Tuesday, June 30, 2020

పాషండుడా నీదెంత పాషాణ హృదయం.

(1) కల్లుపెంట అనగా ?

(A) కల్లు అమ్మెడి చోటు
(B) కల్లు తీసేసమయంలో కల్లు నుండి వేరుచేసిన చెత్త
(C) కల్లు అంటేరాయి,పెంట అంటే కుప్ప కాబట్టి కల్లుపెంట అంటే రాళ్ళకుప్ప
(D) కణేకల్లు, గుంతకల్లు, నకిరేకల్లులాగా ఇదో ఊరు

(2) తెరువరి అనగా ?

(A) పాదాచారుడు
(B) దారి కానక తిరిగేవాడు
(c) ఉపాయాలు చెప్పేలాడు
(D) దారిదోపిడిలు చేసే దొంగ

(3) పంబ అంటే ?

(A) పంబ రేగిపోతోంది అంటాం కదా ! పంబ అంటే ఓ చర్మవాయిద్యం.కొట్టినపుడు రేగిపోతుంది.
(B) బాన కడవ కుండలాగా పంబ అంటే ఓ కుమ్మరిచేసిన మట్టి పాత్ర
(C) శ్రీకాకుళం జిల్లాలో ఒకనది (కేరళలో కూడా పవిత్రమైన నది పంబ )
(D) పంబ అంటే దుమ్ము, అందుకే పంబ రేగిందంటారు

(4) పాషండుడు అనగా ?

(A) రాయిలాగా కఠిన హృదయం కలవాడు.
(B) పాషాణం ఒక విషం , పాషాణం ద్వారా విషప్రయోగం చేయువాడు
(C) పాషండమనేది ఒక మతం, వేదాలను తృణికరించింది
(D) పాషండమంటే అత్యంత కఠినమైన గదాయుద్ధం

(5) ముచ్చే బంగారమంటే ?

(A) బంగారు జాతులలో హీనమైనది.కల్తీ బంగారు
(B) కాకిబంగారం
(C) వడ్లలో(బియ్యంలో ) ఒక ప్రాచీనరకం
(D)  ముచ్చు వారిచే దొంగలింపబడిన బంగారం.

(6) శూన్యవాద సిద్ధాంతకర్త

(A) ఆదిశంకరుడు
(B) మధ్వావాచార్యుడు
(c) కుందకుందనాచార్యుడు (జైనుడు, జంబూద్వీపం ఉన్నగ్రామం ఇతని పేరు మీదుగానే ఏర్పడింది)
( D)  ఆచార్య నాగార్జునుడు
 
(7) మాయావాద సిద్ధాంతకర్త ?

(A) 12వ శతాబ్దంలో మంత్రతంత్రాలు నేర్చిన  కాశీపురవాసి జంబీరుడు
(B) ఆదిశంకరుడు
(C) బౌద్ధమతంలో తాంత్రికవిద్యను ప్రవేశపెట్టిన లీలామాలుడు
(D) మధురరాజు విజయరాఘవుని ఆస్థాన పురోహితుడు తాడంకి వెంకన్న

(8) సమాధి (ఒలికిలి) నుండి శవాలను బయటకు తీసి అంగాంగ పరీక్షలు చేసిందెవరు ?

(A) శుశ్రుతుని శిష్యులు
(B) ఇప్పటికి 2500 సం|| క్రిందటి భిషగర్వులు (భిషగర్వులంటే వైద్యులు)
(C) అఘోరాలు (శివశక్తి ఆరాధకులు, స్మశానంలో తిరిగారు, శవంపై కూర్చున్నారు, కపాలంలో తిన్నారు)
(D) టిబెట్టు నుండి శ్రీపర్వత విశ్వ విద్యాలయంలో విద్య నేర్చుకొన్న లామాలు. శ్రీపర్వతమంటే నాగార్జున కొండ)

(9) గోసాయి అంటే ?

(A) గోవుల రక్షణాధికారి
(B) గోవులను కాచేవాడు
(C) శైవ సన్యాసి
(D) వైష్ణవ సన్యాసి

(10) భారత ముస్లీం తత్వవేత్తల నుండి జనించిన సూఫితత్వం

(A)  ముస్లీంలు కాని వారిపై విధించిన జిజియాపన్నును తిరస్కరించింది
(B) హింసాత్మక మార్గాన్ని తిరస్కరించింది
(C) హిందువులను అవమానించరాదని ఆదరించాలని చెప్పింది.
(D) అన్ని మతాలసారం ఒకటేనని చెప్పింది.

Be thankful. Be patient

A movie theater announced that an 8-minute movie won the title of Best Short Film in the World ...

So, it was decided to display this movie in the cinema for free, so that the largest crowd could gather to watch it ...
 
    The movie began with a snapshot of a room ceiling that is devoid of any decoration and of any details;  Just a white ceiling ...

    3 minutes passed without the camera moving and it did not move to any other scene, or any other part of the ceiling in the same room ...

    Another 3 minutes passed without the camera moving and without changing the scene ...

    After 6 boring minutes, the viewers started grumbling;  Some of them were about to leave the theater hall;  And some of them objected to the officials of the house because they wasted their time watching a ceiling ...

    Suddenly, before the majority became concerned and starting to leave, the camera lens slowly moved on a wall without any details as well until it reached down towards the floor, there a child appeared on a bed, who seems to be totally handicapped due to the spinal cord tare in his little body ...

    The camera slowly moved to the side of the handicap bed, showing a wheelchair without a back ...

    The camera moved to the boredom location of the ceiling again;  To show a sentence: *"We showed you only 8 minutes of this child's daily activity, only 8 minutes from the scene that this handicapped child watches at all hours of his life, and you complained and weren’t patient for only six minutes, you couldn't bear to watch it ..!* ...
   
    So know the value of every second of your life that you spend in wellness, and thank your Lord for every blessing bestowed on you, and you will not feel its existence unless you lose it ...

    We suffer from quarantine and the curfew, which is, God willing, for a limited time, and we do not know that there are millions who lived their entire lives in quarantine ...

    Covid-19 has forced us to have the time to think about many privileges , and we thank God for the blessing of the freedom of movement and out of the house to see life, breathe the air, and practice activity in its various colors ...

Thank God and have gratitude for being blessed with all that, which we have not realized... in many occassions.
Lead life counting the blessings but not the problems or troubles or challenges.

Life is a One Time Opportunity.. Daily one more time.. Every day to think better, feel better and do better.

May god bless you in abundance.

Sunday, June 28, 2020

శ్రీమన్నారాయణ వృత్తాంతము - 5

🌻. తమ భక్తులను రక్షించు నాగులను చంపుటకు ప్రయత్నించిన వారికి శ్రీపాదుల వారి గుణపాఠము.

నాగులచవితినాడు మా గ్రామమునకు మంత్రగాడు ఒకడు వచ్చియుండెను. 

ఆ మంత్రగానిని మా దాయాదులునూ, గ్రామపెద్దయు సాదరముగా ఆహ్వానించిరి. అతడు ఎంతటి విషసర్పమునయిననూ తన మంత్రశక్తితో స్తంభింపజేసి వశమొనరించుకోగలగినవాడు. పాము కరచిన ఏ వ్యక్తిని అయినా తన మంత్రశక్తితో జీవింపజేయగలగినవాడు. అతనిచేతిలో గరుడరేఖ కూడా యుండెను. 

గరుడరేఖ కలిగిన మానవులకు సర్పములు స్వాధీనములగునని శాస్త్రవచనము. ఆ సర్పములను హతమార్చవలెనని గ్రామపెద్దయు, మంత్రగాడును తలపోయుచుండిరి.

పుట్టకు దరిదాపులలోనున్న ప్రాంతమంతయునూ మంటలు ఏర్పాటు చేయబడెను. మంత్రగాడు తన ఆసనమునందు కూర్చొని వింత వింత పద్ధతులతో తంత్రములనుచేయుచూ మంత్రములను బిగ్గరగా చదువుచుండెను. 

జాతి సర్పములను వధింపబూనుట పాపహేతువని మేము బాధపడుచుంటిమి. మేము నిస్సహాయస్థితిలో నుంటిమి. అమాయకములయిన జాతిసర్పములను ఆ శ్రీపాదుల వారే రక్షింపవలెనని ప్రార్థించుచుంటిమి. 

మంత్రశక్తికి లోబడినవో అనునట్లు ఆ సర్పములు పుట్టనుండి బయటకు వచ్చినవి. మంత్రగానికిని, వాని అనుచరులకునూ యిదిఎంతయో సంతసము కూర్చుచుండెను. అయిననూ వారికి ఆ సంతసము ఎక్కువసేపు నిలువలేదు. 

బయటకు వచ్చిన సర్పములు క్షణక్షణమునూ ఆకారములో పెద్దవగుచుండెను. మంత్రగాడు బిగ్గరగా మంత్రములు చదువుచుండెను. మంత్రశక్తికి లోబడినవో అన్నట్లు ఆ సర్పములు అగ్నికీలలవైపు పయనించుచుండెను. 

ఆశ్చర్యము! అగ్నిదేవుడు వాటికి దారి విడిచెనో అన్నట్లు అవి వచ్చు మార్గము నందు మాత్రము అగ్ని చల్లారుచుండెను.తుదకు అగ్ని అంతయునూ ఆరిపోయెను. ఆ సర్పరాజములు యధేచ్చగా అచ్చటనుండి వెడలిపోయెను. మంత్రగాడును, అతని అనుచరులునూ బిత్తరపోయిరి.

ఇంతలో గ్రామపెద్ద పెద్దకుమారునికి పాము కరచిన వానికుండు లక్షణములు కన్పింపసాగెను. రెండవ కుమారుని నేత్రములకు చూపు బాగుగా తగ్గిపోయెను. 

పాము కరవకుండగనే సర్పదష్టునకుండు లక్షణములు ప్రాప్తించి శరీరము విషపూరిత  మగుట విడ్డూరము. ఉన్నట్టుండి అంధత్వము ప్రాప్తించుటయూ విడ్డూరమే! మంత్రగాడు మంత్రములనెన్నింటినో పఠించెను. కాని ఫలితము లభింపలేదు. 

అతని చేతిలోని గరుడరేఖ క్రమక్రమముగా తన ఆకారమును కోల్పోయి పూర్తిగా అదృశ్యమాయెను. గ్రామపెద్ద మనసులో మహాభయము తోచెను. అనాధ రక్షకుడగు శ్రీపాదుడు తప్ప వేరేవ్వరునూ దిక్కులేరు. మంత్రగానిలో మంత్రశక్తి పూర్తిగా క్షీణించెను. కొద్ది నిముషములలో అతడు విగతజీవుడాయెను. 

శ్రీపాదుల వారి లీల ఏ సమయములో ఎట్లుండునో ఎవరికెరుక? గ్రామపెద్ద మా వద్దకు పరుగెత్తుకొని వచ్చి గోలుగోలున ఏడువసాగెను. మేము మాత్రము ఏమి చేయగలము? అనన్యచింతతో శ్రీపాదుల వారిని స్మరించిన యెడల నీ యిద్దరు కుమారులును స్వస్థత పొందగలరని మాత్రము చెప్పితిమి.

మాంత్రికుని కళేబరము గ్రామపెద్ద యింటివద్ద నుండెను. గ్రామపెద్ద కుమారులు యిద్దరునూ విధి వైపరీత్యమునకు లోనయిరి. మా దాయాదులు భయముతో వణకిపోసాగిరి. వాతావరణమంతయునూ విషాద భరితముగా నుండెను. 

చనిపోయిన మాంత్రికుని శవమును స్మశానమునకు  తీసుకొనిపోయిరి. కట్టెలు పేర్చబడి చితికి నిప్పంటించబడెను. నిప్పంటించిన శవాములో ఆకస్మాత్తుగా చైతన్యము కలిగెను. శవము తనను అగ్నిబాధ నుండి రక్షించమని కేకలు వేయుచుండెను. 

కాటికాపరివాండ్రు  చనిపోయిన మాంత్రికుడు దయ్యమై తిరిగి శరీరములో ప్రవేశించినాడనియు, వానిని రక్షించినచో యిదే శరీరముతో అతడు ప్రేతార్మ చేయు దుష్ట కార్యములన్నియునూ చేయుననియూ, అతని శవము కాలి బూడిద అయిన యెడల కేవలం ప్రేతాత్మ గానే యుండి తనకి వశమైయుండెడి వారి దేహములందు ప్రవేశించి కొంతమందిని బాధించుననియూ, అందుచేత శవమునకు నీళ్లుపోయు ప్రయత్నమును మానుకొనిరి. 

విగతజీవుడై ఉపాధిరహితుడుగా నున్న ప్రేతాత్మకంటే సజీవుడై తన స్వంత ఉపాదిలోనే ప్రవేశించెడి ప్రేతాత్మ ఎక్కువ శక్తులని కలిగియుండి సమాజమునకు విశేష వినాశనమును, దుఃఖములను కలిగించి తీరుననియు వారు తలపోసిరి. 

ప్రారబ్ధానుసారముగా ఆయా వ్యక్తుల మానసములందు ఆయా భావములను కలిగించి ఆయా కర్మఫలములను అనుభవింపజేసి ప్రత్యక్షముగా తన అవతారతత్త్వము యొక్క నిజస్వరూపమును బోధపరచుట శ్రీపాద శ్రీవల్లభుల వారి విచిత్ర విధానము. 

చెరువును ఎలా నిర్మించాలో చెప్పిన పోరుమామిళ్ళ శాసనం.

చెరువును త్రవ్వించడం ఓ పుణ్యకార్యంగా మనపూర్వీకులు భావించారు. పుణ్యకార్యమేకాదు అదో ప్రజాహిత కార్యక్రమం. అందుకే దక్షిణాపథంలో మనరాజులు చక్రవర్తులు సామంతులు దండనాయకులు చివరకు సామాన్యుడు కూడా చెరువులను నిర్మించి తమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశారు.

ఈనాడైతే మనవద్ద ఆధునిక శాస్త్రపరిజ్ఞానం అత్యంత సాంకేతిక పనిముట్లు యంత్రాలున్నాయి.కనుక జలాశయ నిర్మాణాలు సులభంగా చేపట్టగలుగుతున్నాము.

ఇప్పటికి 2300 సంవత్సరాల క్రిందటనే మనవారు ఉత్తమోత్తమ పరిజ్ఞానంతో చెరువులు నిర్మించారు.ఉదాll సుదర్శన తటాకాన్ని మౌర్యబిందుసారుడి కాలంలో పుష్యగుప్తుడు అనేవాడు గుజరాతులో నిర్మించాడు. ఈ తటాకం తెగిపోతే  శకరాజు రుద్రదమనుడు మరమ్మత్తు చేసాడు. ఈ తటాకగొప్పతనాన్ని జునాఘడ్ శాసనంలో రుద్రదమణుడు పెర్కొన్నాడు.

అలాగే ఇప్పటికి 1800 సం|| క్రిందట కరికాలచోళుడు కావేరినదిపై నిర్మించిన కల్లాడై / కల్లానై ఆనకట్ట ఈనాటికి చెక్కుచెదరలేదు. సింధు నాగరికతలోని నీటిపారుదల వ్యవస్థ మనకు తెలిసిందే.

భాస్కరభావదుర అనే యువరాజు విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన ఒకటవ హరిహరరాయలకుగల ఐదుమంది సంతానంలో ఒక్కడు. నెల్లూరుజిల్లాలోని ఉదయగిరిని కేంద్రంగా ఓ రాష్ట్రాన్ని పాలించేవాడు.

ఇతను శాలివాహనశకం 1291 లో అనగా 1369లో కడపజిల్లా పోరుమామిళ్ళలో చెరువును త్రవ్వించి చెరువు నిర్మాణం ఎలా వుండాలో అక్కడే ఓ శాసనం చెక్కించాడు. మంచి తటాకాన్ని నిర్మించాలంటే పన్నెండు అంగాలు సాధనాలు వుండాలి. అవి

(1)  చెరువును నిర్మించే వ్యక్తి సంపన్నుడు, ఆనందితుడు సచ్ఛీలుడైవుండాలి.

(2) పాత:శాస్త్ర ప్రవీణులుండాలి. పాత: శాస్త్రమంటే చెరువును త్రవ్వే కళ.

(3) చెరువు నిర్మాణానికి కఠినమైన, దృఢమైన నేలను ఎన్నుకోవాలి.

(4) మూడుయోజనాల దూరం లోపల చెరువుకు నీటిని అందించే  వాగులు వంకలు కాలువలు నదులు ఉండాలి.

(5) చెరువుకట్టకు అటువైపు ఇటువైపు కొండగుట్టలుండాలి.

(6)  చెరువుకట్ట కట్టడాన్ని మరి పొడుగుగా కట్టరాదు. (అలా కట్టవలసిన పరిస్థితులు ఎదురై మధ్యలో కూడా ఒక మరవను (అలుగు) ను ఏర్పాటుచేయాలి)

(7) అటువైపు ఇటువైపున్న కొండగుట్టలు మెత్తగా మృదువుగా ఉండక దృఢంగా ఉండాలి.

(8) చెరువుగర్భం (మధ్యభాగం) లోతుగా వుండెట్టుగా చూచుకోవాలి.

(9) చెరువు నిర్మాణానికి  కఠినమైన రాళ్ళు ఉపయోగించాలి.

(10) చెరువుతూములనుండి పారే నీరు పల్లపు ప్రదేశానికి వెళ్ళేవిధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. పంటలకు అనువైన సారవంతమైన నేలలు ఉండాలి.

(11) చెరువులో బలమైన అలలు సుడులు వగైరాలు వస్తే వాటిని కొండగుట్టలు అడ్డుకొనేలా ఉండాలి.

(12) తటాకనిర్మాణానికి సిద్ధహస్తులు నిపుణులైన పని వారు పనిముట్లు ఉండాలి.

చెరువు నిర్మాణానికి  అనువుకాని పరిస్థితులను కూడా పోరుమామిళ్ళ శాసనం పెర్కొంది.

(1) చెరువుకట్ట నుండి నీరు ఊరరాదు, ఉబకరాదు.

(2) చౌడు, ఉప్పునీటి నేలలు చెరువు నిర్మాణానికి పనికిరావు.

(3) రెండు రాజ్యాల మధ్య తటస్థంగా వున్నచోటు చెరువు నిర్మాణానికి పనికిరాదు.(ఎందుకంటే జలకలహాలు వస్తాయి. యుద్ధసమయంలో చెరువునీటిని విషపూరితం చేస్తారు.)

(4) చెరువుమధ్య భాగం ఉబ్బుగా (మెరక / ఎత్తు ) ఉండరాదు.

(5) సాగుభూమి చెరువులోని నీటిపరిమాణం ప్రకారమే సరిగా వుండాలి. చెరువు నీరు తక్కువగా వుండి సాగునేల ఎక్కువగా వుండరాదు.

(6) చెరువులో నీరు పుష్కలంగా ఉండి సాగుభూమి తక్కువగా వుండరాదు.

ఈ సూత్రాలు అప్పటికేకాక ఇప్పటికి కూడా అనుసరణీయమే.

ప్రశ్నలు...

(1) మనదేశంలో చెరువులు  అధికంగావున్న రాష్ట్రమేది ?

(2) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోగల పెద్దచెరువు ఏది ?

ఒక నాన్న కు తన‌ కూతురే బంగారం

ఒక నాన్న కు తన‌ కూతురే బంగారం 💛 ...✍🏻
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
అలాంటి నాన్న‍ తన కూతురు  ను గుండెళ్ళే పెట్టుకుంటాడు,
భుజాలపై‌ ఎక్కించుకుంటాడు, తన హృదయం పైన‌ నడిపించుకుంటూ‌ తన‌ పాదాలకు చెప్పులౌతాడు,
తన బంగారు ‌భవిష్యత్తు గురించి ఎవరూ కనని కలలు కంటాడు, కంటికి రెప్పలా కాపాడుకుంటాడు....
అలాంటి తండ్రి ఒకటి అడిగితే రెండు కొనిస్తాడు
రెండు అడిగితే నాలుగు కొనిస్తాడు

యుక్త వయసుకు రాగానే తన ఉన్నత చదివుల కొరకు  రాత్రింబవళ్ళు కష్టపడుతాడు తన బాధ కష్టం కనబడకుండా గుండె లోనే దాచుకుంటాడు...

ఒక మంచి జీవిత భాగస్వామికొరకు వెతుకుతునే ఉంటాడు
కూతురు సుఖం సంతోషం కొరకు దేనికైనా సిద్దపడుతాడు...
తను కోరుకున్నది జరిగితే ఈ ప్రపంచాన్నే జయించినంతగా సంబరపడుతాడు

కాని ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ ఉన్న‌ యువత స్వేచ్చ స్వతంత్ర్యం  పేరు సొంత నిర్ణయాలతో తల్లిదండ్రులను ఎదిరిస్తున్నారు...

తమ తల్లిదండ్రులకు ఏమీ తెలియదని కించపరుస్తున్నారు..
పెళ్ళి వయస్సు కు రాగానే ఎవరో ముక్కు మొఖం తెలియని వారికి కట్టబెడుతున్నారని అంటున్నారు...

నిజంగా ఏ తల్లిదండ్రులు అంత నీచంగాఆలోచించరు .. పెళ్ళంటే నూరేళ్ళ పంటగా భావిస్తారు.. అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలను తల్లిదండ్రులు పరిశీలిస్తారు..
అప్పుడైనా నచ్చితేనే ఆ అమ్మాయికి కూడా ‌నచ్చితే ఒప్పుకుంటారు...

ఏ తండ్రి కూడా ‌తన కూతురు ఏమైనా‌ ఫర్వాలేదని అనుకోడు తన కూతురు ఏలాంటి కష్టాలు పడకూడదని కోరుకుంటాడు..

📌 కాని నేటి అమ్మాయి లు అలా ఆలోచించడం లేదు.
📌 పెళ్ళి వయస్సు వచ్చే వరకు తన తల్లిదండ్రులను విలన్లు గా చూస్తున్నారు.

 ప్రేమ అనే మత్తులో పడి మోసమేదో.. మోదమేదో తెలియని వయస్సులో మేము ఒకరినొకరం అర్థం చేసుకున్నాం మాది నిజమైన ప్రేమ అనే మైకంలో తల్లిదండ్రులను ఎదురిస్తున్నారు... ఐతే మీరు లేదా తల్లిదండ్రులను బలి చేస్తున్నారు..

నిజంగా మీకు అర్థం చేసుకోనే శక్తి‌ ఉంటే నీకు జన్మనిచ్చిన‌ నాటి‌ నుండి నీ కోసం తన‌ తపన అర్థమయ్యేది .. నీ గురించి కన్న కలలు అర్థం అయ్యేది.. నీ కోసం పడ్డ కష్టం అర్థం అయ్యేది..

నీ చిన్ని కాళ్ళ సరిపడే సైజు కోసం పది షాపులు తిరిగింది....
నీ పుట్టిన రోజుకి‌ నీ సరిపడే డ్రస్ కోసం తిరిగిన ఇరవై షాపులు తిరిగింది...నా కూతురు అందరికంటే ముందుండాలనే ఉబలాటం..నీవు బయటకు వెళ్ళినప్పుడు మళ్ళీ‌ వచ్చేవరకు‌ తపించే హృదయం.. అర్థం అయ్యేది

నీ బంగారు భవిష్యత్తు కొరకు ఇరవై ఏళ్ళు గా తపించే నీ తండ్రి నే‌ అర్థం చేసుకోలేని నీవు గతమేంటో భవిష్యత్తు ఏమిటో తెలియని ఒక వ్యక్తి గురించి ‌ఎలా అర్థం చేసుకుంటావు...??

 నాలుగు రోజులు ‌ఉండే నీ‌ పాదరక్షల కొరకే పది షాపులు తిరిగిన నాన్న నిండు నూరేళ్ళు జీవించే నీకు తగిన జీవిత భాగస్వామిని‌ ఇవ్వడని ఎలా అనుకొంటారు..

తన కొడుకులను ఒక డాక్టర్... ఇంజినీరింగ్..IAS, IPS చేస్తాడో లేదో కాని...తన కూతురికి మాత్రం   అలాంటి భాగస్వామిని  తేగలడు...

కూతురు ఉన్న ఏ తండ్రి యైనా ఎక్కువ గా‌ ఆలోచించేది తన కూతురు గురించే అంగ రంగ వైభవంగా కూతురు వివాహం చేయాలని ఎన్నో కలలు కంటాడు...ఆ కలలను సాకారం చేసుకోని గర్వంగా చెప్పుకోవాలనుకుంటాడు..

అలాంటి తండ్రి యొక్క కలలను భగ్నం చేయకండి

💞 ప్రేమను గెలవండి.
💞 నాన్న ను గెలిపించండి.

ప్రేమంటే...✍🏻

💜 ఇద్దరు 🧝‍♀️🧝‍♂️ మనుషులు కలవడమే కాదు.
🧡 రెండు ‌మనస్సులు 💑‌ కలవడమే కాదు.
💚 రెండు కుటుంబాలు  👨‍👩‍👧👪 కూడా ‌కలవాలి.

అదే నిజమైన ప్రేమ 💛

ఇది ప్రతి అమ్మాయి 👱🏼‍♀️‌ అర్థం చేసుకోవాలి

*ఇది ఒక తండ్రి 💁🏼‍♂️ భయం
*ఇది ఒక తల్లి 🤱 వేదన.

నేను చేస్తున్నాను

"నేను చేస్తున్నాను" అనే కర్తృత్వ భావన ఏ విధంగా ఏర్పడుతుంది ?

మన పరిధి విషయంలో అవగాహన లేకపోవటం వలన కర్తృత్వ భావన ఏర్పడుతుంది. ముక్తేశ్వరపురం (ముక్త్యాల) అనే పుణ్యక్షేత్రం కృష్ణానది ఒడ్డున ఉంది. ఆ గ్రామంలోని పిల్లలు ఊరిని అనుకొని ప్రవహించే కృష్ణానదిని తమ చిన్నతనం నుండి చూస్తుంటారు. 

కృష్ణానది అనగానే వారికి తన ఊరే గుర్తుకు వస్తుంది. వారి దృష్టిలో ముక్త్యాల ఒడ్డున ఉన్నదే కృష్ణానది అనే భావన ఉంటుంది. ఇక్కడ ఏం జరిగిందంటే కొన్ని వందల మైళ్ళు ప్రవహించే కృష్ణానదికి వారి మనసులో ఒక పరిధి ఏర్పడింది. వయసు పెరిగిన తర్వాత గాని కృష్ణానది ఒడ్డున ఉన్న అనేక గ్రామాల్లో తమ గ్రామం ఒకటన్న విషయం అర్థమవుతుంది. మనలో కర్తృత్వ భావన కూడా అలాగే ఏర్పడుతుంది.

 చైతన్యశక్తి అనంతంగా నిండి ఉంది. ఆ చైతన్యశక్తికి దేహం అనే పరిధి ఏర్పడింది. ఆ కారణంగానే ప్రతీదీ "నేను చేస్తున్నాను" అనే కర్తృత్వ భావన ఏర్పడటానికి కారణమైంది. అదే మన సుఖదుఃఖాలకు దారితీస్తుంది !

Saturday, June 27, 2020

అగ్ని అమ్మవారు దీపం


సృష్టి మొత్తం ఆమె నుండి ఏర్పడినప్పుడు పంచభూతాలు, పంచతత్వాలు, పంచప్రణవాలు అన్ని ఆ తల్లి రూపమే, అలా అగ్ని రూపంలో అమ్మవారు సాక్షాత్తు శక్తి గా వ్యక్తం అవుతుంది. ఆ తల్లి చిదగ్ని నుండే రూపు దాల్చుతుంది..ఈ అగ్ని ద్వారానే హావిస్సు రూపంలో దేవతలకు శక్తి అందుతుంది.. ఈ నిత్య అగ్నిహోత్రం ఎంతో గొప్ప అనుష్ఠానం.. 

జీవుడిలో అగ్ని యొక్క స్థానం ఇలా ఉంటుంది ,అగ్ని వాక్కుగా ముఖమునందు, వాయువు ఘ్రాణముగా నాసిక యందు, ఆదిత్యుడు దృష్టిగా నేత్రములందు, దిశలు శ్రవణేంద్రియములుగా చెవుల యందు, జలము వీర్యముగా శిశ్న మందు, మృత్యువు అపానముగా నాభి యందు ప్రవేశించగా; ఈశ్వరుడు శరీరం నిలబడుటకు శిరస్సు ద్వారా పైనుండి బ్రహ్మ రంధ్రములోనికి ప్రవేశించెను. అగ్ని నుండి సమస్త ప్రపంచము ఏర్పడినది. సూర్యుడు కూడా అగ్ని స్వరూపుడే. రాత్రి, పగలు అగ్ని యొక్క సంతానము. 

అగ్ని రూపంలో అమ్మవారిని భావించి దీపం లో దర్శనం చేయాలి దీపం జోతిలోకి ఆ తల్లిని ఆవాహన చేసి ఆ దీపంలో ఉపాసించాలి అగ్నిలో ఆమె ప్రత్యక్షంగా దర్శనం ఇస్తుంది ఇది దీప దుర్గా ఉపాసనలో అనుభవం అవుతుంది.. దీపాలు వెలిగించి చేసే ప్రార్ధనకి అందుకే అంత శక్తి ఉంటుంది.. దీపాలతో దీప కాంతి రూపంలో అమ్మవారిని ప్రత్యక్షంగా ఉపాసన చేస్తారు..ఈ ఉపాసనలో ఆ కాంతి అమ్మవారి ఆకారంలోనే ప్రత్యక్షంగా పూజను స్వీకరిస్తుంది.. ఇది పద్దతిగా గురువును నుండి సాధన నేర్చుకుని చేయాలి.. అలా ఆవాహన చేసిన తల్లి ని దేవి మహత్యం స్ట్రోత్రాలతో, ఉపదేశం పొందిన మంత్రం యొక్క సంపుటికరణ స్త్రోత్రం అర్చనతో పూజించి ఆ స్వరూపం అంతర్ధానం అయే వరకు మనసులో నే మంత్రం జపిస్తూ ధ్యానం చేయాలి అలా చేయగా చేయగా ఆ శక్తి మనలోకి చేరిపోతుంది.. ఈ సాధన కోరికలతో చేయాకుడదు అమ్మవారి అనుగ్రహము పొందడానికి చేయాలి ఎందుకంటే ఆ స్థాయిలో అమ్మవారిని ప్రత్యక్షంగా ఆ కాంతిలో అనుభూతి చందుతూ ఒకరకమైన భయం తో కూడిన భక్తి ఏర్పడుతుంది వెన్నులో వణుకు పుడుతుంది నేరుగా ఆమెను చూసే ధైర్యం సరిపోక చూపు ఆమె పాదాలను వెతుకుతుంది.. అలా చూస్తూ చేసే శక్తి లేక ధ్యానంలో కి వెళ్ళిపోయి ఉపాసన కొనసాగిస్తారు లేకుంటే భయంతో మైకం వచ్చి పడిపోతారు.. నిదానంగా అలవాటు అయిన కొద్దీ ఆ భయం తగ్గక పోయిన ధైర్యంతో సాధన కొనసాగించడం అలవాటు అవుతుంది.. క్రమంగా ఈ సాధన సమయం కూడా పెరుగుతుంది. అఖండ దీపం లో అమ్మవారిని భావించి చేసే మండల దీక్షకు కూడా అంత శక్తి ఉంటుంది. 

ఈ ఉపాసన అంతా తెలియక పోయినా ప్రాతః కాలం సూర్యోదయానికి పూర్వం ఎక్కడ దీపం వెలుగుతుందో ఆ ఇంటిని ఆ దీపం రూపములో అమ్మవారు రక్షిస్తుంది దీపానికి ఒక్కో సమయానికి ఒక్కో దేవత అధిపతిగా ఉంటారు ఉదయం 5 గం దీపంలో వినాయకుడు అధిపతిగా ఉంటారు , 5.30 నుండి 6 గం సమయం వరకు లక్ష్మీ దేవి అధిపతిగా ఉంటుంది ఆ తల్లి దీపంలో కొలువై నరాయణుడిని ప్రార్థిస్తూ ఉంటుంది ఎక్కడ లక్ష్మీ కొలువై స్వామిని ఆరాధిస్తారో ఆ ఇంటిపైన  నారాయణుడి దృష్టి పడుతుంది. అగ్ని రూపం సాక్షాత్తు అమ్మవారే ఆ అగ్నిని దీపం రూపంలో ఆరాధిస్తే అంతకంటే గొప్ప ఉపాసనా సాధన ఏముంటుంది. 

ఉదయం సాయంత్రం దీపారాధన చేయండి, అగ్నిహోత్రం అలవాటు ఉన్నవాళ్లు క్రమం తప్పకుండా  సాధన చేస్తే ఆ తల్లిని ప్రత్యక్షంగా ఆరాధించినట్టు..దీపాలు వెలిగించండి అమ్మవారిని మీ ఇంటికి ఆహ్వానించండి..ఆ తల్లి మీ ఇంటికి దీపమై చీకటిని మాపి వెలుగును నింపుతుంది.

🌷శ్రీ మాత్రే నమః🌷

ఏడు కొండలు పేర్లు విశిష్టత


 
*తిరుమలలోని ఏడుకొండల పరమార్థం గురించి తెలుసుకొందామా..!*
☘☘☘☘☘☘☘
1. వృషబాద్రి    2. వృషాద్రి   3. గరుడాద్రి 
4. అంజనాద్రి   5. శేషాద్రి.    6. వేంకటాద్రి 
7. నారాయణాద్రి.
🌸🌸🌸🌸🌸🌸🌸
మనలోని ఏడు చక్రాలు దాటితే ఆనందానుభూతి కలుగుతుంది. ఆనంద నిలయం ఎక్కడ ఉంటుంది అంటే బ్రహ్మ స్థానంలో ఉంటుంది. అందుకనే ఆయన 7 కొండలు పైన ఉంటాడు. ఈ 7 కొండలు ఎక్కడం కూడా ఒక రహస్యం ఉంటుంది. 
ఆ 7 కొండలు సాలగ్రామాలే. ఆ 7 కొండలూ మహర్షులే. అక్కడి చెట్లు, పుట్టలు, పక్షులు ఏవైనా మహర్షుల అంశలే. తిరుమలలో పుట్టింది ఏదీ సామాన్యమైనది కాదు. 
🌸🌸🌸🌸🌸🌸🌸
అంజనాద్రి ర్వ్రుశాద్రిశ్చ శేషాద్రిర్గరుడాచలః |
తీర్థాద్రిః శ్రీనివాసాద్రి శ్చింతామణిగిరిస్తథా ||
వృషభాద్రి ర్వరాహాద్రిః జ్ణానాద్రిః కనకాచలః |
ఆనందాద్రిశ్చ నీలాద్రి స్సుమేరుశిఖరాచలః ||
వైకుంఠాద్రి: పుష్కరాద్రిః -- ఇతి నామాని వింశతిః
🌸🌸🌸🌸🌸🌸🌸

ఈ 20 నామాలు పఠించటంవల్ల సర్వ పాప బంధాలు నుండి విముక్తులు కాగలరు.
 ☘☘☘☘☘☘☘

*1. వృషభాద్రి - అంటే ఎద్దు :*
వృషభానికి ఋగ్వేదంలో ఒక సంకేతం ఉంది. ఎద్దు మీద పరమశివుడు కూర్చుంటాడు. దానికి 4 కొమ్ములుంటాయి. 3 పాదాలు (భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు)
వాక్కు అంటే - శబ్దం
శబ్దం అంటే - వేదం
వేదం అంటే - ప్రమాణము
వేదమే ప్రమాణము. వేదము యొక్క ప్రమాణాన్ని అంగీకరించిన వాడు మొదటి కొండ ఎక్కుతాడు.
 🌸🌸🌸🌸🌸🌸🌸

*2. వృషాద్రి - అంటే ధర్మం :*
ధర్మం అంటే నువ్వు వేదాన్ని అనుసరించి చేయవలసిన పనులు. నీకు భగవంతుడు ఇచ్చిన వాటితో మంచివి వినడం, చూడడం, మంచి వాక్కు మొదలైనవి. దాని వల్ల ఇహంలోను, పరలోకంలోను సుఖాన్ని పొందుతాడు. అవి చెయ్యడమే వృషాద్రిని ఎక్కడం.
 🌸🌸🌸🌸🌸🌸🌸

*3. గరుడాద్రి - అంటే పక్షి :*
ఉపనిషత్తుల జ్ఞానాన్ని పొందడం.
షడ్ - అంటే జీర్ణం కానిది. ఒక్క పరమాత్మ మాత్రమే జీర్ణంకానిది. పరమాత్మ ఒక్కడే ఉంటాడు. మిగిలిన వాటికి 6 వికారాలు ఉంటాయి. పుట్టినది, ఉన్నది, పెరిగినది, మార్పు చెందినది, తరిగినది, నశించినది. ఇవన్నీ పుట్టిన వాడికి జరుగుతూనే ఉంటాయి. ఆ ఆరు లేని వాడు భగవానుడు.
భగవ : ఐశ్వర్య బలము, వీర్య తేజస్సు మరియు అంతా తానే బ్రహ్మాండము అయినవాడు.
అన్ : ఉన్నవాడు, కళ్యాణగుణ సహితుడు, హేయగుణ రహితుడు. అటువంటి భగవానుణ్ణి జ్ఞానం చేత తెలుసుకోవడమే గరుడాద్రి.
🌸🌸🌸🌸🌸🌸🌸

*4. అంజనాద్రి :*
అంజనం అంటే కంటికి కాటుక. ఈ కంటితో చూడవలసినవి మాత్రమే చూసినపుడు. ఈ కంటితో చూసిన దాంట్లో అంతటా బ్రహ్మమే ఉందని తెలుసుకోవడం కంటికి కాటుక. ఇదంతా పరమాత్మ సృష్టియే. అప్పుడు అంజనాద్రి దాటుతాడు.
🌸🌸🌸🌸🌸🌸🌸

*5. శేషాద్రి :*
ప్రపంచం అంతా బ్రహ్మమే అని చూసాడనుకోండి వాడికి రాగద్వేషాలు ఉండవు. వాడికి క్రోధం ఉండదు. వాడికి శత్రుత్వం ఉండదు. భగవద్గీతలో గీతాచార్యుడు చెప్పినట్లు "తుల్య నిందా స్తుతిర్ మౌని" (శ్లోకం చెప్పారు) తాను కాకుండా ఇంకోటి ఉంది అన్న వాడికి భయం. అంతా బ్రహ్మమే అనుకునేవాడికి భయం ఉండదు. ఎప్పుడూ ఒకేలా ఉండడమే బ్రహ్మం. ఆ స్థితికి ఎక్కితే శేషాద్రిని ఎక్కడం.
 🌸🌸🌸🌸🌸🌸🌸

*6. వేంకటాద్రి :*
వేం : పాపం, కట : తీసేయడం. కాబట్టి పాపాలు పోతాయి. అంతా బ్రహ్మమే చేయిస్తున్నాడు, అందుకనే మనకి బ్రహ్మం తెలిసినవారు పిచ్చివాళ్ళలా కనవడుతారు. రామకృష్ణ పరమహంస ఈ పిచ్చి నాకు ఎప్పుడు వస్తుందో అంటూ ఉండేవారు. అందుకే జ్ఞాని, పిచ్చివాడు ఒకలా ఉంటారు. ఆయనకే అర్పణం అనడం, అటువంటి స్థితిని పొందడం వెంకటాద్రి ఎక్కడం.
🌸🌸🌸🌸🌸🌸🌸

*7. నారాయణాద్రి :*
 అంటే తుల్యావస్థని కూడా దాటిపోయి, తానే బ్రహ్మముగా నిలబడిపోతాడు. అటువంటి స్థితిని పొందడం నారాయణాద్రి. 
🌸🌸🌸🌸🌸🌸🌸
కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటాచల తిరుమల శ్రీనివాసున్నీ మనసారా కొలవడం అంటే నాభూతో నాభవిష్యత్. ఆయన చెంత ఉంటే వైకుంఠమేగా ఇక.
🌸🌸🌸🌸🌸🌸🌸

వరాహస్వామిని ఎందుకు దర్శించుకోవాలి

వెంకటేశ్వర స్వామి కంటే ముందుగా వరాహస్వామిని ఎందుకు దర్శించుకోవాలి? 

చాలామంది భక్తులకు అసలలా ఎందుకు చేయాలో తెలియదు కానీ చేసేస్తుంటారు. తిరుమలలో శ్రీనివాసుడు వెలసి 5000 సంవత్సరాలవగా, అప్పటివరకూ తిరుమల శిఖరం వరాహస్వామి సొంతం.


 అప్పటిలో వరాహ స్వామి వద్ద శిఖరంపై వంద చదరపు అడుగుల స్థలాన్ని బహుమతిగా తీసుకున్నాడు వెంకటేశ్వరస్వామి. దానికి బదులుగా శ్రీనివాసుడు ఒక హామీ ఇచ్చాడు వరాహస్వామికి.

అదేమిటంటే… తనకోసం వచ్చే భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించుకు వచ్చేలా చూస్తానని చెప్పాడు. తిరుమలలో వెలసిన తొలి దైవం వరాహ స్వామి, అందువల్లనే వేంకటాచలం వరాహ క్షేత్రంగా ప్రసిద్ధి కెక్కింది.

తిరుమల శ్రీవారి ఆలయ పుష్కరిణికి వాయువ్య మూలలో తూర్పు ముఖంగా శ్రీ వరాహ స్వామి ఆలయం వుంది. వెంకటేశ్వరస్వామికి ఇక్కడ స్థలం ఇచ్చినందుకు వరాహస్వామికి తొలిదర్శనం, మొదటి అర్చన, మొదటి నివేదన జరిగేట్లు తామ్రపత్రం (రాగిరేకు) పైన వేంకటేశ్వరుడు రాసి ఇచ్చాడు. ఈ తామ్ర పత్రం మీద బ్రాహ్మీ లిపిని పోలిన అక్షరాలు దానిమీద ఉన్నాయి.

ఈ రాగిరేకును నేటికీ రూ.3 హారతి టిక్కట్టు కొన్న భక్తులకు హారతి సమయంలో చూపిస్తారు. భక్తులు ముందుగా వరాహ స్వామిని దర్శించుకుంటే ఆ శ్రీనివాసుడు సంతోషిస్తాడని పెద్దలు చెబుతుంటారు. ఒకవేళ వరాహస్వామిని దర్శించుకోకుండా గాని భక్తులు తిరమల నుండి వస్తే, ఆ యాత్ర ఫలం దక్కదని చెబుతారు. కనుక తిరుమల శ్రీవారిని దర్శించుకునే ప్రతి భక్తుడు వరాహ స్వామి దర్శనం సంపూర్ణసిద్ధిని కలిగిస్తుంది.

అశ్వని నక్షత్రం - గుణగణాలు, ఫలితాలు


    అశ్విని నక్షత్ర అధిదేవత అశ్వినీ దేవతలు. సూర్య భగవానుడి భార్య సజ్ఞాదేవికి, సూర్య భవానుడికి పుట్టిన వారు అశ్వినీ దేవతలు. ప్రాథమికంగా అశ్వనీ నక్షత్రం సన్య నక్షత్రంగా పురుష లక్షణంతో క్షిపుతారగా గుర్తింపు పొందింది. దీనికి అధిపతి కేతువు. ఈ నక్షత్రంలో జన్మించినవారు శివుడి అర్చన చేసి వైడూర్యాన్ని ధరించవలసి ఉంటుంది. 

అశ్వని నాలుగు పాదాలు మేష రాశిలోనే ఉన్నాయి. మొదటి పాదం :- అశ్వినీ నక్షత్రం మొదటి పాదంలో పుట్టిన వారి నక్షత్ర అధిపతిగా కుజుడు. వీరు శక్తికి మించిన సామర్థ్యం ప్రదర్శించాలని ప్రయత్నిస్తారు. అస్థిర చిత్తంతో ఉంటారు. కొన్ని సార్లు రాజీ ధోరణితో ఉండాల్సి ఉంటుంది. అనవసర విషయాలపై దృష్టి పెట్టడం జరుగుతుంది. పనికి రాని ఆలోచనలు బుర్రను తొలుస్తుంటాయి. సమాజంలో మంచి గుర్తింపు, గౌరవం పొందాలన్న తాపత్రయపడతారు. గ్రహ దశలు :-పుట్టినప్పటి నుంచి కేతు మహర్దశ ఏడు సంవత్సరాలు, శుక్ర మహర్దశ ఇరవై సంవత్సరాలు, రవి మహర్దశ ఆరు సంవత్సరాలు, చంద్ర మహర్దశ పది సంవత్సరాలు, కుజ మహర్దశ ఏడు సంవత్సరాలు అనుభవిస్తారు.రెండో పాదం:- అశ్వినీ నక్షత్రం రెండవ పాదంలో పుట్టిన వారి నక్షత్ర అధిపతిగా కుజుడు నవాంశ రాశ్యధిపతి శుక్రుడు. దీంతో వీరు పట్టుదల గల వారు. ఎదుటి వ్యక్తుల స్వభావాన్ని త్వరగా గ్రహిస్తారు. చాలా విషయాల్లో చురుగ్గా వ్యవహరిస్తారు. తలపెట్టిన కార్యాన్ని సాధించడంలో అనుకూలమైన మార్గాన్ని ఎంచుకుంటారు. ప్రాజ్ఞులు, దక్షులుగా గుర్తింపు పొందుతారు. మంచి ఆత్మవిశ్వాసం గలవారై ఉంటారు. గ్రహ దశలు:- వీరు పుట్టినప్పటి నుంచి కేతు దశ ఐదు సంవత్సరాల మూడు నెలలు. శుక్ర మహర్దశ ఇరవై సంవత్సరాలు. రవి మహర్దశ ఆరు సంవత్సరాలు. చంద్ర మహర్దశ పది సంవత్సరాలు, కుజ మహర్దశ ఏడు సంవత్సరాలు అనుభవిస్తారు. మూడో పాదం:-  అశ్వని మూడో పాదంలో జన్మించిన వారికి ప్రాచీన శాస్త్రాలను ఇష్టపడుతారు. ముఖ్యంగా జ్యోతిష్య, తర్క శాస్త్రాలపై మక్కువ ఉంటుంది. చక్కటి సలహాలు ఇవ్వడంలో నేర్పరులు.  అయితే ఆ సలహాల వల్ల తమకు తాము ఎలాంటి లాభాన్ని పొందలేరు. నలుగురిలో కలిసేందుకు ఇష్టపడరు. గ్రహ దశలు  
పుట్టినప్పటి నుంచి కేతు మహర్దశ మూడున్నర సంవత్సరాలు, శుక్ర మహర్దశ ఇరవై సంవత్సరాలు. రవి మహర్దశ ఆరు సంవత్సరాలు. చంద్ర మహర్దశ పది సంవత్సరాలు, కుజ మహర్దశ ఏడు సంవత్సరాలు, రాహు దశ 18 సంవత్సరాలు అనుభవిస్తారు. నాలుగో పాదం:- అశ్వని నాలుగో పాదంలో జన్మించిన వారు కళాత్మకంగాను, అలంకార ప్రియులుగానూ, నిదానమైన ప్రవర్తనతోనూ ఉంటారు. గాఢమైన ఆలోచనలు కలిగి మేధావులుగా గుర్తింపు పొందుతారు. నిరంతరం కొత్త విషయాలపై ఆసక్తి కనబరుస్తారు. లక్ష్యసాధనలో వెనుకడుగు వేయరు. అయితే వీరికి ఫలితం సునాయాసంగా అందదు. శ్రమ పడాల్సిన అవసరం ఉంటుంది. గ్రహ దశలు:- పుట్టినప్పటి నుంచి కేతు మహర్దశ 7 సంవత్సరాల 9 నెలలు, శుక్ర మహర్దశ ఇరవై సంవత్సరాలు. రవి మహర్దశ ఆరు సంవత్సరాలు. చంద్ర మహర్దశ 10 సంవత్సరాలు, కుజ మహర్దశ ఏడు సంవత్సరాలు, రాహు దశ 18 సంవత్సరాలు అనుభవిస్తారు.  
ఈ నక్షత్ర జాతకుల గుణగణాలు
అశ్వినీ నక్షత్ర జాతకులు అశ్వం వలే ఉరిమే ఉత్సాహంతో కనిపిస్తారు. తెలివి, జ్ఞాపకశక్తి, సామర్థ్యం, చైతన్యవంతమైన, విశాలమైన కళ్ళు కలిగివుంటారు. పోటీ మనస్తత్వం ఉంటుంది. క్రీడల యందు ఆసక్తి అధికం. అశ్వినీదేవతలు శసత్రచికిత్స, ఆయుర్వేద వైద్యములో నిపుణులు కనుక అశ్వినీ నక్షత్రజాతకులు ఆయుర్వేదం వంటి వైద్యం యందు ఆసక్తితో ఉంటారు. వీరు ఉద్రేకపూరిత మనస్తత్వం కలిగి ఉంటారు. రాశ్యాధిపతి కుజుడు కనుక వీరికి ధైర్యసాహసాలు అధికం. ఎటువంటి పరిస్థితులనైనా మనోస్థైర్యంతో ఎదుర్కొనగలరు. ఓర్పు, నేర్పు, సామర్ధ్యంతో కార్యనిర్వహణ పూర్తి చేస్తారు. తనను నమ్ముకున్న వారిని ఆపదలో కాపాడుట వీరి విశిష్ట గుణం.ఈ నక్షత్ర జాతకులు వీరు ఇతరుల సలహాలు స్వీకరించినా.. చివరకు తమకు నచ్చినట్లు నిర్ణయం తీసుకుంటారు. ఈ నక్షత్రము దేవగణ నక్షత్రము కనుక న్యాయం, ధర్మము పాటిస్తారు. వీరికి నాయకత్వ లక్షణాలు అధికం కనుక రాజకీయనాయకులుగా, అధికారులుగా చక్కగా రాణిస్తారు. నక్షత్రాధిపతి కేతువు కనుక వైరాగ్యం, దైవోపాసనా, భక్తి వంటి లక్షణాలు వీరికి అధికం. కొంత అలసత్వము కలిగి ఉండడము సహజమే. తాము అనుకున్నది సాధించాలన్న పట్టుదల ఉంటుంది. ఇతరులకు కింద పనిచేయడం వీరికి నచ్చదు. అన్ని విషయాలలో ఆధిపత్య మనస్తత్వం కలిగి ఉంటారు. క్రీడాకారులుగా, వైద్యులుగా, సైనికపరమైన ఉద్యోగులుగా చక్కగా రాణించగలరు. ఇవి అశ్వినీ నక్షత్రజాతకుల సాధారణ గుణాలు. అయితే జాతకచక్రం, లగ్నం, పుట్టిన సమయం, మాసముల వలన గుణగణాలలో కొద్దికొద్దిగా మార్పులు ఉంటాయి. ఈ నక్షత్ర జాతకులకు 45 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా జరుగుతుంది. బాల్యము నుంచి యుక్తవయస్కులు అయ్యే వరకు వీరికి జీవితం వీరికి ఆనందదాయకముగా జరుగుతుంది. అశ్వనీ నక్షత్ర జాతకులకు కృత్తిక, మృగశిర, పునర్వసు, చిత్త, అనూరాధన, జ్యేష్ట నక్షత్రములు ఏ కార్యమునకు పనికి రావని శాస్త్రం చెబుతోంది.!
Taken from Astrological book.