ చెబుతూ కౌరవాగ్రజుడు, "మహాత్మా! విన్నావా! లోకహితం కోరి పరమేష్టి అంతటివాడు శివుడికి సారథ్యం చేశాడు. అలాగే ఇప్పుడు నాకోసం నువ్వు కర్ణుడికి సారథ్యం వహించు. నా గౌరవం కాపాడు. నన్ను రక్షించు. సారథి రథికుడి కంటే గొప్పవాడు కావాలనే నీతి నీ దయవల్ల నాకు సిద్ధింపచెయ్యి" అని శల్యుణ్ణి ప్రార్థించి ఒప్పించాడు. 

 గీతా మాహాత్మ్యము -,

ధ్యానేనాత్మని పశ్యంతి
కేచిదాత్మాన మాత్మనా,
అన్యే సాంఖ్యేన యోగేన
కర్మయోగేన చాపరే.

ఆత్మను (ప్రత్యగాత్మను లేక పరమాత్మను) కొందఱు శుద్ధమగు మనస్సుచే ధ్యానయోగముద్వారా తమయందు గాంచుచున్నారు. సాక్షాత్కరించుకొనుచున్నారు.

Thursday, April 23, 2020

పంచ కేదారాలు - Panch Kedar

కురుక్షేత్ర యుద్ధం ముగుసిసిన తరవాత పాడవులు బ్రహ్మహత్యా పాతకం, దాయాదులను చంపిన పాపం పోగొట్టు కోవడానికి శివ దర్శననానికి వెళ్ళారు వారికి దర్శనం ఇవ్వడానికి ఇష్ట పడని ఈశ్వరుడు కాశీ విడిచి నంది రూపం ధరించి ఉత్తర దిశగా పయన మయ్యాడు. 


పాండవులు పట్టు వదలక వెంబడించగా గుప్త కాశీ ప్రాంతంలో నంది రూపంలో కనిపించిన ఈశ్వరుని పట్టుకోవడానికి భీమశేనుడు ప్రయత్నించగా ఈశ్వరుడు మాయమయ్యాడు. అప్పుడు ఈశ్వరుని శరీర భాగాలు ఐదు ఛోట్ల ప్రతిష్టితమై అవి పుణ్య క్షేత్రాలుగా భాసిల్లాయి. శివ పురాణం లో వర్ణించబడిన పంచ కేదారాలను పంచఆరామాలని పిలుస్తుంటారు.
అవి వరసగా

    1.కేదారినాధ్,
    2.తుంగ నాధ్,
    3.రుద్ర నాధ్,
    4.మధ్య మహేశ్వర్,
    5.కల్పేశ్వర్. 

నేపాల్ లోని ఘోరక్ నాధ్ తెగ వారు పంచకేదార యాత్రకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. భారతీయులూ ఈ యాత్రకు ప్రాధాన్యత ఇస్తారు. ఖాట్మండు లోని పశుపతి నాధ్ ఆలయ నిర్మాణానికి ఈ పొంచ కేదారాల నిర్మాణానికి పోలికలు ఉంటాయి.

కేదారినాధ్🙏🙏🙏

ద్వాదశ జ్యీతిర్లింగాలలో ప్రసిద్ధి చెందింది పంచ కేదారాలలో మొదటిది కేదారనాధ్. పాడవులకు అందకుండా పారి పోయిన శివుని మూపురభాగం ఉన్న చోటు. ఇందుకు నిదర్శనంగా ఇక్కడి లొంగం ఎనిమిది గజముల పొడవు, నాలుగు గజముల ఎత్తు, నాలుగు గజముల వెడల్పు ఉంటుంది. ఈక్కడి లింగం త్రిభుజాకారంలో ఉంటుంది. పాండవులు తమ అంతిమ దశలో స్వర్గారోహణ ఇక్కడ నుండి ప్రారంభించారు. శంకరాచార్యులు మోక్షం పొందిన క్షేత్రం ఇదే. సంవత్సరానికి ఆరు నెలలు మాత్రమే తెరచి ఉంచే ఈ ఆలయం ప్రతి సంవత్సరం అక్షయత్రుతియ నాడు తెరుస్తారు. కాత్రిక మాసంలో వచ్చే యమద్వివిదియ నాడు మూసి వేస్తారు. ఈ మధ్య కాలంలో స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని యూకీ మఠానికి తరలించి అక్కడ పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయం సముద్ర మట్టానికి 11,758 అడుగుల ఎత్తులో ఉంటుంది. హృషీ కేశ్ వరకు రైలు మార్గం ఉంటుంది. అక్కడి నుండి దాదాపు 250 కిలోమీటర్ల దూరం రోడ్డు మార్గంలో ప్రయాణించి గౌరీ కుండ్ చేరుకుని అక్కడి నుండి శిఖరానికి 14 మైళ్ళ దూరం కాలి నడకన చేరాలి. కానీ భక్తులు అనేక మంది డోలీలు, గుర్రాలపై ప్రయాణించి ఆలయం చేరుకుంటారు.

తుంగనాధ్🙏🙏🙏

పంచ కేదారాలలో రెండవది తుంగనాధ్. శివుని చేతులు లింగ రూపంలో వెలసిన క్షేత్రం ఇది. ఇది సముద్ర మట్టానికి 12,000 అడుగుల ఎత్తులో ఉంటుంది కేదారానికంటే ఎత్తైన ప్రదేశం. తుంగనాధుడంటే శిఖరాలకు అధిపతి అని అర్ధం. ఈ ఆలయంలోని లింగం ఒక అడుగు ఎత్తున చేతులను పోలి ఉంటుంది. స్వల్పంగా ఎడమ వైపు వాలి ఉంటుంది. గర్భగుడిలో శివునితో వ్యాస, గణపతి అష్టధాతు విగ్రహాలు ఉంటాయి. ప్రమధ గణాల విగ్రహాలు ఉంటాయి. పాండవుల చిత్రాలు గోడలో చెక్కి ఉంటాయి. ఆలయానికి కుడి వైపున పార్వతీ దేవి ఆలయం ఉంటుంది. వేరొక వైపున ఐదు ఆలయాలు ఉంటాయి . అవి పంచకేదారెఆల నమూనాలు. ఈ ఆలయాన్ని అర్జునుడు నిర్మించారని స్థల పురాణం చెప్తుంది. శిటా కాలంలో ఉత్సవ విగ్రహాలను ముకునాధ్ మఠానికి తరలించి పూజలు నిర్వహిస్తారు.

రుద్రనాధ్🙏🙏🙏

పంచ కేదారాలలో మూడవది రుద్రనాధ్. నంది రూపంలో ఉన్న శివుని ముఖ భాగం వెలసిన చోటు ఇదే. అరమోడ్పు కన్నులతో భువనమోహనంగా ముఖ లింగ రూపంలో ఉండే స్వామిని నీలకంఠ్ మహాదేవ్ అని భక్తులు పిలుస్తారు. తెల్ల వారు ఝామున అభిషేక వేళలో స్వామి వెండి తొడుగు తొలగిస్తారు. నిజరూప దర్శననానికి భక్తులు ప్రాధాన్యత ఇస్తారు. ఈ ఆలయం సముద్ర మట్టానికి 7,500 అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ ఆలయానికి వెనుక భాగంలో వైతరణీ నది ప్రవహిస్తుంటుంది. ఇక్కడకు వచ్చే భక్తులు తమ పూర్వీకులకు మోక్షం ప్రసాదించమని వేడుకుంటారు. ఈ ఆలయానికి సమీప గ్రామం గోపేశ్వర్.గోపేశ్వర్ నుండి 24 మైళ్ళు క్లిష్టమైన కొండ దారిలో కాలి నడకన ప్రయాణించి ఆలయానికి చేరాలి కనుక పంచ కేదారాలలో ఇది చాలా కష్ట తరమైనది గా భావిస్తారు. శీతాకాలంలో ఇక్కడి విగ్రహాలను గోపేశ్వర్కు తరలించి అక్కడ పూజలు నిర్వహిస్తారు.

మధ్యమహేశ్వర్🙏🙏🙏

పంచ కేదారాలలో నాలుగవది మధ్య మహేశ్వర్. విశ్వనాధుని నాభి భాగం లింగంగా వెలసిన క్షేత్రం. నంది రూపంలూ ఉన్న ఈశ్వరుని భీమసేనుడు పట్టుకున్న గుప్త కాశీకి 24 మైళ్ళ దూరంలో ఉన్న ఈ క్షేత్రం ఎత్తు సముద్ర మట్టానికి 11,470 అడుగులు. ఈ ఆలయానికి ఎడమ వైపున రెండు చిన్న ఆలయాలు ఉన్నాయి ఒకటి పార్వతీ దేవిది, ఒకటి అర్ధ నారీశ్వరునిది. ఈ మూడు ఆలయాలను భీమసేనుడు నిర్మించాడని చెప్తారు. ఆలయానికి కుడి వైపున చలువరాతితో నిర్మించిన సరస్వతీ దేవి ఆలయం ఉంటుంది. శీతా కాలంలో ఇక్కడి విగ్రహాలను యూకీ మఠానికి తరలించి అక్కడ పూజలు నిర్వహిస్తారు.

కృష్ణం వందే జగద్గురుమ్

బృందావన గోపికలు ఒక సారి ఒక ఉపవాస వ్రతం చేసారు. ఆ ఉపవాసాన్ని ముగించటానికి వారికి ఒక మునికి భోజనం పెట్టే కార్యక్రమం చేయవలసి వచ్చింది. యమునా నదికి అవతలి పక్క నివసిస్తూ ఉండే దూర్వాస మహామునికి ఆరగింపు చేయమని శ్రీ కృష్ణుడు వారికి సలహా ఇచ్చాడు. గోపికలు రుచికరమైన భోజనం తయారు చేసి బయలు దేరారు, కానీ యమునా నది ఆ రోజు చాలా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఏ నావికుడూ కూడా వారిని నది దాటించటానికి ఒప్పుకోలేదు.
గోపికలు శ్రీ కృష్ణుడి ని ఎదో ఒక పరిష్కారం కోసం వేడుకున్నారు. ఆయన అన్నాడు, "యమునా నదికి చెప్పండి, ఒకవేళ శ్రీ కృష్ణుడు అఖండ బ్రహ్మచారి అయితే మీకు దారి ఇవ్వాలి అని". గోపికలు నవ్వటం మొదలు పెట్టారు, ఎందుకంటే వారు శ్రీ కృష్ణుడు తమపై ప్రేమవ్యామోహ మోజుతో ఉండేవాడు అనుకున్నారు, కాబట్టి ఆయన అఖండ బ్రహ్మచారి అన్న పశ్నే తలెత్తదు అని. ఎదేమైనా, వారు యమునా నదిని ఆ విధంగా వేడుకున్నప్పుడు, ఆ నది వారికి దారి ఇచ్చింది, వారు వెళ్ళటానికి ఒక పూల వంతెన కూడా అగుపించింది.

గోపికలు ఆశ్చర్య చకితులయ్యారు. వారు దూర్వాస ముని ఆశ్రమానికి వెళ్లారు. వారు తయారు చేసిన రుచికరమైన భోజనమును స్వీకరించమని ఆయనను ప్రార్ధించారు. ఆయన సన్యాసే కాబట్టి ఏదో కొద్దిగా తిన్నాడు, దీనితో గోపికలు నిరాశ చెందారు. దీనితో, వారిని సంతృప్తి పరచదలిచిన దూర్వాసుడు తన యోగ శక్తితో వారు తెచ్చినదంతా భుజించాడు. అంత పదార్ధాన్ని ఆయన తినటం చూసి గోపికలు ఆశ్చర్య పోయారు, కానీ తాము వండిన శ్రమకు ఆయన న్యాయం చేసాడని సంతోషపడ్డారు.

గోపికలు ఇప్పుడు దూర్వాస మహామునిని, యమున దాటటానికి సహాయం చేయమన్నారు. ఆయన అన్నాడు, "యమునా నదికి చెప్పండి, ఒకవేళ దూర్వాసుడు గడ్డి తప్ప ఇంకా ఏమీ తినకుండా ఉంటే, ఆ నది దారి ఇవ్వాలని". గోపికలు మళ్లీ నవ్వటం మొదలెట్టారు, ఎందుకటే వారు ప్రత్యక్షంగా దూర్వాసుడు ఎన్నో పదార్ధాల తో ఉన్న భోజనం చేయటం చూసారు. అయినా, వారికి ఆశ్చర్యం గొలిపేలా, వారు యమునా నదిని ఆ విధంగా ప్రార్ధించి నప్పుడు, యమునా నది మరలా దారి ఇచ్చింది.

గోపికలు శ్రీ కృష్ణుడిని జరిగిన వృత్తాంతం వెనుక ఉన్న రహస్యం అడిగారు. అప్పుడు శ్రీ కృష్ణుడు ఇలా అన్నాడు - భగవంతుడు, మునులు బాహ్యంగా ప్రాపంచిక కార్యకలాపములలో నిమగ్నమై ఉన్నట్టు అనిపించినా, అంతర్గతంగా వారెప్పుడూ ఇంద్రియాతీత స్థితిలో ఉంటారు. ఈ విధంగా అన్ని రకాల పనులు చేస్తూనే ఉన్నా, వారు ఏమీ చేయనట్టే లెక్క. గోపికలతో బాహ్యంగా అన్యోన్యంగా ఉన్నా, శ్రీ కృష్ణుడు అంతర్గతంగా అఖండ బ్రహ్మచారి. అలాగే, గోపికలు సమర్పించిన మధురమైన భోజనం చేసినా, అంతర్గతంగా ఆ మహాముని మనసు గడ్డిని మాత్రమే రుచి చూసింది. ఈ రెండు కూడా, కర్మలో అకర్మ ని విశదీకరించే ఉదాహరణలు.

Thursday, April 16, 2020

నేనెవరు... who am I ?

ఈ క్రింది విషయాన్ని ఎవరికి వారు చదివి వారు వారు ఆలోచించుకోవడానికిగాను పెద్దలు చెప్పిన విషయాన్ని ఇక్కడ పొమ్దు పరచడం జరుగుతోంది ఇది ఒక అంతశ్చర్చలాగా సాగుతుంది.
నేను : నేనెవరు? నేను శరీరమా? శరీరము నాదా? ఒక వేళ శరీరము నేనైతే! ఈ శరీరము నాకు తెలియకుండా మారిపోతోంది ఎందుకు? ఒహొ ఐతే శరీరము నాది.
శరీరము : ఈ శరీరము నీదైతే నీకు తెలియకుండా మార్పులు ఎలా జరుగుతున్నాయి ? నీకు తెలియకుండా, నువ్వు చెప్పకుండా ఆకలి దప్పులు ఎలా కలుగుతున్నాయి ?
నేను: మా సైన్స్ చెప్పింది అది శరీరధర్మము అని, శరీరము నాదే
శరీరము: ఐతే ఇది ఎక్కడినుంచి వచ్చింది ?
నేను: మా తల్లి తండ్రుల వల్ల ఎప్పుడో పుట్టింది.
శరీరము: ఓహొ అవునా ? ఐతే, శరీరం మీ తల్లి తండ్రుల వల్ల వచ్చింది నీదెలా
అవుతుంది ?

నేను: అవును అవును, ఇది మాతల్లి తండ్రుల వల్ల వచ్చింది. అది వాళ్ళది.
నాదికాదు.

శరీరము: ఓహొ మరి అది శుక్లమిచ్చిన నీతండ్రిదా ? శోణితముతో కలిపి గర్భంలో
మోసిన తల్లిదా ?

నేను: …….
శరీరము: పాలిచ్చి పెంచిన తల్లిదా? పోషణ భారం వహించిన తండ్రిదా ?
నేను: ఆఁ….
శరీరము: సరే కొంత పెరిగాక, పశువులిచ్చే పాలు తాగి పెరిగావు. ఇది ఆ పశువులదా?
నేను: అయ్యబాబోయ్.. ఈ శరీరము నాదనుకుంటే దీనికి ఇంత మంది యజమానులు వస్తున్నారేంటి?
శరీరము: సరి, మరి భోజనాదులు, పళ్ళు ఫలాలు తిని కదా ఈ శరీరం మార్పు చెందింది అన్న వికారంగా? మరి ఇది ఆ మొక్కలు చెట్లది కాదా?
నేను: మళ్ళీ ఇదోటా ?
శరీరము: సరి, పెరిగి పెద్దవుతున్నప్పుడు విద్యాబుద్దులు నేర్పి, సంస్కారాలునేర్పి శరీరాన్ని నిలబెట్టిన గురువులది కాదా?
నేను: ఇంకా ఎంత మంది దీనికి యజమానులు ?
శరీరము: ఉద్యోగమిచ్చి, నీ జీవన గమనానికి గాను భత్యమిచ్చిన నీ యజమాని వల్లనే కదా దీనిని పోషించి రక్షించు కుంటున్నావు, మరి ఇది ఆయనది కాదా?
నేను: నేను ప్రతిఫలంగా పని చేస్తున్నానే !
శరీరము: అవునా మరి ఇటువంటి శరీరాలు కొన్ని కోట్లు భూమి మీద ఉన్నాయి, ఇది చేసే పనే వేరొకరు కూడా చేస్తున్నారు వారికి తక్కువ దీనికి ఎక్కువ భత్యం ఎందుకు?
నేను: సరే అదీ ఒప్పుకున్నాను, అయ్యిందా ఇంకెవరన్నా ఉన్నారా?
శరీరము: దీనికి ఇంకో శరీరంతో పెళ్ళి అయ్యింది? ఆ శరీరం దీని పోషణార్థమై కష్టపడిందా లేదా? దీన్ని సుఖపెట్టిందా లేదా? మరి దానిది కూడా కదా !
నేను: అవును
శరీరము: ఇది పడిపోయాక దీని అంత్యక్రియ జరిపేవాడొకడున్నాడు కదా! మరి ఇది వాడిది కాకపోతే దానినెందుకు అంత్యేష్టి పేర నాశనము చేస్తున్నాడు? ఐతే ఇది వానిది కూడా!
నేను: అర్థం అవుతోంది…
శరీరము: ఈ శరీరములోని పంచ భూతాలను తిరిగి పంచభూతాలలో కలుపుకునే పంచభూతాలదా కాదా
నేను: అవును ఇది అందరిదీ !
శరీరము: మరి అంత దానికి నాది నాది అని నన్ను (శరీరాన్ని) పట్టుకుని విర్రవీగుతావేం? ఇది ఆ పంచ భూతాలది కూడా కాదు వానిని కూడా సృష్టించి నిర్వహించే వాడున్నాడే వానిది. ఈ శరీరానికి ఇంత మంది యజమానులు లౌకికంగా ఉంటే అందరినీ సమానంగా మాతా పితృభావంతో చూడక ఎందుకు స్వార్థచింతనతో ఉంటావ్? ఇది నీది కానప్పుడు దాన్ని జాగ్రత్తగా చూసి దానితో ఉత్తమమైన పనులు చేయించక, నీస్వార్థం కోసం వాడుకుంటావే? అలా చేస్తే నువ్వూ ఒక దొంగవేగా?
నేను: బోధ పడింది, ఓ శరీరమా, నేను ఎప్పుడూ నేను నేను అని చూపే నువ్వు నేను కాదు. నువ్వు నా మొదటి గురువువి, నా సంరక్షకుడివి. ఎల్లప్పుడూ నాతో ఉండి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని చెప్పే గురు స్వరూపానివి. ఓ శరీరమా నా జీవన గమ్యంలో కలిగే మార్పులను పరమాత్మ తోడి నాసంబంధాన్ని ప్రకృతితోడి సంబంధాన్ని తెలిపే దానవు. నీవు నేను కాదు నేను నీవు కాదు, నువ్వు నాదానవు కాదు. నేను నీవాడను కాను. పరమాత్మ నాకిచ్చిన తొడుగువు నువ్వు, కానీ లేని పోని సిద్ధాంతాలతో నేనే నీవని భావించి అసలు నెనెవరినో నేనెవరివాణ్ణో మరిచిపోయాను. అశాశ్వతమైన నువ్వు (శరీరము) నేను కాదు, అఖండము, అనంతము, ఐన పరమాత్మకు చెందినవాడను. 

Monday, April 13, 2020

దక్షిణామూర్తి స్తోత్రం

విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం
పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యధానిద్రయా
యస్సాక్షాత్కురుతే ప్రభోధసమయే స్వాత్మానమే వాద్వయం
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

బీజస్యాంతతి వాంకురో జగదితం ప్రాఙ్నర్వికల్పం పునః
మాయాకల్పిత దేశకాలకలనా వైచిత్రచిత్రీకృతం
మాయావీవ విజృంభ త్యపి మయా యోగేవయః స్వేచ్ఛయా
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పా ర్థకం భాసతే
సాక్షాత్తత్వమసీతి వేదవచసాయో బోధయత్యాశ్రితాన్
యస్సాక్షాత్కరణాద్భవేన్నపురనావృత్తిర్భవాంభోనిధౌ
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

నానాచ్ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం
జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే
జానామీతి తమేవ భాంతమునుభాత్యేతత్సమస్తంజగత్
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధించశూన్యం విదుః
స్త్రీ బాలాంధ జడోపమాస్త్వహ మితి భ్రాంతాభృశం వాదినః
మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణే
తస్మైశ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్
సన్మాత్రః కరణోప సంహరణతో యో భూత్సుషుప్తః పుమాన్
ప్రాగస్వాప్సమితి ప్రభోద సమయే యః ప్రత్యభిజ్ఞాయతే
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథాసర్వాస్వవస్థాస్వపి
వ్యావృత్తా స్వను వర్తమాన మహమి త్యంతస్స్ఫురంతం సదా
స్వాత్మానం ప్రకటికరోతిభజతాం యోముద్రయా భద్రయా
తస్మైశ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామిసంబంధతః
శిష్యచార్యతయా తథైవ పితృ పుత్రాద్యాత్మనా భేదతాః
స్వప్నే జాగ్రృతి వాయు ఏష పురుషో మయా పరిభ్రామితః
తస్మైశ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

భూరంభాం స్యనలోనిలోబర మహర్నాధోపిమాంశుః పుమాన్ మిత్యాభతి చరాచరాత్మక మిదం యస్మైచ మూర్త్యష్టకం
నాన్యత్కించ నవిద్యతే విమృశతాంయస్మాతత్పర స్మాద్విభో తస్మై శ్రీగురుమూర్తయే నమఇదం శ్రీ దక్షిణామూర్తయే

సర్వాత్వమితి స్ఫుటీకృత మిదం యస్మాదముష్మిన్ స్తవే
తేనాస్యశ్రవణాత్త దర్థ మననా ద్ధ్యానా చ్ఛ సంకీర్తనాత్
సర్వాత్మత్వ మహావిభూతి సహితం స్వాదీశ్వత్వం స్వతః
సిద్ధ్యేత్తత్పునరష్టధా పరిణతం చైశ్వర్య మవ్యాహతమ్....

భార్యదే అసలైన చదువు

అవును..
భార్యదే నిజమైన చదువు.

చిన్నప్పుడు తల్లిదండ్రులను.

చదువుకున్నప్పుడు స్నేహితులను.

కలిసిమెలిసితిరిగేటప్పుడు *ఇరుగుపొరుగు వారిని చదువుకుంది.

పెళ్ళి అయ్యాక *భర్తను చదువుతుంది*. 
*పిల్లలను చదువుతుంది*.

*తన కుటుంబ సభ్యులను చదువుతుంది*.
*పరిసరాలను చదువుతుంది*..
అందుకే...

*భర్తకు.. తన గురించి తనకు*
*తెలియని విషయాలెన్నో*
*భార్యకు తెలుసు!*

*తల్లికి ఏం యిష్టమో తన కంటే తన భార్యకే బాగా తెలుసు*.
*పిల్లలు ఏం తింటారో తండ్రిగా తన కంటే తల్లిగా తనకే తెలుసు*.

అందుకు ...
*ఆశ్చర్యం, ఆనందం.. రెండూనూ!*
.....................
*సంసారం ఒక గడియారమనుకుంటే...*
*చిన్న ముల్లు భర్త,*
*పెద్ద ముల్లు భార్య*

*గంటల ముల్లులా మందగమనం భర్త వ్యవహారం!*
*నిమషాల ముల్లులా చకచకా సాగుతుంది భార్య శతావదానం!*

*వంటింట్లో సహకరిద్దామంటే అగ్గి సిగ్గుపడుతుందట..*
*కనీసం ఇల్లైనా ఊడుద్దామంటే*
*చీపురు చిరాకు పడుతుందట..!*

*పోనీ ..భోజనానంతరమైనా కంచాలు కడగడంలో చేయికలుపుదామంటే పుణ్యం నాకు దక్కకుండా చేయడానికా అని కంట నీరు తిప్పుతుంది*
ఇవన్నీ తన అధ్యయనం వల్లే నేర్చుకుంది.

*ఇన్ని చదువుతున్న తనకు ఇంగ్లీషు చదవడం నేర్పుదామంటే నువ్వుండగ నాకేం లోటని*.. *అమాయకంగా నవ్వుతుంది పిచ్చిదాయి*. 

*ఇంకా..లెక్కల్లో కూడా నేనే ఫష్ట్ అంటుంది*.. *పేపరుమీద రూపాయల లెక్కలు మీరు చెబితే ..ఆ రూపాయలతో ఇల్లు చక్కబెట్టే లెక్కలు నావని అంటుంది*.

ఎందుకంటే..

*పుస్తకాల్ని మాత్రమే చదివేది భర్త*.
*భర్తను సైతం చదివేది భార్య.*
*ఇంటిల్లపాదిని*
*తన హస్తరేఖలుగా* *మలచుకొన్న*
*తన నేర్పంతా ..*
*తన సంస్కారం ముందు తల వంచుతునేఉంటుంది* 
*అందుకే ఆమె చదువే గొప్పది*.
*ఆమె సంస్కారమే ఎనలేనిది.*

*ఓడి గెలుస్తుంటుంది భార్య!*
*గెలిచి ఓడేది భర్త.. !!*

*అందుకే తనే ఓ సిద్ధాంతమైంది*.

 *పెసలు నలిగి పిండి కాలాలంటే తిరగలి పాప ఒకటి తిరగుతుండాలి.. ఇంకొకటి కదలకుండా ఉండాలి ..అని తిరగలి సిద్ధాంతం బోధిస్తుంది. 

పనిమనిషినైనా పెట్టకుందామంటే పనిచేయని ఒళ్ళు రోగాల పుట్టని ఆరోగ్య చిట్కాలు చెబుతుంది!

ఎలా చూసినా అసలైన చదువు తనదేనని అనుక్షణం రుజువు చేస్తూనే ఉంటుంది!

అందుకే..
శ్రీమతి ఒక అమూల్యమైన బహుమతి. ఆమే చదువుల సరస్వతి. 

పిల్లలపెంపకం విషయంలో రామాయణం ఏం చెపుతున్నది?


    శ్రీరాముడు సీతాదేవి నగలను లక్ష్మణుడికి చూపించి ఇవి మీ వొదిన కేయూరాలే గద !   ఒక్కసారి నువ్వు కూడా గురుతు పట్టు అంటే అప్పుడు లక్ష్మణస్వామి అంటారు కదా .......

 *నాహం జానామి కేయూరే   నాహం జానామి కుండలే*             
*నూపురే త్యభి జానామి నిత్యం పాదాభివందనాత్* 

           దీనర్థం ఏమిటంటే ఓ అన్నా! వొదినగారు భుజానికి పెట్టుకునే  కేయూరాలు గానీ గానీ, చెవులకు పెట్టుకునే కుండలాలు గాని నే నెరుగను, కానీ  ఆవిడ పాదాలకు పెట్టుకునే నూపురాలను మాత్రం గుర్తు పట్టగలను. ఎందుకంటే ఆ తల్లి పాదాలకు నిత్యం నమస్కారం చేస్తాను కాబట్టి .
పరస్త్రీని కన్నులెత్తి చూడని సంస్కారం! 
అసలు ఆడువారి ముఖంలో ముఖంపెట్టి కళ్ళలోకి సూటిగా చూస్తూ ఎందుకు మాట్లాడాలి ?
ఈ విధమైన శీల సంపద లక్ష్మణుడికి ఎక్కడ నుండి వచ్చింది ? తల్లి సుమిత్రాదేవి పెంపకం!! 

   రాముడితో అడవికి వెళ్ళేటప్పుడు ఆ మహాతల్లి కొడుకుకు ఏమని చెపుతుందో తెలుసా?

 *రామం దశరథం విధ్ధి,  మాం విధ్ధి జనకాత్మజాం,*
*అయోధ్యాం అటవీం విధ్ధి  గచ్ఛ తాత! యథా సుఖం*

 *రాముణ్ణి దశరథుడనుకో, సీతను నన్ననుకో*
*అడవిని అయోధ్య అనుకో   హాయిగా వెళ్ళిరా నాన్నా!*
   ఇంత సంస్కారమున్న తల్లి పెంచింది కాబట్టే,   లక్ష్మణుడు అంత శీలవంతుడయ్యాడు; చీర తొలగి మత్తులో ఉన్న తారతో మాట్లాడవలసి వచ్చి నప్పుడు తల వంచుకుని మాట్లాడిన అద్భుత శీల సౌందర్యం లక్ష్మణస్వామిది !

నేడు ప్రతి తల్లీ తెలుసుకో వలసిన సత్యం ఇది కాదా?
పిల్లలను ఈ విధంగా పెంచితే దేశంలో ఏ ఆడబిడ్డయినా ఎందుకు బాధపడుతుంది? 
నిర్భయ లాంటి ఘటనలు ఎందుకు చోటు చేసు కుంటాయి? ప్రియాంక రెడ్డి లాంటి భవిష్యత్తు ఉన్న బంగారుతల్లుల జీవితాలు ఎందుకు చిదిమి వేయబడతాయి ?

  రామాయణం, రామకథలు విరివిగా ప్రచారం చేయండి ! పరస్త్రీని ఇష్టం లేకుండా చెరబడితే దండన ఏదో, స్త్రీలతో ఎలా మెలగాలో అన్నీ తెలుస్తాయి.