*మన హిందూ సాంప్రదాయంలో మాత్రమే ఉన్న ఒక పరమ పవిత్ర ఆచారం మడి కట్టుకోవటం. అదేమిటో తెలియక అది ఒక చాంధస ఆచారం అని ఆడుపోసుకొనే వారూ మనలో లేకపోలేదు. కాని అది ఒక ఆరోగ్య వంతమైన, శుచి శుభ్రతలకు సంబంధించిన ఆచారమే కాని, చాదస్తం ఎంతమాత్రం కాదు.*
*ఇప్పుడు మన ప్రాణం మీదకొచ్చాక తమను తాము కాపాడుకోవడానికి మన సంప్రదాయాలను ప్రపంచం యావత్తు ఆచరిస్తోంది.*
*మన భారతీయులను, మన ఆచారాలను పాటించే వాళ్ళను పిచ్చోళ్ళుగా , చాదస్తపు వారిగా వేళాకోళం చేసిన ప్రపంచమే మన సనాతన భారతీయ ఆచార సంప్రదాయాలను గౌరవించడం శుభపరిణామం*
*మడితో ఆహారం వండడం. మడి తో పచ్చళ్ళు, మడితో వడియాలు, మడితో పాలు, పెరుగు, నెయ్యి వుంచడం అనేది పూర్వపు ఆచారం. ఎంతో ఆరోగ్యకరం ఇవన్నీ చాలా వరకు నేడు పోయినాయి. కానీ నేటి తరం యువతీ యువకులలో పరమేశ్వరుని అనుగ్రహంచేత కొద్ది కొద్దిగా మన సనాతన సాంప్రదాయ పద్ధతులపై ఆసక్తి పెరుగుతున్నది. ఆసక్తి కలిగిన వారు నిర్లిప్తత పారద్రోలి క్రమక్రమం మార్పుకు సిద్ధపడాలి. మరలా ఆచరణలోకి తీసుకొచ్చే ప్రయత్నము చేయాలి అందరము. మనము ఆచరించి, అందరికీ చూపించి ఆదర్శకులము అవ్వాలి. మనల్ని మనము కాపాడు కోవాలి. ఒక్క సారి మడి కట్టి చూడండి దాని లోని ఆనందము, స్వచ్ఛత, పరిశుభ్రత, దైవత్వం అనుభవము లోకి వస్తాయి.*
*నేటికీ కొంత మంది ఎంత కష్టం వచ్చినా మడి లేని ఇంట భుజించరు. బయటి వస్తువులు స్వీకరించరు. ఆదర్శంగా నిలుస్తున్న అటువంటి వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.*
*నేడు మనం కరోనా మహమ్మారిని తరిమికొట్టాలి అంటే మన సనాతన భారతీయ ఆచార సంప్రదాయం ఐన మడిని పాటించండి కరోనా తో పాటు ఎన్నో రకాల వైరస్ లు మరియు రోగాల బారి నుంచి విముక్తులమవుదాం.*
No comments:
Post a Comment