"నేను చేస్తున్నాను" అనే కర్తృత్వ భావన ఏ విధంగా ఏర్పడుతుంది ?
మన పరిధి విషయంలో అవగాహన లేకపోవటం వలన కర్తృత్వ భావన ఏర్పడుతుంది. ముక్తేశ్వరపురం (ముక్త్యాల) అనే పుణ్యక్షేత్రం కృష్ణానది ఒడ్డున ఉంది. ఆ గ్రామంలోని పిల్లలు ఊరిని అనుకొని ప్రవహించే కృష్ణానదిని తమ చిన్నతనం నుండి చూస్తుంటారు.
కృష్ణానది అనగానే వారికి తన ఊరే గుర్తుకు వస్తుంది. వారి దృష్టిలో ముక్త్యాల ఒడ్డున ఉన్నదే కృష్ణానది అనే భావన ఉంటుంది. ఇక్కడ ఏం జరిగిందంటే కొన్ని వందల మైళ్ళు ప్రవహించే కృష్ణానదికి వారి మనసులో ఒక పరిధి ఏర్పడింది. వయసు పెరిగిన తర్వాత గాని కృష్ణానది ఒడ్డున ఉన్న అనేక గ్రామాల్లో తమ గ్రామం ఒకటన్న విషయం అర్థమవుతుంది. మనలో కర్తృత్వ భావన కూడా అలాగే ఏర్పడుతుంది.
చైతన్యశక్తి అనంతంగా నిండి ఉంది. ఆ చైతన్యశక్తికి దేహం అనే పరిధి ఏర్పడింది. ఆ కారణంగానే ప్రతీదీ "నేను చేస్తున్నాను" అనే కర్తృత్వ భావన ఏర్పడటానికి కారణమైంది. అదే మన సుఖదుఃఖాలకు దారితీస్తుంది !
No comments:
Post a Comment