Saturday, July 25, 2020

Bhagavad Gita: Chapter 2, Verse 21

वेदाविनाशिनं नित्यं य एनमजमव्ययम् |
कथं स पुरुष: पार्थ कं घातयति हन्ति कम् || 21||

vedāvināśhinaṁ nityaṁ ya enam ajam avyayam
kathaṁ sa puruṣhaḥ pārtha kaṁ ghātayati hanti kam

veda — knows ; avināśhinam—
imperishable ; nityam — eternal ;
yaḥ— who ; enam — this ; ajam —
unborn ; avyayam — immutable ;
katham — how ; saḥ — that ;
puruṣhaḥ — person ; pārtha—
Parth ; kam — whom ; ghātayati—
causes to be killed ; hanti— kills ;
kam — whom

Translation

BG 2.21 : O Parth, how can one who knows the soul to be imperishable, eternal, unborn, and immutable kill anyone or cause anyone to kill?

Commentary

A spiritually elevated soul quells the ego that makes us feel that we are the doers of our actions. In that state, one can see that the soul seated within actually does nothing. Such an elevated soul, though doing all kinds of actions, is never tainted by them. Shree Krishna is advising Arjun that he must elevate himself to that enlightened level, seeing himself as the non-doer, free from egotism, and perform his duty rather than shirk from it.

The Story of Anand Sharma - 3

The description of the greatness of letters in Gayathri Mantra  Anand Sharma explained ‘Power of Gayathri is the power pervading the whole universe. 

If you establish a relationship with that power, the subtle nature will come under your control. Then, you will be able to possess all the riches in the areas related to physic, mind and soul. 

From different organs in the body, nerves spread throughout the body. When some nervous unite, it is called a ‘grandhi’ (knot). 

In the human body, different powers remain embedded in different ‘grandhis’. 

For those who are immersed in ‘japa yoga’, by chanting such mantras the power embedded in such ‘grandhis’ will be expressed. 

‘Aum’  : When chanted, power raises in an area of 6 inches on head.

 ‘Bhooh’  : When chanted, power raises in an area of 4 inches above the right eye. 

 ‘Bhuvah’ : When chanted, power raises in an area of 3 inches above the  human third eye.    

‘Swah’  : When chanted, power raises in an area 4 inches above the left eye.      

To raise the power 'saphalya' embedded in the grandhi by name 'Tapi' present in the area of Ajna Chakram - - Tat' 

To raise the power 'parakram' embedded in grandhi by name 'saphalata' in the left eye - - Sa' 

To raise the power 'palana' embedded in grandhi 'viswa' in the right eye - - Vi 

To raise the power 'mangalakara' embedded in grandhi 'tushti' in the left ear - - Thuh 

To have siddhi of power 'yogam' embedded in the grandhi 'varada' in right ear - - Va 

To have siddhi of power 'preme' embedded in the grandhi 'Revathi' at the root of nose - - Re 

To raise the power 'ghana' embedded in grandhi 'sookshma' in the upper lip - - Ni 

To raise the power 'Tejam' embedded in grandhi 'Jnana' in the lower lip - - Yam

To raise the power 'Rakshana' embedded in grandhi 'Bharga' in the neck - - Bhar 

To have siddhi of power 'Buddhi' embedded in the grandhi 'Gomathi' at the throat - - Go 

To raise the power 'Damanam' embedded in grandhi 'Devika' at the top portion of chest on the left side De 

To have siddhi of power 'Nishta' embedded in the grandhi 'Varaha' in the top portion of right side of chest - - Va 

To raise the power 'Dharana' embedded in grandhi 'Simhini' in the upper part of abdomen where last ribs join together - - Sya 

To raise the power 'Prana' embedded in grandhi 'Dhyana' in the liver  Dhee 

To raise the power 'Samyana' embedded in grandhi 'Maryada' in Pleeham - - Ma 

To raise the power 'Tapo' embedded in grandhi 'Sphuta' in Umbilicus - - Hi 

To raise the power 'Doora Darshita' embedded in grandhi 'Medha' at the end of spinal cord  - - Dhi 

To raise the power 'Antarnihitam' embedded in grandhi 'Yoga Maya' in the left shoulder - - Yo 

To raise the power 'Utpadana' embedded in grandhi 'Yogini' in the right shoulder  - - Yo 

To raise the power 'Sarasata' embedded in grandhi 'Dharini' in the right elbow  - - Nah 

To raise the power 'Adarsha' embedded in grandhi 'Prabhava' in the left elbow  - - Pra 

To raise the power 'Sahasam' embedded in grandhi 'Ooshma' in the right wrist  - - Cho 

To raise the power 'Vivekam' embedded in grandhi 'Drushya' in the left wrist - - Da

To  raise  the  power  'Seva'  embedded  in  grandhi 'Nirayana'  in  left hand - - Yaat 

One  should  chant  those  appropriate  letters  to  raise  those  respective  powers  embedded  in  the knots. 

Thus,  there  is  a  close  relation  between  24  letters  in  Gayathri  Mantra,  the  twenty  four ‘grandhi’  (knots)  in  different  parts  of  human  body  and  the  twenty  four  types  of  powers  embedded  in them.  

The  number  9  indicates  the  ‘para  brahma  tatwam’  which  is  not  affected  by  change.  

The number  8  indicates  ‘maya tatwam’.

శ్రీకృష్ణుడి అంత్యక్రియలు


రోజూ ఎన్నో మరణాలు సంభవిస్తుంటాయి. 
కోవిడ్ వచ్చింది కదా, లాక్డౌన్ ఉంది కదా అని ఇతర మరణాలు ఆగకుండా ఉండవు కదా. 

ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత బలగం ఉన్న మనిషి అయినా, ఎంత కీర్తిమంతుడైనా, సినీ ప్రముఖుడైనా, రాజకీయ నాయకుడైనా ఈ లాక్డౌన్ సమయంలో ప్రాణం విడిస్తే కుటుంబ సభ్యులు పడుతున్న బాధ "ఈ సమయంలో ఇలా ఏమిటి? అంతిమయాత్ర పట్టుమని పదిమంది కూడా లేకుండా ఏమిటి?" అని. చాలామంది ఇదే విషయానికి మరింతగా కృంగిపోతూ ఉండవచ్చు ప్రస్తుతం. సహజం. 
అంతేకాదు..కొందరికి ఉన్న కొడుకులు, కూతుళ్లు అందరూ విదేశాల్లో ఉన్నవారు ఉన్నారు. లాక్డౌన్లో ఏం జరిగా ఎవ్వరూ రాలేని పరిస్థితి. 
వారందరి కోసం "మహాభారతం" మౌసలపర్వంలోని శ్రీకృష్ణుని అంత్యక్రియల విషయం క్లుప్తంగా ఒక్కసారి చెప్పుకోవాల్సిన సందర్భం వచ్చింది.
 
ఎక్కడో ద్వారక. 
దానికి చాలా దూరంలో తపోవనం. 
ఆ తపోవనంలో శ్రీకృష్ణుడు తపస్సులో ఉన్నాడు. 
అక్కడ ద్వారకలో శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడు ప్రాణం విడిచాడు. ఆ అంత్యక్రియలు వెనువెంటనే జరిపించాల్సి వచ్చింది. కానీ బలరాముడు కూడా లేడు. సమస్త బంధుగణం మధ్య ఘనంగా ఆ కార్యక్రమం అర్జునుడే జరిపించాడు. 
ఆ కార్యక్రమం ముగిసాక అర్జునుడు శ్రీకృష్ణుడికి ఈ వార్త నెమ్మదిగా చెప్పాలని వెతుక్కుంటూ ఒక్కడే తపోవనం దాకా ప్రయాణమై వచ్చాడు. వెతికాడు. దాదాపు రెండ్రోజులు కాళ్లరిగేలా తిరిగాడు. 
మొత్తానికి ఒకచోట శ్రీకృష్ణుడు కనిపించాడు...కానీ ప్రాణం లేకుండా..! అర్జునుడు హతాశయుడైపోయాడు. కుమిలిపోయాడు. రోదించాడు. అది శ్రీకృష్ణ కళేబరం కాదని కూడా నమ్మాలనుకున్నాడు. 
అర్జునిడితో పాటూ ఉన్న రథసారధి, ఇంకా ఇద్దరు ముగ్గురు మాత్రమే అర్జునుడిని ఓదార్చారు. 
అప్పటికే శ్రీకృష్ణుడు ఆ అరణ్యంలో బోయవాడి బాణం కాల్లో దిగడం వల్ల దేహాన్ని వదిలేసి 4-5 రోజులు గడిచాయి (ఇప్పటి కరోనాలాగనే అప్పుడు యాదవుల వినాశనానికి ముసలం పుట్టింది--అది వేరే కథ..ఆ కథంతా ఇక్కడ చెప్పట్లేదు). 
ఇక ఆ మృతదేహాన్ని ద్వారకకి తీసుకువెళ్ళే వీలు లేక (ఎందుకంటే ద్వారక సరిగ్గా అప్పుడే సముద్రంలో మునగడానికి సిద్ధంగా ఉంది), అక్కడే అర్జునుడొక్కడే అరగంటలో అంత్యక్రియలు పూర్తిచేసాడు ఏ అర్భాటమూ, ఏ శాస్త్రమూ లేకుండా.

అష్టభార్యలు, ఎనభై మంది సంతానం, మనుమలు, విపరీతమైన బలగం, అఖండమైన కీర్తి ఉన్న శ్రీకృష్ణుడికి అంత్యక్రియల సమయానికి బావ అయిన అర్జునుడు తప్ప ఇంకెవ్వరూ లేరు. 
శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడికి ఇద్దరు కొడుకులున్నా వాళ్ల చేతులమీదుగా అంత్యక్రియలు జరుగలేదు.

అంతటి ఇతహాసపురుషులకే అటువంటి అంతిమఘడియలు తప్పలేదు. మహానుభావుల మరణాలు కూడా కాలక్రమంలో సందేశాలు, ఊరటలు, మార్గనిర్దేశకాలు అవుతాయి అనడానికి ఇదొక ఉదాహరణ. 
మనమంతా కూడా కాలంలో కొట్టుకుపోయే వాళ్లమే. ఆ కాలం ఎప్పుడు ఎవరికి ఎలా నిర్ణయిస్తుందో ఎవారూ చెప్పలేరు. 

ఈ కరోనా లాక్డౌన్ సమయంలో మరణాలు పొందినవారి కుటుంబ సభ్యులకి ఈ శ్రీకృష్ణుడి అంత్యక్రియల ఘట్టం కొంతైనా భారాన్ని దింపుకునే శక్తిని ప్రసాదించుగాక.

ఎవరు పేదవారు?

ఒక చాలా సంపన్న మహిళ చీరల షాప్ కి వెళ్లి , "బాబూ! కొన్ని చౌకగా చీరలు చూపించండీ! నా కుమారుడి వివాహం. కట్నంగా మా ఇంట్లో పని మనిషికి ఇవ్వాల్సి ఉంది."
అలాగే అని చౌక చీరలను చూపించాడు ఆ షాప్ అబ్బాయి .
అందులోంచి ఒక చౌక చీరను ప్యాక్ చేయించుకుని వెళ్లిపోయింది ఆ సంపన్న మహిళ.
కొంత సమయం తర్వాత ఆ చీరల షాప్ కి మరొక మహిళ వచ్చి, "అన్నా! కొన్ని ఖరీదైన చీరలు చూపించు! మా యజమానురాలి కొడుకు వివాహం. ఈ సందర్భంగా మా యజమానురాలుకు కట్నం పెట్టడం కోసం నెలనెల డబ్బులు కూడబెట్టాను. ఆమెకు ఒక మంచి చీరను కట్నంగా ఇవ్వాలి.
అలాగే అని ఖరీదైన చీరలను చూపించాడు ఆ షాప్ అబ్బాయి .
అందులోంచి ఒక ఖరీదైన చీరను ప్యాక్ చేయించుకుని వెళ్లిపోయింది ఆ పేద మహిళ.
ఈ ఇద్దరు స్త్రీలలో ఎవరు పేదవారు?
పేదరికం ఎక్కడ ఉంది ?
మనస్సులోనా?
గుణం లోనా?
సంపన్న మహిళకు ఇంట్లో పేదరికం లేకపోవచ్చు! కాని ఆమే వ్యక్తిత్వంలో పేదతనం ఉంది.
ఆ పేద మహిళకు ఇంట్లో పేదరికం ఉండోచ్చు! కాని ఆమే వ్యక్తిత్వంలో పేదతనం లేదు.
ఆ ఇద్దరు స్త్రీలను ఇల్లుతోనూ - దేనితోనూ సంబంధం లేకుండా ఒంటరిగా నిల్చోబెడితే ఎవరు పేదవారు ???
⭐ ⭐ ⭐
ఎవరు ధనవంతులు ???
🔯 🔯 🔯
ఒకసారి, తన కుటుంబం తో ఒక మహిళ టూర్ కు వెళ్లి అక్కడ ఒక త్రీస్టార్ హోటల్ లో బస చేసింది.. ఆ మహిళ ఒక ఆరు నెలల పాపకు తల్లి.
పాప పాల కోసం ఏడుస్తుంటే ఆ మహిళ త్రీస్టార్ హోటల్ మేనేజర్ వద్దకు వెళ్లి " దయచేసి ఒక కప్పు పాలు ఇవ్వగలరా? " అని అడిగింది.
"తప్పకుండా మేడమ్" అని ఆయన బదులిచ్చారు.
" కానీ మేడమ్ మా హోటల్లో ఒక కప్పు పాలు 100 రూ॥ మేడమ్!"
"పర్వాలేదు ఇవ్వండి!" అని ఆ మహిళ పాలు తీసుకుని పాపకు త్రాగించింది.
కొంత సమయం తర్వాత వారందరు అక్కడి ప్రదేశాలను చూడడానికి కారులో బయలుదేరారు.
మధ్యలో పాప ఆకలితో పాల కోసం ఏడుస్తుంటే...
వారు ఒక రహదారి ప్రక్కన ఉన్న టీ స్టాల్ వద్ద కారును ఆపుకున్నారు. ఆ టీ విక్రేత వద్ద ఒక కప్పు పాలు తీసుకుని పాపకు పట్టింది.
తరువాత "ఎంత?" అని ఆమె టీ స్టాల్ వ్యక్తిని అడిగింది.
"మేడమ్! మేము చిన్న పిల్లల పాలకు డబ్బు వసూలు చేయం" అన్నాడు టీ స్టాల్ వ్యక్తి నవ్వుతూ
ఎంత బలవంతపెట్టినా డబ్బులు తీసుకోలేదతను. అంతే కాదు ప్రయాణంలో పాపకు అవసరమౌతాయని మరో కప్పు పాలు పోసి ఇచ్చాడు.
ఆ మహిళ కారులో కుర్చున్న తరువాత ఆలోచించసాగింది.
నిజంగా ఎవరు ధనవంతులు ? త్రీస్టార్ హోటల్ నిర్వాహకుడా? లేక టీ స్టాల్ విక్రేత నా?
ధనవంతత్వం ఎక్కడ ఉంది?
మనస్సులోనా?
గుణం లోనా??
లేక దాచుకున్న డబ్బుకట్టలు - సంపదలలోనా???
చాలా సార్లు మనమందరం డబ్బు సంపాదన యావ లో పడి మనుషుల మన్న సంగతి మర్చిపోతుంటాము.
కాని ఇలాంటి అనేక సందర్భాలలో " తిరిగి ఏదో ఆశించకుండా చేసే చిన్న చిన్న సహాయాలు " డబ్బు ఇచ్చే కిక్ కన్న ఎన్నో రెట్లు అధికంగా మంచి అనుభూతిని ప్రసాదిస్తాయి.

మయూరధ్వజుడు ఎవరు?

 ప్రతిరోజూ మనం మయూరధ్వజుడ్ని చూస్తుంటాము.  కానీ అతను ఎవరో చాలామందికి తెలియదు.  అతడి ప్రాశస్త్యం తెలియదు.  అలాంటి వారికోసం ఈ కథ.

కురుక్షేత్ర యుద్ధానంతరం ధర్మరాజు సింహాసనం అధిష్టిస్తాడు.  ఆ ఆనందం లో గొప్ప దాతగా పేరు తెచ్చుకోవాలని తలచి విరివిగా దానధర్మాలు చేస్తుంటాడు.  శ్రీకృష్ణుడు ధర్మజునికి దాతృత్వం అంటే ఎలా ఉంటుందో పాఠం చెప్పాలని భావించి అశ్వమేధయాగం చేసి శత్రురాజులను ఓడించి సామ్రాజ్య విస్తరణ చెయ్యమని సలహా ఇస్తాడు.  ధర్మరాజు అంగీకరించి అశ్వమేధయాగం చేసి యాగాశ్వాన్ని దేశం మీదకి పంపిస్తాడు.  దాని వెంట నకుల సహదేవులను సేనలతో సహా పంపిస్తాడు.  ఏ రాజు అయితే అశ్వాన్ని బంధిస్తాడో ఆ రాజును ఓడించి రాజ్యం వశపరుచుకోవడం ఈ యాగం యొక్క లక్ష్యం.  అలాకాకుండా అశ్వం ఒక రాజ్యం లోకి ప్రవేశించగానే ఆ రాజు లొంగి పోయి సామంతానికి  ఒప్పుకుంటే పేచీయే లేదు.  

 ఆ విధంగా ఆ అశ్వం మణిపుర రాజ్యం చేరుతుంది.  ఆ రాజ్య అధినేత మయూరధ్వజుడు.  గొప్ప బలశాలి.  అతని కుమారుడు తామ్రధ్వజుడు మరింత గొప్ప పరాక్రమవంతుడు.  తామ్రధ్వజుడు యాగాశ్వాన్ని బంధిస్తాడు.అతనితో యుద్ధం చేసిన నకుల సహదేవులు ఓడిపోయారు.  వెంటనే భీమార్జునులు కూడా వచ్చి యుద్ధం చేస్తారు.  వారిని కూడా ఓడించి బంధిస్తాడు తామ్రధ్వజుడు. 

  దాంతో మయూరధ్వజుడు ని యుద్ధం లో ఓడించడం కష్టమని గ్రహించిన శ్రీకృష్ణుడు ధర్మరాజు తో కలిసి మాయోపాయంతో మయూరధ్వజుని ఓడించాలని వృద్ధ బ్రాహ్మణుల వేషాల్లో మణిపురం వెళ్తారు.  "దానం కావాలి"  అని అడుగుతాడు శ్రీకృష్ణుడు.  "ఏమి కావాలో కోరుకోండి విప్రోత్తములారా"  అడుగుతాడు మయూరధ్వజుడు. 

  "మహారాజా... మేము నీ దర్శనం కోరి వస్తుండగా అడవిలో ఒక సింహం ఈ బ్రాహ్మణుని సుతుడిని పట్టుకుని చంపపోయింది. బాలుడిని వదలమని మేము ప్రార్ధించగా మయూరధ్వజుని శరీరం లో సగభాగం కోసి తెచ్చినట్లయితే ఈ బాలుడిని విడిచిపెడతాను అన్నది.  కనుక మీ శరీరం లో సగభాగం కావాలి.  అది కూడా నీ భార్యా పిల్లలే నీ శరీరాన్ని కోసి ఇవ్వాలి"  అన్నాడు శ్రీకృష్ణుడు.  

  మయూరధ్వజుడు చిరునవ్వు నవ్వి "అలాగే విప్రులారా"  అని పడుకుని తనను రెండు భాగాలుగా కొయ్యమని భార్యను, తామ్రధ్వజుడ్ని ఆదేశిస్తాడు.  ఆ మాట విని ధర్మజుడు అతని దానగుణానికి నివ్వెరపోయాడు.  భార్య కొడుకు తన శరీరాన్ని ఖండిస్తుండగా మయూరధ్వజుని ఎడమ కంటినుంచి నీరు కారింది.  వెంటనే శ్రీకృష్ణుడు "నువ్వు బాధపడుతూ దానం చేస్తున్నావు.  కనుక మాకు వద్దు" అన్నాడు.  

  అందుకు మయూరధ్వజుడు "మహానుభావా... అది బాధ కాదు.  కుడి వైపు శరీరం దానానికి ఉపయోగపడుతున్నది.  నాకు ఆ అదృష్టం లేదు అని ఎడమ వైపు శరీరం బాధపడుతూ కన్నీరు కారుస్తున్నది."  అన్నాడు.  

  మయూరధ్వజుడి త్యాగానికి,  దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు, ధర్మజుడు తమ నిజరూపాలను చూపించి మయూరధ్వజుడ్ని అనుగ్రహించారు.  "మయూరధ్వజా.. నీ దానగుణం నిరుపమానం.  ఏదైనా వరం కోరుకో"  అంటాడు శ్రీకృష్ణుడు.  అప్పుడు మయూరధ్వజుడు "మహాత్మా.  నా శరీరం నశించినా సరే.. నా ఆత్మ పరోపకారార్ధం ఉపయోగపడేలా అనునిత్యం నీ ముందు ఉండేలా వరం ఇవ్వు" అంటాడు.  

 అప్పుడు శ్రీకృష్ణుడు "తధాస్తు...నేటినుంచి ప్రతి దేవాలయం ముందు నీపేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి.  నిన్ను దర్శించి నీ చుట్టూ ప్రదక్షణం చేసిన తరువాతే భక్తులు తమ ఇష్టదైవాలను దర్శిస్తారు.  అలాంటి భక్తుల కోరికలే నేను తీరుస్తాను.  నీ ముందు దీపం వెలిగించిన తరువాతే నా ముందు దీపం వెలిగిస్తారు." అని వరం ఇచ్చాడు.  

  గుడి లోకి వెళ్ళినపుడు ముందుగా ధ్వజస్తంభానికి మొక్కి, ప్రదక్షణలు చేసిన తరువాత చేసుకున్న దైవదర్శనమే నిజమైన దర్సనంగా అప్పటినుంచి ఆచారంగా స్ధిరపడ్డది. దేవుడు లేని దేవాలయం ఉండొచ్చు కానీ ధ్వజస్తంభం లేని దేవాలయం మాత్రం ఉండదు.  ఇది జైమినీభారతం లోని గాథ. 

ఈ కథ ద్వారా నేర్చుకోవాల్సిన నీతి ఏమిటి?  

ప్రజలసొమ్ము ను ఇష్టారాజ్యంగా దానధర్మాలకు ఉపయోగించకూడదు.  కేవలం కీర్తికాంక్ష తో దానాలు చెయ్యకూడదు.  

 ఆడినమాట తప్పకూడదు.  ప్రాణం పోతుందని తెలిసినా, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి. 

ఇలాంటి నీతి కథలు పిల్లలకు బోధిస్తే వారు విలువలు నేర్చుకుని వారి బుద్ధికుశలత ధ్వజస్తంభం లా నిటారుగా నిలబడుతుంది.  ప్రతిఒక్కరూ పూజిస్తారు.

అసలు భక్తి -ముక్తిని గురించి తెలుసుకుందాం!

శంకర భగవత్పాదులు ఇలా అంటారు. “మోక్షకారణ సామగ్ర్యాం భక్తిరేవ గరీయసీ స్వస్వరూపానుసంధానం భక్తి రిత్యభిదీయతే” అంటే మోక్షానికి కార​ణాలైన వాటిల్లో “భక్తి” ​గొప్పది​ అని ​. “స్వస్వరూప అనుసంధానమే” భక్తి అనబడుతుంది. భగవంతుడు దూరంగా ఉన్నాడనుకొంటే దూరంగానే ఉంటాడని, దగ్గర ​ఉన్నాడని ​అనుకొంటే దగ్గరే ​ఉంటాడని ​అని చెప్తారు! అవగాహన కానంతసేపూ దూరంగా ఉంటుంది​,​ అర్థమయితే దగ్గరే (లోపలే) ఉంటుందని అర్థం. 

చిత్త వృత్తులు పరమేశ్వరుని ​చేరి చేరి ఎల్లప్పుడూ ఉంట​మే భక్తి. ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్రా, స్మృతి అనే ఐదూ చిత్త-వృత్తుల నిరోధమే “యోగ” మనబడుతుందనీ పతంజలి మహర్షి ​చెప్పాడు . అదే భక్తి ​అని శంకరుల వివరణ.

ఇలాంటి భక్తి వలనే మానవుడు తరిస్తాడు.​ ఒక్క మాటలో చెప్పాలంటే ​భగవంతుని పట్ల ప్రేమనే భక్తి ​అనొచ్చు. అటువంటి​ ​​భక్తుల పట్ల పరమేశ్వరుడు ​సంతృప్తిగా ఉండి ,వారి బాధ్యతలను తానే భరిస్తాడు.

 “అనన్యాశ్చింతయంతోమాం​ ​ యే జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం” ఎవరైతే నన్ను అనన్య భక్తితో సేవిస్తారో వారి యోగక్షేమాలు నేనే వహిస్తాను అన్నది భగవంతుడి ​హామీ!

ఇంతకన్నా మనకు ఏమి కావాలి? ఈ భక్తి ఎప్పుడైతే ​ఏమీ ఆశించదో అప్పుడే దానిని శరణాగతి అంటారు.

చాలా మంది భక్తి భావాన్ని వివిధ కారణాల చేత ఏర్పరుచుకుంటుంటారు.​ ​కొంత మంది పుణ్యం కోసం భక్తిని పెంచుకుంటే,​ ​కొందరు పాప ​భయంతో , మరికొందరు మన అవసరాలను భగవంతుడు తీరుస్తాడ​ని భక్తిని అలవరుచుకుం​టున్నారు. భక్తులలో నాలుగు రకాల
వారుంటారని ,ఈ నాలుగు రకాల వారు భగవంతుడితో సంబంధం పెట్టుకుంటారని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెబుతాడు.

ఆ​ ​నాలుగు రకాలవాళ్ళు–​కష్టాల్లో ఉన్నవాడు, కోరికలున్నవాడు​, జిజ్ఞాసువు (అంటే జ్ఞానం పొందాలనే ఆసక్తి ఉన్నవాడు​)​​, జ్ఞాని.​ 

నేటి ప్రపంచంలో మొదటి రెండు కోవలకు చెందినవాళ్లనే మనం ​ఎక్కువగా ​​చూస్తున్నాం!

భక్తి అనేది ఒక యోగం.​

దీన్ని గురించి రెండు ఉదాహరణలు చెప్పారు.

మొదటిది మర్కట కిశోర న్యాయం. మర్కట కిశోరం అంటే కోతిపిల్ల. ఇది తన తల్లి ఒక కొమ్మ నుంచి మరొక కొమ్మకు ఎగిరేటప్పుడు తల్లి కడుపును జాగ్రత్తగా పట్టుకునే ఉంటుంది. ఇది కష్టమైన పని. వేదాంత మార్గంలో ​నడిచేవాడు దీన్ని అనుసరిస్తాడు.

రెండవది మార్జాల కిశోర న్యాయం. మార్జాల కిశోరమంటే పిల్లిపిల్ల. దీన్ని దాని తల్లే నోటితో పట్టుకుని జాగ్రత్తగా తీసుకెళుతుంది. భక్తి మార్గంలో ​నడిచేవాడు దీన్ని అనుసరిస్తాడు.

ఎవరైతే మనసా, వాచా, కర్మణా భగవంతుని యందు భక్తి కలిగి ఉంటారో ,వారి యోగక్షేమాన్ని ​భగవంతుడే భరిస్తాడనేదానికి ​ఒక యదార్ధ సంఘటనకు ఉదాహరణ.

కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ చంద్ర​శేఖర​ ​సరస్వతుల​ ​వారికి ముందు పీఠాధిపతులుగా ​అదే పేరుతో ఇంకో స్వామి వారుండేవారు. వారు అమ్మవారి​కి​ ​గొప్ప ఉపాసకులు.

 వారితో వాదభిక్ష (వాదించాలని కోరుకోవడం) కావాలని ఒకసారి కొందరు వచ్చారు.

వారిని వాదం మొదలెట్టమన్నారు స్వామి వారు.

అందుకు ​వారన్నారు “స్వామీ మీ ఒళ్ళో కూర్చున్న ఆ అందమైన పాపను చూస్తుంటే మా నోట మాట ​రావటం లేదు. ఆ పాపను ​ మాకు కనిపించకుండా చేస్తే మేము మాట్లా​డగలం ” అన్నారు.

అప్పుడు స్వామి వారన్నారు “నేనొక సన్యాసిని. నా ఒళ్ళో పాప ఆడుకోవడం ఏంటి? మీరేదో పొరబడుతున్నారు” అన్నారు.

అప్పుడు వారన్నారు “కాదు స్వామీ! మీ ఒళ్ళో పాపను ​ప్రత్యక్షంగా ​మేం చూస్తున్నాం. ​అందువల్లే మేము మాట్లాడలేకపోతున్నాం! “

అప్పుడు ​ఆ ​స్వామి ​వారు ”ఆ పాప మరెవరో కాదు. నేను ఉపాసిస్తున్న కామాక్షి అమ్మవారే​! ఆమె​కు నామీద కల ​​దయ వలనే మీరు వాదించలేక పోతున్నారు.” అన్నారు.

శరణాగతి స్థితికి చేరుకున్న భక్తులతో ,భగవంతుడు ఇలా ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటాడు​.​ భక్తి భావా​నికి అంతిమ ​లక్ష్యం ​ఏమిటంటే-జన్మరాహిత్యం.

దీనికోసం​ నిరంతరం ​భగవంతుడిపై భక్తిని ​కలిగివుండాలి . ఆ భగవత్ స్వరూపాన్ని మనలో నిక్షిప్తం ​చేసుకుంటే ​ఏదో ఒకరోజు ​ఈ జీవు​డు పరమాత్ముడితో అనుసంధానం ​అవుతాడు. దాన్నేఆత్మ సాక్షాత్కారమని అంటారు.

భగవంతుడికి కావలసింది భక్తి మాత్రమే.

మనకు ఎంత సంపద ఉందన్నది అనవసరం.​ ​భక్తితో​ ​ఎంత సమర్పించా​మన్నది మత్రామే ​ప్రధానం.

విజయమాల్యా లాంటి వాళ్ళు దేవునికి సమర్పించిన కొన్ని వేల కోట్ల కంటే​,​ బడుగుజీవి కష్టపడి కూలీనాలీ చేసుకొని సంపాదించి భక్తితో ఇచ్చిన ఒక్క రూపాయే భగవంతుడికి ప్రీతి.

కొన్ని బారువుల ​బంగారంతో సత్యభామ శ్రీ కృష్ణుడిని తూచలేకపోయింది. రుక్మిణీ దేవి అదే శ్రీ కృష్ణుడిని భక్తితో ఒక తులసీద​ళంతో ​తూచి దక్కించుకుంది. యశోద కృష్ణుడిని ఏకంగా భక్తి , ప్రేమ, అనురాగాలతో కట్టి పడేసింది!

ఎవరు జ్ఞాని?

భారతీయ జ్ఞానసంపద పురాతన కాలం నుండీ విలక్షణంగా విరాజిల్లుతున్నది. ప్రపంచ నాగరికతలు ప్రారంభమయ్యే సరికే భారతావని లో జ్ఞానసంపద సాగరమై విలసిల్లింది. ‘అతతి సర్వత్ర వ్యాప్నోతి ఇతి ఆత్మః’. ‘అంతటా వ్యాపించి ఉన్నదే ఆత్మ..’ అంటూ ఏనాడో ఆత్మకు నిర్వచన మిచ్చి ఆత్మసాక్షాత్కారం పొందిన పవిత్ర నేల ఇది. వేదాలు కర్మకాండల ద్వారా దేవతల దీవెన లు పొందేందుకు నిర్దేశించి ఉండగా, కొంతమంది ఋషులు తర్కమార్గంలో సమస్త చరాచరానికి హేతువు ఎవరనే ఆసక్తితో శోధన మొదలుపెట్టారు. వారు కనిపించే ప్రాకృతిక పదార్థాల మూలతత్త్వా న్ని ఆధారంగా చేసుకుని, కంటికి కనిపించని అనంతతత్వాన్ని పట్టుకున్నారు. ఆ జ్ఞానసంపదను ‘వేదాంతాలు’గా చెప్పబడే ఉపనిషత్తుల రూపంలో నిక్షిప్త పరిచారు. ప్రాకృతిక రూపాలకు హేతువైన సూర్యుడిని ఛేదించి, ఆ తేజస్సుకు ఆవల ఉన్న దానిని అన్వేషించి దాన్ని సాధించడం ఉపనిషత్తుల్లో కనిపిస్తుంది.

ఈ జ్ఞానఫలాలు జిజ్ఞాసి సాధన చేయనంత వరకు అర్థం కావంటే అతిశయోక్తి కాదు. ‘పూర్ణమదః పూర్ణమిదం’ అన్నది శాస్త్రం. అంటే, పూర్ణమైనటువంటి ఆత్మనుండే దృశ్యమాన ప్రపంచం ఉద్భవించింద నీ, ఆ పూర్ణం నుండి ఏ పూర్ణాన్ని తీసి వేసినా పూర్ణమే మిగులుతుందని ఓ అద్భుత నాందీ ప్రస్తావన ‘ఈశావాస్యోపనిషత్తు’లో కనిపిస్తుంది. ఈ శ్లోకార్థం ఖగోళ, గణితసూత్రాలను ప్రతిబింబిస్తుంది.

 జ్ఞానం అరిషడ్వర్గాలను హరించి వేస్తుంది. తపస్సు, ధ్యానం లాంటివి అరిషడ్వర్గాలకు తాత్కాలిక విరామాన్నే ఈయగలుగుతాయి. విశ్వామిత్రుడు, దుర్వాసుడులాంటి వారి చరిత్రలు నిరూపించింది కూడా ఇదే. కానీ, జ్ఞానమొక్కటే మేథలో ఆత్మతత్త్వాన్ని నిలుపగా అరిషడ్వర్గాలకు చోటులేకుండా పోతుంది. ఐతే, ఆత్మతత్త్వాన్ని అర్థంచేసుకోవడం అంత సులువైన విషయం కాదు. అర్థమైనా ఆచరించడానికి నిరంతర తపన అవసరం. ఆదిశంకరులు విశ్వనాథుని దర్శనార్థం గంగానదినుండి బయలుదేరగా, ఎదురైన అపరి శుభ్ర వ్యక్తిని పక్కకు తప్పుకోమంటాడు. 

ఆ తర్వాత ఆ వ్యక్తి ఆత్మ చైతన్య తత్త్వాన్ని ఈ అద్వైత సిద్ధాంతకర్తకే విడమర్చి చెప్పడం సదా స్మరణీయం. అంతుచిక్కని జ్ఞానం సముపార్జించడమంటే, వేదవేదాంగాలను మించిన పనిగా ‘ముండకోపనిషత్తు’ప్రకటించింది.

ఉపనిషత్తుల అధ్యయనం అనేది జిజ్ఞాసిని, చరాచర ప్రపం చాన్ని సృష్టించి, తనలోనే నిలుపు కున్న ఆ అనంత విశ్వాంత రాళాల లోకి తీసుకెళ్తుంది. ఆత్మతత్త్వాన్ని దొరకబుచ్చుకున్న సాధకుడిని ఆ తాత్త్వికత ఓ అద్భుతమైన వర్ణనాతీ తమైన ఆనంద డోలికల్లో ఓలలాడింప జేస్తుంది. ఆత్మసాక్షాత్కారం సాధకుడిని ’అహం బ్రహ్మాస్మి’ గా మార్చివేస్తుంది. అతనిలో భేదభావం నశించిపోతుంది. దీనివల్ల అలాంటి వారు ‘సర్వాంతర్యామి’ని తనలోనే అనుభస్తారు. తను చూసే దృశ్యమాన ప్రపంచం అంతా తానుగానే గ్రహిస్తారు. అదో అవ్యాజమైన, అనిర్వచనీయమైన ఆనందస్థితి. ‘కేనోపనిషత్తు’లో ప్రకటించినట్లుగా ప్రతి చైతన్యస్థితిలోనూ ఆత్మ ను గ్రహించే వ్యక్తే జ్ఞాని. అతనికి చర, అచరాల నడుమ భేదమేమీ కని పించదు. ఆత్మనుండి శక్తి లభించినట్లుగా, జ్ఞానం నుండే అమరత్వకరమూ లభిస్తుంది. అతనే జ్ఞానరూపంలో ఆత్మయై నిత్యమూ విరాజిల్లుతాడు.

రావుల నిరంజనాచారి 🙏

Bhagavad Gita: Chapter 2, Verse 19

य एनं वेत्ति हन्तारं यश्चैनं मन्यते हतम् |
उभौ तौ न विजानीतो नायं हन्ति न हन्यते || 19||

ya enaṁ vetti hantāraṁ yaśh chainaṁ manyate hatam
ubhau tau na vijānīto nāyaṁ hanti na hanyate

yaḥ— one who ; enam — this ; vetti
— knows ; hantāram — the slayer ;
yaḥ— one who ; cha — and ; enam
— this ; manyate — thinks ; hatam
— slain ; ubhau — both ; tau— they ;
na — not ; vijānītaḥ — in knowledge ; na— neither ; ayam —
this ; hanti— slays ; na — nor ;
hanyate — is killed

Translation

BG 2.19 : Neither of them is in knowledge—the one who thinks the soul can slay and the one who thinks the soul can be slain. For truly, the soul neither kills nor can it be killed.

Commentary

The illusion of death is created because we identify ourselves with the body. The Ramayan explains this as follows:

jauṅ sapaneṅ sira kāṭai koī, binu jāgeṅ na dūri dukh hoī. [v23]

“If we dream of our head getting cut, we will perceive its pain until we wake up.” The incident in the dream is an illusion, but the experience of the pain continues to torment until we wake up and dispel the illusion. Similarly, in the illusion that we are the body, we fear the experience of death. For the enlightened soul whose illusion has been dispelled, this fear of death vanishes.

One may ask that if nobody can kill anyone, then why is murder considered a punishable offense? The answer is that the body is the vehicle of the soul, and destroying any living being’s vehicle is violence, which is forbidden. The Vedas clearly instruct: mā hinsyāt sarvabhūtāni [v24] “Do not commit violence toward anyone.” In fact, the Vedas even consider killing of animals as a crime. However, there are occasions where the rules change and even violence becomes necessary. For example, in cases where a snake is approaching to bite, or if one is attacked with lethal weapons, or one’s life sustenance is being snatched away, then violence is permitted for self-protection. In the present situation, what is appropriate for Arjun, violence or non-violence, and why? Shree Krishna will explain this to him in great detail, as the dialogue of the
Bhagavad Gita progresses. And in the course of the explanation, priceless divine knowledge will be revealed to shed light on the subject.

విష్ణుదత్తుడు చేసిన దత్త స్తుతి

దత్తాత్రేయుని పిత్రు స్థానమున కుర్చోబెట్టి  శాస్త్రోక్తముగా శ్రాద్ధము పెట్టిన తరువాత, స్వామి తృప్తి చెందారు. 
నీకు నాశనము లేని ఫలము కలిగినదని స్వామి చెప్పగా, సాష్టాంగనమస్కారములు చేసి విష్ణుదత్తుడు ఈ విధముగా స్తుతించారు🙏...

1.🔸దత్తాత్రేయం హరిం కృష్ణం! ఉన్మాదం ప్రణతోస్మ్యహమ్!
ఆనందదాయకం దేవం! మునిబాలం దిగంబరమ్॥🙏
భావము :: దత్త దేవుడు, అత్రిపుత్రుడు, విష్ణువు, కృష్ణుడు, అనందము చే ఉన్మత్తుడు, ఆనందమును ఇచ్చె వాడు, ప్రణవస్వరూపుడు,మునిబాలుడు, దిగంబరుడు అయిన దత్తాత్రేయునికి నమస్కారించు చున్నాను.

2.🔸పిశాచరూపిణం విష్ణుం! వందేహం జ్ఞానసాగరం!
యోగినం భోగినం నగ్నం!అనషూయాత్మజం కవిమ్ ॥🙏

భావము:: పిశాచరూపుడు, సర్వవ్యాపకుడు,జ్ఞానసముద్రుడు, యోగి, భోగి, దిగంబరుడు, అనసూయా పుత్రుడు, సర్వజ్ఞుడు అయిన స్వామికి నమస్కారము.

3.🔸భోగ మోక్షప్రదం వందే! సర్వదేవ స్వరూపిణం!
ఉరుక్రమం విశాలాక్షం! పరమానంద విగ్రహం ॥🙏
భావము:: భోగమోక్షములను ఇచ్చువాడు, సర్వ దేవస్వరూపుడు, గొప్ప పరాక్రమము కలవాడు, విశాలమైన కన్నులు కలవాడు, పరమానందమే శరీరముగా కలవాడవు అగు నీకు నమస్కారము.

4.🔸వరదందేవదేవేశం వందే! కార్తవీర్యవరప్రదం !
నానారూపధరం హృద్యం! భక్త చింతామణిం గురుమ్ ॥🙏
భావము :: దేవదేవులకు ప్రభువైన వాడవు, వరములిచ్చువాడవు, కార్తవీర్యునికి అనేక వరములు ఇచ్చినవాడవు, నానారూపములు ధరించెడి వాడవు, హృదయమునకు ఇష్టుడైనవాడవు, భక్తులకు చింతామణి లాంటి వాడవు, గురువైన నీకు నమస్కారము.

5.🔸విశ్వవంద్యపదాంబోజం! యోగి హృత్పద్మవాసినమ్!
ప్రణతార్తిహరం గూఢం! కుత్సితాచార చేష్టితమ్॥🙏
భావము:: విశ్వములోని జనులందరిచే నమస్కరింపదగిన పాదపద్మాలు కలవాడవు, యోగుల హృదయములందు నివశించెడివాడవు,నమస్కారించు వారి బాధలను పోగొట్టేవాడవు, రహస్యంగా వుండెడి వాడవు, విచిత్రమైన ఆచారము, చేష్టలు కలవాడవు అయిన దత్తాత్రేయునికి నమస్కారములు.

6.🔸 మితాచారం మితాహారం! భక్ష్యా భక్ష్య వివర్జితమ్!
ప్రమాణం ప్రాణనిలయం! సర్వాధారం నతోస్మ్యహం ॥🙏
భావము:: మితమైన ఆచారము, ఆహారం కలిగినవాడు, తినతగిన ,తినకూడని ఆహారము అనే దంద్వమును విడిచిన వాడవు ( ఆహారం మీద ఇష్టం, అయిష్టం లేని వాడు), అన్నిటికీ ప్రమాణం అయిన వాడు, అందరిలో ప్రాణముల రూపంలో నివశించుచూ, సర్వమునకు ఆధారమైనవాడవగు ఓ దత్త ప్రభో! నీకు నమస్కారము.

7.🔸సిద్ధసాథక సంసేవ్యం! కపిలం కృష్ణ పింగళం!
విప్రవర్యం వేదవిదం! వేదవేద్యం వియత్సమమ్॥🙏
భావము:: సిద్ధులు, సాథ్యులు, భక్తులు అందరిచే సేవించబడేవాడు , చిత్రమైన వర్ణములు కలిగినవాడవు, నల్లని, పచ్చని రూపములు కలిగిన వాడు, విప్రులలో శ్రేష్ఠమైనవాడవు, వేదములు తెలిసినవాడవు, వేదములచే తెలియతగిన వాడవు, ఆకాశముతో సమానమైన వాడవు అగు నీకు నమస్కారము.

8.🔸పరాశక్తి పదాశ్లిష్టం! రాజరాజ్యప్రదం శివమ్!
శుభదం సుందరగ్రీవం! సుశీలం శాన్త విగ్రహమ్॥🙏
భావము:: పరాశక్తితో కూడిన వాడు,రాజరాజ్యములను ఇచ్చువాడు, మంగళ స్వరూపుడు,,శుభములు ఇచ్చువాడు,సుందరమైన కంఠం కలవాడు, మంచి స్వభావం కలిగిన వాడు, శాంతస్వరూపుడు అయిన దత్తాత్రేయునికి నమస్కారించు చున్నాను.

9.🔸 యోగినం రామయాస్పృష్టం! రామా రామం రమాప్రియం!
ప్రణతోస్మి మహాదేవం! శరణ్యం భక్తవత్సలం ॥🙏
భావము:: యోగిఅయిన వాడు, లక్ష్మిదేవి తో కూడిన వాడు, లక్ష్మీ ప్రియుడు, మహాదేవుడు, రక్షకుడు, భక్తులయందు వాత్సల్యము కలిగిన వాడవైన నీకు నమస్కారము.

10.🔸వీరం వరేణ్య
మృషభం! వృషాచారం వృషప్రియమ్!
అలిప్తమనఘం మేధ్యం! అనాదిమగుణం పరమ్ ॥🙏
భావము:: వీరుడు, ప్రార్ధనీయుడు,శ్రేష్ఠమైనవాడు, శ్రేష్ఠమైన ఆచారము కలవాడు, వృషప్రియుడు, దేనితో సంబంధము లేనివాడు, పాపములేనివాడు, ఆది లేనివాడు, నిర్గుణుడు అయిన స్వామికి నమస్కారము.

11.🔸అనేకమేక మీశానం! అనంతమనికేతనమ్ !
అధ్యక్ష మసురారాతిం ! శమం శాంతం సనాతనమ్॥🙏
భావము:: అనేక రూపములలో వున్న ఏక స్వరూపుడు, ఈశానుడు, నాశనము లేనివాడు, అందరికీ ప్రభువు, రాక్షసులకు శత్రువు, అనంతుడు, శమస్వరూపుడు, శాంతుడు, సనాతనుడు అయిన స్వామికి నమస్కారము.

12.🔸గుహ్యం గభీరం గహనం! గుణజ్ఞం గహ్వరప్రియమ్!
శ్రీదం శ్రీశం శ్రీనివాసం! శ్రీవత్సాంకం పరాయణమ్॥🙏
భావము:: రహస్యమైనవాడు, లోతైన భావములు కలవాడు, దొరకనివాడు,గుహయందు ఇష్టము కలవాడు, లక్ష్మి ని ఇచ్చువాడు, లక్ష్మి నివాసుడు, శ్రీవత్సమను పుట్టుమచ్చ కలిగినవాడు, పరబ్రహ్మమే గతిగా కలిగిన స్వామికి నమస్కారము.

13.🔸జపంతం జపతాం వంద్యం! జయంతం విజయప్రదమ్!
జీవనం జగతః సేతుం! జానానమ్ జాతవేదసమ్॥🙏
భావము:: జపించువారిలో జపించువాడును,జపస్వరూపుడు, నమస్కారింపతగిన వాడు,జయ స్వరూపుడు, విజయాలను ఇచ్చువాడు, జగత్తుకు జీవనం అయిన వాడు, అన్నిటి ఎరుక కలవాడు, జగత్తు కు సేతువైనవాడు, అగ్ని అయిన వాడు అయిన స్వామికి నమస్కారము.

14.🔸యజ్ఞమిజ్యం యజ్ఞభుజం! యజ్ఞేసం యాజకం యజుః!
యష్టారం ఫలదం వందే! సాష్టాంగం పరయా ముదా॥🙏
భావము:: యజ్ఞస్వరూపుడు,యజ్ఞమున ప్రార్థింపతగినవాడు, యజ్ఞమున హవిస్సులను తినువాడు, యజ్ఞములకు ప్రభువైన వాడు, యజుర్వేద స్వరూపుడైనవాడు, సోమయాజి అయిన వాడు, యజ్ఞ ఫలములను ప్రసాదించు వాడు, అయిన దత్తాత్రేయునికి పరమ సంతోషంతో సాష్టాంగ పడి నమస్కారించున్నాను🙏🙏🙏

         *_🍁శుభమస్తు🍁_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏

జ్ఞాన సౌందర్యం


 🌷 ధనం గురించి ,అది లభించే మార్గాల గురించి , ఎంతసేపు ఆలోచించినా కోటీశ్వరుల భజన చేసినా  ఒక్క రూపాయి కూడా లభించదు.
      
 🌷జ్ఞానం గురించి మాట్లాడుతూ,  చర్చిస్తూ, ఆలోచిస్తూ, జ్ఞానుల సాంగత్యం లో ఉంటేనే , జ్ఞానుల ని ఆరాధిస్తే  వారి  నుండి జ్ఞానం మన లోకి  ప్రవహిస్తుంది.
      
 🌷జ్ఞానం ఒక అగ్ని,  మనలోని సమస్త మాలిన్యాలని దహిస్తుంది. అహంకారం కరిగి పోతుంది.

 🌷జ్ఞానం ఒక ఐశ్వర్యం.  క్రమంగా పెరుగుతూ  జన్మ జన్మ కి వెంట వస్తుంది.
  
🌷జ్ఞానం  ఒక ప్రేమ స్వరూపం.  జ్ఞానం ఉన్నవారే
తమని ప్రేమించే వారి  హృదయాన్ని. గుర్తించగలరు. స్వయంగా అందించగలరు.

  🌷జ్ఞానం  ఒక సౌందర్యం.    జ్ఞానం పొందిన వారి
మాటల్లో. ,ప్రవర్తన లో ,  వ్యక్తిత్వం లో,  విశ్వాసాల్లో, కోరికల్లో,   వారి  ప్రతి అణువు లో  జ్ఞానమే కనిపిస్తుంది..

       ఈ కారణం గానే  శ్రీ కృష్ణుడు భగవద్గీత లో 
". *నహి జ్ఞానేన సదృశం "*  అన్నాడు.
.🙏🙏🙏💐💐💐

Before Carona After Carona

కరోనా పూర్తిగా కనుమరుగైన తర్వాత కూడా ఇలాంటి వైరస్​లు మరిన్ని పుట్టుకురావొచ్చు. అందుకే ఇప్పటిదాకా గడిపిన జీవితం వేరు.. ఇక నుంచి గడపాల్సిన జీవితం వేరు. పర్సనల్​గానే కాదు ఫ్యామిలీ మెంబర్స్​తో గడిపే లైఫ్​ కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్​, రిలేటివ్స్​, కొలీగ్స్​తో రిలేషన్​ కూడా చేంజ్​ చేసుకోవాలి.  వీటన్నింటితో పాటు.. మన అలవాట్లు కూడా మార్చుకోవాలి.

🏠🏕 *ఇంటి నుంచే మొదలవ్వాలి*🏡🏝🏕

లైఫ్​స్టైల్​ చేంజ్​ అనేది ముందుగా ఇంటి నుంచే మొదలవ్వాలి. బయటి పరిస్థితులు ఎలా ఉన్నా… ఇంట్లో ఉండాల్సి వస్తే, ఆ ఇల్లు ఆరోగ్యాన్నిచ్చేదిలా ఉండాలి. అంటే.. అవసరమైనప్పుడే ఇంట్లోకి గాలి, వెలుతురు వచ్చేలా మార్పులు చేసుకోవాలి. ఎప్పుడూ మెడికల్​ షాపు​లోని మందులపైనే ఆధారపడకుండా ఆయుర్వేదంలో ఉపయోగించే ఔషధ మొక్కలను ఇంట్లో పెంచాలి. ఇల్లు ఎప్పుడూ పొడిగా ఉండాలి. వాటర్ లీకేజీ లేకుండా రిపేర్​ చేయించుకోవాలి. అలాగే స్థలం ఉంటే బాత్రూమ్​, వాష్​రూమ్​ వంటివి ఆరుబయట ఏర్పాటుచేసుకోవాలి. బ్రష్​ చేసుకునే సింక్​ వంటివి కూడా ఇంట్లో కాకుండా బయటే ఉంటే బెటర్​. ఇంట్లోని ఫ్లోర్​ను ఈజీగా క్లీన్​ చేసుకునేలా స్పేస్​ ఫ్రీగా ఉంచుకోవాలి. అవసరంలేని వస్తువులన్నింటిని అటకెక్కించాలి.

🗒 *కిరాణా లిస్ట్​ మారాలి* 🗒

ఇప్పటిదాకా కిరాణా లిస్ట్​ కేవలం వంటింటి సరుకులు, సబ్బులు, సర్ఫ్​లకే పరిమితమయ్యేది. ఇకపై ఆ లిస్ట్​లో హ్యాండ్​వాష్, శానిటైజర్​ వంటివి కూడా చేర్చాలి. ఇప్పుడు కరోనా కలకలం ఉంది కదా అని మాత్రమే చేతులు కడుక్కుంటే సరిపోదు. ఇకపై కూడా చేతులు శుభ్రంగా ఉంచుకోవడం అలవాటుగా మార్చుకోవాలి.
అందుకే ఇంట్లో ఎప్పుడూ హ్యాండ్​వాష్​, బ్యాగ్​లో ఎప్పుడూ శానిటైజర్​ ఉంచుకోవాలి.

🍉🍊🍅🍋🥥🍌🥬🥒🌶🍆🌽🧅🥦🥕🥭🍑🍈🍒 *ఫుడ్​ హ్యాబిట్స్ మారాలి*

కాలంతో సంబంధం లేకుండా వేడి వేడివి  మాత్రమే తినాలి. ఫ్రిజ్​లో పెట్టి తినే అలవాటు మార్చుకోవాలి. కేవలం రుచికోసమే కాకుండా ఆరోగ్యం గురించి కూడా ఆలోచించి అన్నిరకాల ఆహారపదార్థాలు తినడం అలవాటు చేసుకోవాలి. జంక్​ ఫుడ్​, కూల్​ డ్రింక్స్​ వంటివాటికి వీలైనంత దూరంగా ఉండాలి.  తాజా కూరగాయలు, పండ్లు, మొలకెత్తిన గింజలు, డ్రైఫ్రూట్స్​ వంటివి రెగ్యులర్​గా తినాలి. నిజానికి జంక్​ఫుడ్​తో పోలిస్తే వీటికి అయ్యే ఖర్చు చాలా తక్కువే. ఫ్రిజ్​లో నీళ్లు తాగడం మానేసి వేడి నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. అంతగా చల్లటి నీళ్లు తాగాలనుకుంటే కుండలో నీళ్లు తాగాలి.

 🧘‍♂🧘‍♀ *వర్కవుట్స్​ కంపల్సరీ* 

శరీరానికి తగినంత ఇమ్యూనిటీ​ ఉంటే వైరస్​లు, బ్యాక్టీరియాల వల్ల వచ్చే వ్యాధులన్నింటినీ దాదాపు తరిమికొట్టొచ్చు. అదే లేకపోతే మనం ఎన్నిజాగ్రత్తలు తీసుకున్నా లాభం ఉండదు. మరి ఈ ఇమ్యూనిటీ కోసం మంచి ఫుడ్​ మాత్రమే తీసుకుంటే సరిపోదు. శరీరంలోని ప్రతి వ్యవస్థ బలంగా మారేలా వర్కవుట్స్​ కూడా చేయాలి. ఇప్పటిదాకా అలవాటు లేకపోయినాసరే.. ఇక నుంచి వర్కవుట్స్​ హాబీగా మారాలి. యోగ, ధ్యానం, ప్రాణాయామం వంటివి కూడా ప్రాక్టీస్​ చేయాలి. వీటిని ఏదో ఒక మతానికి సంబంధించినవిగా చూడొద్దు.

 🛀 🚿 *పర్సనల్​  హైజీన్​* 🚿🚰

వ్యక్తిగత పరిశుభ్రత అనేది ఎప్పుడూ అవసరమే. బిజీ షెడ్యూల్​ ఉందని స్నానం చెయ్యకుండా ఉండొద్దు. తరచూ కాళ్లు, చేతులు కడుక్కోవడం అనేది ఎప్పుడూ కంటిన్యూ చేయాలి. ఇంట్లోకి అడుగుపెట్టకముందే కాళ్లు, చేతులు, ముఖం శుభ్రంగా కడుక్కోవాలి. అంతేగానీ.. అలసిపోయి వచ్చామంటూ సోఫాలో అలాగే సాగిలపడొద్దు. వీలైతే ఆఫీస్​ నుంచి వచ్చాక కూడా వేడివేడి నీళ్లతో స్నానం చేయాలి. అంతేకాకుండా తరచూ చేతులతో ముఖాన్ని, శరీర భాగాలను తాకే అలవాటు కూడా మార్చుకోవాలి.

🧹🚽🪒🧽 *శుభ్రత* 

ఇంటిని, పరిసరాలను మాత్రమే శుభ్రం  చేసుకుంటే సరిపోదు. వైరస్​లు, బ్యాక్టీరియాలబారిన పడకుండా ఉండాలంటే ఇంటితోపాటు ఇంట్లో ఉండే వస్తువులను, పర్సనల్​గా మనం వాడే వస్తువులను కూడా క్లీన్​ చేసుకోవాలి. ల్యాప్​టాప్​, ఫోన్​, వ్యాలెట్, హ్యాండ్​ బ్యాగ్​, కంప్యూటర్​, కీబోర్డ్, టీవీ రిమోట్​, రిస్ట్​ వాచ్​, బుక్స్​ వంటివి క్లీన్​ చేయడం గురించి ఆలోచించం. కానీ వీటిని ఎప్పటికప్పుడు క్లీన్​ చేసుకోవాలి. ఎందుకంటే నిజానికి వీటివల్లే  వైరస్​ స్ప్రెడ్​ అవుతుంది.

 👨‍👨‍👦 *పిల్లలు, పెద్దల పట్ల..*

పిల్లలు, పెద్దల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా అస్సలు ఉండొద్దు. ‘జ్వరమేకదా.. జలుబే కదా.. దగ్గు కామనే’.. అంటూ నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఎప్పుడూ ఇలాగే వస్తుంది కదా, అదే తగ్గిపోతుందిలే అనే వైఖరి ఇకపై మారాలి.  అలాగని మెడికల్​ షాపు​ నుంచి ఏదిపడితే అది తెచ్చి వేయొద్దు. పిల్లలను శుభ్రంగా ఉంచడంతోపాటు వాళ్లకు బలమైనవి తినిపించాలి. ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చిన వెంటనే డాక్టర్​ను కలవాలి. ఎక్కువయ్యేదాకా ఆగడం మంచిదికాదు. పెద్దోళ్ల విషయంలో కూడా ఇలాగే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పిల్లలు, వృద్ధుల్లో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందనే విషయాన్ని గుర్తించాలి.

 🚷 *అవుట్​డోర్​ మీటింగ్స్​..* ,

టైంపాస్​ కాకపోతే అలా బ

యటకి వెళ్లొస్తామంటూ వెళ్లిపోతారు. సెలవు దొరికితే షికార్లకు ప్లాన్​చేస్తారు. కొన్నిసార్లు నేరుగా కలవాల్సిన​ అవసరం లేకపోయినా వెళ్లి కలిసి వస్తారు. బ్యాంకులు, బిల్లుల చెల్లింపు వంటివాటి కోసం గంటల తరబడి లైన్లలో నిలబడతారు. నిజానికి ఇవన్నీ ఇంటి నుంచే చేసుకోవచ్చు. అందుకే ఇకపై అవుట్​డోర్​ మీటింగ్స్​ను సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. వీలైనంత వరకు ఫోన్​, ఆన్​లైన్​ చాటింగ్​ ద్వారానే పూర్తయ్యేలా చేసుకోవాలి. తప్పనిసరి అయితే తప్ప బయటికి వెళ్లొద్దు.

 *సెల్ఫ్​ డిసిప్లిన్​..* 

సెల్ఫ్​ డిసిప్లిన్​ తప్పనిసరి. అది ఇంట్లో ఉన్నా సరే.. బయటకెళ్లినా సరే. ఎక్కడైనా ‘క్యూ’లో నిలబడాల్సి వస్తే మనిషికి, మనిషికి మధ్య స్పేస్​ ఉండేలా నిలబడాలి. విదేశాల్లో ఈ కల్చర్​ ఉన్నా.. మనదేశంలో మాత్రం మీదపడి తోసుకోవడమే. అంతేకాదు.. తుమ్మినా, దగ్గినా దస్తీ​ అడ్డంగా పెట్టుకోవాలి. మాట్లాడేటప్పుడు కూడా దూరంగా ఉండి మాట్లాడాలి. తుంపర్లు పడేలా మరీ దగ్గరగా ఉండొద్దు.

🌹🌻🌷సర్వేజనా సుఖినోభవంతు...

ఆత్మ శుద్ధత్వమే బ్రహ్మత్వ సిద్ధి

మన పాంచభౌతిక దేహమే 'క్షేత్రం'. ఈ దేహాన్ని ధరించిన మనమే 'క్షేత్రజ్ఞులం'. ఈ దేహానికి సంబంధించిన ఎరుకనే 'క్షేత్రజ్ఞత్వం'. ఈ దేహ క్షేత్ర అస్తిత్వానికి ఆధారమైన పురుషోత్తముడే 'క్షేత్రి'.

పంచభూతాలతో రూపుదిద్దుకున్న మానవ అవతారం ఎప్పటికైనా పంచభూతాలలో కలవవలసిందే! అయితే రూపుదిద్దుకోవటానికీ, కరిగిపోవటానికీ నడుమ జరిగే సంగ్రామమే మానవ జీవితం. ఈ అశాశ్వతత్వ దేహంలోకి శాశ్వతత్వ ఆత్మ పుట్టుకతో ప్రవేశించినా శరీరం నశ్వర స్థితికి చేరేప్పటికి మరణం రూపేణా భౌతికాన్ని వీడుతోంది. దేహంలో ఉన్నప్పటికీ భౌతిక తత్వానికే దేహి పరిమితమై ఉన్నంతకాలం ఆత్మ వౌన ప్రేక్షకురాలిలా ఉండిపోతోంది.

అలా కాక దేహి భౌతికం నుండి అధిభౌతికం వైపు మరలినప్పుడు ఆత్మ భౌతిక జీవనంలో సైతం జోక్యం చేసుకోవటం ప్రారంభిస్తుంది.. ప్రభావవంతంగా దేహ చైతన్యాన్ని ఆత్మ చైతన్యంగా మలుపు తిప్పుతుంది. దేహిని 'అహం'కారాదుల నుండి, ఇంద్రియ వైభోగాల నుండి బయటపడేయటానికి సంయమన వర్తనం సాగించటానికి ప్రయత్నిస్తుంటుంది. దీనే్న క్షేత్ర క్షేత్రజ్ఞ యోగంగా భగవద్గీత చెబుతుంది.

ఈ క్షేత్ర క్షేత్రజ్ఞ యోగ ఎరుకతో జ్ఞానయోగం వైపు దృష్టి మరలుతుంది. యోగ సాధనలో జ్ఞాన నేత్రం విచ్చుకోవటం, విప్పారటం అంటే ఇదే! క్షేత్ర, క్షేత్రజ్ఞులు భౌతికాలు కాబట్టి రెంటికీ రూపం ఉంది.. రెండూ దృశ్యమానాలే.

అయితే అటు క్షేత్ర చైతన్యానికి ఇటు క్షేత్రజ్ఞ చైతన్యానికి మూలమైన ఆత్మ, పరమాత్మలు మాత్రం అభౌతికాలు, అరూపాలు, అదృశ్యాలు. దేహాన్ని మనం పుడమిపైని పుట్టుకనో లేదా తల్లి గర్భంలో ఉంటూ పరిణమిస్తూ వచ్చిన స్థితినో 'ఆది'గాను, 'ప్రారంభ' దశగాను చెప్పకోగలమే కానీ ఆత్మకు కానీ, పరమాత్మకు కానీ ప్రారంభ దశనీ, ఆది స్థితినీ చూడలేం. అలాగే ఆత్మ అధీనంలోనివే మానవ రూపానికి ఆధారమైన పంచభూతాలు సైతం. ఇలా భూత వైవిధ్యతలూ, భూత ఉత్పత్తి వికాసాలూ ఆత్మాశ్రీతాలే!

ఆత్మ చైతన్యంతో పరిణమించేవే!! ఆ ఆత్మ చైతన్యంతో పరిఢవిల్లేవే!! అందుకే భగవద్గీత- 'యదా భూత పృథగ్భావమేకస్థమను పశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా' అని అంటుంది. మనం సామాన్యంగా మానవ అవతరణకు 'మూలం'గా పరమ పురుషుడ్ని చెప్పుకుంటుంటాం.

మానవ ఆత్మకు మూలంగా 'పరమాత్మ'ను పేర్కొంటుంటాం. మానవ చైతన్యాన్ని సైతం ఆ ప్రత్యగాత్మ చైతన్యపాయ అనే అర్థం చేసుకో ప్రయత్నిస్తుంటాం. అలాగే ప్రకృతిని సైతం ఒక 'మూల ప్రకృతి' ఆధారితంగానే చూస్తుంటాం. నిజానికి 'ప్రకృతిం పురుషం చైవ విద్ధ్య నాదీ ఉభావపి' అంటూ ప్రకృతికీ, పురుషుడికీ 'ఆది' అనేదే లేదంటుంది భగవద్గీత.

అందుకే ప్రకృతిని కానీ, పురుషుడ్ని కానీ సత్-చిత్-ఆనంద అస్తిత్వాలుగా చెప్పుకోగలమే కానీ వస్తు రూపేణా చెప్పుకోలేం. అంతెందుకు, ఈ మానవ జన్మ లేదా మానవ దేహం కార్యసంపన్న కాబట్టి, ఆ కార్యమగ్నతకు వలసిన ఇంద్రియ వ్యవస్థకు 'ప్రకృతి' హేతువు అయవుంటుంది. ఆ ఇంద్రియ చైతన్యంతో కలిగే సుఖదుఃఖాలకు హేతువు పురుషుడు అవుతుంటాడు. అందుకే మానవ అవతారంలోని పురుషుడ్ని అంటే జీవుడ్ని భోక్త, కర్త అనీ అంటుంటాం.

ఈ ఎరుక లేకపోవటమే అవిద్య, అజ్ఞానం. ఈ అజ్ఞానం ప్రిదిలిపోవటమే స్వతంత్రమవటం, స్వతంత్రించటం. అజ్ఞానం, అవిద్య ప్రిదిలిపోవటానికి ఉపకరించేదే యోగ సాధన. నిరంతర యోగ సాధనతో కర్మ, భక్తి, రాజ, సాంఖ్య యోగ పథాలలో గికత్వం సాధ్యవంటుంది భగవద్గీత.

* భగవద్గీత పరమాత్మను 'క్షేత్రి' అంటుంది. అన్ని క్షేత్ర ఆత్మల చైతన్యం ఆ క్షేత్రి చైతన్యమే అంటుంది. చీకటి అనేది లేనిది, సూర్య తేజస్సుకు సైతం మూలమైంది ఈ పరమాత్మ జ్యోతిస్సే. అదే పరంజ్యోతి.

పైగా భూత చైతన్యానికి ఆంతర్యంగాను బాహ్యంగాను ఉన్నది కూడా ఆ పరమాత్మ చైతన్యమే. పైగా - 'సర్వేన్ద్రియ గుణాభాసం సర్వేన్ద్రియ వివర్జితమ్ అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృ చ' ఇంద్రియ చైతన్యమంతా ఆ పరమాత్మ చైతన్యానిదే అనిపిస్తుంటుంది. మానవ గుణాల కన్నిటికీ మూలం అదే అనిపిస్తుంటుంది. అయినా దేనికీ అది కట్టుబడి ఉండదు.

పైగా ఎటువంటి పరిస్థితిలోను కేవలం భౌతిక స్పృహకే పరిమితమైంది కాదు. ఒక విధంగా భౌతికత్వాన్ని వీడిన తర్వాత కలిగే ఇంద్రియాతీత స్పృహ ఇది. అది ఎంతలా ఎన్ని కోట్ల యోజనాల దూరంలో ఉన్నప్పటికీ 'ఆత్మ'కు సమీపంగానే ఉంటుంది. మానవ అవతారంలోని హృదయ స్థానమే ఈ అంతర్యామి స్థావరం.

అనేకానేక అలల చైతన్యం ఆ పరమాత్మ చైతన్య పాయనే.. అసంఖ్యాక జలధారలు చైతన్యమూ ఆ పరమాత్మ చైతన్య అంశనే.. ప్రవహించే నదుల, కాలువల చైతన్యమూ ఆ పరమాత్మ చైతన్య ఉధృతే. అలాగే మానవ క్షేత్ర ఆత్మల చైతన్యమూ ఆ పరబ్రహ్మ చైతన్యమే.

అంతెందుకు మానవ గుణ సంపన్నతలా కానవచ్చే అధిభౌతిక తాత్విక చైతన్యమూ ఆ పరమాత్మ చైతన్యానిదే. అందుకే మన దేహానికే కాదు చివరికి ప్రకృతికి సైతం అతీతమైందిగా పరమాత్మ అస్తిత్వాన్ని పరిగణిస్తుంటాం. * ఇంతకీ భగవద్గీతలోని పదమూడవ అధ్యాయం క్షేత్ర - క్షేత్రజ్ఞ - విభాగ యోగం. ఈ అధ్యాయంలో 5 నుండి 11 వరకు ఉన్న ఏడు శ్లోకాలు దేహతత్వ
గురించి, దేహాతీత తత్వాన్ని గురించి విపులీకరిస్తుంటాయి.

'మహాభూతాన్యహంకారో బుద్ధి రవ్యక్త మేవ చ ఇన్ద్రియాణి దశైకం చ పఞ్చ చేన్ద్రియగోచరాః' 'ఇచ్ఛా ద్వేషః సుఖం దుఃఖం సంఘాతశే్చతనా ధృతిః ఏ తత్ క్షేత్రం సమాసేన సవికార ముదాహృతమ్' గాలి, నీరు, నిప్పు, ఆకాశం, మట్టి అయిన అయిదు భూతాలు, అహంకారం, అవ్యక్తం, బుద్ధి- వీటితోపాటు అయిదు కర్మేంద్రియాలు, అయిదు జ్ఞానేంద్రియాలు, మనో రూపేంద్రియం, అయిదు ఇంద్రియ గ్రహ శబ్ద విషయాలతో పాటు ఇచ్ఛ, ద్వేషం, సుఖం, దుఃఖం, దేహేంద్రియ సంపద, అంతఃకరణ జ్ఞానం, ధైర్యం - ఇవన్నీ దేహిక వికారాలు. వీటి సమ్మేళనమే మానవ క్షేత్రం. నిజానికి పైకి ఇవి దైహిక స్వభావంలా అనిపిస్తుంటాయి కానీ అవి దైహిక వికారాలు. అంటే స్వభావతః లేనివి..

పుడమిని తాకటంతో గుణాలుగా వచ్చి చేరేవి. వచ్చి చేరుతున్న ఈ గుణాలను నిలుపుదల చేయటం యోగ సాధన వల్లనే సాధ్యం. ఇనుప ఊచ వంగుతుంది. భగభగమండే అగ్నిలో కాలినపుడు.

అగ్ని కారణంగా ఇనుముకి ఆ వంగే గుణం కలుగుతోంది. అలాగే, ఆత్మ జీవులమైన మనలను, స్వభావంలో లేని 'ప్రాపంచిక చేరిక'ల వల్ల, గుణాలు వికారాలు కలుషితం చేస్తున్నాయి. ఈ వికార కాలుష్యం నుండి వైదొలగడమంటే- నిగర్వి కావాలి; డాంబిక వర్తనం కూడదు; సహనం, ఋజు స్వభావం, స్థిరత్వం, నిగ్రహం, వైరాగ్యం, నిరహంకారం, వొంటబట్టాలి; జన్మ - మృత్యు - జరా - వ్యాధి దుఃఖాల దోషాలను గుర్తించగలగాలి; దేనిపైనా అమితాసక్తి లేకుండాలి; సమచిత్తం అలవడాలి. ఈ వర్తనం వల్లనే సాధనా జీవితం సాధ్యవౌతుంది.

ఆ సాధనా జీవితం గికత్వాన్ని అందిస్తంది.. ఆ గికత్వం వల్లనే బ్రహ్మత్వం సిద్ధిస్తంది. అదే బ్రహ్మ సాక్షాత్కారం.. అదే బ్రహ్మజ్ఞానం..

ఆ బ్రహ్మమూ మనమూ ఒక్కటే అన్న స్థితికి చేరుకోవటం ఆత్మ దర్శనమే! అహం బ్రహ్మస్మి. ఆత్మ తన ఆధ్యాత్మికత్వ ఎరుకలేక భౌతిక వ్యామోహంలో పడిపోవటం వల్ల తన మానవ అవతరణ లక్ష్యాన్ని విస్మరిస్తుంటుంది. అయితే ఏమాత్రం మానవ ఆత్మ తన మానవ అవతరణ లక్ష్యాన్ని పసిగట్టగలిగినా అది భౌతిక మాయామోహిత వాతావరణం నుండి బయటపడి విశ్వవ్యాప్త ఆచరణ పథం పడుతుంది - జ్ఞాన యోగంతో కానీ, సాంఖ్య యోగంతో కానీ, కర్మ యోగంతో కానీ!

మనకు కావలసిన పురుషోత్తమ యోగం ఇదే!

Srimadramayana

 తార " లక్ష్మణా! ఎందుకు అంత కోపంగా ఉన్నావు?  నీకు ఇంత కోపం తెప్పించడానికి సాహసించిన వాళ్ళు ఎవరు? ఎండిపోయిన చెట్లతో కూడిన వనాన్ని దావాగ్ని దహించేస్తుంటే దానికి ఎదురు వెళ్ళగల మొనగాడు ఎవరు? " అన్నది.             
లక్ష్మణుడు " నీ భర్త యొక్క ప్రవర్తన ఆయన భార్యవైన నీకు తెలియడము లేదా?  నీ భర్త ధర్మాన్ని పక్కన పెట్టేసి కేవలము  కామమునందే కాలాన్ని గడుపుతున్నాడు. (మనకి ధర్మ, అర్ధ, కామ, మోక్షాలు అని నాలుగు పురుషార్ధములు ఉంటాయి. ధర్మబద్ధమైన అర్ధము ( కష్టపడి సంపాదించినది) ధర్మబద్ధమైన కామము (కేవలం తన భార్య అందే కామసుఖాన్ని అనుభవించడము) వలన మోక్షము వైపు అడుగులు వేస్తాము. ధర్మాన్ని పక్కన పెట్టి మనం ఎంత డబ్బు సంపాదించినా ఎన్ని సుఖములు అనుభవించినా ప్రమాదమే వస్తుంది). మిత్రుడికి ఇచ్చిన మాట తప్పాడు. నాలుగు నెలల సమయము  గడిచిపోయింది.
న చింతయతి రాజ్యార్థం నాఽస్మాన్ శోక పరాయణాన్ |
సామాత్య పరిషత్తారే  పానమేవోపసేవతే ||
రాజన్నవాడు అనుభవించాల్సింది కేవలము కామము ఒక్కటే కాదు. రాజు మొట్టమొదట మంత్రి పరిషత్తుతో కూడి సమాలోచన చేసి రాజ్యకార్య నిర్వహణ చెయ్యాలి. ఇవన్నీ నీ భర్త చేస్తున్నాడా? వర్షాకాలంలో వెతకడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ నాలుగు నెలలు సుఖములను అనుభవించి నాలుగు నెలల తరువాత స్నేహితుడికి ఇచ్చిన మాట ప్రకారము  సహాయము చెయ్యమంటే ఇచ్చిన సమయము  గడిచిపోయినా ఇంకా కామసుఖాలని అనుభవిస్తూ ఉన్న సుగ్రీవుడిది దోషం కాదా? ఇవ్వాళ నీ భర్త నిరంతర మధ్యపానం చేస్తుండడంవలన ఆయన బుద్ధియందు వైక్లబ్యము ఏర్పడింది. మధ్యపానమునందు రమిస్తున్న సుగ్రీవుడు పురుషార్ధములయందు చెడిపోయాడు " అన్నాడు.
 తార " నాయనా! ఇది కోపగించవలసిన కాలం కాదు. ఎవరో బయటివాళ్ళు చెడిపోతే నువ్వు కోపంతో గట్టిగా కేకలు వెయ్యచ్చు నిగ్రహించవచ్చు చంపవచ్చు. ఇవ్వాళ నీ అన్నతో సమానమైన సుగ్రీవుడు కామానికి బానిస అయ్యాడు. అటువంటి సుగ్రీవుడి మీద నీకు ఇంత కోపం తగదు  'సుగ్రీవుడిది దోషము' అని నువ్వు చెప్పినది పరమ యదార్ధము. నువ్వు గుణములు ఉన్నవాడివి కనుక సుగ్రీవుడిని క్షమించు.  లక్ష్మణా! నువ్వు చాలా గుణాలు ఉన్నవాడివి. నీకు  శాస్త్ర మర్యాద తెలుసు. నా భర్త చాలా అల్పమైన గుణములు ఉన్నవాడు. కామమునకు లొంగిపోయాడు. మరి నువ్వు కోపమునకు లొంగిపోతున్నావేమిటి ?
లక్ష్మణా! నువ్వు ప్రత్యేకించి ఇక్కడికి వచ్చి అరుస్తున్నావు. రాముడు బాణం వేస్తే ఆ ప్రభావము ఎలా వుంటుందో నాకు తెలుసు. సుగ్రీవుడు ఎంత విలువైన కాలాన్ని చేజార్చుకున్నాడో నాకు తెలుసు. దానివల్ల రాముడు ఎంత బాధపడుతున్నాడో నాకు తెలుసు. ఈ మూడుతప్పులు జరిగాయి కనుక మీకు ఉపకారము ఎలా చెయ్యాలో కూడా నాకు తెలుసు. ఎంతో తీవ్రముగా ఉండే  మన్మధుని బాణముల దెబ్బకి కామానికి ఎంత తొందరగా పడిపోతారో, ఏ కాముని బాణముల దెబ్బకి సుగ్రీవుడు ఇలా ఉన్నాడో, ఆ సుగ్రీవుడు ఎవరి పొందుయందు సంతోషముగా ఉన్నాడో నాకు తెలుసు. శత్రువులని చంపే ఓ లక్ష్మణా! ఇవ్వాళ సుగ్రీవుడు తన ఇంద్రియాలకి లొంగిపోయాడు. ఆయనకి రాముడి మీద ఎటువంటి ద్వేషభావము లేదు. అందుకని నువ్వు ఆయనని క్షమించి తీరాలి.
మహర్షయో ధర్మతపోభికామాః కామానుకామాః ప్రతిబద్ధ మోహాః |
అయం ప్రకృత్యా చపలః కపిస్తు కథం న సజ్జేత సుఖేషు రాజా  ||     
నేను కొత్తగా చెప్పాలా ! నీకు తెలీదా?  సంసారాన్ని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళి తపస్సు చేసుకునే మహర్షులు ఇంద్రుడు పంపిన అప్సరసలని చూసి కామానికి లొంగి తమ తపస్సులను భ్రష్టు పట్టించుకున్నవారు చాలామంది ఉన్నారు. అంత గొప్ప మహర్షులే కామానికి లొంగిపోయినప్పుడు చపలబుద్ధి కలిగిన వానరుడు కామంతో చెయ్యవలసిన పనిని కొన్ని రోజులు మరిచిపోవడము  పెద్ద విషయము కాదు. సుగ్రీవుడు ఇంతగా కామానికి లొంగిపోయినప్పటికీ కూడా మీకు ఇచ్చిన మాటని నెరవేర్చడానికి ఎప్పుడో ప్రయత్నాలు ప్రారంభించాడు.
లక్ష్మణా! పరాయివాడిలా ఇక్కడే నిలబడి ఉన్నావు. నువ్వు అంతఃపురంలోకి రాకూడదా! నువ్వేమన్నా పరాయివాడివా! సుగ్రీవుడు పడుకున్న మందిరంలోకి వస్తే అంతఃపుర కాంతలు కనిపిస్తారని సందేహిస్తున్నావా! అన్యభావన లేకుండా మిత్రుడితో కూర్చుని మాట్లాడేవాడు చారిత్రము ఉన్నవాడు నడువడి ఉన్నవాడు అంతఃపురంలోకి రావచ్చు ఏమి దోషంలేదు లోపలికి రా " అన్నది.
బంగారు కన్నుతో మెరిసిపోతున్న సుగ్రీవుడు తన తొడ మీద రుమని కూర్చోపెట్టుకొని గట్టిగా కౌగలించుకొని ఉన్నాడు. తెర తీసుకొని లక్ష్మణుడు లోపలికి రాగానే సుగ్రీవుడికి తన దోషం జ్ఞాపకము వచ్చి గబుక్కున ఎగిరి లక్ష్మణుడి దగ్గర వాలి శిరస్సు వంచి అంజలి ఘటించాడు.
సుగ్రీవుడి చూడగానే లక్ష్మణుడికి కోపం వచ్చి " సుగ్రీవా! రాజన్నవాడు ఉత్తమమైన అభిజనంతో కూడి ఉండాలి. జాలికలిగినవాడై ఉండాలి.
 ఇంద్రియములను గెలిచినవాడై ఉండాలి. చేసిన ఉపకారాన్ని మరిచిపోనివాడై ఉండాలి. మాట తప్పనివాడై ఉండాలి. అటువంటివాడిని ఈలోకం రాజని గౌరవిస్తుంది. మిత్రుడి దగ్గర సహాయము పొంది, ఆ మిత్రుడికి తిరిగి ఉపకారం చెయ్యనివాడిని ఈ లోకం క్రూరుడు అని పిలుస్తుంది.
శతమ్ అశ్వానృతే హంతి సహస్రం తు గవానృతే |
ఆత్మానం స్వజనం హంతి పురుషః పురుషానృతే ||
ఎవడైనా గుఱ్ఱం విషయంలో అసత్యం చెబితే (అంటే  ఎవరికన్నా గుఱ్ఱము ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఉండడం) నూరు గుఱ్ఱములని చంపిన పాపము వస్తుంది. ఆవు విషయములో అసత్యం చెబితే వెయ్యి ఆవుల్ని చంపిన పాపము వస్తుంది. ఉపకారము చేస్తానని చెప్పి ఆ మాటకి కట్టుబడనివాడు తన బందువులందరిని చంపి వారిని తినేసి తననితాను చంపుకున్నవాడితో సమానమవుతాడు. ఒకరి దగ్గరికి వెళ్ళి ' అయ్యా! మీరు నాకు ఉపకారం చెయ్యండి, నేను మీకు ప్రత్యుపకారం చేస్తాను ' అని మాట పుచ్చుకొని వారి దగ్గరినుండి ఉపకారమును పొంది దాని ఫలితాన్ని అనుభవిస్తూ తాను ఇచ్చిన మాట మరిచిపోయినవాడిని లోకం అంతా కలిసి చంపేస్తుంది.
బ్రహ్మఘ్నే చ సురాపే చ చోరే భగ్నవ్రతే తథా |
నిష్కృతిర్విహితా సద్భిః కృతఘ్నే నాస్తి నిష్కృతిః ||
బ్రహ్మహత్య చేసినవాడికి, మధ్యపానము చేసినవాడికి, దొంగతనము చేసినవాడికి, ఒక వ్రతం చేస్తాను అని చెయ్యడము మానేసినవాడికి ప్రాయశ్చిత్తము ఉండవచ్చు. కృతఘ్నుడికి ప్రాయశ్చిత్తము లేదు. నువ్వు రాముడికి ఉపకారం చేస్తానని ఒప్పుకున్నావు కాని ప్రత్యుపకారము  చెయ్యలేదు. నీ ప్రవర్తన చూసి మా అన్నయ్య నిన్ను మంచివాడు అనుకున్నాడు. నువ్వు కప్పలా అరుస్తున్న పామువని మా అన్నయ్య కనిపెట్టలేకపోయాడు. నువ్వు మా అన్నయ్యకి చేసిన దోషానికి నిన్ను ఇప్పుడే చంపేస్తాను. నీ మాట మీద నువ్వు నిలబడు. లేకపోతే వాలి వెళ్ళిన దారిలో వెళ్ళవలసి ఉంటుంది " అని లక్ష్మణుడు అన్నాడు.
లక్ష్మణుడు మాట్లాడుతున్నంతసేపు నక్షత్రముల మధ్యలో ఉన్న చంద్రుడిలా సుగ్రీవుడు తన భార్యల మధ్యలో చేతులుకట్టుకొని నిలబడిపోయి ఉన్నాడు. తార " లక్ష్మణా! నీ నోటి వెంట సుగ్రీవుడి గురించి ఇటువంటి మాటలు రాకూడదు. సుగ్రీవుడు కుటిలుడు కాదు. అసత్యవాది కాదు. ఇంద్రియనిగ్రహము లేనివాడు,  శఠుడు కాదు. రాముడు చేసిన ఉపకారము  సుగ్రీవుడు ఎన్నడూ మరిచిపోలేదు. రాముడు చేసిన ఉపకారము వల్లనే సుగ్రీవుడు ఈనాడు ఇంత గొప్ప రాజ్యాన్ని, ఐశ్వర్యాన్ని, రుమని, నన్ను పొందగలిగాడు. చాలా కాలం సుఖాలకి దూరముగా ఉండడం వలన సుగ్రీవుడు ఈనాడు సమయాన్ని మరిచిపోయాడు. నా భర్తేనా అలా మరిచిపోయినవాడు? విశ్వామిత్రుడంతటివాడు కూడా కామానికి లొంగి సమయాన్ని మరిచిపోయాడు కదా! ఏ రుమయందు, ఏ రాజ్యమునందు, నా యందు ఆనందముతో సుగ్రీవుడు ఈనాడు సమయాన్ని మరిచిపోయాడో, అదే సుగ్రీవుడు రామకార్యము కోసం అవసరమైతే నన్ను, రుమని, రాజ్యాన్ని వదిలేస్తాడు. రావణుడు యుద్ధంలో నిహతుడవుతాడు. చంద్రుడితో రోహిణి కలిసినట్టు కొద్దికాలంలోనే సీతమ్మ రాముడితో కలవడము సుగ్రీవుడు చూస్తాడు.

శత కోటి సహస్రాణి లంకాయాం కిల రాక్షసాః |
అయుతాని చ షట్ త్రింశత్ సహస్రాణి శతాని చ ||
నాయనా! లంకలో నూరు వేల కోట్ల రాక్షసులు(1 ట్రిలియన్), మరియు 36 వేల సంఖ్యలో( ఒక్కొక్క సంఖ్యలో 100 మంది సైనికులు) బలగాలు ఉన్నాయి. వాలి బతికి ఉన్నప్పుడు ఈ విషయాలని నాకు చెప్పాడు. నాకు పూర్తిగా తెలియదు. అంతమంది రాక్షసులని మట్టుపెట్టడానికి మనకి కూడా కొన్ని కోట్ల కోట్ల వానర సైన్యం అవసరముంది. అందుకని సుగ్రీవుడు వానర సైన్యం కోసం కబురుపెట్టాడు. నువ్వు బాణ ప్రయోగము  చేస్తాను అంటుంటే, ఆనాడు రాముడి బాణానికి వాలి పడిపోయిన సంఘటన గుర్తుకువచ్చి ఇక్కడున్నటువంటి స్త్రీలందరూ భయపడుతున్నారు. నువ్వు ఇలా ప్రవర్తించకూడదు. నీ కోపాన్ని విడిచిపెట్టు " అన్నది.             
లక్ష్మణుడు " అమ్మా! నువ్వు చెప్పిన మాట యదార్ధమే. నేను అంగీకరిస్తున్నాను. ఇక నేను కోపంగా మాట్లాడను. నేను ప్రసన్నుడను అయ్యాను " అన్నాడు.
లక్ష్మణుడి మాటలు విన్న సుగ్రీవుడు ఆనందముతో తన మెడలో ఉన్న పుష్పహారాలని పీకేసి " లక్ష్మణా! నేను రాజ్యాన్ని, భార్యని పోగొట్టుకున్నాను. రాముడి అనుగ్రహముతో వాటిని పొందాను. కేవలం తన చూపు చేత, బాణ ప్రయోగం చేత రాముడు లంకని కాల్చేయగలడు.  రాముడికి సహాయం చెయ్యడానికి నేను ఎంతటి వాడిని. ' నా రాముడే కదా ' అని ప్రేమ చేత కాలాన్ని మరిచిపోయాను అనో లేకపోతే  వానర సైన్యానికి కబురు పంపించాను కదా ' అన్న విశ్వాసంతో మరిచిపోయాననో నేను కాలాన్ని మరిచిపోయిన మాట యదార్ధమే. ప్రపంచములో పొరపాటు చెయ్యనివాడు అంటూ ఉండడు కదా! నన్ను క్షమించు " అన్నాడు. లక్ష్మణుడు " సుగ్రీవా! నువ్వు మా అన్నయ్యకి నాథుడిగా ఉన్నావు. నీవంటి వాడి నీడలో ఉన్న రాముడి పని జరిగి తీరుతుంది. అపారమైన శక్తి ఉండి తిరగబడకుండా తప్పు జరిగితే ఇలా చేతులు కట్టుకొని క్షమించమని అడగగలిగే ధార్మికమైన బుద్ధి మా అన్న రాముడి దగ్గర ఉన్నది. నీ దగ్గర ఉన్నది. ఆ ప్రస్రవణ పర్వత గుహలో బాధపడుతున్న నీ స్నేహితుడిని ఓదార్చు. మా అన్నయ్య బాధపడుతున్నాడన్న బాధతో కోపానికి లొంగి నిన్ను అనకూడని మాటలు ఏమైనా నేను అని ఉంటే  నన్ను క్షమించు " అన్నాడు.
 సుగ్రీవుడు హనుమంతుడిని పిలిచి " ఈ భూమండలములో ఎక్కడెక్కడ ఉన్న వానరాలు ఇక్కడికి రావాలని చెప్పాను. వాళ్ళని కేవలం పది  రోజులలో రమ్మని చెప్పండి. మలయ, హిమాలయ, మహేంద్ర, వింధ్య మొదలైన పర్వతాల మీద ఉన్నవాళ్లు ఇక్కడికి వచ్చెయ్యాలి. కాటుక రంగులో ఉన్నవారు, బంగారు రంగులో ఉన్నవారు, వెయ్యి ఏనుగుల బలం కలిగినవారు, పది ఏనుగుల బలం కలిగినవారు, నీటిమీద నడిచేవారు, నీళ్ళల్లో ఉండేవారు, పర్వతాల మీద ఉండేవారు, చెట్ల మీద ఉండేవారు మొదలైన వానరములన్నిటికి కబురు చెయ్యండి " అని చెప్పాడు.
సుగ్రీవుడి ఆజ్ఞప్రకారము మంత్రులు మొదలైనవారు వానరములను తీసుకురావడానికి వెళ్ళారు. అలా వెళ్ళినవారు అన్ని ప్రాంతాలలోని వానరములని కూడగట్టుకొని కిష్కిందకి పయనమయ్యారు.
సుగ్రీవుడు పల్లకిలో తనతోపాటు లక్ష్మణుడిని ఎక్కించుకొని ప్రస్రవణ పర్వతానికి చేరుకున్నాడు. ఇంతకాలానికి ప్రభువు బయటకి వచ్చాడని అక్కడున్న వానరములు కూడా బయటకి వచ్చాయి.  రాముడి దగ్గరికి వెళ్ళి తన శిరస్సు రాముడి పాదాలకి తగిలేటట్టు పాదాభివందనము చేశాడు. రాముడు సుగ్రీవుడిని కౌగలించుకొని " ధర్మము, అర్థము, కామము వీటికోసం కాలాన్ని విడదీసుకోవడములోనే ఎవరిదైనా ప్రాజ్ఞత ఉంటుంది. కేవలము  కామమునందే జీవితాన్ని నిక్షిప్తము చేసుకున్నవాడు చెట్టు చివరి కొమ్మమీద నిద్రపోతున్నవాడితో సమానము " అన్నాడు.
 సుగ్రీవుడు " రామా ! నువ్వు ఇచ్చినదే ఈ రాజ్యం, ఈ భార్య, కాని నేను కృతఘ్నుడను కాదు. కొన్ని కోట్ల వానరాలు, భల్లూకాలు మొదలైనవి వచ్చేస్తున్నాయి. వీటన్నిటితో ఏ కార్యము చెయ్యాలో నన్ను శాసించు " అన్నాడు.
రాముడు " నీవంటి మిత్రుడు దొరకడము నా అదృష్టం. సీత ఈ భూమండలము మీద ఎక్కడ ఉన్నది? ప్రాణములతో ఉన్నదా" ప్రాణములు తీయబడినదా!అసలు ఏ పరిస్థితులలో ఉన్నదో అన్న జాడ ముందు కనిపెట్టాలి.  వానరాలని అన్నిదిక్కులకి పంపించి అన్వేషణ జరిగేటట్టుగా  చూడు " అన్నాడు.
ఇంతలో అక్కడికి కోట్ల కోట్ల వానరములు వచ్చాయి. అవి రావడము వలన ఆ ప్రాంతమంతా దుమ్ము ధూళితో నిండిపోయింది. అంతా గోలగోలగా ఉన్నది. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. కొంతమంది నమస్కారాలు చేస్తున్నారు. కొంతమంది చెట్లమీద ఉన్నారు. కొంతమంది నీళల్లో ఉన్నారు. కొంతమంది పర్వతాలమీద ఉన్నారు.
వానర రాజైన సుగ్రీవుడు అందరినీ సరిగ్గా నిలబడమన్నాడు. వానరములు తమని ఎవరెవరు తీసుకొచ్చారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాయి. " ఎవరు ఎంతమందిని తెచ్చారో నాకు చెప్పండి " అని సుగ్రీవుడు ఆదేశించాడు.
వాళ్ళు " సూర్యాస్తమయ పర్వతమునుండి పది కోట్ల వానరములు వచ్చాయి. శతబలి అనే వానరుడు పదివేల కోట్ల వానరములతో వచ్చాడు. సుషేణుడు లెక్కపెట్టలేనన్ని వానరములతో వచ్చాడు. రుమ తండ్రి కొన్నివేల కోట్ల వానరములతో, హనుమంతుడి తండ్రి కేసరి కొన్నివేల కోట్ల వానరములతో, గవాక్షుడు వెయ్యి కొండముచ్చులతో, ధూమ్రుడు రెండువేల కోట్ల భల్లూకములతో వచ్చాడు, పనసుడు మూడుకోట్ల వానరములతో వచ్చాడు.
 నీలుడు పదికోట్ల నల్లటి దేహం కలిగిన వానరములతో వచ్చాడు. గవయుడు ఐదు కోట్ల వానరాలతో వచ్చాడు, దరీముఖుడు వెయ్యి కోట్ల వానరములతో వచ్చాడు. మైంద-ద్వివిదులు అశ్విని దేవతల్లా వెయ్యి కోట్ల వానరాలని తెచ్చారు, గజుడు మూడు కోట్ల వానరములను, జాంబవంతుడు పది కోట్ల భల్లూకములని తెచ్చాడు. రుమణుడు నూరు కోట్ల వానరములను  తెచ్చాడు. గంధమాదనుడు పదివేల కోట్ల వానరములతో వచ్చాడు. ఆయన వెనకాల లక్ష కోట్ల వానరములు వస్తున్నాయి. అంగదుడు వెయ్యి పద్మ వానరములను, నూరు శంకు వానరములను తీసుకొచ్చాడు. తారుడు ఐదుకోట్ల వానరములను తీసుకొచ్చాడు. ఇంద్రజానువు పదకొండు కోట్ల వానరాలని తెచ్చాడు. రంభుడు పదకొండు వందల  ఆయుత వానరాలని తెచ్చాడు. దుర్ముఖుడు రెండు కోట్ల వానరములని తెచ్చాడు. హనుమంతుడు కైలాశ శిఖరముల్లా ఎత్తుగావున్న వెయ్యి కోట్ల వానరములను తెచ్చాడు. నలుడు నూరు కోట్ల వెయ్యిమంది వందమంది వానరములతో వచ్చాడు. దధిముఖుడు పది కోట్ల వానరములతో వచ్చాడు.
పదివేలకోట్లయితే ఒక ఆయుతం, లక్ష కోట్లయితే ఒక శంకు, వెయ్యిశంకువులయితే ఒక అద్భుదం, పదిఅద్భుదములయితే ఒక మధ్యము, పది మధ్యములయితే ఒక అంత్యము, ఇరువది అంత్యములయితే ఒక సముద్రం, ముప్పది సముద్రములయితే ఒక పరార్థం, అలాంటి పరార్థములు కొన్ని వేలు ఉన్నాయి " అని అన్నారు.

సుగ్రీవుడు వినతుడు అనే వానరమును పిలిచి " వినతా! నువ్వు లక్షమంది వానరములతో బయలుదేరి తూర్పుదిక్కుకి వెళ్ళు. నీకు నెల రోజుల సమయము ఇస్తున్నాను. నెల రోజులలో సీతమ్మ తల్లి జాడ కనిపెట్టాలి. మీరు ఇక్కడినుండి తూర్పు దిక్కుకి బయలుదేరి గంగ, సరయు, కౌశికి, యమున, సరస్వతి, సింధు మొదలైన నదులని, వాటి తీరములలో ఉన్న ప్రాంతాలని అన్వేషించండి. బ్రహ్మమాల, విదేహ, మాలవ, కాశి, కోసల, మాగధ, పుణ్డ్ర, అంగ దేశములలో ఉండే పట్టణాలని, జనపదాలని వెతకండి. వెండి గనులు కలిగిన ప్రదేశాలు అక్కడ ఉన్నాయి. ఆ ప్రదేశాలన్నీ వెతకండి. సముద్రాలలో గల పర్వతాలు, వాటి మధ్యలో గల ద్వీపాలు, అందులో ఉన్న నగరాలు, మంధరాచల శిఖరము మీద కలిగినటువంటి గ్రామములలో నివసిస్తున్న జనుల యొక్క ఇళ్ళు, అక్కడ కొంతమందికి చెవులు ఉండవు. కొంతమందికి పెదవులు చెవుల వరకూ వ్యాపించి ఉంటాయి. కొంతమంది జుట్టు చెవుల వరకూ పడి ఉంటుంది. వాళ్ళందరూ చాలా భయంకరమైన నరభక్షకులు. వాళ్ళు నీళ్ళల్లో ఉంటారు. మీరందరూ ప్రతి చోట సీతమ్మని వెతకండి. కొంతదూరం వెళితే యవద్వీపం కనపడుతుంది. అ

ది రత్నములతో నిండి ఉంటుంది. మీరు అక్కడ వెతకండి. తరువాత సువర్ణ ద్వీపము, రూప్యక ద్వీపము ఉంటాయి. అవి బంగారము, వెండి గనులకు నిలయమైనటువంటివి. అది దాటితే శిశిరం అనే పర్వతం కనపడుతుంది. ఆ పర్వతం అంతా వెతకండి.
కొంతదూరము వెళ్ళాక శోణానది కనపడుతుంది. ఆ నది చాలా లోతుగా, ఎర్రటి నీటితో ఉంటుంది. ఆ ప్రదేశములో సిద్ధులు, చారులు విహరిస్తూ ఉంటారు. అక్కడున్న ఆశ్రమాలలో, తపోవనాలలో సీతమ్మని ఉంచాడేమో వెతకండి. తరువాత ఇక్షు సముద్రము వస్తుంది. అందులో మహాకాయులైన అసురులు ఉంటారు. వాళ్ళు ఆకలిని తీర్చుకోడానికి ప్రాణుల నీడని పట్టి బక్షిస్తుంటారు. అది దాటాక లోహితము అనే మధు సముద్ర తీరాన్ని చేరుకుంటారు. అక్కడ బూరుగు వృక్షములు చాలా సంఖ్యలో పెరిగి ఉంటాయి. అందుకని ఆ ద్వీపాన్ని శాల్మలీ ద్వీపం అంటారు. అక్కడున్న గిరి శిఖరాలకి మందేహులు అనే రాక్షసులు తలక్రిందులుగా వేలాడుతూ ఉంటారు. వాళ్ళు సూర్యుడు ఉదయించే సమయంలో, సూర్యుడు ఉదయించకుండా ఆయనని గ్రసించే ప్రయత్నం చేస్తుంటారు. అక్కడున్న బ్రాహ్మణులు సంధ్యావందనము చేసి అర్ఘ్యం విడిచిపెడితే, ఆ జలముల యొక్క శక్తి చేత, సూర్యుడి శక్తి చేత ఆ మందేహులు అనే రాక్షసులు సముద్రములో పడిపోతుంటారు. అప్పుడు వాళ్ళు మళ్ళీ లేచి ఆ పర్వతానికి తలక్రిందులుగా వేలాడుతూ ఉంటారు. ఆ సముద్ర మధ్యలో ఋషభము అనే పెద్ద పర్వతము ఉంటుంది. ఆ పర్వతం మీద సుదర్శనము అనే పేరుగల గొప్ప సరోవరం వెండి కాంతులతో విరాజిల్లుతూ ఉంటుంది. దానిని దాటితే క్షీరసముద్రము వస్తుంది. దానిని కూడా దాటితే మధుర జలములు కలిగిన మహాసముద్రము వస్తుంది. అందులో ఔర్వుడు అనే మహాముని యొక్క కోపం బడబాగ్నిగా పుట్టి సముద్రములో ప్రవేశించింది. దానికి హయముఖము అని పేరు.
దానిని దాటి ముందుకి ఒక పదమూడు యోజనముల దూరం వెళితే ఒక బంగారు పర్వతము కనపడుతుంది. దానికి జాతరూప శిలము అని పేరు. దానిమీద సర్పాకృతి కలిగిన అనంతుడు నల్లటి బట్టలు ధరించి కూర్చొని ఉంటాడు. ఆయనే ఆదిశేషుడు. ఆయన పక్కనే తాటి చెట్టు ఆకారంలో ధ్వజం పెట్టబడి ఉన్నది. దాని పక్కనే ఒక వేదిక ఉన్నది. దానిని దేవతలు నిర్మించారు. మీరు ఆ ఆదిశేషుడిని దర్శించి ముందుకి వెళితే బంగారు పర్వతమైన ఉదయాద్రి కనపడుతుంది. ఆ పర్వతము నూరు  యోజనముల వరకూ విస్తరిస్తూ ఆకాశాన్ని తాకుతూ ఉంటుంది. దానిని దాటి వెళితే సౌమనసం అనే ధృడమైన బంగారు శిఖరము ఉంటుంది. అక్కడే బ్రహ్మగారు భూమండలానికి ద్వారాన్ని ఏర్పాటు చేశారు. అక్కడే సూర్యుడి మొదటి కిరణ ప్రసారము  ప్రారంభమవుతుంది. అది దాటి వెళితే కటిక చీకటి. ఇక్కడిదాక అంగుళము విడిచిపెట్టకుండా సీతమ్మ జాడ వెతకండి. తూర్పు దిక్కుకి వెళ్ళే వానరములు సిద్ధం అవండి " అన్నాడు.
సుగ్రీవుడు " నీలుడు, హనుమంతుడు, జాంబవంతుడు, సుహోత, శరారి, శరగుల్ముడు, గజుడు, గవాక్షుడు, గవయుడు, మైందుడు, ద్వివిదుడు, గంధమాదనుడు, ఉల్కాముఖుడు, అనంగుడు, హుతాశరుడు మొదలైనవారందరికి నాయకుడిగా యువరాజైన అంగదుడు బయలుదేరి దక్షిణ దిక్కుకి వెళ్ళండి. మీతో పాటు కొన్ని లక్షల వానరములను  తీసుకువెళ్ళండి. వెయ్యి శిఖరములు కలిగిన వింధ్యపర్వతానికి వెళ్ళి ఆ పర్వతము అంతా వెతకండి. గోదావరి నది, కృష్ణవేణి, వరదానదిలో వెతకండి. తరువాత మేఖల దేశము, ఉత్కల దేశము, దశార్ణ నగరము, భద్రవంతీ, అవంతీ నగరాలని వెతకండి.

నదీం గోదావరీం చైవ సర్వమేవానుపశ్యత |
తథైవాంధ్రాంశ్చపుండ్రాం శ్చ చోళాన్ పాండ్యాన్ కేరళాన్ ||
విదర్భ,రుష్టిక, మాహి, కళింగ, కౌశిక,కుంభ,చేర, చోళ, పాండ్య, కేరళ మొదలైన రాజ్యాలన్నీ వెతకండి. కావేరి నదిని దాటండి. మలయ పర్వత శిఖరం మీద అగస్త్యునికి విశ్వకర్మ నిర్మించిన గృహం ఉంటుంది. ఆ ప్రాంతాన్ని వెతకండి. తరువాత మొసళ్ళతో ఉన్న తామ్రపర్ణీ నదిలో వెతకండి. ఆ తరువాత సముద్రం వస్తుంది. ఆ సముద్రంలోకి చొచ్చుకుపోయిన శిఖరములతో మహేంద్రగిరి పర్వతము కనపడుతుంది. ఆ సముద్రానికి నూరు  యోజనముల అవతల ఒక ద్వీపం ఉన్నది. దానిని కాంచనలంక అంటారు. ఆ లంకా పట్టణాన్ని రావణాసురుడనే పది తలల రాక్షసుడు పరిపాలిస్తున్నాడు. అక్కడ మీరు చాలా జాగ్రత్తగా వెతకాలి. ఆ తరువాత సముద్రాన్ని దాటితే పుష్పితము అనే పర్వతము కనపడుతుంది. అది దాటితే సూర్యవత్, వైద్యుతం అనే పర్వతాలు కనపడతాయి. ఆ పర్వతాల మీద ఉండే చెట్లకి కాచిన పళ్ళు చాలా బాగుంటాయి. అవి తినండి. ఆ తరువాత కుంజరం అనే పర్వతం కనపడుతుంది. దాని మీద విశ్వకర్మ అగస్త్యుడికి బ్రహ్మాండమైన భవనం నిర్మించాడు. అలా ముందుకి వెళితే భోగవతి అనే నగరం వస్తుంది. అందులో విషంతో కూడుకున్న పాములు ఉంటాయి. అక్కడే సర్పాలకి రాజైన వాసుకి ఉంటాడు. ఆ తరువాత ఎద్దు ఆకారములో ఉన్న వృషభ పర్వతం కనబడుతుంది. దానిమీద గోశీర్షకము, పద్మకము, హరిశ్రావము అనే మూడు రకాల చందనం కనపడుతుంది. అగ్నితుల్యము అనే చందనం కూడా ఉంటుంది. మీరు పొరపాటున కూడా ఆ చందనాన్ని ముట్టుకోకండి. అక్కడ శైలూషుడు, గ్రామణి, శిగ్రువు, శుభ్రువు, బభ్రువు అనే ఐదుగురు గంధర్వ రాజులు పరిపాలన చేస్తుంటారు. మీరు వారికి నమస్కారము చేసి ముందుకి వెళితే, పృద్వికి చివరన పుణ్యం చేసుకున్నవారు స్వర్గానికి వెళ్ళేవారు కనపడతారు. అదికూడా ద

ాటిపోతే పితృలోకం వస్తుంది. ఇక అది దాటితే యమధర్మరాజు యొక్క సామ్రాజ్యము ఉంటుంది. అక్కడ పాపులు ఉంటారు. మీరు అది దాటి వెళ్ళలేరు. దక్షిణ దిక్కున అక్కడిదాకా వెళ్ళి వెతికిరండి " అన్నాడు.
తరువాత సుగ్రీవుడు సుషేణుడిని పిలిచి ఆయనకి నమస్కరించి " మీతో పాటు మరీచి మహర్షి యొక్క కుమారుడైన అర్చిష్మంతుడు, అర్చిర్మాల్యుడు మొదలైన వానరాలని తీసుకొని పడమర దిక్కుకి వెళ్ళండి. అప్పుడు మీరు సౌరాష్ట్ర, బాహ్లిక, చంద్ర, కురు, మల్ల, పాంచాల, కోసల, అంగ, మగధ, అవంతి, గాంధార, కాంభోజ మొదలైన రాజ్యాలు, పట్టణాలు, గ్రామాలు వెతకండి. అలాగే అవంతీపురం, జటాపురం కనపడతాయి, వాటిని కూడా వెతకండి. సిందు-సాగర సంగమ స్థానంలో, నూరుశిఖరాలతో, పెద్ద చెట్లతో సోమగిరి అనే పర్వతం కనపడుతుంది. మీకు ఆ పర్వతం మీద రెక్కలున్న సింహాలు కనపడతాయి, అవి ఏనుగుల్ని ఎత్తుకుపోతుంటాయి. సముద్రంలోని తిమింగలాలని ఎత్తుకుపోతుంటాయి. అక్కడ సముద్రంలో పారియాత్రం అనే పర్వతము ఉన్నది. అది వంద యోజనముల విస్తీర్ణములో ఉంటుంది. దానిమీద ఇరవైనాలుగు కోట్ల మంది గంధర్వులు ఉంటారు. వాళ్ళకి నమస్కారము  చేసి ముందుకి వెళ్ళండి. అప్పుడు మీకు నూరు యోజనముల ఎత్తయిన వజ్ర పర్వతము  కనపడుతుంది. సముద్రములో నాలుగోవంతు భాగంలో చక్రవంతము అనే పర్వతం ఉంటుంది. దానిమీద విశ్వకర్మ వెయ్యి అంచుల చక్రాన్ని నిర్మించాడు. ఆ చక్రాన్ని ఎవరూ తీసుకోకుండా చేస్తున్న హయగ్రీవుడు అనే రాక్షసుడిని శ్రీ మహావిష్ణువు చంపి ఆ చక్రాన్ని తీసుకున్నారు.  పంచజనుడు అనే మరొక రాక్షసుడిని చంపి శంఖాన్ని తీసుకున్నారు.

Tuesday, June 30, 2020

పాషండుడా నీదెంత పాషాణ హృదయం.

(1) కల్లుపెంట అనగా ?

(A) కల్లు అమ్మెడి చోటు
(B) కల్లు తీసేసమయంలో కల్లు నుండి వేరుచేసిన చెత్త
(C) కల్లు అంటేరాయి,పెంట అంటే కుప్ప కాబట్టి కల్లుపెంట అంటే రాళ్ళకుప్ప
(D) కణేకల్లు, గుంతకల్లు, నకిరేకల్లులాగా ఇదో ఊరు

(2) తెరువరి అనగా ?

(A) పాదాచారుడు
(B) దారి కానక తిరిగేవాడు
(c) ఉపాయాలు చెప్పేలాడు
(D) దారిదోపిడిలు చేసే దొంగ

(3) పంబ అంటే ?

(A) పంబ రేగిపోతోంది అంటాం కదా ! పంబ అంటే ఓ చర్మవాయిద్యం.కొట్టినపుడు రేగిపోతుంది.
(B) బాన కడవ కుండలాగా పంబ అంటే ఓ కుమ్మరిచేసిన మట్టి పాత్ర
(C) శ్రీకాకుళం జిల్లాలో ఒకనది (కేరళలో కూడా పవిత్రమైన నది పంబ )
(D) పంబ అంటే దుమ్ము, అందుకే పంబ రేగిందంటారు

(4) పాషండుడు అనగా ?

(A) రాయిలాగా కఠిన హృదయం కలవాడు.
(B) పాషాణం ఒక విషం , పాషాణం ద్వారా విషప్రయోగం చేయువాడు
(C) పాషండమనేది ఒక మతం, వేదాలను తృణికరించింది
(D) పాషండమంటే అత్యంత కఠినమైన గదాయుద్ధం

(5) ముచ్చే బంగారమంటే ?

(A) బంగారు జాతులలో హీనమైనది.కల్తీ బంగారు
(B) కాకిబంగారం
(C) వడ్లలో(బియ్యంలో ) ఒక ప్రాచీనరకం
(D)  ముచ్చు వారిచే దొంగలింపబడిన బంగారం.

(6) శూన్యవాద సిద్ధాంతకర్త

(A) ఆదిశంకరుడు
(B) మధ్వావాచార్యుడు
(c) కుందకుందనాచార్యుడు (జైనుడు, జంబూద్వీపం ఉన్నగ్రామం ఇతని పేరు మీదుగానే ఏర్పడింది)
( D)  ఆచార్య నాగార్జునుడు
 
(7) మాయావాద సిద్ధాంతకర్త ?

(A) 12వ శతాబ్దంలో మంత్రతంత్రాలు నేర్చిన  కాశీపురవాసి జంబీరుడు
(B) ఆదిశంకరుడు
(C) బౌద్ధమతంలో తాంత్రికవిద్యను ప్రవేశపెట్టిన లీలామాలుడు
(D) మధురరాజు విజయరాఘవుని ఆస్థాన పురోహితుడు తాడంకి వెంకన్న

(8) సమాధి (ఒలికిలి) నుండి శవాలను బయటకు తీసి అంగాంగ పరీక్షలు చేసిందెవరు ?

(A) శుశ్రుతుని శిష్యులు
(B) ఇప్పటికి 2500 సం|| క్రిందటి భిషగర్వులు (భిషగర్వులంటే వైద్యులు)
(C) అఘోరాలు (శివశక్తి ఆరాధకులు, స్మశానంలో తిరిగారు, శవంపై కూర్చున్నారు, కపాలంలో తిన్నారు)
(D) టిబెట్టు నుండి శ్రీపర్వత విశ్వ విద్యాలయంలో విద్య నేర్చుకొన్న లామాలు. శ్రీపర్వతమంటే నాగార్జున కొండ)

(9) గోసాయి అంటే ?

(A) గోవుల రక్షణాధికారి
(B) గోవులను కాచేవాడు
(C) శైవ సన్యాసి
(D) వైష్ణవ సన్యాసి

(10) భారత ముస్లీం తత్వవేత్తల నుండి జనించిన సూఫితత్వం

(A)  ముస్లీంలు కాని వారిపై విధించిన జిజియాపన్నును తిరస్కరించింది
(B) హింసాత్మక మార్గాన్ని తిరస్కరించింది
(C) హిందువులను అవమానించరాదని ఆదరించాలని చెప్పింది.
(D) అన్ని మతాలసారం ఒకటేనని చెప్పింది.

Be thankful. Be patient

A movie theater announced that an 8-minute movie won the title of Best Short Film in the World ...

So, it was decided to display this movie in the cinema for free, so that the largest crowd could gather to watch it ...
 
    The movie began with a snapshot of a room ceiling that is devoid of any decoration and of any details;  Just a white ceiling ...

    3 minutes passed without the camera moving and it did not move to any other scene, or any other part of the ceiling in the same room ...

    Another 3 minutes passed without the camera moving and without changing the scene ...

    After 6 boring minutes, the viewers started grumbling;  Some of them were about to leave the theater hall;  And some of them objected to the officials of the house because they wasted their time watching a ceiling ...

    Suddenly, before the majority became concerned and starting to leave, the camera lens slowly moved on a wall without any details as well until it reached down towards the floor, there a child appeared on a bed, who seems to be totally handicapped due to the spinal cord tare in his little body ...

    The camera slowly moved to the side of the handicap bed, showing a wheelchair without a back ...

    The camera moved to the boredom location of the ceiling again;  To show a sentence: *"We showed you only 8 minutes of this child's daily activity, only 8 minutes from the scene that this handicapped child watches at all hours of his life, and you complained and weren’t patient for only six minutes, you couldn't bear to watch it ..!* ...
   
    So know the value of every second of your life that you spend in wellness, and thank your Lord for every blessing bestowed on you, and you will not feel its existence unless you lose it ...

    We suffer from quarantine and the curfew, which is, God willing, for a limited time, and we do not know that there are millions who lived their entire lives in quarantine ...

    Covid-19 has forced us to have the time to think about many privileges , and we thank God for the blessing of the freedom of movement and out of the house to see life, breathe the air, and practice activity in its various colors ...

Thank God and have gratitude for being blessed with all that, which we have not realized... in many occassions.
Lead life counting the blessings but not the problems or troubles or challenges.

Life is a One Time Opportunity.. Daily one more time.. Every day to think better, feel better and do better.

May god bless you in abundance.

Sunday, June 28, 2020

శ్రీమన్నారాయణ వృత్తాంతము - 5

🌻. తమ భక్తులను రక్షించు నాగులను చంపుటకు ప్రయత్నించిన వారికి శ్రీపాదుల వారి గుణపాఠము.

నాగులచవితినాడు మా గ్రామమునకు మంత్రగాడు ఒకడు వచ్చియుండెను. 

ఆ మంత్రగానిని మా దాయాదులునూ, గ్రామపెద్దయు సాదరముగా ఆహ్వానించిరి. అతడు ఎంతటి విషసర్పమునయిననూ తన మంత్రశక్తితో స్తంభింపజేసి వశమొనరించుకోగలగినవాడు. పాము కరచిన ఏ వ్యక్తిని అయినా తన మంత్రశక్తితో జీవింపజేయగలగినవాడు. అతనిచేతిలో గరుడరేఖ కూడా యుండెను. 

గరుడరేఖ కలిగిన మానవులకు సర్పములు స్వాధీనములగునని శాస్త్రవచనము. ఆ సర్పములను హతమార్చవలెనని గ్రామపెద్దయు, మంత్రగాడును తలపోయుచుండిరి.

పుట్టకు దరిదాపులలోనున్న ప్రాంతమంతయునూ మంటలు ఏర్పాటు చేయబడెను. మంత్రగాడు తన ఆసనమునందు కూర్చొని వింత వింత పద్ధతులతో తంత్రములనుచేయుచూ మంత్రములను బిగ్గరగా చదువుచుండెను. 

జాతి సర్పములను వధింపబూనుట పాపహేతువని మేము బాధపడుచుంటిమి. మేము నిస్సహాయస్థితిలో నుంటిమి. అమాయకములయిన జాతిసర్పములను ఆ శ్రీపాదుల వారే రక్షింపవలెనని ప్రార్థించుచుంటిమి. 

మంత్రశక్తికి లోబడినవో అనునట్లు ఆ సర్పములు పుట్టనుండి బయటకు వచ్చినవి. మంత్రగానికిని, వాని అనుచరులకునూ యిదిఎంతయో సంతసము కూర్చుచుండెను. అయిననూ వారికి ఆ సంతసము ఎక్కువసేపు నిలువలేదు. 

బయటకు వచ్చిన సర్పములు క్షణక్షణమునూ ఆకారములో పెద్దవగుచుండెను. మంత్రగాడు బిగ్గరగా మంత్రములు చదువుచుండెను. మంత్రశక్తికి లోబడినవో అన్నట్లు ఆ సర్పములు అగ్నికీలలవైపు పయనించుచుండెను. 

ఆశ్చర్యము! అగ్నిదేవుడు వాటికి దారి విడిచెనో అన్నట్లు అవి వచ్చు మార్గము నందు మాత్రము అగ్ని చల్లారుచుండెను.తుదకు అగ్ని అంతయునూ ఆరిపోయెను. ఆ సర్పరాజములు యధేచ్చగా అచ్చటనుండి వెడలిపోయెను. మంత్రగాడును, అతని అనుచరులునూ బిత్తరపోయిరి.

ఇంతలో గ్రామపెద్ద పెద్దకుమారునికి పాము కరచిన వానికుండు లక్షణములు కన్పింపసాగెను. రెండవ కుమారుని నేత్రములకు చూపు బాగుగా తగ్గిపోయెను. 

పాము కరవకుండగనే సర్పదష్టునకుండు లక్షణములు ప్రాప్తించి శరీరము విషపూరిత  మగుట విడ్డూరము. ఉన్నట్టుండి అంధత్వము ప్రాప్తించుటయూ విడ్డూరమే! మంత్రగాడు మంత్రములనెన్నింటినో పఠించెను. కాని ఫలితము లభింపలేదు. 

అతని చేతిలోని గరుడరేఖ క్రమక్రమముగా తన ఆకారమును కోల్పోయి పూర్తిగా అదృశ్యమాయెను. గ్రామపెద్ద మనసులో మహాభయము తోచెను. అనాధ రక్షకుడగు శ్రీపాదుడు తప్ప వేరేవ్వరునూ దిక్కులేరు. మంత్రగానిలో మంత్రశక్తి పూర్తిగా క్షీణించెను. కొద్ది నిముషములలో అతడు విగతజీవుడాయెను. 

శ్రీపాదుల వారి లీల ఏ సమయములో ఎట్లుండునో ఎవరికెరుక? గ్రామపెద్ద మా వద్దకు పరుగెత్తుకొని వచ్చి గోలుగోలున ఏడువసాగెను. మేము మాత్రము ఏమి చేయగలము? అనన్యచింతతో శ్రీపాదుల వారిని స్మరించిన యెడల నీ యిద్దరు కుమారులును స్వస్థత పొందగలరని మాత్రము చెప్పితిమి.

మాంత్రికుని కళేబరము గ్రామపెద్ద యింటివద్ద నుండెను. గ్రామపెద్ద కుమారులు యిద్దరునూ విధి వైపరీత్యమునకు లోనయిరి. మా దాయాదులు భయముతో వణకిపోసాగిరి. వాతావరణమంతయునూ విషాద భరితముగా నుండెను. 

చనిపోయిన మాంత్రికుని శవమును స్మశానమునకు  తీసుకొనిపోయిరి. కట్టెలు పేర్చబడి చితికి నిప్పంటించబడెను. నిప్పంటించిన శవాములో ఆకస్మాత్తుగా చైతన్యము కలిగెను. శవము తనను అగ్నిబాధ నుండి రక్షించమని కేకలు వేయుచుండెను. 

కాటికాపరివాండ్రు  చనిపోయిన మాంత్రికుడు దయ్యమై తిరిగి శరీరములో ప్రవేశించినాడనియు, వానిని రక్షించినచో యిదే శరీరముతో అతడు ప్రేతార్మ చేయు దుష్ట కార్యములన్నియునూ చేయుననియూ, అతని శవము కాలి బూడిద అయిన యెడల కేవలం ప్రేతాత్మ గానే యుండి తనకి వశమైయుండెడి వారి దేహములందు ప్రవేశించి కొంతమందిని బాధించుననియూ, అందుచేత శవమునకు నీళ్లుపోయు ప్రయత్నమును మానుకొనిరి. 

విగతజీవుడై ఉపాధిరహితుడుగా నున్న ప్రేతాత్మకంటే సజీవుడై తన స్వంత ఉపాదిలోనే ప్రవేశించెడి ప్రేతాత్మ ఎక్కువ శక్తులని కలిగియుండి సమాజమునకు విశేష వినాశనమును, దుఃఖములను కలిగించి తీరుననియు వారు తలపోసిరి. 

ప్రారబ్ధానుసారముగా ఆయా వ్యక్తుల మానసములందు ఆయా భావములను కలిగించి ఆయా కర్మఫలములను అనుభవింపజేసి ప్రత్యక్షముగా తన అవతారతత్త్వము యొక్క నిజస్వరూపమును బోధపరచుట శ్రీపాద శ్రీవల్లభుల వారి విచిత్ర విధానము. 

చెరువును ఎలా నిర్మించాలో చెప్పిన పోరుమామిళ్ళ శాసనం.

చెరువును త్రవ్వించడం ఓ పుణ్యకార్యంగా మనపూర్వీకులు భావించారు. పుణ్యకార్యమేకాదు అదో ప్రజాహిత కార్యక్రమం. అందుకే దక్షిణాపథంలో మనరాజులు చక్రవర్తులు సామంతులు దండనాయకులు చివరకు సామాన్యుడు కూడా చెరువులను నిర్మించి తమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశారు.

ఈనాడైతే మనవద్ద ఆధునిక శాస్త్రపరిజ్ఞానం అత్యంత సాంకేతిక పనిముట్లు యంత్రాలున్నాయి.కనుక జలాశయ నిర్మాణాలు సులభంగా చేపట్టగలుగుతున్నాము.

ఇప్పటికి 2300 సంవత్సరాల క్రిందటనే మనవారు ఉత్తమోత్తమ పరిజ్ఞానంతో చెరువులు నిర్మించారు.ఉదాll సుదర్శన తటాకాన్ని మౌర్యబిందుసారుడి కాలంలో పుష్యగుప్తుడు అనేవాడు గుజరాతులో నిర్మించాడు. ఈ తటాకం తెగిపోతే  శకరాజు రుద్రదమనుడు మరమ్మత్తు చేసాడు. ఈ తటాకగొప్పతనాన్ని జునాఘడ్ శాసనంలో రుద్రదమణుడు పెర్కొన్నాడు.

అలాగే ఇప్పటికి 1800 సం|| క్రిందట కరికాలచోళుడు కావేరినదిపై నిర్మించిన కల్లాడై / కల్లానై ఆనకట్ట ఈనాటికి చెక్కుచెదరలేదు. సింధు నాగరికతలోని నీటిపారుదల వ్యవస్థ మనకు తెలిసిందే.

భాస్కరభావదుర అనే యువరాజు విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన ఒకటవ హరిహరరాయలకుగల ఐదుమంది సంతానంలో ఒక్కడు. నెల్లూరుజిల్లాలోని ఉదయగిరిని కేంద్రంగా ఓ రాష్ట్రాన్ని పాలించేవాడు.

ఇతను శాలివాహనశకం 1291 లో అనగా 1369లో కడపజిల్లా పోరుమామిళ్ళలో చెరువును త్రవ్వించి చెరువు నిర్మాణం ఎలా వుండాలో అక్కడే ఓ శాసనం చెక్కించాడు. మంచి తటాకాన్ని నిర్మించాలంటే పన్నెండు అంగాలు సాధనాలు వుండాలి. అవి

(1)  చెరువును నిర్మించే వ్యక్తి సంపన్నుడు, ఆనందితుడు సచ్ఛీలుడైవుండాలి.

(2) పాత:శాస్త్ర ప్రవీణులుండాలి. పాత: శాస్త్రమంటే చెరువును త్రవ్వే కళ.

(3) చెరువు నిర్మాణానికి కఠినమైన, దృఢమైన నేలను ఎన్నుకోవాలి.

(4) మూడుయోజనాల దూరం లోపల చెరువుకు నీటిని అందించే  వాగులు వంకలు కాలువలు నదులు ఉండాలి.

(5) చెరువుకట్టకు అటువైపు ఇటువైపు కొండగుట్టలుండాలి.

(6)  చెరువుకట్ట కట్టడాన్ని మరి పొడుగుగా కట్టరాదు. (అలా కట్టవలసిన పరిస్థితులు ఎదురై మధ్యలో కూడా ఒక మరవను (అలుగు) ను ఏర్పాటుచేయాలి)

(7) అటువైపు ఇటువైపున్న కొండగుట్టలు మెత్తగా మృదువుగా ఉండక దృఢంగా ఉండాలి.

(8) చెరువుగర్భం (మధ్యభాగం) లోతుగా వుండెట్టుగా చూచుకోవాలి.

(9) చెరువు నిర్మాణానికి  కఠినమైన రాళ్ళు ఉపయోగించాలి.

(10) చెరువుతూములనుండి పారే నీరు పల్లపు ప్రదేశానికి వెళ్ళేవిధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. పంటలకు అనువైన సారవంతమైన నేలలు ఉండాలి.

(11) చెరువులో బలమైన అలలు సుడులు వగైరాలు వస్తే వాటిని కొండగుట్టలు అడ్డుకొనేలా ఉండాలి.

(12) తటాకనిర్మాణానికి సిద్ధహస్తులు నిపుణులైన పని వారు పనిముట్లు ఉండాలి.

చెరువు నిర్మాణానికి  అనువుకాని పరిస్థితులను కూడా పోరుమామిళ్ళ శాసనం పెర్కొంది.

(1) చెరువుకట్ట నుండి నీరు ఊరరాదు, ఉబకరాదు.

(2) చౌడు, ఉప్పునీటి నేలలు చెరువు నిర్మాణానికి పనికిరావు.

(3) రెండు రాజ్యాల మధ్య తటస్థంగా వున్నచోటు చెరువు నిర్మాణానికి పనికిరాదు.(ఎందుకంటే జలకలహాలు వస్తాయి. యుద్ధసమయంలో చెరువునీటిని విషపూరితం చేస్తారు.)

(4) చెరువుమధ్య భాగం ఉబ్బుగా (మెరక / ఎత్తు ) ఉండరాదు.

(5) సాగుభూమి చెరువులోని నీటిపరిమాణం ప్రకారమే సరిగా వుండాలి. చెరువు నీరు తక్కువగా వుండి సాగునేల ఎక్కువగా వుండరాదు.

(6) చెరువులో నీరు పుష్కలంగా ఉండి సాగుభూమి తక్కువగా వుండరాదు.

ఈ సూత్రాలు అప్పటికేకాక ఇప్పటికి కూడా అనుసరణీయమే.

ప్రశ్నలు...

(1) మనదేశంలో చెరువులు  అధికంగావున్న రాష్ట్రమేది ?

(2) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోగల పెద్దచెరువు ఏది ?

ఒక నాన్న కు తన‌ కూతురే బంగారం

ఒక నాన్న కు తన‌ కూతురే బంగారం 💛 ...✍🏻
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
అలాంటి నాన్న‍ తన కూతురు  ను గుండెళ్ళే పెట్టుకుంటాడు,
భుజాలపై‌ ఎక్కించుకుంటాడు, తన హృదయం పైన‌ నడిపించుకుంటూ‌ తన‌ పాదాలకు చెప్పులౌతాడు,
తన బంగారు ‌భవిష్యత్తు గురించి ఎవరూ కనని కలలు కంటాడు, కంటికి రెప్పలా కాపాడుకుంటాడు....
అలాంటి తండ్రి ఒకటి అడిగితే రెండు కొనిస్తాడు
రెండు అడిగితే నాలుగు కొనిస్తాడు

యుక్త వయసుకు రాగానే తన ఉన్నత చదివుల కొరకు  రాత్రింబవళ్ళు కష్టపడుతాడు తన బాధ కష్టం కనబడకుండా గుండె లోనే దాచుకుంటాడు...

ఒక మంచి జీవిత భాగస్వామికొరకు వెతుకుతునే ఉంటాడు
కూతురు సుఖం సంతోషం కొరకు దేనికైనా సిద్దపడుతాడు...
తను కోరుకున్నది జరిగితే ఈ ప్రపంచాన్నే జయించినంతగా సంబరపడుతాడు

కాని ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ ఉన్న‌ యువత స్వేచ్చ స్వతంత్ర్యం  పేరు సొంత నిర్ణయాలతో తల్లిదండ్రులను ఎదిరిస్తున్నారు...

తమ తల్లిదండ్రులకు ఏమీ తెలియదని కించపరుస్తున్నారు..
పెళ్ళి వయస్సు కు రాగానే ఎవరో ముక్కు మొఖం తెలియని వారికి కట్టబెడుతున్నారని అంటున్నారు...

నిజంగా ఏ తల్లిదండ్రులు అంత నీచంగాఆలోచించరు .. పెళ్ళంటే నూరేళ్ళ పంటగా భావిస్తారు.. అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలను తల్లిదండ్రులు పరిశీలిస్తారు..
అప్పుడైనా నచ్చితేనే ఆ అమ్మాయికి కూడా ‌నచ్చితే ఒప్పుకుంటారు...

ఏ తండ్రి కూడా ‌తన కూతురు ఏమైనా‌ ఫర్వాలేదని అనుకోడు తన కూతురు ఏలాంటి కష్టాలు పడకూడదని కోరుకుంటాడు..

📌 కాని నేటి అమ్మాయి లు అలా ఆలోచించడం లేదు.
📌 పెళ్ళి వయస్సు వచ్చే వరకు తన తల్లిదండ్రులను విలన్లు గా చూస్తున్నారు.

 ప్రేమ అనే మత్తులో పడి మోసమేదో.. మోదమేదో తెలియని వయస్సులో మేము ఒకరినొకరం అర్థం చేసుకున్నాం మాది నిజమైన ప్రేమ అనే మైకంలో తల్లిదండ్రులను ఎదురిస్తున్నారు... ఐతే మీరు లేదా తల్లిదండ్రులను బలి చేస్తున్నారు..

నిజంగా మీకు అర్థం చేసుకోనే శక్తి‌ ఉంటే నీకు జన్మనిచ్చిన‌ నాటి‌ నుండి నీ కోసం తన‌ తపన అర్థమయ్యేది .. నీ గురించి కన్న కలలు అర్థం అయ్యేది.. నీ కోసం పడ్డ కష్టం అర్థం అయ్యేది..

నీ చిన్ని కాళ్ళ సరిపడే సైజు కోసం పది షాపులు తిరిగింది....
నీ పుట్టిన రోజుకి‌ నీ సరిపడే డ్రస్ కోసం తిరిగిన ఇరవై షాపులు తిరిగింది...నా కూతురు అందరికంటే ముందుండాలనే ఉబలాటం..నీవు బయటకు వెళ్ళినప్పుడు మళ్ళీ‌ వచ్చేవరకు‌ తపించే హృదయం.. అర్థం అయ్యేది

నీ బంగారు భవిష్యత్తు కొరకు ఇరవై ఏళ్ళు గా తపించే నీ తండ్రి నే‌ అర్థం చేసుకోలేని నీవు గతమేంటో భవిష్యత్తు ఏమిటో తెలియని ఒక వ్యక్తి గురించి ‌ఎలా అర్థం చేసుకుంటావు...??

 నాలుగు రోజులు ‌ఉండే నీ‌ పాదరక్షల కొరకే పది షాపులు తిరిగిన నాన్న నిండు నూరేళ్ళు జీవించే నీకు తగిన జీవిత భాగస్వామిని‌ ఇవ్వడని ఎలా అనుకొంటారు..

తన కొడుకులను ఒక డాక్టర్... ఇంజినీరింగ్..IAS, IPS చేస్తాడో లేదో కాని...తన కూతురికి మాత్రం   అలాంటి భాగస్వామిని  తేగలడు...

కూతురు ఉన్న ఏ తండ్రి యైనా ఎక్కువ గా‌ ఆలోచించేది తన కూతురు గురించే అంగ రంగ వైభవంగా కూతురు వివాహం చేయాలని ఎన్నో కలలు కంటాడు...ఆ కలలను సాకారం చేసుకోని గర్వంగా చెప్పుకోవాలనుకుంటాడు..

అలాంటి తండ్రి యొక్క కలలను భగ్నం చేయకండి

💞 ప్రేమను గెలవండి.
💞 నాన్న ను గెలిపించండి.

ప్రేమంటే...✍🏻

💜 ఇద్దరు 🧝‍♀️🧝‍♂️ మనుషులు కలవడమే కాదు.
🧡 రెండు ‌మనస్సులు 💑‌ కలవడమే కాదు.
💚 రెండు కుటుంబాలు  👨‍👩‍👧👪 కూడా ‌కలవాలి.

అదే నిజమైన ప్రేమ 💛

ఇది ప్రతి అమ్మాయి 👱🏼‍♀️‌ అర్థం చేసుకోవాలి

*ఇది ఒక తండ్రి 💁🏼‍♂️ భయం
*ఇది ఒక తల్లి 🤱 వేదన.

నేను చేస్తున్నాను

"నేను చేస్తున్నాను" అనే కర్తృత్వ భావన ఏ విధంగా ఏర్పడుతుంది ?

మన పరిధి విషయంలో అవగాహన లేకపోవటం వలన కర్తృత్వ భావన ఏర్పడుతుంది. ముక్తేశ్వరపురం (ముక్త్యాల) అనే పుణ్యక్షేత్రం కృష్ణానది ఒడ్డున ఉంది. ఆ గ్రామంలోని పిల్లలు ఊరిని అనుకొని ప్రవహించే కృష్ణానదిని తమ చిన్నతనం నుండి చూస్తుంటారు. 

కృష్ణానది అనగానే వారికి తన ఊరే గుర్తుకు వస్తుంది. వారి దృష్టిలో ముక్త్యాల ఒడ్డున ఉన్నదే కృష్ణానది అనే భావన ఉంటుంది. ఇక్కడ ఏం జరిగిందంటే కొన్ని వందల మైళ్ళు ప్రవహించే కృష్ణానదికి వారి మనసులో ఒక పరిధి ఏర్పడింది. వయసు పెరిగిన తర్వాత గాని కృష్ణానది ఒడ్డున ఉన్న అనేక గ్రామాల్లో తమ గ్రామం ఒకటన్న విషయం అర్థమవుతుంది. మనలో కర్తృత్వ భావన కూడా అలాగే ఏర్పడుతుంది.

 చైతన్యశక్తి అనంతంగా నిండి ఉంది. ఆ చైతన్యశక్తికి దేహం అనే పరిధి ఏర్పడింది. ఆ కారణంగానే ప్రతీదీ "నేను చేస్తున్నాను" అనే కర్తృత్వ భావన ఏర్పడటానికి కారణమైంది. అదే మన సుఖదుఃఖాలకు దారితీస్తుంది !

Saturday, June 27, 2020

అగ్ని అమ్మవారు దీపం


సృష్టి మొత్తం ఆమె నుండి ఏర్పడినప్పుడు పంచభూతాలు, పంచతత్వాలు, పంచప్రణవాలు అన్ని ఆ తల్లి రూపమే, అలా అగ్ని రూపంలో అమ్మవారు సాక్షాత్తు శక్తి గా వ్యక్తం అవుతుంది. ఆ తల్లి చిదగ్ని నుండే రూపు దాల్చుతుంది..ఈ అగ్ని ద్వారానే హావిస్సు రూపంలో దేవతలకు శక్తి అందుతుంది.. ఈ నిత్య అగ్నిహోత్రం ఎంతో గొప్ప అనుష్ఠానం.. 

జీవుడిలో అగ్ని యొక్క స్థానం ఇలా ఉంటుంది ,అగ్ని వాక్కుగా ముఖమునందు, వాయువు ఘ్రాణముగా నాసిక యందు, ఆదిత్యుడు దృష్టిగా నేత్రములందు, దిశలు శ్రవణేంద్రియములుగా చెవుల యందు, జలము వీర్యముగా శిశ్న మందు, మృత్యువు అపానముగా నాభి యందు ప్రవేశించగా; ఈశ్వరుడు శరీరం నిలబడుటకు శిరస్సు ద్వారా పైనుండి బ్రహ్మ రంధ్రములోనికి ప్రవేశించెను. అగ్ని నుండి సమస్త ప్రపంచము ఏర్పడినది. సూర్యుడు కూడా అగ్ని స్వరూపుడే. రాత్రి, పగలు అగ్ని యొక్క సంతానము. 

అగ్ని రూపంలో అమ్మవారిని భావించి దీపం లో దర్శనం చేయాలి దీపం జోతిలోకి ఆ తల్లిని ఆవాహన చేసి ఆ దీపంలో ఉపాసించాలి అగ్నిలో ఆమె ప్రత్యక్షంగా దర్శనం ఇస్తుంది ఇది దీప దుర్గా ఉపాసనలో అనుభవం అవుతుంది.. దీపాలు వెలిగించి చేసే ప్రార్ధనకి అందుకే అంత శక్తి ఉంటుంది.. దీపాలతో దీప కాంతి రూపంలో అమ్మవారిని ప్రత్యక్షంగా ఉపాసన చేస్తారు..ఈ ఉపాసనలో ఆ కాంతి అమ్మవారి ఆకారంలోనే ప్రత్యక్షంగా పూజను స్వీకరిస్తుంది.. ఇది పద్దతిగా గురువును నుండి సాధన నేర్చుకుని చేయాలి.. అలా ఆవాహన చేసిన తల్లి ని దేవి మహత్యం స్ట్రోత్రాలతో, ఉపదేశం పొందిన మంత్రం యొక్క సంపుటికరణ స్త్రోత్రం అర్చనతో పూజించి ఆ స్వరూపం అంతర్ధానం అయే వరకు మనసులో నే మంత్రం జపిస్తూ ధ్యానం చేయాలి అలా చేయగా చేయగా ఆ శక్తి మనలోకి చేరిపోతుంది.. ఈ సాధన కోరికలతో చేయాకుడదు అమ్మవారి అనుగ్రహము పొందడానికి చేయాలి ఎందుకంటే ఆ స్థాయిలో అమ్మవారిని ప్రత్యక్షంగా ఆ కాంతిలో అనుభూతి చందుతూ ఒకరకమైన భయం తో కూడిన భక్తి ఏర్పడుతుంది వెన్నులో వణుకు పుడుతుంది నేరుగా ఆమెను చూసే ధైర్యం సరిపోక చూపు ఆమె పాదాలను వెతుకుతుంది.. అలా చూస్తూ చేసే శక్తి లేక ధ్యానంలో కి వెళ్ళిపోయి ఉపాసన కొనసాగిస్తారు లేకుంటే భయంతో మైకం వచ్చి పడిపోతారు.. నిదానంగా అలవాటు అయిన కొద్దీ ఆ భయం తగ్గక పోయిన ధైర్యంతో సాధన కొనసాగించడం అలవాటు అవుతుంది.. క్రమంగా ఈ సాధన సమయం కూడా పెరుగుతుంది. అఖండ దీపం లో అమ్మవారిని భావించి చేసే మండల దీక్షకు కూడా అంత శక్తి ఉంటుంది. 

ఈ ఉపాసన అంతా తెలియక పోయినా ప్రాతః కాలం సూర్యోదయానికి పూర్వం ఎక్కడ దీపం వెలుగుతుందో ఆ ఇంటిని ఆ దీపం రూపములో అమ్మవారు రక్షిస్తుంది దీపానికి ఒక్కో సమయానికి ఒక్కో దేవత అధిపతిగా ఉంటారు ఉదయం 5 గం దీపంలో వినాయకుడు అధిపతిగా ఉంటారు , 5.30 నుండి 6 గం సమయం వరకు లక్ష్మీ దేవి అధిపతిగా ఉంటుంది ఆ తల్లి దీపంలో కొలువై నరాయణుడిని ప్రార్థిస్తూ ఉంటుంది ఎక్కడ లక్ష్మీ కొలువై స్వామిని ఆరాధిస్తారో ఆ ఇంటిపైన  నారాయణుడి దృష్టి పడుతుంది. అగ్ని రూపం సాక్షాత్తు అమ్మవారే ఆ అగ్నిని దీపం రూపంలో ఆరాధిస్తే అంతకంటే గొప్ప ఉపాసనా సాధన ఏముంటుంది. 

ఉదయం సాయంత్రం దీపారాధన చేయండి, అగ్నిహోత్రం అలవాటు ఉన్నవాళ్లు క్రమం తప్పకుండా  సాధన చేస్తే ఆ తల్లిని ప్రత్యక్షంగా ఆరాధించినట్టు..దీపాలు వెలిగించండి అమ్మవారిని మీ ఇంటికి ఆహ్వానించండి..ఆ తల్లి మీ ఇంటికి దీపమై చీకటిని మాపి వెలుగును నింపుతుంది.

🌷శ్రీ మాత్రే నమః🌷

ఏడు కొండలు పేర్లు విశిష్టత


 
*తిరుమలలోని ఏడుకొండల పరమార్థం గురించి తెలుసుకొందామా..!*
☘☘☘☘☘☘☘
1. వృషబాద్రి    2. వృషాద్రి   3. గరుడాద్రి 
4. అంజనాద్రి   5. శేషాద్రి.    6. వేంకటాద్రి 
7. నారాయణాద్రి.
🌸🌸🌸🌸🌸🌸🌸
మనలోని ఏడు చక్రాలు దాటితే ఆనందానుభూతి కలుగుతుంది. ఆనంద నిలయం ఎక్కడ ఉంటుంది అంటే బ్రహ్మ స్థానంలో ఉంటుంది. అందుకనే ఆయన 7 కొండలు పైన ఉంటాడు. ఈ 7 కొండలు ఎక్కడం కూడా ఒక రహస్యం ఉంటుంది. 
ఆ 7 కొండలు సాలగ్రామాలే. ఆ 7 కొండలూ మహర్షులే. అక్కడి చెట్లు, పుట్టలు, పక్షులు ఏవైనా మహర్షుల అంశలే. తిరుమలలో పుట్టింది ఏదీ సామాన్యమైనది కాదు. 
🌸🌸🌸🌸🌸🌸🌸
అంజనాద్రి ర్వ్రుశాద్రిశ్చ శేషాద్రిర్గరుడాచలః |
తీర్థాద్రిః శ్రీనివాసాద్రి శ్చింతామణిగిరిస్తథా ||
వృషభాద్రి ర్వరాహాద్రిః జ్ణానాద్రిః కనకాచలః |
ఆనందాద్రిశ్చ నీలాద్రి స్సుమేరుశిఖరాచలః ||
వైకుంఠాద్రి: పుష్కరాద్రిః -- ఇతి నామాని వింశతిః
🌸🌸🌸🌸🌸🌸🌸

ఈ 20 నామాలు పఠించటంవల్ల సర్వ పాప బంధాలు నుండి విముక్తులు కాగలరు.
 ☘☘☘☘☘☘☘

*1. వృషభాద్రి - అంటే ఎద్దు :*
వృషభానికి ఋగ్వేదంలో ఒక సంకేతం ఉంది. ఎద్దు మీద పరమశివుడు కూర్చుంటాడు. దానికి 4 కొమ్ములుంటాయి. 3 పాదాలు (భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు)
వాక్కు అంటే - శబ్దం
శబ్దం అంటే - వేదం
వేదం అంటే - ప్రమాణము
వేదమే ప్రమాణము. వేదము యొక్క ప్రమాణాన్ని అంగీకరించిన వాడు మొదటి కొండ ఎక్కుతాడు.
 🌸🌸🌸🌸🌸🌸🌸

*2. వృషాద్రి - అంటే ధర్మం :*
ధర్మం అంటే నువ్వు వేదాన్ని అనుసరించి చేయవలసిన పనులు. నీకు భగవంతుడు ఇచ్చిన వాటితో మంచివి వినడం, చూడడం, మంచి వాక్కు మొదలైనవి. దాని వల్ల ఇహంలోను, పరలోకంలోను సుఖాన్ని పొందుతాడు. అవి చెయ్యడమే వృషాద్రిని ఎక్కడం.
 🌸🌸🌸🌸🌸🌸🌸

*3. గరుడాద్రి - అంటే పక్షి :*
ఉపనిషత్తుల జ్ఞానాన్ని పొందడం.
షడ్ - అంటే జీర్ణం కానిది. ఒక్క పరమాత్మ మాత్రమే జీర్ణంకానిది. పరమాత్మ ఒక్కడే ఉంటాడు. మిగిలిన వాటికి 6 వికారాలు ఉంటాయి. పుట్టినది, ఉన్నది, పెరిగినది, మార్పు చెందినది, తరిగినది, నశించినది. ఇవన్నీ పుట్టిన వాడికి జరుగుతూనే ఉంటాయి. ఆ ఆరు లేని వాడు భగవానుడు.
భగవ : ఐశ్వర్య బలము, వీర్య తేజస్సు మరియు అంతా తానే బ్రహ్మాండము అయినవాడు.
అన్ : ఉన్నవాడు, కళ్యాణగుణ సహితుడు, హేయగుణ రహితుడు. అటువంటి భగవానుణ్ణి జ్ఞానం చేత తెలుసుకోవడమే గరుడాద్రి.
🌸🌸🌸🌸🌸🌸🌸

*4. అంజనాద్రి :*
అంజనం అంటే కంటికి కాటుక. ఈ కంటితో చూడవలసినవి మాత్రమే చూసినపుడు. ఈ కంటితో చూసిన దాంట్లో అంతటా బ్రహ్మమే ఉందని తెలుసుకోవడం కంటికి కాటుక. ఇదంతా పరమాత్మ సృష్టియే. అప్పుడు అంజనాద్రి దాటుతాడు.
🌸🌸🌸🌸🌸🌸🌸

*5. శేషాద్రి :*
ప్రపంచం అంతా బ్రహ్మమే అని చూసాడనుకోండి వాడికి రాగద్వేషాలు ఉండవు. వాడికి క్రోధం ఉండదు. వాడికి శత్రుత్వం ఉండదు. భగవద్గీతలో గీతాచార్యుడు చెప్పినట్లు "తుల్య నిందా స్తుతిర్ మౌని" (శ్లోకం చెప్పారు) తాను కాకుండా ఇంకోటి ఉంది అన్న వాడికి భయం. అంతా బ్రహ్మమే అనుకునేవాడికి భయం ఉండదు. ఎప్పుడూ ఒకేలా ఉండడమే బ్రహ్మం. ఆ స్థితికి ఎక్కితే శేషాద్రిని ఎక్కడం.
 🌸🌸🌸🌸🌸🌸🌸

*6. వేంకటాద్రి :*
వేం : పాపం, కట : తీసేయడం. కాబట్టి పాపాలు పోతాయి. అంతా బ్రహ్మమే చేయిస్తున్నాడు, అందుకనే మనకి బ్రహ్మం తెలిసినవారు పిచ్చివాళ్ళలా కనవడుతారు. రామకృష్ణ పరమహంస ఈ పిచ్చి నాకు ఎప్పుడు వస్తుందో అంటూ ఉండేవారు. అందుకే జ్ఞాని, పిచ్చివాడు ఒకలా ఉంటారు. ఆయనకే అర్పణం అనడం, అటువంటి స్థితిని పొందడం వెంకటాద్రి ఎక్కడం.
🌸🌸🌸🌸🌸🌸🌸

*7. నారాయణాద్రి :*
 అంటే తుల్యావస్థని కూడా దాటిపోయి, తానే బ్రహ్మముగా నిలబడిపోతాడు. అటువంటి స్థితిని పొందడం నారాయణాద్రి. 
🌸🌸🌸🌸🌸🌸🌸
కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటాచల తిరుమల శ్రీనివాసున్నీ మనసారా కొలవడం అంటే నాభూతో నాభవిష్యత్. ఆయన చెంత ఉంటే వైకుంఠమేగా ఇక.
🌸🌸🌸🌸🌸🌸🌸

వరాహస్వామిని ఎందుకు దర్శించుకోవాలి

వెంకటేశ్వర స్వామి కంటే ముందుగా వరాహస్వామిని ఎందుకు దర్శించుకోవాలి? 

చాలామంది భక్తులకు అసలలా ఎందుకు చేయాలో తెలియదు కానీ చేసేస్తుంటారు. తిరుమలలో శ్రీనివాసుడు వెలసి 5000 సంవత్సరాలవగా, అప్పటివరకూ తిరుమల శిఖరం వరాహస్వామి సొంతం.


 అప్పటిలో వరాహ స్వామి వద్ద శిఖరంపై వంద చదరపు అడుగుల స్థలాన్ని బహుమతిగా తీసుకున్నాడు వెంకటేశ్వరస్వామి. దానికి బదులుగా శ్రీనివాసుడు ఒక హామీ ఇచ్చాడు వరాహస్వామికి.

అదేమిటంటే… తనకోసం వచ్చే భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించుకు వచ్చేలా చూస్తానని చెప్పాడు. తిరుమలలో వెలసిన తొలి దైవం వరాహ స్వామి, అందువల్లనే వేంకటాచలం వరాహ క్షేత్రంగా ప్రసిద్ధి కెక్కింది.

తిరుమల శ్రీవారి ఆలయ పుష్కరిణికి వాయువ్య మూలలో తూర్పు ముఖంగా శ్రీ వరాహ స్వామి ఆలయం వుంది. వెంకటేశ్వరస్వామికి ఇక్కడ స్థలం ఇచ్చినందుకు వరాహస్వామికి తొలిదర్శనం, మొదటి అర్చన, మొదటి నివేదన జరిగేట్లు తామ్రపత్రం (రాగిరేకు) పైన వేంకటేశ్వరుడు రాసి ఇచ్చాడు. ఈ తామ్ర పత్రం మీద బ్రాహ్మీ లిపిని పోలిన అక్షరాలు దానిమీద ఉన్నాయి.

ఈ రాగిరేకును నేటికీ రూ.3 హారతి టిక్కట్టు కొన్న భక్తులకు హారతి సమయంలో చూపిస్తారు. భక్తులు ముందుగా వరాహ స్వామిని దర్శించుకుంటే ఆ శ్రీనివాసుడు సంతోషిస్తాడని పెద్దలు చెబుతుంటారు. ఒకవేళ వరాహస్వామిని దర్శించుకోకుండా గాని భక్తులు తిరమల నుండి వస్తే, ఆ యాత్ర ఫలం దక్కదని చెబుతారు. కనుక తిరుమల శ్రీవారిని దర్శించుకునే ప్రతి భక్తుడు వరాహ స్వామి దర్శనం సంపూర్ణసిద్ధిని కలిగిస్తుంది.

అశ్వని నక్షత్రం - గుణగణాలు, ఫలితాలు


    అశ్విని నక్షత్ర అధిదేవత అశ్వినీ దేవతలు. సూర్య భగవానుడి భార్య సజ్ఞాదేవికి, సూర్య భవానుడికి పుట్టిన వారు అశ్వినీ దేవతలు. ప్రాథమికంగా అశ్వనీ నక్షత్రం సన్య నక్షత్రంగా పురుష లక్షణంతో క్షిపుతారగా గుర్తింపు పొందింది. దీనికి అధిపతి కేతువు. ఈ నక్షత్రంలో జన్మించినవారు శివుడి అర్చన చేసి వైడూర్యాన్ని ధరించవలసి ఉంటుంది. 

అశ్వని నాలుగు పాదాలు మేష రాశిలోనే ఉన్నాయి. మొదటి పాదం :- అశ్వినీ నక్షత్రం మొదటి పాదంలో పుట్టిన వారి నక్షత్ర అధిపతిగా కుజుడు. వీరు శక్తికి మించిన సామర్థ్యం ప్రదర్శించాలని ప్రయత్నిస్తారు. అస్థిర చిత్తంతో ఉంటారు. కొన్ని సార్లు రాజీ ధోరణితో ఉండాల్సి ఉంటుంది. అనవసర విషయాలపై దృష్టి పెట్టడం జరుగుతుంది. పనికి రాని ఆలోచనలు బుర్రను తొలుస్తుంటాయి. సమాజంలో మంచి గుర్తింపు, గౌరవం పొందాలన్న తాపత్రయపడతారు. గ్రహ దశలు :-పుట్టినప్పటి నుంచి కేతు మహర్దశ ఏడు సంవత్సరాలు, శుక్ర మహర్దశ ఇరవై సంవత్సరాలు, రవి మహర్దశ ఆరు సంవత్సరాలు, చంద్ర మహర్దశ పది సంవత్సరాలు, కుజ మహర్దశ ఏడు సంవత్సరాలు అనుభవిస్తారు.రెండో పాదం:- అశ్వినీ నక్షత్రం రెండవ పాదంలో పుట్టిన వారి నక్షత్ర అధిపతిగా కుజుడు నవాంశ రాశ్యధిపతి శుక్రుడు. దీంతో వీరు పట్టుదల గల వారు. ఎదుటి వ్యక్తుల స్వభావాన్ని త్వరగా గ్రహిస్తారు. చాలా విషయాల్లో చురుగ్గా వ్యవహరిస్తారు. తలపెట్టిన కార్యాన్ని సాధించడంలో అనుకూలమైన మార్గాన్ని ఎంచుకుంటారు. ప్రాజ్ఞులు, దక్షులుగా గుర్తింపు పొందుతారు. మంచి ఆత్మవిశ్వాసం గలవారై ఉంటారు. గ్రహ దశలు:- వీరు పుట్టినప్పటి నుంచి కేతు దశ ఐదు సంవత్సరాల మూడు నెలలు. శుక్ర మహర్దశ ఇరవై సంవత్సరాలు. రవి మహర్దశ ఆరు సంవత్సరాలు. చంద్ర మహర్దశ పది సంవత్సరాలు, కుజ మహర్దశ ఏడు సంవత్సరాలు అనుభవిస్తారు. మూడో పాదం:-  అశ్వని మూడో పాదంలో జన్మించిన వారికి ప్రాచీన శాస్త్రాలను ఇష్టపడుతారు. ముఖ్యంగా జ్యోతిష్య, తర్క శాస్త్రాలపై మక్కువ ఉంటుంది. చక్కటి సలహాలు ఇవ్వడంలో నేర్పరులు.  అయితే ఆ సలహాల వల్ల తమకు తాము ఎలాంటి లాభాన్ని పొందలేరు. నలుగురిలో కలిసేందుకు ఇష్టపడరు. గ్రహ దశలు  
పుట్టినప్పటి నుంచి కేతు మహర్దశ మూడున్నర సంవత్సరాలు, శుక్ర మహర్దశ ఇరవై సంవత్సరాలు. రవి మహర్దశ ఆరు సంవత్సరాలు. చంద్ర మహర్దశ పది సంవత్సరాలు, కుజ మహర్దశ ఏడు సంవత్సరాలు, రాహు దశ 18 సంవత్సరాలు అనుభవిస్తారు. నాలుగో పాదం:- అశ్వని నాలుగో పాదంలో జన్మించిన వారు కళాత్మకంగాను, అలంకార ప్రియులుగానూ, నిదానమైన ప్రవర్తనతోనూ ఉంటారు. గాఢమైన ఆలోచనలు కలిగి మేధావులుగా గుర్తింపు పొందుతారు. నిరంతరం కొత్త విషయాలపై ఆసక్తి కనబరుస్తారు. లక్ష్యసాధనలో వెనుకడుగు వేయరు. అయితే వీరికి ఫలితం సునాయాసంగా అందదు. శ్రమ పడాల్సిన అవసరం ఉంటుంది. గ్రహ దశలు:- పుట్టినప్పటి నుంచి కేతు మహర్దశ 7 సంవత్సరాల 9 నెలలు, శుక్ర మహర్దశ ఇరవై సంవత్సరాలు. రవి మహర్దశ ఆరు సంవత్సరాలు. చంద్ర మహర్దశ 10 సంవత్సరాలు, కుజ మహర్దశ ఏడు సంవత్సరాలు, రాహు దశ 18 సంవత్సరాలు అనుభవిస్తారు.  
ఈ నక్షత్ర జాతకుల గుణగణాలు
అశ్వినీ నక్షత్ర జాతకులు అశ్వం వలే ఉరిమే ఉత్సాహంతో కనిపిస్తారు. తెలివి, జ్ఞాపకశక్తి, సామర్థ్యం, చైతన్యవంతమైన, విశాలమైన కళ్ళు కలిగివుంటారు. పోటీ మనస్తత్వం ఉంటుంది. క్రీడల యందు ఆసక్తి అధికం. అశ్వినీదేవతలు శసత్రచికిత్స, ఆయుర్వేద వైద్యములో నిపుణులు కనుక అశ్వినీ నక్షత్రజాతకులు ఆయుర్వేదం వంటి వైద్యం యందు ఆసక్తితో ఉంటారు. వీరు ఉద్రేకపూరిత మనస్తత్వం కలిగి ఉంటారు. రాశ్యాధిపతి కుజుడు కనుక వీరికి ధైర్యసాహసాలు అధికం. ఎటువంటి పరిస్థితులనైనా మనోస్థైర్యంతో ఎదుర్కొనగలరు. ఓర్పు, నేర్పు, సామర్ధ్యంతో కార్యనిర్వహణ పూర్తి చేస్తారు. తనను నమ్ముకున్న వారిని ఆపదలో కాపాడుట వీరి విశిష్ట గుణం.ఈ నక్షత్ర జాతకులు వీరు ఇతరుల సలహాలు స్వీకరించినా.. చివరకు తమకు నచ్చినట్లు నిర్ణయం తీసుకుంటారు. ఈ నక్షత్రము దేవగణ నక్షత్రము కనుక న్యాయం, ధర్మము పాటిస్తారు. వీరికి నాయకత్వ లక్షణాలు అధికం కనుక రాజకీయనాయకులుగా, అధికారులుగా చక్కగా రాణిస్తారు. నక్షత్రాధిపతి కేతువు కనుక వైరాగ్యం, దైవోపాసనా, భక్తి వంటి లక్షణాలు వీరికి అధికం. కొంత అలసత్వము కలిగి ఉండడము సహజమే. తాము అనుకున్నది సాధించాలన్న పట్టుదల ఉంటుంది. ఇతరులకు కింద పనిచేయడం వీరికి నచ్చదు. అన్ని విషయాలలో ఆధిపత్య మనస్తత్వం కలిగి ఉంటారు. క్రీడాకారులుగా, వైద్యులుగా, సైనికపరమైన ఉద్యోగులుగా చక్కగా రాణించగలరు. ఇవి అశ్వినీ నక్షత్రజాతకుల సాధారణ గుణాలు. అయితే జాతకచక్రం, లగ్నం, పుట్టిన సమయం, మాసముల వలన గుణగణాలలో కొద్దికొద్దిగా మార్పులు ఉంటాయి. ఈ నక్షత్ర జాతకులకు 45 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా జరుగుతుంది. బాల్యము నుంచి యుక్తవయస్కులు అయ్యే వరకు వీరికి జీవితం వీరికి ఆనందదాయకముగా జరుగుతుంది. అశ్వనీ నక్షత్ర జాతకులకు కృత్తిక, మృగశిర, పునర్వసు, చిత్త, అనూరాధన, జ్యేష్ట నక్షత్రములు ఏ కార్యమునకు పనికి రావని శాస్త్రం చెబుతోంది.!
Taken from Astrological book.

Seeds Of Consciousness - 52

🌴. YOU PEOPLE DON’T KNOW HOW MUCH YOU MISS BY NOT KNOWING YOU TRUE SELF  🌴

Q: While in theory I am ready to pay any price, in actual life again and again I am being prompted to behave in ways which come in between me and reality. Desire carries me away.

M: Increase and widen your desires till nothing but reality can fulfil them. It is not desire that is wrong, but its narrowness and smallness. Desire is devotion. By all means be devoted to the real, the infinite, the eternal heart of being. 

Transform desire into love. All you want is to be happy. All your desires, whatever they may be, are expressions of your longing for happiness. Basically, you wish yourself well.

Q: If I am free, why am I in a body?

M: you are not in the body, the body is in you! The mind is in you. They happen to you. They are there because you find them interesting. Your very nature has the infinite capacity to enjoy. 

It is full of zest and affection. It sheds its radiance on all that comes within its focus of awareness and nothing is excluded. It does not know evil nor ugliness, it hopes, it trusts, it loves. 

You people do not know how much you miss by not knowing your own true Self. You are neither the body nor the mind, neither the fuel nor the fire. They appear and disappear according to their own laws.

That which you are, your true Self, you love it, and whatever you do, you do for your own happiness. To find it, to know it, to cherish it is your basic urge.

Since time immemorial you loved yourself, but never wisely. Use your body and mind wisely in the service of the self, that is all. 

Be true to your own self, love your self absolutely. Do not pretend that you love others as yourself. Unless you have realised them as one with yourself, you cannot love them. 

Don't pretend to be what you are not, don't refuse to be what you are. Your love of others is the result of self-knowledge, not its cause.

Without self-realization, no virtue is genuine. When you know beyond all doubting that the same life flows through all that is and you are that life, you will love all naturally and spontaneously. 

When you realize the depth and fullness of your love of yourself, you know that every living being and the entire universe are included in your affection. But when you look at anything as separate from you, you cannot love it for you are afraid of it. 

Alienation causes fear and fear deepens alienation. It is a vicious circle. Only Self-realization can break it. Go for it resolutely.

- Nisargadatta Maharaj

రాజ ధర్మం-భక్తి ధర్మం

ధర్మం నాలుగు పాదాలుగా నడిచిన త్రేతాయుగంలోని రామాయణకాలంలో రాజధర్మానికి, భక్తిధర్మానికి మధ్య జరిగిన సంఘర్షణ, వాటివల్ల పొడసూపిన భావవైరుధ్యాన్ని వారు ఆనుభవించిన తీరు చాలా ఆశ్చర్యం కలిగించేలా ఉండి, సగటు మనిషికి ఎన్నో జీవితపాఠాలు నేర్చుకునే అవకాశం కలిగిస్తుంది. పరిస్థితులు ధర్మసంకటాన్ని సృష్టించినా, తాము నమ్మిన సిద్ధాంతాల కోసం తమ జీవితాలను సమర్పించి పునీతం చేసుకున్న రెండు వైవిధ్యమైన వ్యక్తిత్వాల మధ్య ఉన్న అపురూపమైన అనుబంధాన్ని వాల్మీకి మలిచిన తీరు మనం రామలక్ష్మణుల వృత్తాంతాలను అవలోకిస్తే అవగతమవుతుంది.

మర్యాదా పురుషోత్తముడిగా మన్ననలందిన శ్రీరాముడి ధర్మజిజ్ఞాస రామాయణమంతా మనకు అగుపడుతుంది. అందుకే ‘రామో విగ్రహవాన్‌ ధర్మః’ అని శత్రువైన మారీచుడి ద్వారా వర్ణితమైన ఉత్తమోత్తముడు శ్రీరాముడు. అడుగడుగు నా ఎన్ని పరీక్షలు ఎదురైనా కేవలం తండ్రికిచ్చిన మాట కోసం స్వంతవారి ని, ప్రజలను ఐశ్వర్యాన్ని రాజ్యాధికారాన్ని తృణప్రాయంగా వదిలి అడవిబాట బట్టిన త్యాగశీలి. కైకేయి వరం వల్ల దశరథుడు తాను తలపెట్టిన పట్టాభిషేకానికి బదులు ఉన్నఫలాన రాజ్యాన్ని భరతుడికి వదిలేసి వెళ్ళమని అన్నప్పుడు, ఒక్కమాట కూడా ఎదురుచెప్పకుండా, తల్లి కౌసల్య వద్దని వారిస్తున్నా, అన్యాయం జరుగుతుందని లక్ష్మణుడు వారిస్తున్నా, ఎన్నో కష్టాలు అనుభవించి,  ఆ ప్రస్థానంలో, ఏకపత్నీ వ్రతాన్ని, సుగ్రీవుడి విషయంలో స్నేహధర్మాన్ని, విభీషణుడి విషయంలో రాజధర్మాన్ని, భరతుడు తన పాదుకలు స్వీకరించడానికి వచ్చినపుడు రాజ్యపాలనా రహస్యాలను వివరించి తన భాతృధర్మాన్ని నిర్వర్తించిన సౌహార్ద్ర శీలి ఆ పురుషోత్తముడు.

అటువంటి రాముడి అత్యంత ప్రియమైన సోదరుడు, అరివీర భయంకరుడు, పేరుకి సవతి తమ్ముడైనా, రాముడి కోసం ప్రాణత్యాగం కూడా చేయడానికి వెనుకాడని భక్తిధర్మం లక్ష్మణుడిది. ఇద్దరి మనస్తత్వంలో ఎంతో వైరుధ్యం ఉంది. తాను స్వతహాగా రాముడికి ధీటైన వాడైనా, అన్నమాట దాటని సేవకుడు. లక్ష్మణుడు, రాముడికి ఏ కష్టం వచ్చినా తట్టుకోలేడు. ఎంతటి సాహసానికైనా వెనుకాడడు. తన దృష్టిలో రాముడికి కష్టం కలిగించిన వారెవరూ తన మిత్రులు కారు. రాముణ్ణి బాధపెట్టే అవకాశం ఉన్న ఏ సంఘటనా ఆయనకు రుచించదు. లక్ష్మణుడు నమ్మిన ఏకైక ధర్మం రామభక్తి. మిగతా అన్నీ అధర్మాలే. ఎంతటి ఆవేశాన్నయినా ఒక్క రాముడి కంటిచూపుతోనే తగ్గించుకొని, రామసేవలో నిద్రాహారాలు మాని, తన సర్వసుఖాలు వదులుకొని ఒక సేవకుడిగా మారి, తన భక్తిని చాటుకున్న ధర్మశీలి లక్ష్మణుడు.

రాముడిని నిత్యం అనుసరిస్తూ గడిపిన లక్ష్మణుడి దృష్టిలో, రాముడిని వనవాసానికి వెళ్ళమన్న తండ్రి దశరథుడు, కైకేయి ఇద్దరూ పెద్ద మోసగాళ్ళు. వారి నిర్ణయంపై ఆగ్రహంతో, వారిని, అయోధ్యనంతటినీ నాశనం చేయడానికి కూడా ఉద్యుక్తుడైన సాహసవంతుడు, నిరంతరం తన ఆవేశాన్ని సీతారాముల సేవలో అణిచివేసుకొని, కేవలం అన్న వెంటే ఉండాలన్న భక్తితో, తన సతీ వియోగంలో పధ్నాలుగేండ్లు వనవాసంలో గడిపిన ధర్మమూర్తి. లక్ష్మణుడికి రాముడి మాటంటే ఎంత గురి అంటే, రాముడి ధర్మవాక్కులు ఎక్కడైనా నచ్చినా, నచ్చకపోయినా ఒక్కమాట కూడా అనక భాతృప్రేమను చాటిన ఉత్తముడు సౌమిత్రుడు. లక్ష్మణుడి తల్లి సుమిత్ర ఎంతో ఉత్తమురాలు. తన సవతి కొడుకుతో పాటు భార్యను, రాజ్యాన్ని వదిలి వనవాసానికి సిద్ధమైన పుత్రుడిని వారించకుండా, పైగా ‘రాముని క్షేమం పూర్తిగా నీ బాధ్యతయే’ అన్నదిగానీ, ‘నువు జాగ్రత్త’ అనలేదు. అంతటి ఉత్తమోత్తమమైన తల్లికి పుత్రుడు. కాబట్టే, లక్ష్మణుడు (సౌమిత్రుడు) అంతటి సౌశీల్యుడయ్యాడు. చివరకు యుద్ధంలో ఇంద్రజిత్తు ఏ అస్ర్తానికీ లొంగకపోతే రాముడిని, రాముడు పాటించిన ధర్మాన్ని మనసులో తలుచుకొని బాణం వేసి వధించి, రాముడి రాజధర్మాన్నీ, తన భక్తిధర్మాన్ని ఒకేసారి నిరూపించిన సౌజన్యశీలి లక్ష్మణుడు.

మనస్తత్వంలో ఇంతటి వైరుధ్యం ఉన్నా, తాను నమ్మిన రాజధర్మం కోసం రాముడు, తాను నమ్మిన భక్తి కోసం అన్నను తప్ప అన్నీ త్యాగం చేసిన తమ్ముడు లక్ష్మణుడు. అటువంటి రామలక్ష్మణ అనుబంధం అజరామరం. మనందరికీ ఆదర్శప్రాయం, ఆచరణీయం. ఇప్పుడు అరుదైనా, మన ఉమ్మడి కుటుంబాల్లో ఇటువంటి అనుబంధాలను ఇంకా మనం చూడవచ్చు. దీనికి ఇంకా ఆస్కారం ఉంది కూడా. ధర్మో రక్షతి రక్షితః